"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. టీవీలో బాపు 'శ్రీరామరాజ్యం' కమర్షియల్ వస్తుంది.
టీవీ చూస్తూ "ఈ బాపుకి ఎంత ఓపిక! అరిగిపోయిన రికార్డులా రామాయణాన్ని తీస్తూనే ఉన్నాడు గదా!" అంటూ ఆశ్చర్యపడిపొయాడు సుబ్బు.
"సుబ్బు! నేను బాపు అభిమానిని, చూజ్ యువర్ వర్డ్స్." స్థిరంగా అన్నాను.
"నాకు తెలుగు సినిమా దర్శకుల్ని చూస్తుంటే హోటల్లో అట్టుమాస్టర్లు గుర్తొస్తారు. ఆనందభవన్లో ముత్తు నలభయ్యేళ్ళుగా అట్టుమాస్టర్. మనిషి నల్లగా నిగనిగలాడుతూ కాలిన పెనంలా, బక్కగా ఎండిపోయిన చుట్టలా వుంటాడు. దించిన తల ఎత్తకుండా దీక్షగా బుల్లిగిన్నెలో పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా అట్లు పోస్తూనే ఉంటాడు." అన్నాడు సుబ్బు.
"అవును, అయితే?" అన్నాను.
"ముత్తు అట్లకాడతో స్టీలు మగ్గులోంచి నూనె అట్టుమీదకి జల్లటం ఎంతో కళాత్మకంగా వుంటుంది! పిండిచెయ్యిని నీళ్ళబొచ్చెలో ముంచి - కొన్నిట్లో బంగాళదుంప మసాలా, కొన్నిట్లో ఉల్లిపాయలు గుప్పిటతో ఎంతో పొందికగా పెడతాడు. మళ్ళీ నూనెని అట్లకాడతో ఇంకోరౌండ్ జల్లి, అట్టుని లాఘవంగా చుట్టి పక్కనున్న పెద్ద సత్తుప్లేట్ మీద పెట్టి, అట్లకాడతో టకటకమంటూ శబ్దం చేస్తాడు. అది - 'అట్టు రెడీ!' అని సర్వర్‌కి తెలియజేసే కోడ్." అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! విషయానికి రా." విసుక్కున్నాను.
"వస్తున్నా! వస్తున్నా! అట్లు పోయ్యటంలో గొప్ప ప్రతిభాశీలి అయిన ముత్తుకి ఇడ్లీలు వెయ్యడం రాదు! పొద్దస్తమానం అట్లుపోస్తూ, పక్కనే ఉండే ఇడ్లీమాస్టర్‌తో కబుర్లాడుతుంటాడు, కానీ ముత్తుకి ఇడ్లీ గూర్చి తెలీదు!"
"ఆశ్చర్యంగా ఉందే!"
"ఇందులో ఆశ్చర్యమేముంది? నువ్వు కూడా ముత్తు సోదరుడివే! ఎప్పుడూ 'మానసిక వైద్యం' అనే అట్లు మాత్రమే పోస్తున్నావుకదా!"
"ఓ! నువ్వా రూట్లో వచ్చావా!" నవ్వుతూ అన్నాను.
ఇంతలో వేడిగా కాఫీ వచ్చింది, కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"తెలుగు సినిమారంగం మొత్తం ముత్తు సోదరులే! విఠలాచార్య ఒకేరకమైన సినిమాలు పుంజీలకొద్దీ తీశాడు. అన్నిసినిమాల్లో అవే గుర్రాలు, అవే కత్తులు! పులులు, పిల్లులు, కప్పలు రెగ్యులర్ ఆర్టిస్టులు. కథ చుట్టేయ్యటానికి దొరికితే రామారావు, దొరక్కపోతే కాంతారావు. ఆయన జానపద సినిమాలు అనే 'అట్లు' పోసీపోసీ కీర్తిశేషుడయ్యాడు." అన్నాడు సుబ్బు.
"సుబ్బు! మనం ఒక్క విఠలాచార్య సినిమాకూడా వదల్లేదుగదూ!" సంతోషంగా అన్నాను.
"కె.ఎస్.ఆర్.దాస్ అనే దర్శకుడు లెక్కలేనన్ని 'డిష్షుం డిష్షుం' సినిమాలు తీశాడు. దొరికితే కృష్ణ, దొరక్కపొతే విజయ లలిత! ఆయన దగ్గర ఇంకా పిండి చాలా ఉంది. కానీ - ఆయన అట్లు తినడానికి ప్రేక్షకులు అనే కస్టమర్లు మాయమయ్యారు, అంచేత నేచురల్‌గానే నిర్మాత అనే పెనం దొరకలేదు."
"ఆయన దాదాపు ఇంగ్లీషు సినిమాలన్నీ తెలుగులో తీసేశాడు!" ఉత్సాహంగా అన్నాను.
"ఇంక రాంగోపాల్ వర్మ! గాడ్‌ఫాదర్ సినిమాని తిరగేసి తీశాడు, బోర్లించి తీశాడు, మడతపెట్టి తీశాడు, చితక్కొట్టి తీశాడు, పిసికి పిసికి తీసాడు, ఉతికి ఉతికి తీశాడు! ఒకే పిండి, ఒకే అట్టు. రకరకాలుగా పేర్లు మార్చి కస్టమర్లని మోసం చేస్తుంటాడు."
"ఐ అగ్రీ." నవ్వుతూ అన్నాను.
"బాపు రమణల స్పెషాలిటీ 'రామాయణం' అనే దోసెలు. రమణ తగుపాళ్ళలో పిండిరుబ్బి బాపుచేతికి అందిస్తే, ఇంక బాపు మన ముత్తులాగా రెచ్చిపోతాడు. ఒకసారి ముత్తుని 'అట్టు కొంచెం పెద్దదిగా, స్పెషల్‌గా వెయ్యి ముత్తు' అనడిగా. ముత్తు గారపళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ 'అదెట్టా కుదురుద్ది సుబ్బు బాబు! అట్టా సైజ్ మార్చాలంటే చెయ్యి వణుకుద్ది, వాటం కుదరదు.' అన్నాడు."
"నిజమా!" ఆశ్చర్యపోయాను.
"అవును. మలయాళం దర్శకుడు అరవిందన్ ఆంధ్రా అడవుల్లో చెంచుదొరల్తో 'కాంచనసీత' అనే సినిమా కొత్తదనంతో వెరైటీగా తీశాడు. కొత్తరకంగా ఆలోచించాడని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. బాపురమణలు ముత్తుకి సోదరులు, వారికి కొత్తఐడియాలు వచ్చే అవకాశం లేదు." అన్నాడు సుబ్బు.
"సుబ్బు! బాపు రమణలు చాలా ప్రతిభావంతులు." అన్నాను.
