"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.
ఎదురుగా వున్న టేబుల్‌పై పుస్తకాల్ని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు. ఆవి సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ పుస్తకాలు.
"ఏంటీ! ఈ రోజుల్లో కూడా ఇవి చదివేవాళ్ళున్నారా!" ఆశ్చర్యపోయాడు సుబ్బు.
"నేనున్నాను, నీకేమన్నా ఇబ్బందా?" అన్నాను.
"నాకేం ఇబ్బంది! కాకపోతే ప్రపంచం మారిపోతుంది. తెలుగునేలంతా జగన్, చంద్రబాబు అని కలవరిస్తుంది. నువ్వేమో జనజీవన స్రవంతికి దూరంగా ఏవో పురాతన పుస్తకాల్లో కొట్టుకుంటున్నావు." జాలిగా చూస్తూ అన్నాడు సుబ్బు.
"అంటే మనకి ఫ్రాయిడ్, రస్సెల్ ఇర్రిలెవెంట్ అంటావా?" అన్నాను.
"అవును. మన వూరు గుంటూరు, ఇక్కడ వుంటేగింటే చంద్రబాబు నాయుడుకి పనుంటుంది గానీ ఫ్రాయిడ్ కేమి పని! అసలీ ఫిలాసఫర్స్ గుంటూర్లో పుట్టుంటే వీళ్ళకథ వేరుగా ఉండేది. అదృష్టవంతులు కాబట్టి ఇంకేదో దేశంలో పుట్టి బతికిపొయ్యారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! డోంటాక్ రబ్బిష్." విసుక్కున్నాను.
సుబ్బు మాట్లాడలేదు.
ఇంతలో కాఫీ వచ్చింది.
కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలెట్టాడు సుబ్బు.
"కొద్దిసేపు ఫ్రాయిడ్, రస్సెల్ గుంటూర్లో పుడితే ఏమయ్యేదో ఆలోచిద్దాం. ఇద్దర్నీ ఇంగ్లీషు మీడియం స్కూల్ అనే యేదోక దుకాణంలో చేర్పించేవాళ్ళు, పాఠాలు బట్టీ పట్టరు కాబట్టి మార్కులు తక్కువొచ్చేవి. ఇంక స్కూల్లో టీచర్లు, ఇంట్లో తలిదండ్రులు హింసించడం మొదలెట్టేవాళ్ళు."
"అంతేనంటావా?" సాలోచనగా అడిగాను.
"అంతే! టెన్త్ పాసయ్యాక ఇంటర్ చదువుకి ఇద్దరు మేదావుల్నీ కార్పొరేట్ కాలేజీలో పడేసేవాళ్ళు. అక్కడ ప్రతివారాంతం, ప్రతిదినాంతం, ప్రతి గంటాంతం, ప్రతి నిముషాంతం పెట్టే టెస్టులు రాయలేక చచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్లకి రెండే ఆప్షన్లు ఉండేవి." అంటూ ఆగాడు సుబ్బు.
"ఏంటవి?" ఆసక్తిగా అడిగాను.
"ఒకటి మనవాళ్ళ ఇంటర్ రుద్దుడుకి తట్టుకుని నిలబడి, ఇంజనీరింగ్‌లో కుక్కలా చదివి, అమెరికాలో ఉద్యోగం సంపాదించి, డాలర్లు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు, స్థలాలు కొనడం. ఆస్తుల్నిప్పుడు మనూళ్లోనే కొంటున్నార్లే - తెలంగాణా దెబ్బకి." అంటూ నవ్వాడు సుబ్బు.
"రెండో ఆప్షన్?"
"ఏముంది. ఒత్తిడికి తట్టుకోలేక ఇద్దరూ రోడ్లెమ్మడ తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు మీ సైకియాట్రిస్టులు, విజయానికి వెయ్యిమెట్ల వ్యక్తిత్వ వికాసంగాళ్ళు పండగ చేసుకుంటారు." అంటూ కాఫీ తాగడం ముగించాడు సుబ్బు.
"సుబ్బూ! మనం పనికిరాని బడుద్దాయిల్ని తయారు చేస్తున్నామని నీ అభిప్రాయమా?" విసుక్కున్నాను.
"నేనా మాటన్లేదు. మనం విద్యార్ధుల్ని రొబోల్లాగా ఒకే షేప్‌లో వుండేట్లు ఒక సిస్టం తయారు చేసుకున్నాం. ఈ సిస్టం ఉద్యోగానికి తప్ప తెలివైనవాణ్ని ప్రోత్సాహించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు. ఎందుకంటే మన విద్యకి పరమార్ధం ఉద్యోగం. ఆ ఉద్యోగం అమెరికాలో అయితే మరీ మంచిది. అందుకే అమెరికాలో డిమాండ్ ఉన్న కోర్సులకే ఇక్కడా డిమాండ్. చైనావాడు అమెరికాకి చౌకరకం బొమ్మల్ని అమ్ముతాడు, మనం చౌకగా మేన్ పవర్ని ఎగుమతి చేస్తున్నాం." అన్నాడు సుబ్బు.
