అమ్మయ్య! చిరంజీవి కొడుక్కి పెళ్ళి కుదిరిందిట, ఆనందమానందమాయే! ఇంక నాక్కొన్నాళ్ళు రిలీఫ్! థాంక్స్ టు తెలుగు టీవీ చానెల్స్.
ఏవిఁటీ అర్ధంపర్ధం లేని రాతలు? సినిమావాళ్ళ పెళ్ళైతే నీకెందుకానందం?!
అమ్మ అన్నయ్య దగ్గర ఉంటుంది. షుగరు, బిపి, మోకాళ్ళ నొప్పుల వగైరా జబ్బులు అమ్మతో వుంటాయి. అమ్మని పలకరించాలంటే మా చుట్టాల్లో చాలామందికి భయం. ఎవరినా దొరికితే చాలు - అమ్మ తన జబ్బులు, బాధలు, మందులు.. చెప్పుకుంటూనే పోతుంది. అదో ఎల్పీ రికార్డ్! ఘంటసాల పాడిన భగవద్గీత వంటి ఆ రికార్దుని నేను రోజూ వింటూనే వుంటాను. ఎవరైనా సరే! తన వేసే రికార్డు మొత్తం చచ్చినట్లు వినాల్సిందే. ఓపిగ్గా విన్నవాడు ఉత్తముడు, వినలేనివాడు అధముడు. ఆ విధంగా మన కాండక్ట్ రోజువారీగా బేరీజు వేయబడుతుంది, అప్పటికప్పుడే సర్టిఫికేట్ జారీ చెయ్యబడుతుంది. ఏరోజు పరీక్ష ఆరోజే! నిన్న నువ్వు ప్యాసైనంత మాత్రాన ఈరోజు ఫైలవకూడదని లేదు.
అది పెద్ద హాలు, మధ్యన పెద్ద సోఫా. ఆ సోఫాలో పెదరాయుడు స్టైల్లో అమ్మ, ఎదురుగా టీవీ, చేతిలో మంత్రదండంలా రిమోట్! ఈ పెదరాయుడికి అనుచరగణం ఇద్దరు. సోఫా పక్కనే గచ్చుమీద కూర్చునే వెంకటమ్మ - ఇంటిపని చేస్తుంది. వంటగది గుమ్మానికి జారగిలిపడే చిట్టెమ్మ - వంటపని చేస్తుంది. వీళ్ళు టీవీ సీరియళ్ళని సీరియస్‌గా చూస్తూంటారు. వీళ్ళకితోడుగా ఆమధ్యదాకా సన్నీ అనబడు ఒక శునకుడు కూడా వుండేవాడు, వాడు వృద్ధాప్య కారణంగా కొంతకాలం క్రితం కాలం చేశాడు! టీవీ సీరియళ్లు రాని (లేని) సమయంలో అమ్మకి నొప్పులు, నీరసం, గుండెదడ!
అవి అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటున్న రోజులు.
నా రోజువారీ డ్యూటీలో భాగంగా డ్యూటిఫుల్‌గా అమ్మని అడిగాను. "అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?"
"చిట్టెమ్మా! తొందరగా రా! పెళ్ళికి పవన్ కళ్యాణ్ వచ్చాడు చూడు! పక్కన భార్య లేకుండా ఒక్కడే చేతులూపుకుంటూ వచ్చాడేంటి?"
"అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?" మళ్ళీ అడిగాను.
"వెంకటమ్మా! చిరంజీవి రెండో కూతుర్ని పిలవలేదనుకుంటా. పాపం! ఆ అమ్మాయి కూడా వస్తే బాగుండేది."
"అమ్మా! నొప్పులు.. "
"పెళ్ళికూతురు మెరిసిపోతుంది కదూ. అబ్బో! అబ్బో! ఏం నగలు! ఏం అలంకారాలు!"
ముగ్గురూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. మొదట్లో నాకు చిరాకేసినా, ఆ తరవాత నేనూ వాళ్ళతో కలిసిపొయ్యాను!
"చిరంజీవి రెండో కూతురు మొగుణ్ణి పవన్ కళ్యాణ్ కాల్చేస్తానని సవాల్జేసిండంట! పాపం రావాలంటే ఆళ్ళకి బయ్యం గదా!" వెంకటమ్మ సమాచారం.
"లేదు వెంకటమ్మా! కాలుస్తాడనే తుపాకీని పోలీసోళ్ళు తీసేసుకున్నారు." చిట్టెమ్మ అదనపు సమాచారం.