"కాదని నేనలేదే! కానీ నువ్వో విషయం గ్రహించాలి. దోసెలన్నీ ఒకటే. అట్లే వృత్తులన్నీ ఒక్కటే. నీ వైద్యవృత్తి క్షురకవృత్తి కన్నా గొప్పదేమీకాదు. కానీ మనం కొన్ని ప్రొఫెషన్లకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. అలాగే విఠలాచార్య, కె.ఎస్.ఆర్.దాస్, వర్మ, బాపురమణలు ఒకేగొడుగు క్రిందకొస్తారు. కానీ మనం దేవుడి సినిమాలు తీసేవాళ్ళనే గొప్పవారంటాం. ఇక్కడ మతవిశ్వాసాలు కూడా ప్లే చేస్తాయి." అన్నాడు సుబ్బు.
"నీ ఎనాలిసిస్ బాగానే ఉందిగానీ - రాత్రికి 'శ్రీరామరాజ్యం' వెళ్దామా?" అడిగాను.
"ఆ సినిమా తీసింది కుర్రాళ్ళ కోసం. మనలాంటి ముసలాళ్ళ కోసం ఎన్టీరామారావు 'లవకుశ' ఉందిగా. నీకు చూడాలనిపిస్తే మన లవకుశ ఇంకోసారి చూసుకో. నాదృష్టిలో లవకుశ సినిమాకి అసలు హీరో ఘంటసాల! రాముడిగా రామారావుని చూశాక ఇంకెవ్వర్నీ చూళ్ళేం!" అన్నాడు సుబ్బు.
"నువ్వెన్నయినా చెప్పు. బాపురమణలు తెలుగువాళ్లవడం మన అదృష్టం." నేనివ్వాళ సుబ్బుని ఒప్పుకోదల్చుకోలేదు.
"నేను మాత్రం కాదన్నానా? బాపురమణలకి రామాయణమే జీవనాధారం. అదే కథని నలభయ్యేళ్ళుగా నమ్ముకున్నారు. రామాయణాన్ని తీసేవాడు దొరక్కపొతే ఆ కథకే ప్యాంటూ, చొక్కా తొడిగి సోషల్ పిక్చర్లు చుట్టేశారు.. రామకోటి రాసినట్లు! ఫలితంగా దండిగా పుణ్యం మరియూ సొమ్ము మూట కట్టుకున్నారు."
"ఈ విషయం ఇంకెక్కడా అనకు, భక్తులు తంతారు." నవ్వుతూ అన్నాను.
సుబ్బు కాఫీ తాగటం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు.
"బాపుకి ఫైనాన్స్ చేసేవాడు దొరికాడు, నటించేవాడూ దొరికాడు. అట్టు పోసేశాడు. చూసేవాడు చూస్తాడు, చూడనివాడు చూడడు. ఎవడి గోల వాడిది. ఉప్మాపెసరట్టు అందరికీ నచ్చాలని లేదుకదా." అన్నాడు సుబ్బు.
"అంతేగదా." అన్నాను.
"అయినా యే సినిమా గొప్పదనం ఆ సినిమాదే. ఇప్పటి శ్రీరామరాజ్యంని ఎప్పుడో సి.పుల్లయ్య తీసిన లవకుశతో తూకం వేద్దామనుకోవటం అశాస్త్రీయం కూడా. ఈ రోజుల్లో సినిమాలు టెక్నికల్‌గా ఎంతముందుకెళ్ళాయో, నటన విషయంలో అంత వెనక్కొచ్చాయి. ఇది అన్ని భాషల్లోనూ జరుగుతుందే." అన్నాడు సుబ్బు.
"మరి తియ్యటం దేనికో!" అడిగాను.
"ఏ భాషలోనయినా పాతక్లాసిక్స్ మళ్ళీ తియ్యటం జరుగుతుంది. అలా అనుకుంటే రామారావుతో లవకుశ తీసి వుండేవాళ్ళుకాదు. ఎన్టీరామారావు కొడుకు రాముడి వేషం వేస్తున్నాడని జనాలు ఆసక్తిగా ఉన్నారు. అసలు ఈ సినిమాకి పబ్లిసిటీ పాయింటే అది." అన్నాడు సుబ్బు.
"అవును."
"రాజులాగా యువరాజు, పెదరాయుడిలా చినరాయుడు, రాజీవ్ గాంధీలా రాహుల్ గాంధీ! రాచరిక వ్యవస్థని రద్దు చేసుకున్నాం గానీ - బానిస భావాలని బుర్రలోంచి రద్దు చేసుకోలేకపోతున్నాం. బహుశా మన సమాజం తగినంతగా ఎడ్యుకేట్ కాకపోవటం.. ప్రాంతం, కులం ప్రభావాల నుండి బయటపడలేకపోవటం కారణం కావొచ్చు." అన్నాడు సుబ్బు.
"మొత్తానికి నీ ముత్తు థియరీ బాగానే వుంది." నవ్వుతూ అన్నాను.
"థాంక్యూ! అవును - ముత్తు అట్లు పోస్తున్నట్లు బాపురమణలు రామాయణం తీస్తూనే వున్నారు. అందుకే నాకు ముత్తు, బాపురమణలు ఇష్టులు! వీరు తమకి తెలిసిన ఏకైక పనిని ఏమాత్రం విసుగు లేకుండా మళ్ళీమళ్ళీ చేస్తూనే వుంటారు!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.
"మన దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మందిలో బాలకృష్ణ ఒక్కడే రాముడి వేషం వెయ్యగల ప్రతిభ ఉన్నవాడా?"
ReplyDeleteమీరు సుమన్ కూడా ఉన్నాడని జవాబు ఇవ్వాల్సింది, మరిచిపోయారా లేక ఈటీవీ అలవాటు లేదా?
చాలా బాగా రాసేరు అనడం చాలా చిన్న మాట !
ReplyDeleteశ్రీరామరాజ్యంని ఎప్పుడో సి.పుల్లయ్య తీసిన లవకుశతో తూకం వేద్దామనుకోవటం అశాస్త్రీయం యెందుకవుతుంది? పరమశాస్త్రీయం. ఒకే కథతో మరొక సినిమా వస్తే, పోలికలూ తేడాల గురించి మేథావులేకాదు, సామాన్యజనం కూడా తప్పక ఆలోచిస్తారు. మేథావులు తమ లాజిక్కులతో గిమ్మిక్కులు చేసి తమయెదుటివాళ్ళను బోల్తాకొట్టించాలనుకున్నా, సామాన్యులు సాఫీగా మాత్రమే ఆలోచించి నచ్చితే చూస్తారు లేకుంటే లేదు. శ్రీరామరాజ్యం సినిమా బాగుందని కొంతమంది జనాన్ని మోసంచేయాలని చూడటందేనికో నాకర్ధం కాదు. బాపు సినిమా అగు కాక మనం నెత్తిన పెట్టుకోవాలని యాగీ చేయట మేమిటి? ఈ సినిమా తెలుగువాళ్ళ దురదృష్టంకొద్దీ వచ్చిందని నా నమ్మకం. కాలాని కనుగుణంగా అంటూ చెత్తగా తీయాలా? ఆర్టు వర్క్ బాగున్నంతమాత్రాన మంచి సినిమా కాబోదు.