"ఒప్పుకుంటున్నాను, నేనిలా ఆలోచించలేదు." అన్నాను.
"ఆలోచించి మాత్రం నువ్వు చేసేదేముంది? మళ్ళీ ఇంకో ఇంగ్లీషు పుస్తకం చదువుకుని బుర్ర పాడుచేసుకోటం తప్ప. మేధావులకి తమచుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడో ఎక్కడో ఎవరో రాసిన అంశాలని అధ్యయనం చేస్తారు, తీవ్రంగా మధనపడతారు. వాళ్ళు కన్ఫ్యూజయ్యి, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరకంగా నువ్వు నిఖార్సైన మేధావివి." అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు.
నేనూ నవ్వాను.
టైమ్ చూసుకుని లేచాడు సుబ్బు. "నీకో విషయం చెబ్తాను. చంద్రబాబు ట్రై చేస్తే ఫ్రాయిడ్ అర్ధమవుతాడు. కానీ ఫ్రాయిడ్‌కి మాత్రం చచ్చినా చంద్రబాబు అర్ధం కాడు!"
"మరిప్పుడు ఏం చెయ్యాలి?" దిగులుగా అడిగాను.
"మనం చెయ్యడానికేముంది. అసలు ఏదన్నా చెయ్యాలని ముఖ్యమంత్రే అనుకోటల్లేదు. అందుకని నువ్వు హాయిగా పేషంట్లని చూసుకో. వస్తా, ఇప్పటికే లేటయింది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.
టేబుల్ మీద నుండి ఫ్రాయిడ్, రస్సెల్ నన్ను చూస్తూ వెక్కిరింతగా నవ్వుతున్నట్లనిపించింది!
మొన్నెప్పుడో మేధావినా కాదా అని డౌట్ వచ్చింది మీకు. ఇప్పుడా సందేహం తీరిపోయింది(అని నాకనిపిస్తుంది :)).
ReplyDeleteడాక్టర్ గారూ...ఏదో సరదాగా రాస్తున్నారనిపించిది కానీ మీ రాతల్లో చాలా లోతు౦ద౦డీ...సంభాషణల సిల్కు తెర కప్పినా విషయం చాలా సూటిగా ఉంది. అభినందనలు.
ReplyDeleteనాది కూడా జ్యోతిర్మయి గారి మాటేనండీ...
ReplyDeleteFreud's "science" is akin to Russell's tea pot - i.e.., non-existent. Juxtaposing these two is an interesting choice, Ramana!
ReplyDeleteI am with Frederick Crews' views on Freud. His (Frederick Crew) conclusion is that Freud was indeed making it up as he went along. In Follies of the Wise, Crews takes on not only Freud and psychoanalysis, but also other fields of intellectual inquiry which have caused rational people to succumb to irrational ideas: recovered-memory therapy, alien abduction, theosophy, Rorschach inkblot analysis, intelligent design creationism, and even poststructuralist literary theory. All of these, asserts Crews, violate “the ethic of respecting that which is known, acknowledging what is still unknown, and acting as if one cared about the difference”. Thank you for your thought stimulating and (as Jyotirmayi garu said above) deep writing! Keep them coming!!
రమణ గారు,
ReplyDeletevery nice!
@ subha,
అన్నయ్యగారు మేధావే అని మనమంతా సర్టిఫికెట్ ఇస్తేనూ.. మళ్లీ.. :)
సుభ గారు..
ReplyDeleteడౌట్ లేదు. నేను మేదావినే!
జ్యోతిర్మయి గారు..
ReplyDeleteవేణు శ్రీకాంత్ గారు..
ధన్యవాదాలు.
ఏదో సరదాగా రాస్తున్నా.
మీకు నచ్చుతున్నందుకు సంతోషం.
ఒక్కోసారి చాలా ఎనార్కిక్ గా కూడా రాయొచ్చు,
అప్పుడు తిట్టుకోకండి.
క్రిష్ణ ప్రియ గారు..
ReplyDeleteధన్యవాదాలు.
మీరు నన్ను పదే పదే 'అన్నయ్య' అని కర్ణ (రాత) కఠోరంగా సంబోధించకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి?
Dear GIdoc..
ReplyDeletei am surprised to find Freud being very popular in people with non-psychology background! i agree with you about Freud, but not about Bertrand Russel. i'll keep Freud for my future blogs.