ఈ విషయాల్లో వీళ్ళు నాకన్నా జ్ఞానవంతులనే సంగతి అర్ధమయ్యింది. మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లే ఎన్నెన్నో విశేషాలు ముచ్చటించుకున్నారు.
చీరలు, నగలు ఎక్కడ కొన్నారు? రేటెంత? పెళ్లి జరుగుతున్న స్టేజ్ వెడల్పెంత? పొడుగెంత? వంట ఎంతమందికి? ఎన్నిరకాల స్వీట్లు? యేయే ఊళ్ళనించి తెచ్చారు? వంటల్లో వాడిన నూనేంటి? తాలింపు గింజలెన్ని? ఎవరెవర్ని పిలిచారు? వాళ్ళ డ్రస్సులేంటి?
అమ్మ తన నొప్పి, నీరసం, గుండెదడ మర్చిపోయింది. అసలు నన్నే మర్చిపోయింది! హమ్మయ్య!
అల్లు అర్జున్ పెళ్ళైపోయింది. అమ్మకి నొప్పులు, నీరసం మొదలయ్యాయి. తన పాత ఎల్పీ రికార్డుని దుమ్ము దులిపి ప్లే చెయ్యటం మొదలెట్టింది.
కొన్నాళ్ళకి నా అదృష్టం బాగుండి జూ.ఎన్టీఆర్ పెళ్లి కుదిరింది. కొన్నాళ్ళ పాటు ఆ పెళ్ళీకబుర్లు. ఆరోజు జూ.ఎన్టీఆర్ పెల్లి జరుగుతుంది.
యధావిధిగా డ్యూటిఫుల్‌గా అడిగాను - "అమ్మా! షుగర్ మాత్రలు వేసుకుంటున్నావా?"
"చిట్టెమ్మా! అర్జంటుగా రా! ఎన్టీఆర్ తల్లిని చూడు."
వంట మధ్యలో వదిలేసి పరుగున వచ్చింది చిట్టెమ్మ. "ఈమె భలే బాగుంది మామ్మగారు! మరి హరికృష్ణని ఎందుకు చేసుకుంది?"
"చాలా మంచమ్మాయిలా ఉంది. కాబోయే కోడలంటే ఎంత ప్రేమ! లక్షలు పెట్టి చీరలు కొంటుంది!"
"అమ్మా! షుగర్ మాత్రలు.. "
"వెంకటమ్మా! పెళ్ళికూతురు ఎంత ముద్దోస్తుందో! అల్లు అర్జున్ భార్యకన్నా హైటా?"
"లేదమ్మగారు! ఎన్టీఆర్ పొట్టి, అందుకనీ అమ్మాయి ఎత్తుగా అవిపిస్తుంది." వెంకటమ్మ అబ్జర్వేషన్.
అల్లు అర్జున్ పెళ్ళికీ, ఎన్టీఆర్ పెళ్ళికీ కల పోలికల గూర్చి కొంతసేపు మేధోమధనం కొనసాగింది.
"అమ్మా! షుగర్.. "
"చిట్టెమ్మా! పెళ్లికి బాలకృష్ణ రాడన్నావ్? వచ్చాడు చూడు." అమ్మ అరిచింది.
"బాబాయ్ వస్తేగానీ తాళి కట్టనన్నాట్ట పెళ్లికొడుకు. అందుకే వచ్చినట్లున్నాడు." చిట్టెమ్మ సంజాయిషీ.
నేను మాట్లాడ్డం ఆపేసాను, అమ్మ పెళ్ళీవిషయాలు ఫాలో అవుతూ అలా టీవీ చూడ్డం నాకు ముచ్చటేసింది.
ఈవిధంగా జూ.ఎన్టీఆర్ కొన్నాళ్ళపాటు అమ్మకి నొప్పులు, నీరసం పోగొట్టాడు. థాంక్యూ జూ.ఎన్టీఆర్!
ఆ తరవాత కొంతకాలం నన్ను సత్యసాయిబాబా కాపాడాడు. బాబా చనిపోయాడా? లేదా? ఆస్తి ఎవరికి వెళ్తుంది? ముగ్గురూ తీవ్రమైన చర్హలు సాగించారు. అయితే సాయిబాబా విషయం తొందరగానే తేల్చేశారు. బాబాని డా.సఫాయ సాయంతో రత్నాకర్ చంపేశాడు! ఆ తరవాత డబ్బుల పంపకంలో ఇద్దరికీ తేడా వచ్చింది. ఇట్లా అనేక మలుపులతో ఒక క్రైమ్ స్టోరీ చెప్పారు! ఈవిధంగా మీడియాక్కూడా తెలీని అద్భుత రహస్యాలు బయటపడ్డాయి!