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteచప్పట్లు.. మీకు, సుబ్బు గారికి.
:) :) :) :) :)
ReplyDeleteరమణ గారూ...సుబ్బు గారు ఇలా జీవిత సత్యాలు భలే చెప్తారండీ..పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
ReplyDeleteహ హ ..సినిమా కన్నా మీ సుబ్బు కబుర్లు సూపర్ గా ఉన్నాయ్.
ReplyDeleteహ్మ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్లు తన అట్లేవో తను పోసుకోకుండా ఇడ్లీల్లో వేలుపెట్టి అందుబాటులో ఉన్న అట్టుపిండితో ఇడ్లీలు వేయాలని ప్రయత్నించి రసాభాసా చేయడం కన్నా.. తన పనిలో ఏకాగ్రత నిలిపి ప్రావీణ్యం సంపాదించడం ఉత్తమమేకదండీ :-)
ReplyDeleteబాపురమణల మీద ఉన్న అభిమానం అడ్డుపడుతుందేమో తెలియదు కానీ మీ సుబ్బు గారి దోశ ఫిలాసఫీ వీరికి అన్వయించడాన్ని ఒప్పుకోలేకపోతున్నానండీ. కనీసం దోశ పెద్దదిగా పోయడం కూడా రాదు అనడం మరీ... :-))
>>శ్రీరామరాజ్యం సినిమా బాగుందని కొంతమంది జనాన్ని మోసంచేయాలని చూడటందేనికో నాకర్ధం కాదు. బాపు సినిమా అగు కాక మనం నెత్తిన పెట్టుకోవాలని యాగీ చేయట మేమిటి?
ReplyDeleteసినిమా చూడకుండా ట్రైలర్ చూసి సినిమా బాగాలేదని తీర్మానించేసి,జనాల్ని నమ్మించడానికి మీరు చేస్తున్న యాగీ కంటే తక్కువే లేండి.బాపు సినిమా కాబట్టి సినిమా నెత్తిన పెట్టుకోవాలని ఎవరూ తీర్మానించలేదు.అదే బాపు తీసిన బోల్డు సినిమాలు జనం తిప్పికొట్టారు.సినిమా ఆస్వాదించే ఉద్దేశ్యంతో వెళ్ళిన వాళ్ళకు సినిమా నచ్చే అవకాశముంది కానీ, సినిమాలో వంకలు పెడుదామనుకొని వెళ్ళిన వాళ్ళకి సినిమాలో నెమలి నిజమైనదా కాదా,సెట్టింగ్లు ప్లాస్టిక్‌తో చేశారా లేక చెక్కతో చేశారా అనే ఆలోచనలే ఉంటాయి కానీ సినిమా ఎక్కదు.
ఇక సినిమాకు లభిస్తున్న ఆదరణ గురుంచి. ఈ సినిమా 450 థియేటర్లలో రిలీజయ్యి రెండవ వారంలో 250 కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. పౌరాణిక భక్తి రస చిత్రాలలో ఇదొక రికార్డు. అన్నమయ్య 60 కేంద్రాలలో విడుదలైతే, శ్రీరామదాసు 150 కేంద్రాలలో విడుదలయ్యింది.అంత తక్కువ థియేటర్లలో విడుదలైన ఆ సినిమాలే మొదటి రెండు వారాలు జనం లేక ఈగలు తోలుకున్నాయి.తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాయి.జనం ఎగబడి చూసిన అన్నమయ్య కమర్షియల్ ఫెయిల్యూర్ అన్న సంగతి నిర్మాతే స్వయంగా చెప్పాడు. భారీగా విడుదలైన శ్రీరామారజ్యాం, జనానికి నచ్చకపోతే రెండవ వారానికే సర్దుకొనేది.అలా జరగలేదే. మీడియా సృష్టి అయితే సినిమా గురుంచి కేవలం TV9 మాత్రమే టముకు వేసేది.కానీ ప్రతి చానల్, ప్రతి న్యూస్ పేపర్ దీన్ని ఆకాశానికి ఎందుకు ఎత్తేస్తున్నాయంటారు? ఇది కూడా మీడియా సృష్టేనా?
ReplyDeleterangaraju గారు..
ReplyDeleteవ్యాఖ్యలకి ధన్యవాదాలు.
సినిమా కమర్షియల్ సక్సెస్ అయినందుకు సంతోషం.
కానీ.. ఈ పోస్ట్ కీ, సినిమా సక్సెస్ కి సంబంధం లేదు.
దయచేసి గమనించగలరు.
//సినిమా చూడకుండా ట్రైలర్ చూసి సినిమా బాగాలేదని తీర్మానించేసి,జనాల్ని నమ్మించడానికి మీరు చేస్తున్న యాగీ కంటే తక్కువే లేండి//
ReplyDeleteనేను సినిమా చూసే యాగీ చేస్తున్నాను లెండి . :) ... స్క్రీన్ ప్లే ( ముఖ్యంగా స్వర్ణ సీత ను చూసే ముందు అసలు సీత మూర్చపోవడం , వాల్మీకి మంత్ర జలం చల్లగానే ఆత్మ రూపంలో స్వర్ణ సీతదగ్గరకి వెళ్లడం , ముసుగు లాగేయడం , చంద్ర వంక దిద్దడం అబ్బో మొత్తం అదే లే ) యథాతథంగా మక్కికి మక్కి కాపీ కొట్టేసి అక్కడక్కడ - కొన్ని సీన్స్ మాత్రం మార్చేస్తే మాత్రం ఒరిజినల్ ఒరిజినలే , నకిలీ నకిలీ నే ! తేడా స్పష్టంగా తెలుస్తోంది . ఒరిజినల్ స్క్రీన్ ప్లే కి క్రెడిట్స్ ఇచ్చారా ఇంతకీ ? అంతెందుకు ఇప్పటికీ పాత లవకుశ పాటలన్నీ గుర్తున్నట్టు , ఈ శ్రీ రామ రాజ్యం పాటలు ఒక్కటంటే ఒక్కటి 50 సంవత్సరాలు అవసరం లేదు కాని , 5 సంవత్సరాల తరువాత గుర్తుంటాయా ? అంత గాఢత ఎక్కడుంది ఆ పాటల్లో ? అసలు రామ రాజ్యం ఎలా ఉంటుందో చూపించనప్పుడు , ఈ సినిమాకు ఆ పేరే ఒక మిస్ నామర్ !!! శ్రీరామ వ్యథ అంటే సరిపోయేది .
Ahaa.. abhutamgaa raasaru.. :)
ReplyDelete>>శ్రీరామరాజ్యంని ఎప్పుడో సి.పుల్లయ్య తీసిన లవకుశతో తూకం వేద్దామనుకోవటం అశాస్త్రీయం యెందుకవుతుంది? పరమశాస్త్రీయం.
