Monday, 28 November 2011

ఆగండి! ఆలోచించండి!! (ఒక ప్రమాద హెచ్చరిక)

అబ్బాయిలూ!

ప్రేమలో పడ్డారా?

"నచ్చింది మల్లెచెండు, నచ్చింది  గర్ల్ ఫ్రెండు." అంటూ చిరంజీవిలా గంతులేస్తున్నారా?

"పెళ్ళి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా కాలం గడపాలి." అని రామారావులా కలలు కంటున్నారా?

"ఆలయాన వెలసిన ఆ దేవత రీతి" అని కూడా పాడుకోవాలనుకుంటున్నారా?

నా స్నేహితుడొకడు మీలాగే ముచ్చటపడ్డాడు.

కానీ ఇప్పుడు -

"తలచినదే జరిగినదా దైవం ఎందులకు?" అనీ..

"విధి ఒక విషవలయం, విషాదకథలకు అది నిలయం" అనీ పాడుకుంటున్నాడు.

అర్ధం కావట్లేదా?

సరే! నా స్నేహితుడి భార్య ఫొటో పబ్లిష్ చేస్తున్నాను. మీకు బాగా అర్ధమవుతుంది.

నీళ్ళల్లోకి దూకే ముందు బాగా ఆలోచించుకుని దూకండి మరి!

బెస్టాఫ్ లక్!


21 comments:

  1. అబ్బాయిలకు మీ హెచ్చరిక చాల బాగుంది..మరి అమ్మాయిలకు కూడ ఓ హెచ్చరిక ఇవ్వండి.

    ReplyDelete
  2. వద్దురా సోదరా అరేయ్ పెళ్ళంటే నూరేళ్ళ మంటారా! అంటారా? మీరు పెట్టిన చిత్రం చూస్తుంటే నాకు ఆలి కాదురా అది అనకొండ అన్న వాక్యం గుర్తుకొస్తోంది! సరే మరి అమ్మాయిలకో హెచ్చరిక?

    ReplyDelete
  3. The tragedy of marriage is that while all women marry thinking that their man will change, all men marry believing their wife will never change.

    ReplyDelete
  4. ఈయన అమ్మాయిలకు హెచ్చరికలు ఇవ్వరు. అబ్బాయిలకు మాత్రమే అని ఎప్పుడో బోర్డ్ పెట్టేసారు. కదండీ డాట్రారూ?

    ReplyDelete
  5. ఆగండీ, ఆలోచించండీ, ఆ పెళ్ళాలోచన వాడులుకొండీ!
    పెళ్ళాం లోచన
    అది ముక్కు మీద ఉండును
    ముక్కు ఒక్కటే కాని లోచనములు రెండు
    కాన ముక్కు లోచనములకు తక్కువే
    తెలుసుకొనవె జిలేబి, లోచనములు అవలోకితేశ్వరములు!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. Men’s Issues: కుడి ఎడమైతే – అబ్బాయే ఈ పనిచేసుంటే..!?
    http://kalalaprapancham.wordpress.com/

    ReplyDelete
  7. పంతుల విజయలక్ష్మి గారు..
    రసజ్ఞ గారు..

    సుభ గారు నా తరఫున చెప్పేశారు గదా!
    అయినా ఆడవారికి సలహాలిచ్చేంత తెలివితేటలు లేవండి!

    ReplyDelete
  8. Zilebi గారు..

    మీ పద్యం పూర్తిగా అర్ధం కాలేదు.
    అయినా బాగానే ఉందనిపిస్తుంది!
    ధన్యవాదాలు.

    ReplyDelete
  9. Dear GIdoc..

    ha.. ha.. ha..
    thank you.

    ReplyDelete
  10. ఎన్ని అనుకున్నా ప్రకృతి సహజంగా వచ్చే వాటిని ఆపలేం.

    ReplyDelete
  11. గురువు గారూ, ముందా దెయ్యం ఫోటో తియ్యండి. నా బ్లాగర్ అకౌంట్ లో మీ బ్లాగ్ ఉంది (నేను ఫాలో అయ్యే బ్లాగులు). ఏదైనా పోస్ట్ చేద్దామా అని ఇందాకే నా బ్లాగర్ అకౌంట్ తీశాను. ఆ వీడియో చూసి దడుసుకుని వెంటనే లాప్ టాప్ మూసేశాను. భయపడి చస్తున్నా. ( ఆంజనేయ దండకం కూడా రాదు నాకు)

    ఈ రిక్వెస్ట్ సరదాగా తీసుకునేరు. సీరియస్

    ReplyDelete
  12. "అమ్మబాబో నమ్మరాదు
    ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదూ.."

    పెళ్లవకముందు అయిన తరువాత వారి చూపులో తేడా చూశారూ...

    "రాదే చెలీ నమ్మ రాదే చెలీ
    మగవారి నిలా నమ్మరాదే చెలీ..."

    ReplyDelete
  13. శుభ గారి లాగే నేనూ మీ జవాబు రాస్తున్నా,

    yaramana said:

    ఏవమ్మా చందు ఎస్ గారూ, మీరు రోజూ అద్దం లో చూసుకోరా, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసి ఆంజనేయ దండకం చదువుకుంటారా?