నేను తెలివిగా అమ్మని తెలంగాణా ముగ్గులోకి లాగుదామని ప్రయత్నించాను. కానీ నా కుట్ర ఫలించలేదు. అమ్మకి తెలంగాణా మీద ఆసక్తి లేదు, సోనియాగాంధీ అంటే మాత్రం చాలా ఇష్టం. ఆ ఇష్టానిక్కారణం.. సోనియాగాంధీ తెల్లగా వుంటుంది, చీరలు బాగుంటాయి, నడక హుందాగా ఉంటుంది! భర్త చనిపోయినా అత్తగారి కొంపలోనే వుంటుంది. అంచేత - సోనియాగాంధీ తెలంగాణా ఇస్తేనే మనం తీసుకోవాలి, లేకపొతే లేదు. అంతే!
నాకు అమ్మ జబ్బుల ఎల్పీ రికార్డ్ తప్పట్లేదు, టీవీలవాళ్ళు మాత్రం ఏంచేస్తారు? పొద్దస్తమానం అందరికీ మళ్ళీమళ్ళీ పెళ్లి చెయ్యలేరుగా! పోన్లేండి! ఇప్పుడు చిరంజీవి కొడుక్కి పెళ్ళవుతుంది. కొన్నిరోజులు ఆవిడ కాళ్ళనొప్పులకి సెలవు!
ఈ హీరోల పెళ్ళిళ్ళు కవర్ చేసినందువల్ల చానెళ్ళవాళ్ళకి వొచ్చే లాభం నాకు తెలీదు గానీ, నాకు మాత్రం హాయిగా, ప్రశాంతంగా వుంటుంది.
:):):):):):)
ReplyDeletelol
ReplyDeleteదేవుడా! వీళ్ళెవ్వరూ మహేష్ బాబులా గుట్టుచప్పుడు పెళ్లి చేసుకోకుండా చూడు స్వామీ!
ReplyDeleteHigh light! LOL - Gowtham
ఛాలా బాగా వ్రాసారండి
ReplyDeleteమీ విషాదం మాకు ఆద్యంతం నవ్వుల్నీ పండించింది. కొసమెరుపు అదుర్స్.
ReplyDeleteబ్రహ్మాండంగా ఉంది డాక్టర్ గారూ!
ReplyDeleteగుళ్ళో బంగారం గురించి మర్చి పోయారండోయ్. ఈ 'పని లేక' బ్లాగుని పనున్నా చూసెళ్ళడం అలవాటయి పోయింది. ధన్యవాదాలు రమణ గారూ...
ReplyDeleteబాగుంది.
ReplyDeleteయమగోల కాదండి, యమలీల.
అన్నట్టు మిమ్మల్ని ఎప్పటినుంచో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను
మీరు మానసిక వైద్యుడు కదా, ఏడుపుగొట్టు సీరియళ్ళు వలన మీ ప్రాక్టీస్ ఏమైనా పెరిగిందా?
మీ అమ్మగారి సంగతి ఏమో గాని మీ రాతల వలన మా జబ్బులు మాయ మౌతున్నాయి(కొందరు అర్భకులకు పొట్టలు పగులుతున్నాయి అనుకోండి ), ఇలా వ్రాసేనని ఫీజు గట్రా ఏమి అడగరు కదా?
ReplyDelete:))))) hilarious..
ReplyDeletenice blog sir
ReplyDeletebonagiri గారు..
ReplyDeleteఅదా సంగతి!
యమగోల నించి తనికెళ్ళ భరణి ఫోటో పెడదామని ట్రై చేశాను.
కుదరలేదు.
యమలీల అని సరిచేసినందుకు కృతజ్ఞతలు.
ఏడుపుగొట్టు సీరియళ్ళు నేనెప్పుడూ చూళ్ళేదు.
ఒకసారి ఏదో సీన్ చూశాను.
ఒక నడి వయసు స్త్రీ ఒంటి నిండా నగలతో, ఫుల్ మేకప్ తో చాలా ఘోరంగా ఏడుస్తుంది.
నాకయితే టీవీ సీరియళ్ళ ప్రభావిత కేసులు తగల్లేదు.