ReplyDeleteఖచ్చితంగా అశాస్త్రీయమే అవుతుంది. రామారావు, అంజలిదేవి, నాగయ్య, కాంతారావు గొప్పగా నటించారు కాదనటం లేదు.కానీ ఇప్పటి తరం నటీనటులు కూడా అలానే నటించి, సినిమాని కూడా అదే శైలిలో మళ్ళీ తీస్తే,చిత్ర వ్యవధి నాలుగ్గంటలవుతుంది.అప్పుడు ఒక్కడు కూడా చూడడు.అప్పటికీ శ్రీరామరాజ్యం 2 గంటలా 45 నిమిషాలుంది.ఎటువంటి కమర్షియల్ ఎత్తుగడలకూ పోకుండా ఇంత తక్కువ వ్యవధిలో లవకుశ ఇతివృత్తాన్ని చెప్పటం నిజంగా గొప్పే.ఇదొక మంచి ప్రయత్నం .ఇటువంటి ప్రయత్నాన్ని కూడా హర్షించకుండా ఇటువంటి సినిమా రావటం మన దురదృష్టం అంటున్నారంటే ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.ఎన్‌టిరామారావు 37-41 వయసులో వేసిన వేషాన్ని బాలకృష్ణ 51 ఏళ్ళ వయసులో చేశాడు. బాలయ్య వయసు గురుంచి మాట్లాడే వాళ్ళు అదే వయసులో రామారావు చేసిన శ్రీరామ పట్టాభిషేకం చూసి మాట్లాడండి.
రమణ గారు, గమనించానండి.శ్యామలీయం గారి కామెంటుకు సమాధానంగా నేను ఇదంతా వ్రాయాల్సి వచ్చింది . సాధారణ ప్రేక్షకుడు దీన్ని బాగానే రీసీవ్ చేసుకుంటున్నాడని మేధావుల సృష్టి కాదని చెప్పటమే నా ఉద్దేశ్యం
ReplyDeleteడియర్ రమణా, ఈ సుబ్బు నాకు బాగా నచ్చాడు. నెక్ష్ట్ సారి ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చెయ్యాలి. సుబ్బు కి నాకు ఒకే రకమైన వ్యూస్ ఉన్నాయి. ఐతే, ఏ బాలక్రిష్ణ ఫ్యాన్లో, బాపు ఫ్యాన్లో కొడతారేమో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి!
ReplyDelete*రాచరిక వ్యవస్థని రద్దు చేసుకున్నాం గానీ.. బానిస భావాలని బుర్రలోంచి రద్దు చేసుకోలేక పోతున్నాం. ఇలా అంతర్జాతీయంగా జరగట్లేదు.*
ReplyDeleteఎందుకు జరగటం లేదు. బ్రిటిష్ యువరాజు గారి పెళ్ళిని అక్కడ మీడీయ ప్రజలు నెత్తిన పెట్టుకొని చూడటం లేదా? అదే విధంగా కొత్త పోప్ గారి పదవి ప్రమాణ స్వీకారన్ని మీడీయావారు ప్రపంచ వ్యాప్తంగా కవర్ చేయటం లేదా! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశానికి వారి వైన లోపాలు ఎన్నో ఉన్నాయి.
*నాకు బాపు అన్నా, ముత్తు అన్నా ఇష్టం! తమకి వచ్చిన ఏకైక పనిని ఏ మాత్రం విసుగు లేకుండా మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు.*
ముత్తు సంగతి నాకు తెలియదు గాని. బాపుగారు పనిని విసుగు లేకుండా చేస్తున్నారు అంటే ఒకటే కారణం, వారు వారి పనిని ప్రేమిస్తారు. అందువలన వారు విసుగు విరామం లేకుండా పని చేస్తారు. వారు పక్క పనులను ఎమీ చేయటం లేదు. వారికి నచ్చిన/వచ్చిన పనినే కేరీర్ ఆరంభం నుండి చివరి వరకు నమ్ముకొన్నారు. ఆ వచ్చిన డబ్బుతో తృప్తి చెందారు. రచయితగా మారి పుస్తకాలు రాయటం. నిర్మాతగా మారి సినేమాలు తీయటం మొద|| పనులు డబ్బుకొరకో పేరు ప్రఖ్యాతుల కొరకో చేయలేదు.
ఈ అనాలిసిస్ మీకు మీరే నిజాయితి గా చేసుకొని ఉంటే, మీరు చేసే వృత్తిలో లోపాలు తెలిసి తక్షణం ఆపి ఉండేవారు. ప్రపంచంలో ప్రజల రోగాల మీద వచ్చే డబ్బులతో జీవితం గడిపేది ఒక్క వైద్యులు మాత్రమే. ప్రపంచంలో ఆలోచించే ప్రతిఒక్కరు వారి వారిలోకాలలో ఊహలలో ఉంట్టూఉంటారు. మరి సైకాలజిస్ట్లు ఒకరి పిచ్చి అని, మానసికంగా బాగా లేదని ఏవీధంగా నిద్దరణ చేసి వైద్యం చేస్తారు? ఒకటే కారణం గవర్నమేంట్ మీకు లైసెన్స్ ఇచ్చింది. మీరు చికిత్స చేస్తారు.
Sri
Good comparison to professional Dosa maker Ya Ra.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteసుత్తి లేకుండా సూటిగా పాయింట్ బ్లాక్ లో చెప్పారండి. సూపర్ :)
ReplyDeleteఇక్కడ మేధావులూ.. అప్పుడే వండిన గారెల్లో కూడా పురుగులెంచగలరు :-)
ReplyDeleteరామాయణం అని చెప్పి ఎదో బూతుపురాణం చూపించలేదు కద(దర్శక దిగ్గజ అనబడే రాఘవేంద్రరావులా..)
పాత లవకుశ అంత గొప్పగా లేకపోవచ్చు(దర్శక, రచన, సంగీత, సాహిత్య...ఏది చూసినా), ఇప్పటి జనాలు చూసే రీతిలోనే ఉంది బాగుంది. నాకు నచ్చింది ఇంతకంటే గొప్పగా తీయవచ్చు అని కూడా అనిపించింది, తీసే వాడు ఉంటే చూడడానికి జనాలు విమర్శించడానికి మేధావులు రెడీ గానే ఉన్నారు కూడా!
This comment has been removed by the author.
ReplyDeleteమీ రివ్యూ రాసే విధానం బాగుంది!!
ReplyDeleteSRR New Record in US
ReplyDeleteSri Rama Rajyam, the masterpiece from legendary combination of Bapu-Ramana-BalaKrishna-NageswaraRao-Ilayaraja is creating sensation at overseas box office in the 2nd week. Normally, the second week collections of any movie in overseas not more than 50% of the first week including blockbusters. Probably for the first time in overseas history, this movie is poised to collect around 80% of its first week collections in the second week based on Nov 23rd and 24th collections. Some of the shows were sold out in locations like VA, New Jersey and Bay Area even though we are screening in multiple theaters. The movie had a fantastic second week so far and families with kids are turning up in big numbers to watch this magnum opus.
