భర్తల పుస్తకం
పతితులారా!
భ్రష్టులార!
బాధాసర్ప దృష్టులార!
దగాపడిన భర్తలార!
ఏడవకం డేడవకండి!
వచ్చేసింది, వచ్చేసింది,
భర్తల పుస్తకం, భర్తల పుస్తకం..
రారండో! రండో! రండి!
ఈ లోకం మీదేనండి!
మీ రాజ్యం మీరేలండి!
"భార్యని అదుపులో పెట్టడం ఎలా?"
పుస్తకం రిలీజైంది,
నేడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి!
ఎవరు రాశారండీ? కొంచెం అడ్రెస్ ఇస్తారా? :)
ReplyDeleteఅబ్బో....భలే...ఇది చదివేసి రండి..అప్పుడూ చూద్దాం మిగతా సంగతులు :D
ReplyDeleteమీ కాపీ రిజర్వ్ చేసుకున్నారా లేదా ఇంతకూ? :):)
ReplyDelete:))
ReplyDeleteశ్రీశ్రీ గారి కవితను భలేగా వాడుకున్నారు రమణగారు :))
ReplyDeleteఐతే ముఖ్య విషయం....అక్కడ చూపిస్తున్న పుస్తకం మొదటి భాగం మాత్రమే(ట). ఇంకెన్ని భాగాలున్నాయో రచయత(ల)కు కూడా అంతుబట్టడం లేదు(ట).
పైగా పుస్తకం పేరు ’భార్యలను అదుపులో పెట్టడం ఎలా’ అని కాదు. అన్నేసి మార్గాలుంటే పాపం భర్తలకు అన్ని కష్టాలెందుకూ.
’భార్యలను అర్ధం చేసుకోవడం ఎలా’ ఇదీ కరస్టు టైటిలు :)
శిశిర గారు..
ReplyDeleteఈ పోస్ట్ భర్తలకి మాత్రమే.
మీకు ఎడ్రెస్ చెప్పేంత అమాయకుణ్ణి కాదు!
ఆ.సౌమ్య గారు..
ReplyDeleteమీరలాగే కాన్ఫిడెంట్ గా ఉండండి.
ఆ పుస్తకం చదివి ఒక్కొక్క భర్త వీరుడై, శూరుడై..
భార్యలతో వంట చేయిస్తూ, అంట్లు తోమిస్తూ..
ప్రపంచమే మారిపోనున్నది.
అప్పుడు మీరు..
ఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీ వన్నది,
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం!
అని తీరిగ్గా బాధపడుదురు గాని!
subha గారు..
ReplyDeleteనేనే డిస్ట్రిబ్యూటర్నండి!
నాగార్జున గారు..
ReplyDelete’భార్యలను అర్ధం చేసుకోవడం ఎలా’ ఇదీ కరస్టు టైటిలు :)
సారీ! మీ టైటిల్ నాకు అర్ధం కాలేదు!
ప్రయత్నించి 'మో' కవిత్వం అర్ధం చేసుకొనవచ్చును.
పాళీ భాషని, పిశాచాల భాషనీ కూడా అర్ధం చేసుకోనవచ్చును.
కానీ.. మీ టైటిల్ నాకు అర్ధం కాలేదు!!
Srikanth Edara gaaru..
ReplyDeletethank u.
వదిన గారికి మీ టపా లింకు పంపించానులెండి.
ReplyDeleteజ్యోతిర్మయి గారు..
ReplyDeleteకనీసం బ్లాగుల్లోనయినా మనశ్శాంతిగా ఉండనీయరా?
కొన్ని పోస్టులు ఆడ లేడీసు చదవకుండా ఏమన్నా ఆప్షన్లు ఉన్నాయా?
నల్లమోతు శ్రీధర్ గారిని అడగాలి!
ఆశ దోశ అప్పడం వడేం కాదు..అబ్బా మేము చూడకుండా బ్లాగు నడిపించేద్దామనే! ఇంతకీ మీరేనా డిస్ట్రిబ్యూటరు..ఐతే ఇంకా సరైన బోణీ ఏమీ తగల్లేనట్టుంది పాపం :(
ReplyDeleteగురువు గారు ఇద్దరు భార్యలు ఉన్నవాళ్ళు రెండు పుస్త కాలు కొనాలా ? లేక ఒకటే సరిపోతుందా?
ReplyDeleteee book nijangaane vastundaa?mee email address konchem ivvandi..naaku oka copy kaavaali...
ReplyDelete- Rustum Reddy
subha గారు..
ReplyDeleteకాపీలన్నీ అమ్ముడయితే పోయాయి.
కానీ హోం డెలివరీకి ఏ ట్రాన్స్ పోర్ట్ వాడు ఒప్పుకోవట్లేదు.
అంత బరువు మోసేవాళ్ళు దొరకట్లేదు!
ఆ ట్రాన్స్పొర్టువాడికి ఒ పుస్తకం ఫ్రీ గా ఇచ్చుకోండీ, వాడికి ఇది ఎమి పుస్తకమో తెలిస్తే మీకొసం ఫ్రీ గానే ట్రాన్సుపోర్టు చేయును వాడు! నా మాటలు నమ్ముడు!
ReplyDeleterajasekhar Dasari గారు..
ReplyDeleteఅయ్యో పాపం! మీకు ఇద్దరు భార్యలా!
ఒక పుస్తకం చాల్లెండి.
పుస్తకంలో 7563 పేజీ నుండి 8194 పేజీ దాకా మీ లాంటి వాళ్ళ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
జాగ్రత్తగా చదువుకోండి!
ఈ పుస్తకాన్ని చదివి అర్ధం చేసుకునేలోపు భార్యనే పూర్తిగా చదివేయచ్చండి!
ReplyDeleteకొన్ని పోస్టులు ఆడ లేడీసు చదవకుండా ఏమన్నా ఆప్షన్లు ఉన్నాయా? ఉండవు ఉన్నా మేమొప్పుకోము! మహిళలు చూడని పోస్టులెందుకు?