కానీ.. అరుంధతి సినిమా కొన్ని కేసుల్ని తెప్పించింది.
అయినా మాకు శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఉన్నంత కాలం ప్రాక్టీసుకి దిగుల్లేదు!
భలే నవ్వించారు. నాక్కూడా సోనియా గాంధీ డ్రెస్ సెన్స్ ఇష్ఠం. ఆ మేధావుల చర్చలో నేనూ కూర్చోవాలని ఆశ గా ఉంది.
ReplyDeleteFantastic!
ReplyDeleteహహహ బాగుందండీ!ఇంకా ఉన్నాయండీ! మమతా మోహన్ దాస్ కి పెళ్లి కుదిరింది కదా! అలానే స్నేహ, ప్రసన్నల వివాహం! కనుక ఆవిడ ఇంకొన్ని రోజులు నొప్పులు మరచిపోవాలని ఆశిస్తున్నాను!ఈ బ్లాగ్లోకంలోకి తీసుకుని వచ్చారంటే ఆవిడ నొప్పులు నయమవ్వడమే కాదు క్రొత్త ఉత్సాహంతో ఉరకలేస్తారు అనిపిస్తోంది! ఏమంటారు డాక్టరు గారూ? శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఉన్నంత కాలం ప్రాక్టీసుకి దిగుల్లేదు! పంచ్ అదిరింది!
ReplyDeleteసూపర్..:))
ReplyDelete>>"అటూఇటుగా సర్వే సత్యన్నారాయణదీ, అమ్మదీ ఒకటే మాట!"
ఇది కేక..
fantabulous!!! :))
ReplyDelete>>>అటూఇటుగా సర్వే సత్యన్నారాయణదీ, అమ్మదీ ఒకటే మాట!
ReplyDelete>>>దేవుడా! వీళ్ళెవ్వరూ మహేష్ బాబులా గుట్టుచప్పుడు పెళ్లి చేసుకోకుండా చూడు స్వామీ!
నవ్వు ఆపుకోటానికి మందులేమైనా ఇస్తారా డాక్టర్ గారూ. పక్కింటి వాళ్లు అనుమానం గా చూస్తున్నారు.
meeku meerae saaTi Doctor gaaroo:)))
ReplyDelete>>>మన కాండక్ట్ రోజు వారీగా బేరీజు వేయబడుతుంది<<<
ReplyDelete>>క్రమేపి వారి విజ్ఞానానికి నేను నోరెళ్ళబెట్టాను<<
ఏం నవ్వించేరండీ ! ముగ్గురికీ కొంచం హిందీ నటుల/హోలీవుడ్ నటుల పెళ్ళిల్లూ, విడాకులూ అవీ కూడా పరిచయం చేయండి మరి!
క్రిష్ణవేణి
అమ్మా, నేనూ మంచి స్నేహితులం.
ReplyDeleteఈ రోజుకీ మా మధ్య అనేక విషయాలు చర్చకొస్తాయ్.
తరచుగా ఫోన్లు చేసుకుంటుంటాం.
వీళ్ళ మధ్య అన్ని కబుర్లు ఏముంటాయి! అని కొందరు ఆశ్చర్యపోతుంటారు.
నడవలేని అమ్మ జీవితం గత కొన్ని రోజులుగా..
ఇంట్లో ఫర్నిచర్ స్థాయికి పడిపోయింది.
పొద్దస్తమానం నాలుగ్గోడల మధ్య జీవించటం దుర్భరం.
వృద్ధుల పట్ల జాలీ, గౌరవం చూపించటం కంటే..
వాళ్ళతో స్నేహం చెయ్యటం ఉత్తమమని భావిస్తున్నాను.
సరదాగా రాసిన అమ్మ కబుర్లు మీక్కూడా నచ్చినందుకు ఆనందంగా ఉంది.
థాంక్యూ!
:))
ReplyDeleteరమణగారూ మీరు ""నడవలేని అమ్మ జీవితం"" అన్నారు. ఆ సంగతి తెలియక రాసేనండీ.క్షమాపణలు.
ReplyDeleteక్రిష్ణవేణి
ఒరేయి మీ అమ్మ ఆ విధంగా ఆవిడ 'attention ' divert చేసుకొంటోంది.
ReplyDeleteపెద్దవయసులో మరి ఏదో విధంగా టైం పాస్ చెయ్యాలి గదా!