This movie turned out to be the biggest grosser among Bala Krishna's movies in Overseas. Also, this is the highest grosser in mythological movies. The movie offers something for everyone and hence this movie is being embraced by all sections (Youth, Families, Women and Kids) for its technical brilliance, straight & crisp narration, visual grandeur, strong emotions and show casing our heritage, history and culture in a splendid way.
Almost all the exhibitors are already in profit zone and we thank overseas audience from the bottom of our heart for encouraging this movie in a big way in Overseas. This epic movie is running in all major centers and we made sure that there are enough shows to cater for public demand. Please watch the movie in Big Screen and please make sure to take your kids to this visual extravaganza.
ఈ సుబ్బు మరీ కన్ఫ్యూషన్ మనిషి లాగున్నాడు. మొదట్లో ఓ ట్రాక్ లో టాపిక్ మెదలెట్టి, మధ్యలో గిరికీ గొట్టి వేరే మార్గం లో మార్చేసాడు అసలు సుబ్బు కి పెసరట్టు (ఉప్మా పెసరట్టు) రెండు వైపులా వేసే తెలివి ఉందనుకుంటాను !
ReplyDeleteచీర్స్
జిలేబి
From Eenaducinema.com:
ReplyDeleteWe know already that a hardcore fan of Balayya; Mr. Ashok from San Jose had bought Sri Rama Rajyam movie ticket for 2500 dollars. Now the latest buzz is that another hardcore fan of Balakrishna; Mr. Jitender Kumar from New Jersey had bought the first show ticket of Sri Rama Rajyam movie for a whopping price of $ 6000. According to sources, a holy temple of Rama is going to be constructed by fans at a theater in New Jersey.
I want to know how you would buy a ticket for that much money for a movie no less and from whom? I don't believe there are scalpers for movie tickets in the US.
BTW, shouldn't that make the movie even grander now that we heard people are losing their head and paying exorbitant prices for the tickets?
Good review and more than that the way the review was presented is Goodest (I know this is a wrong usage, but when those British butchered our languages, can't we do this much!!)
ReplyDeleteశ్యామలీయం గారు..
ReplyDeleteలవకుశతో శ్రీరామరాజ్యాన్ని తూయటం పరమ శాస్త్రీయం అన్న మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను.
నాకయితే మీరు ఒక వృద్ధుడితో యువకుడిని పోల్చినట్లనిపిస్తుంది. అవటానికి ఇద్దరూ మనుషులే! కానీ ఎన్నో పరిమితులు.
అప్పటి ప్రెక్షకులు వేరు. దేశ కాల పరిస్థితులు వేరు. కాలానుగుణంగా మనుషులు మారతారు. అది సహజం. ఇంక అభిరుచుల గూర్చి చెప్పేదేముంది!
ఇట్లాంటి విషయాల్లో కంపేరిటివ్ స్టడీ చెయ్యాలంటే కాలాన్ని, సామాజిక పరిస్థితుల్నీ standardize చెయ్యాలి.
అర్ధ శతాబ్ద వ్యవధిలో వచ్చిన క్రియేటివ్ అవుట్ పుట్ ని విశ్లేషణ (by standardizing social, cultural, political variables) చేస్తూ తెలుగులో ఎవరన్నా రాసారేమో నాకు తెలీదు.
నాకు ఆ.సౌమ్య గారు రాసిన రివ్యూ నచ్చింది. దయచేసి అది చదవండి.
:)))
ReplyDeleteJai Gottimukkala గారు..
ReplyDeleteపంతుల జోగారావు గారు..
క్రిష్ణప్రియ గారు..
Kathi Mahesh Kumar గారు..
జ్యోతిర్మయి గారు..
Mauli గారు..
vamsi గారు..
nagarjuna గారు..
Sharma గారు..
Srikannth Edara గారు..
ధన్యవాదాలు.
వేణూ శ్రీకాంత్ గారు..
ReplyDeleteమీ అభిప్రాయాన్ని ఒప్పుకుంటూనే..
నేను నా స్కూల్ డేస్ లోనే ముళ్ళపూడి బుడుగు చదివాను. అప్పట్నించి దాదాపు రమణ రాసినవన్నీ చదివాను. బాపు బొమ్మలు మీకులాగే నాకూ ఇష్టం. బాపు రమణలు తీసిన మంచి సినిమాలతో పాటు చెత్త సినిమాలూ చూశాను. మా అబ్బాయి ముద్దు పేరు బుడుగు.
బాపు రమణలపై మన అభిమానం తెలుగు హీరోల అభిమాన సంఘాల స్థాయికి దిగిపోకుండా చూసుకుందాం. బాపు రమణలు ప్రతిభావంతులనే కదా ఇంత చర్చ!
sri గారు..
ReplyDelete*రాచరిక వ్యవస్థని రద్దు చేసుకున్నాం గానీ.. బానిస భావాలని బుర్రలోంచి రద్దు చేసుకోలేక పోతున్నాం. ఇలా అంతర్జాతీయంగా జరగట్లేదు.*
సుబ్బు తెలుగు సినిమాలని ఉద్దేశించి అన్నాడు.
సినిమాలకి సంబంధించి హీరోల కొడుకుల్నీ, తమ్ముళ్ళనీ కూడా మోస్తున్న వీరులం మనం.
జాతి, పౌరుషం, వంశం అంటూ పులకించిపోతున్నాం.
తెలుగులో మంచి సినిమాలు, మంచి నటులు రావాలని ఆశించే వారిని ఇబ్బంది పెట్టే అంశం ఇది.
*ముత్తు సంగతి నాకు తెలియదు గాని. బాపుగారు పనిని విసుగు లేకుండా చేస్తున్నారు అంటే ఒకటే కారణం, వారు వారి పనిని ప్రేమిస్తారు. అందువలన వారు విసుగు విరామం లేకుండా పని చేస్తారు.*
సుబ్బుని నమ్మండి. ముత్తు కూడా పనిని ప్రేమిస్తాడు!
*ప్రపంచంలో ప్రజల రోగాల మీద వచ్చే డబ్బులతో జీవితం గడిపేది ఒక్క వైద్యులు మాత్రమే.*
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను!
*ప్రపంచంలో ఆలోచించే ప్రతిఒక్కరు వారి వారిలోకాలలో ఊహలలో ఉంట్టూఉంటారు. మరి సైకాలజిస్ట్లు ఒకరి పిచ్చి అని, మానసికంగా బాగా లేదని ఏవీధంగా నిద్దరణ చేసి వైద్యం చేస్తారు? ఒకటే కారణం గవర్నమేంట్ మీకు లైసెన్స్ ఇచ్చింది. మీరు చికిత్స చేస్తారు.*
మీ ఆలోచనలతో ఫ్రెంచ్ ఫిలాసఫర్ Michel Foucault అద్భుతంగా రాశాడు. Madness and Civilization మరియూ The Birth of the Clinic. చదవకపోతే చదవండి. దీనిపై వీలయితే ఒక టపా రాస్తాను.