    ReplyDelete
  14. మీరు ప్రతిదానిని సరదాగా రాయటం ఎమీ బాగా లేదు. డాక్టర్ అయ్యి ఉండి ప్రజలను ఎడ్యుకేట్ చేయవలసినది పోయి, హాస్య రచనలు చేస్తున్నారు. మీకు బ్లాగు బ్రహ్మానందం అనే పేరు సరిగ్గా సరి పోతుంది. రోజు రోజుకి మీ ఫాన్స్ కూడా మీ నుంచి అదే కోరుకొంట్టున్నారు.

    Sri

    ReplyDelete
  15. Sri గారు..

    శ్రీరామరాజ్యం గూర్చి రాస్తే.. బాపుని అపహాస్యం చేశానన్నారు.

    సరదాగా రాస్తే బ్లాగు బ్రహ్మానందం (థాంక్యూ!) అంటున్నారు.

    మరప్పుడు నేను ఏం రాయాలి?

    నేను వృత్తి రీత్యా డాక్టర్ని.

    నా ప్రపంచం పేషంట్లు, మెడికల్ జర్నల్స్, మెడికల్ డాక్టర్లు.

    వైద్య విషయాల్లో పబ్లిక్ ని ఎవేర్ చేసే కార్యక్రమాలు టీవీల్లో, పత్రికల్లో చాలా మంది చేస్తూనే ఉన్నారు.

    అలా చేయటం శ్రమతో కూడుకున్న పని.

    నాకు అంత ఓపికా, స్కిల్స్ లేవు.

    ఈ బ్లాగులు రాయటం నాకు రిలీఫ్.

    కేవలం రిలాక్స్ అవటం కోసమే రాస్తున్నాను.

    నేను ఎవరినీ ఎడ్యుకేట్ చేసేంత స్థితిలో లేను.

    ఈ బ్లాగులు రాస్తుండటం వల్ల నా తెలుగు ఇంప్రూవ్ అయ్యింది.

    పెద్దబాలశిక్షనీ, శంకరనారాయణ డిక్షనరీనీ కొని కుస్తీ పడుతున్నాను.

    ఆ మేరకు నాకు సంతృప్తి ఉంది.

    డాక్తర్లు వైద్యం గూర్చీ, బ్యాంకర్లు పొదుపు గూర్చి బ్లాగులు రాస్తుంటే బోర్ కొడతాయేమో!

    ReplyDelete
  16. మీరు సైకాలజిస్ట్ కనుక మీదగ్గర కొచ్చే కొత్త కొత్త కేసుల గురించి, ప్రస్తుత సమాజ ట్రెండ్ గురించి రాయవచ్చు. నేను నిన్న సీరియస్ గా "డాక్టర్లు ఒక్కరే ప్రపంచం లో ప్రజల రోగాల మీద డబ్బులు సంపాదించేది .... ప్రభుతవం లైసేన్స్ ఇచ్చింది" అని రాస్తే ఎవరో ఫ్రెంచ్ ఫిలాసఫర్ పుస్తకం చదవమని నాకు చెప్పారు. రాను రాను మీరు పార్లమేంట్ లో ప్రణబ్ ముఖర్జీ లాగా అవుతున్నారు. ఎదుటివారు సీరియస్ గా చేసిన ఆరోపణలను కూడా సమయస్పుర్తి తో తిప్పి కొడుతున్నారు. నేను సీరియస్ గా రాసినది మీరు సీరియస్ గా తీసుకోవాలంటె ఎమీ చేయాలి?

    Sri

    ReplyDelete
  17. శ్రీ గారు..

    నేను సైకాలజిస్ట్ ని కాదు. సైకియాట్రిస్ట్ ని.

    మీరు ఇలా రాశారు."ప్రపంచంలో ఆలోచించే ప్రతిఒక్కరు వారి వారిలోకాలలో ఊహలలో ఉంట్టూఉంటారు. మరి సైకాలజిస్ట్లు ఒకరి పిచ్చి అని, మానసికంగా బాగా లేదని ఏవీధంగా నిద్దరణ చేసి వైద్యం చేస్తారు?"

    దానికి నేను ఫూకు (Michel Foucault) ని కోట్ చేశాను.

    ఫూకు యూరప్ లో 'ఏంటీ సైకియాట్రీ మూవ్ మెంట్' తెచ్చాడు. మానసిక రోగాలు, మానసిక వైద్యం అంతా ట్రాష్ అనీ, బోగస్ అనీ చెప్పాడు. చాలా influential థింకర్. ఫూకు గూర్చి పోస్ట్ కూడా రాస్తానన్నాను. ఇంతకన్నా సీరియస్ గా ఎలా చెప్పాలి!

    ReplyDelete
  18. నేను సైకాలజిస్ట్ ని కాదు. సైకియాట్రిస్ట్ ని.

    Sorry sir.

    Sri

    ReplyDelete
  19. అయ్యా యారమణ ,

    జిలేబి రాతలు జిలేబీకే అర్థం కావు. మీకు అర్థం కాక పోవడం లో విడ్డూరం ఏమీ లేదు

    ReplyDelete
  20. Dont lose the humour part. But somehow this particular post didn't meet the "pani leka" target. Sorry :(

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.