ఏమీ చెయ్యకుండా కూర్చొని అతిగా ఆలోచించి 'depression ' లోకి పోయ్యేకంటే..
ఏదో ఒక విధంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యటం చాలా మంచిది.
గో వె ర
బాగుందండీ...
ReplyDelete"దేవుడా! వీళ్ళెవ్వరూ మహేష్ బాబులా గుట్టుచప్పుడు పెళ్లి చేసుకోకుండా చూడు స్వామీ!"
ReplyDeleteహహహహ బావుంది మీ అమ్మగారికి కాలక్షేపం. :)
అన్నిటికన్నా నాకు బాగా నచ్చినది"
"అయినా మాకు శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఉన్నంత కాలం ప్రాక్టీసుకి దిగుల్లేదు!"...హమ్మో హమ్మో, కింద పడి పడి నవ్వానండీ :))))
డియర్ రమణా
ReplyDeleteమొన్న ఆమధ్య రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలో హీరో సీరియస్ సినిమా తీద్దామని మొదలుపెట్టి పూర్తి చేసినతర్వాత చూస్తె ఆ "కామెడీ" సినిమాని అందరూ చూసి విజయవంతం చేసారట
నీ బ్లాగు చాల బాగుంది కాని అందరికి అంత పోట్టపగిలెంత నవ్వులు తెప్పించింది అంటే హాశ్చర్యం వేసింది
చివరికి నీఅంతట నువ్వే "పెద్ద వాళ్ళను చూసి జాలి పడటం కంటే గౌరవించటం కంటే కాస్తంత స్నేహంగ ఉంటె బాగుంటుంది" అని చెప్పే దాక అది ఉత్తి హాస్య బ్లాగ్ అనే అనిపించిందా?
ఏమైనా సీరియస్ టాపిక్ ని చాల సరదాగా చెప్పిన ఘనత మాత్రం నీదే
కీప్ ఇట్ అప్
రవి
రవి గారు,
ReplyDeleteరామ్ గోపాల్ వర్మ :)
నిజానికి చాలామ౦ది కి ఉ౦డె అభిప్రాయాన్ని, చెప్పుకొనే విషయాల్ని మొదట వ్రాసారు.(ఇ౦త ఓపెన్ గా వ్రాయడానికి కారణం అర్ధం కాక కన్ఫ్యుస్ ఆయినా మాట నిజమే, కాని నిజాలే కదా అని నవ్వేస్కున్నాం ) తరువాత వ్యాఖ్య లో చివరికి తను చెప్పదలుచుకొన్నది కూడా చెప్పారు.
ఆంధ్ర జ్యోతి సండే స్పెషల్ లో ఈ పోస్ట్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. అభిమాన గణం .. సెలబ్రిటీల పెళ్ళిళ్ళకి ఎందుకు అంత విలువ నిస్తున్నారో.!? అంతవరకూ పర్వాలేదు. తర్వాత వారిని అనుకరిస్తూ.. చీరలు,నగలు,వేదికల అలంకరణలు.. కాదేది..అనుకరణకి అనర్హం. హతోస్మి. !!!! చానెల్స్ వైపరీత్యం పుణ్యమా అని కొద్ది రోజులు మనని మనం మర్చిపోవడం నిజమన్న మాట:))))))
ReplyDeleteవనజ వనమాలి గారు,
ReplyDeleteమన కల్చర్ లో పెళ్ళిళ్ళనేవి 'celebration of wealth' అనుకుంటున్నాను.
ఎవడి దురద వాడికానందం.
ఆ దురదలని చూపించడం టీవీ వాడికి వ్యాపారం.
కాకపోతే వృద్ధులకి మంచి కాలక్షేపం.
నా ఆంధ్రజ్యోతి టపా చదివి కామెంటినందుకు ధన్యవాదాలు.
నేను ఇప్పుడే చూశానండీ ఈ పోస్టు. ఎంత నవ్వుకున్నానో... Extremely hilarious! :)))
ReplyDeleteమధురవాణి గారు,
ReplyDeleteధన్యవాదాలు.
blog chaala baagundi bossssssssssssssss
ReplyDeleteబాగుందని మళ్లీ చెప్పాలా... బాగా రాశారు .. ఈ సారి మీ రాత కన్నా మీ అమ్మతో మీ అనుబందం నాకు చాలా చాలా బాగా నచ్చింది
ReplyDeleteHa ha ha. I know EXACTLY what you mean. God Bless Telugu TV!! :)
ReplyDelete