*తెలుగులో మంచి సినిమాలు, మంచి నటులు రావాలని .*
ReplyDeleteఈ కాలంలో ప్రజలకి చాలా రకాల యంటర్టైన్మేంట్ ఉంది. తెలుగు సినేమా ఎంత మూల పడితే ప్రజలకు అంత మంచిది.
* ముత్తు కూడా పనిని ప్రేమిస్తాడు!*
కావొచ్చు. డాక్టర్ గారు, ముత్తు లాంటి వారు పనిని ప్రేమిస్తే వ్యక్తిగత జీవితం లో నష్ట్టపోతారు. ఆయన ఎంత బాగా దోశలు పోసినా వచ్చే జీతం కుటుంబ పోషణకి సరి పోతుంది. ఏరోజుకారోజు సంపాదించుకోవాలి. కనుక అదే పని లో 40సం|| పని చేయాలి అంటే మాటలు కాదు. కనుక నాకు ముత్తు సంగతి ఎమో తెలియదు అని రాశాను.
బాపుగారి పనిని ప్రేమించారు అనటానికి కారణం. ఆయన కనీసం చెన్నయ్ లో ఒక స్వంత ఇల్లు ఉంది, సినేమాలు లేక పోతే బొమ్మలు గీచుకొంటారు. కాలక్షేపం చేస్తారు. దీనికి అతనికి సహకరించే కుటుంబసభ్యులు ఉన్నారు. ఇక ఆయనని ఎవరైనా సహాయం అడిగితే( దర్శకులు ) వారికి అంజీ లాంటి సినేమాలకి పని చేశాడని చదివాను. మీకు సహాయం చేస్తే నాకేంటి అని ఇంట్లో కుచ్చున్నా అడిగేవారు ఎవరు లేరు. ఇక రామారావు గారు శ్రీనాథుడు సినేమా కి ఇచ్చిన డబ్బులలో లక్ష రూపాయలు రామరావు పేరు తో మైలాపుర్ రామకృష్ణ మఠంలో ఒక రూం కట్టివడానికి ఇచ్చాడని చదివాను. ఒక్క రోజు పేపర్ లో మాట్లాడినట్టు గుర్తు లేదు.ఆయనేదో కొంచెం పోతన తరహా జీవితం గడుపుతుంటే. ఇవ్వన్ని ఇక బాపు గారి గురించి పేపర్ లో చదవటం తప్పించి ఎటువంటి పరిచయం లేదు. అటువంటి ఆయనని కూ డా వేలాకోళం చేస్తె ఎలా? అదికాక ఇక్కడ కొంతమంది ఆ సినేమా తీయటమే ఎదో పెద్ద తప్పుగా రాస్తే ఆగ్రహం వచ్చింది. ప్రయత్నించటం కూడా తప్పంటే ఎలా?
Read below Tapaa
http://navatarangam.com/2011/11/sriramarajyam_review/
Sri
అభిమానాన్ని, దురభిమానాన్ని ఎవరికీ చేతనైనంత వారు వెళ్ళగక్కారు. నటుడు, వారి కులం, ఇమేజి, కుటుంబం వగైరా పనికిరాని విషయాల వరద వరవడిలో కళ గురించి అతి తక్కువగా విశ్లేషించడం బాధ కలిగిస్తోంది. ఏమైనా ya రమణ గారి వ్రాత బావుంది, కాని అనవసర చర్చకి తెరలేపడంలో మన అరుదయిన ప్రతిభావంతుడు, కుళ్ళు-- కుల రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాపు గారి లాంటి వ్యక్తుల్ని కించపరుస్తున్నారని ఇబ్బందిగా ఉంది. వ్రాయసగాళ్ళు వివాదంకోసం, ప్రాచుర్యం కోసం కాకుండా విషయ పరిశీలన కోసమే వ్రాస్తే బావుంటుంది.
ReplyDeleteరాజా.
>>>>సినిమాలకి సంబంధించి హీరోల కొడుకుల్నీ, తమ్ముళ్ళనీ కూడా మోస్తున్న వీరులం మనం.
ReplyDeleteఅబ్జెక్షన్ యువరానర్! ఏదో గొప్పకి చెప్పుకోడం కాని , మనమెక్కడ మోస్తున్నాము? అన్ని వృత్తుల లానే రాజకీయము, నటన, బ్లాగులూ ను ..డా ట్ట ర్ సంతానం డా ట్ట ర్స్ అయతే యా ట్ట ర్ సంతానం ఏమవ్వాలిట్టా :)
చదువుకుంటే/చదువు 'కొంటే' డాట్టర్లు అవ్వొచ్చు. కాని కళాకారులు కాలేరు. ఒకే కుటుంబంలో చాలామంది ఒకే కళను పోషించడం కొత్తేమి కాదు 'సురభి' నాటకబృందం లాగ. కాని మనం కళను కళ గానే చూస్తున్నామా? మనం ఆస్వాదించగలిగే స్థాయి లో ఉన్నామా?
ReplyDeleteచాంతాడు పద్యాలు, బాణం బాణం కొట్టుకునే లోపు బయటకి వెళ్ళి తీ తాగొచ్చే యుద్హాలు లేకుండా ఉన్నంతలో చక్కగా తీసారు సినిమా. అది రామాయణం లా కాకుండా ఒక మామూలు కుటుంబ కదా చిత్రం గా చూసినా కూడా చాలా బాగా ఉంది. నయనతార ఆవిడకి ఉన్న ఒక ఇమేజ్ నించి బయటకి వచ్చి ఇలాంటి సినిమా చేయ్యగాలడా అనుకున్నా సినిమా మొదలై నప్పుడు, చూసాకా ఆ సీతమ్మ తల్లి నయనతార అనుకోకుండా ఉండలేకపోయా. అదృష్టం బాగుంది మీ టపా రావడానికి ముందే ఆ సినిమా చూసేసా లేదంటే అస్సలు చూడలేక పోయేవాదినేమో?
ReplyDeleteఏది ఏమైనా మంచో చేదో మనకి మంచి బోలెడు కామెంట్లు వచ్చేసాయి..అదే చాలు.
మిత్రులారా!
ReplyDeleteఅందరూ శ్రీరామరాజ్యం గూర్చి రాస్తుంటే..
ఆ సినిమా చూడని నేను కూడా..
హం కిసీ సే కం నహీ! అనుకుంటూ..
మధ్యలో దూరిపోయి ఏవో పిచ్చిరాతలు రాసితిని.
కొంతమందిని నా రాతలు నొప్పించాయని అర్ధమయ్యింది.
అందుకు చింతిస్తున్నాను.
నాకు బాపు రమణల పట్ల కానీ, శ్రీరామరాజ్యం సినిమా పట్ల కానీ..
వ్యతిరేకత లేదని మనవి చేస్తున్నాను.
నా రచన కేవలం సరదా కోసం రాసిందే తప్ప..
వేరే దురుద్దేశాలు లేవని గ్రహించగలరు.