Very good "medhavi"
ReplyDeleteDear Ramana, I did not say anything bad about Russell! He was a fine rational philosopher (even if he was a serial philanderer!). Hence, my comment about seeing both books together.
ReplyDelete"Russell's teapot" is an analogy first coined by the philosopher Bertrand Russell himself to illustrate the idea that the philosophic burden of proof lies upon a person making claims rather than shifting the burden of proof to others, specifically in the case of religion. Russell wrote that if he claimed that a teapot were orbiting the Sun somewhere in space between the Earth and Mars, it would be nonsensical for him to expect others not to doubt him on the grounds that they could not prove him wrong. I am simply using Russell's imaginary tea pot analogy to refer to Freud's equally imaginary fixation with unresolved conflicts nonsense. That is all. Cheers!
సుబ్బు గారెంత' మేధావి :)
ReplyDeletedear GIdoc..
ReplyDeleteit was a mistake. i could not follow your comment as i was negotiating with mr.glenfiddich 12!
A very subtle message there on the "system" sir. I came across this blog and read all of them in one go.(sometime back) and from then following it.
ReplyDeleteలీడర్ సినిమాలో గొల్లపూడి మారుతి రావు గారి డైలాగ్ లాగా, "ఏదో చిన్న satisfaction ..." "నీలో ఏదో విషయం ఉందయ్యా ! ..."
ReplyDeleteనేను "ఉందయ్యా" అని రాసేంత పెద్ద వాడిని కాదు కాని, ఏదో సంధర్బోచితంగా ఉందని "రాసి పడేసాను".
మీరు ఏదో "పని లేక" రాసి పడేసినా, అవి అమూల్యమయిన సందేశాన్ని ఇస్తున్నాయి "మేధావి" గారు.(ఈ సంబోధన ఇతర బ్లాగ్ మిత్రుల సంబోధనని అనుకరించా)
Now I see the problem. We have to upgrade to Glenfiddich 18 pronto! LOL!! BTW, I admire you for publishing critical or argumentative posts and for responding to them. Kudos!
ReplyDeleteరమణ గారూ, మన విద్యావిధానం, మానసిక శాస్త్రం, ప్రస్తుత రాజకీయాలు మొదలయిన అంశాలను చక్కగా మేళవించారు.
ReplyDeleteA refreshing break from the "usual" uni-dimensional blogs one sees these days.
ఇంతకీ సుబ్బు మీ alter-egoనా?
ramana! very good. you deserve a party. Ok. chandra
ReplyDeleteఅజ్ఞాతలు..
ReplyDeleteనన్ను మేధావి అంటున్నారు.
నాకు పొగడ్తలంటే గిట్టవండి!
కానీ.. ఎందుకో సంతోషంతో గంతులెయ్యాలనిపిస్తుంది!
మీ కామెంట్ నా భార్యక్కూడా చూపిస్తున్నాను.
మౌళీ గారు..
ReplyDeleteథాంక్స్! మీ కాంప్లిమెంట్ మా సుబ్బుకు తెలియజేస్తాను.
Jai Gottimukkala గారు..
ReplyDeleteధన్యవాదాలు.
సుబ్బు నా ప్రాణ స్నేహితుడు.
పొద్దస్తమానం నా బుర్ర తింటూ.. నన్ను ప్రశాంతంగా బతకనివ్వని అతి తెలివి మేధావి!
Chandra..
ReplyDeletethank you.
here i am.. waiting for your party.
అబ్బ!
ReplyDeleteఫ్రాయిడ్ NTR భవన్ లో బజ్జిలు అమ్ముకోడం! ఉహించుకుంటే ఎంత బాగుందో!
అది సరే కాని, నాకో చిన్న డౌట్!
మిమ్మల్ని డాక్టర్ గారు అనకూడదు, అన్నయ్య అనకూడదు, సర్ అంటే ఒప్పుకోరేమో? పొనీ రమణ గారు అనాలంటే పెద్దోరై పోతిరి! (అంటే గారు కన్నా పెద్దోరనమాట)
ఏమనలబ్బా?
పొనీ భక్తులు ఏవన్నా ఓకే అనేస్తే పోలా? లేపోతే మీరు dictator అనుకుంటారేమో జనాలు? బాబు గారి లాగా కింది స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించలేదు అనే ప్రమాదం కూడా ఉంది మరి :-)
Deenemma jeevitham.. em rasaru saami...
ReplyDelete//వందేళ్ళు కష్టపడ్డా ఫ్రాయిడ్ కి చంద్రబాబు అర్ధం కాడు. // ఏమి అద్బుతం సారు. ప్రాయిడ్ కు అర్దం కాని చంద్రబాబు మార్క్స్ కు అర్దమౌతాడు.
ReplyDeleteమీ అభిప్రాయాన్ని కాదనను గానీ, నాకైతే నమ్మకం లేదు.
Delete