కామెంట్లు రాసిన మిత్రులకి ధన్యవాదాలు.
హన్నా, నేను సుబ్బుడే రెండు వైపులా గిరికీలు కొట్టునని అన్నాను.
ReplyDelete"ఈ సుబ్బు మరీ కన్ఫ్యూషన్ మనిషి లాగున్నాడు. మొదట్లో ఓ ట్రాక్ లో టాపిక్ మెదలెట్టి, మధ్యలో గిరికీ గొట్టి వేరే మార్గం లో మార్చేసాడు అసలు సుబ్బు కి పెసరట్టు (ఉప్మా పెసరట్టు) రెండు వైపులా వేసే తెలివి ఉందనుకుంటాను !
"
ఇప్పుడు yaramana కూడా గిరికీలు కొట్టి తన కత్తి కి రెండు వైపులా పస ఉందని ప్రూవ్ చేసేసారు !
చీర్స్
జిలేబి.
అయ్యా/అమ్మా Zilebi గారు..
ReplyDeleteమీరు మా సుబ్బుని, నన్నూ కాచి వడపొశారు.
నా పోస్ట్ గూర్చి మీ observation కరెక్ట్!
మన తెలుగు ప్రేక్షకులు మరీ ఇంత సున్నిత మనస్కులని అనుకోలేదు.
అందుకే.. తెల్ల జెండా ఎగరేశా!
(లేకపోతే వీపు విమానం మోత మోగేట్లుంది!)
మీ సుబ్బు భలే ఉన్నాడండీ...నిజం చెప్పారు, నాకు నచ్చారు కూడా!
ReplyDeleteమీరు రాసిన విధానం ఇంకా చాలా బావుంది. అట్లు రుచిగా ఉన్నాయి :)))
చప్పట్లు చప్పట్లు!
సత్తిరాజు వెంకట్రావు గారు..
ReplyDeleteసత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) గూర్చి రాసిన టపాలో కామెంటినందుకు ధన్యవాదాలు.
ఆ.సౌమ్య గారు..
ReplyDeleteసుబ్బు నిజాలే చెబుతాళ్ళేండి. వాడిదేం పోయింది?
వాడి కబుర్లు నచ్చి మీరు చప్పట్లు కొడతారు.
మధ్యలో నాకే అందరూ కలిసి మాడు పగలకొట్టారు.
yaramana గారూ, This is too much..సినిమా చూడకుండానే దాని పైన విమర్శ రాశారా? మీరు కూడా శ్యామలీయం గారి టైపేనా?
ReplyDeleteదయచేసి సినిమా చూడకుండా ఎటువంటి విమర్శలు వ్రాయకండి. బ్లాగులు చూసి నిర్ణయాలు మార్చుకునేవాళ్ళు బోలెడు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకైతే పర్లేదు కానీ అమవాస్యకో పౌర్ణమికో వచ్చే ఇటువంటి మంచి సినిమాలకు వద్దు
ReplyDeleteరంగరాజు గారు..
ReplyDeleteనేను నా పోస్ట్ లో శ్రీరామరాజ్యం సినిమా విమర్శ రాయలేదు. గమనించగలరు.
నేను రాసింది మన తెలుగు సినిమా డైరక్టర్ల మీద సెటైర్ మాత్రమే.
శ్యామలీయం గారు కొన్ని వ్యాఖ్యలు రాశారు. ఎందుకనో వారు చర్చలోకి రావటానికి ఆసక్తి చూపలేదు. వారి కామెంట్లు నా 'ఖాతా'లో పడ్డాయి! అంతే.
బ్లాగుల్లో రాతలు చూసి సినిమాలు చూడకపోవటం ఉంటుందా!
*బ్లాగుల్లో రాతలు చూసి సినిమాలు చూడకపోవటం ఉంటుందా! *
ReplyDeleteతప్పక ఉంట్టుంది. mIరు పాతరోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో ఎవ్వరు పేపర్లో రాసేది నమ్మరు. ఒక వేళ పేపర్ చదివిన తమకు తెలిసిన బ్లాగుల్లో వారు ఎమీ రాశారో అని. ఆ విషయాన్ని చదివి, తెలుసుకొని, నిర్దారించుకొంటారు. భాగవతం లో వామన అవతారం లో ఒక పద్యం ఉంది "వ్యాప్తిం చెందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలంచున్ ... తృప్తించెందని మంజుడు సప్త ద్వీపంబులనైన చక్కం బడునే" బాపుగారు ఉన్నదానితో "విత్తంతేన వినోదయ చిత్తం" అని జీవిస్తూంటే ఆయన గురించి మీరు సరదాగా రాయటం నచ్చలేదు. ఈ వయసులో ఆయన ఈ సినేమాతో కేరిర్ బిల్డ్ చేసుకొంటాడా? ఆయనని నిర్మాత స్వయంగా కోరాడు. అన్నితేలిసి (బాపు ఇప్పుడు విజయవంతమైన దర్శకుడు కాడు కదా! అలాగే బాలకృష్ణ కూడా) సినేమతీయటానికి పూనుకొన్నాడు. ఇక చాలా మంది బ్లాగర్లు ఈ సినేమా చూడటం వారి పాండిత్యాన్ని బ్లాగుల్లో వాంతికి చేసుకోవటం మొదలు పెట్టారు. ఎప్పుడో,ఎవడో ఒక కవి రాసిన పద్యం రాసేది దానిలో ఇలా చేప్పారు, బాపు అలా తీశాడు. బాలకృష్ణా బాడీ కొంచెం ఫిట్ గాఉంటే బాగుండేది, నాగేశ్వర రావు ఎడమకన్ను చిన్నది గా కనిపించింది ఇలా మొదలు పెట్టారు విశ్లేషణలు. వాస్తవానికి ఆ సినేమాను ఒక్కసారి తప్పక చూడవచ్చు. అంత ఘోరంగా ఎమీలేదు.
భవిషత్ లో తెచ్చే మార్పులను మీడీయా మార్పులను ఈ క్రింది వీడీయోలలో చూడండి.
The Future of Communication
http://www.youtube.com/watch?v=OS6AQTTi76M&feature=player_embedded
The Future of Mobile Media and Communication
http://www.youtube.com/watch?feature=player_embedded&v=FScddkTMlTc
Future Technology
http://www.youtube.com/watch?v=oIDF_60ok04&feature=related
http://www.youtube.com/watch?v=dxIOOY2uP3A&feature=player_embedded
Sri
>>>మధ్యలో నాకే అందరూ కలిసి మాడు పగలకొట్టారు
ReplyDeleteప్రైవేటు బాగుందా రమణ గారు ha ha .... ఇంతమంది అజ్నాతలను పుట్టించిన అపరబ్రహ్మ మీ సుబ్బు గారు. వారికి ప్రాణ హాని ఉంది !! కిరణ్ కుమార్ రెడ్డి గారిని రక్షణ అడగమని చెప్పండి :)
అసలు మీకు ఎవరు చెప్పలేదా...వ్యాఖ్యలు వ్రాస్తే మొదట వ్రాసినవారు చెప్పిందే చెప్పాలి...టపాలు వ్రాస్తే ముందు వ్రాసిన వారెం చెబితే అలాగే ఫ్లో లో ఫాలో అయిపోవాలి :)
>>> ఈ రోజుల్లో ఎవ్వరు పేపర్లో రాసేది నమ్మరు. ఒక వేళ పేపర్ చదివిన తమకు తెలిసిన బ్లాగుల్లో వారు ఎమీ రాశారో అని.
అందుకేనా అజ్నాతగారు, ఈ మధ్య కొన్ని సినిమాలపై బ్లాగుల్లో వ్రాస్తూ దర్శకుడి పెళ్ళాం పుట్టింటి వాళ్లకి కూడా పి౦డాలు పెడుతున్నారు సినిమా నఃచ్చకపోతే :)
వామ్మో!
ReplyDeleteఈ పోస్ట్ లో చర్చల దెబ్బకి ఆ యొక్క బుర్ర ఏదైతే ఉందొ అది వేడెక్కిపోయింది.
మళ్లీ ప్రశాంతత కోసం మీ 'సాంబారు-పద్మనాభ హోటల్' పోస్టు చదువుకోవాలి. :-)
ఇక సినిమా గురించి కామెంట్ చేయాలంటే -
ఒక అద్భుతమైన ప్రయత్నం. ఇవాల్టి రోజుల్లో ఇలాంటి సినిమా, పైన కొందరు చెపినట్టు మనుషుల్లో కొంత passion ఉంటె తప్ప తీయలేరు.
perfect గా ఉందా లేదా అనేది నా వరకు అనవసరం. మంచి సినిమా, మంచి ప్రయత్నం. మెరుపులు చాల వున్నై సినిమా లో, వాటి కోసం సంతోషం గా వెళ్ళవచ్చు.
Krishna గారు..
ReplyDeleteఅసలీ పోస్టులో శ్రీరామరాజ్యం గూర్చి నెగటివ్ గా నేనేమీ రాయలేదు.
అయినా దేవుడు దర్శకుడుగారిని అవమానించినట్లుగా ప్రేక్షక భక్తులు భావించారు.
ఒక సినిమా విషయంలో ఇంత తీవ్రంగా స్పందించటం నన్ను ఆశ్చర్యపరిచింది.
వారి 'మనో భావాలు' దెబ్బ తినుటచే.. బుర్ర వేడెక్కే కామెంట్లు వచ్చాయి.
మౌళి గారి సలహా పాటిస్తూ మా సుబ్బు గాడి సుభాషితాలకి విరామం ఇస్తున్నాను.
నిజానికి రాముడు వేషం వేసే ప్రైం టైం తన కెరీర్లో బాలకృష్ణ దాటి పొయ్యాడు. మన దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మందిలో బాలకృష్ణ ఒక్కడే రాముడి వేషం వెయ్యగల ప్రతిభ ఉన్నవాడా?
ReplyDeletechala chala manchi review :)
వృత్తులన్నీ ఒక్కటే. కానీ మనం కొన్ని వృత్తులకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం
ReplyDeleteఇది నిజంగా నిజం. భగవద్గీత లోను ఇదేచెప్పారు, శ్రీశ్రీ కూడా ఇదె చెప్పాడు.
కాముధ
బాపు గారి సినిమా అనగానే రెండో ఆలోచన లేకుండా సినిమా కి వెళ్ళాము.
ReplyDeletediscussion లో రాసినట్లు దీని పేరు శ్రీ రామ రాజ్యం కాకుండా శ్రీ రామ వ్యధ అని వుండాల్సింది. దర్శకుడు ముఖ్యం గా ఒక సమతౌల్యం పాటించడం లో విఫలమయ్యారు.
మొదటిది, లవ కుశ సినిమా చూసాక మనకు ఒక బాధ తో పాటు శ్రీ రాముని స్థైర్యం, ఒక రాజు కి ఉండవలసిన కఠనత్వము రెండు కనపడతాయి, ఇక్కడ చివరి వరకు రాముడు పడ్డ బాధ, అయన తల్లి, సోదరులు పడిన వేదన మాత్రమే కనబడుతుంది. సినిమా చివరికి సీతమ్మని అడవికి పంపాడన్న బాధ అందరికి ఉన్నప్పటికీ అది justified అనేలా లవకుశ వుంటే, శ్రీ రామరాజ్యం లో శ్రీ రాముని నిందించినట్లు, నాస్తికులో, హిందూ మత వ్యతిరేకులో కూడా నింది౦చలేరేమో !!!
ఇక పిల్లల విషయానికి వస్తే చివర్లో వున్నా యుద్ధం సీన్ తుస్స్ మనిపించింది. లవకుశ లో వున్న పాము, గద్ద, నీరు నిప్పు సీన్స్ బాగున్నయనిపించింది.
మొత్తం మీద ఈ సినిమా మాకు, మా పిల్లలకు నచ్చలేదు.
చివరగా పాండురంగ మహత్యం ( లేక పాండురంగడి శృంగారలీలలు అంటే కర్రెక్టా?) లాగా కాకుండా బాపు గారు కుటుంబం అంతా కలిసి చూసేలా తీసారు, వారికి ధన్యవాదాలు.
సుబ్బు, రమణ గార్లకు అభినందనలు....
Dr.Rajasekhar గారు,
ReplyDeleteబాపు, రమణలకి రామాయణం బాగా గిట్టుబాటయ్యింది. వాళ్ళు ఎన్నిసార్లు తీసినా వారి భక్త పరమాణువులకి బాగానే ఉంటుంది. ఎవడి గోల వాడిది!
Mari pelli pustakam, mister pellaam laanti cinemalu kuda raamaayanam nunchi extract chesinavenantaara? Naaku telisi baapu ramana laki mogudu pellaala (stree purushula) madhya unde sambandha baandhavyaalanu tackle cheyyatam ante chaala ishtam. Ramayananni theesukovatam, daanini pade pade cinemaluga theeyatam anduloni bhaagame ani anukuntunnanu, endukante bhaaryabhartala madhya unde sambandhaanni chakkaga chupedi, andariki telisinadi, ardham ayyedi ade kada!
ReplyDeleteడాక్టర్ రమణ గారూ, మీ స్నేహితుడు డాక్టర్ సూర్యప్రకాష్ గారు బాపు గారి గురించి ఓ వ్యాసం వ్రాసారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం నుంచి వెలువడే వెబ్ పత్రిక "తెలుగు జ్యోతి" నవంబర్-డిసెంబర్ 2014 సంచికలో ప్రచురితమయింది. మీరు చూశారా?
ReplyDeletewww.telugujyothi.com
విన్నకోట నరసింహారావు గారు,
Deleteమీరిచ్చిన లింకు ద్వారా వెళ్ళి మావాడి వ్యాసం చదివాను. ధన్యవాదాలు.