Thursday, 10 November 2011

గుండెలు మార్చు గోఖలే

అనుకున్నంతా అయ్యింది! మావాడు మళ్ళీ ఇంకోగుండె మార్చాడు. మనం సాధారణంగా కార్లు మారుస్తాం, ఇల్లు మారుస్తాం. కొద్దిమంది అదృష్టవంతులు భార్యల్ని కూడా మార్చేస్తారు. పాపం! ఇవేవీ మార్చలేని మా గోఖలే (మాధవపెద్ది గోఖలే కాదు) గుండెల్ని మారుస్తున్నాడు. కొంతమందంతే, మనం వాళ్ళని ఏమాత్రం మార్చలేం!

గుండెమార్పిడి ఆపరేషన్ చొక్కా మార్చినంత వీజీగా, విజయవంతంగా చేసేస్తున్నాడు. నిన్న ఆరోసారి గుండె మార్చాట్ట! గుండెలు తీసిన బంటు అంటారు, మా గోఖలే మాత్రం గుండెలు మార్చే బంటు! 

కంగ్రాచులేషన్స్ మై బాయ్!


డా.A.గోపాలకృష్ణ గోఖలే,
కార్డియాక్ సర్జన్,
నా క్లాస్ మేట్,
ఆత్మీయ మిత్రుడు,
గోఖలేకి అభినందనలతో..

(picture courtesy : Google)

16 comments:

  1. గోఖలే గారికి అభినందనలు...

    ReplyDelete
  2. :) మీ వ్యాఖ్యానం బాగుంది. మీరంటే కాస్త జెలస్ గా ఉంది. గొప్ప గొప్ప ఫ్రెండ్స్..

    ReplyDelete
  3. రాజేష్ మారం గారు..
    ధన్యవాదాలు.

    ReplyDelete
  4. క్రిష్ణప్రియ గారు..
    ధన్యవాదాలు.
    ఇప్పుడే "బొమ్మను చేసి.. " అంటూ దిగులుగా పాడుకోబోతున్నాను.
    మీకు నేనంటే జెలస్ గా ఉన్నందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాను.
    కావున.. పాట బంద్.
    నాకు గోఖలే గొప్ప ఫ్రెండేమిటండీ!
    వాడికే నేను గొప్ప ఫ్రెండ్ నయితే!

    ReplyDelete
  5. డాక్టర్ గారికి congratulations చెప్పండి..

    ReplyDelete
  6. డాట్రారూ!
    మా గొప్ప వారండి మీరూ మీ స్నేహితులూ!

    వైద్యో నారాయణో హరి!

    ReplyDelete
  7. గోఖలే గారికి అభినందనలు !

    నాకు గోఖలే గొప్ప ఫ్రెండేమిటండీ!
    వాడికే నేను గొప్ప ఫ్రెండ్ నయితే!
    ----------------------------
    హ హ అంతే అంతేనండి :)))

    ReplyDelete
  8. Dear YV

    Thanks for the message about Gokhale, I would be sending congrats to him too.

    ReplyDelete
  9. ఈయన గురించి మీరలా చెప్తూ ఉంటే చాలా బాగుంది! ఆయనకి నా హృదయ పూర్వక అభినందనలు!

    ReplyDelete
  10. ట ట ట ట టా!
    గుండెలు తీసిన బంటూ!!!!

    -ఏదో సిన్మా లో NTR పాట గుర్తుకొస్తుందండి.

    డాక్టర్ గారికి గుండెలు తీసి పెట్ట గలిగినందుకు గౌరవాభినందనలు :-)

    ReplyDelete
  11. ఒరేయి నాన్న య ర
    మన గోఖలే గాడికి అభినందనలు. వాడు మనకి స్నేహితుడు అయినందుకు మనందరం కూడా చాలా గర్వించాల్సిన విషయం.
    గో వె ర

    ReplyDelete
  12. కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    మీ అభినందనలు గోఖలేకి తెలియజేస్తున్నాను.
    I am forwarding this post to Dr.Gokhale.
    hope he'll respond.

    ReplyDelete
  13. OREY RAMANA, I can see your confidence in me. So far hearing to all your patients, I (we all) know that you got most of their symptoms. Every two year you were going through so many tests for your heart and still not happy. Now you know that even if your heart is gone, there is someone whom you can trust to change it. Hope that you will have a good undisturbed sleep.
    Thanks again to all the friends for their wishes

    ReplyDelete
  14. ప్రస్తుత సమాజంలో మెడికల్ డాక్టర్లంటే పెద్దగా గౌరవం లేదు.
    దానికి వంద కారణాలు ఉన్నయ్.
    గుండె మార్పిడి ఆపరేషన్ తమిళనాడులో (చెన్నై) మొదటిసారి జరిగినప్పుడు రాజకీయ నాయకుల మొదలు అందరూ చాలా బాగా స్పందించారు.
    ఆ టీం ని పోటీ పడి అభినందించారు.
    ఏడేళ్ళ క్రితం మన హైదరాబాదులో గోఖలే మొదటి సారి గుండెని మార్చినప్పుడు పెద్దగా చప్పుడు లేదు.
    కారణం తెలీదు.
    మన బ్లాగర్లు ఒక సైంటిఫిక్ అచీవ్ మెంట్ ని గుర్తించినందుకు అభినందిస్తున్నాను.

    ReplyDelete
  15. రమణ గారు,

    మీ వయస్సెంతో తెలియదు కాని...చూడగా ప్రపంచాన్ని కాచి వడబోసేసినట్టున్నారు...."కొద్దిమంది అదృష్టవంతులు భార్యల్ని మారుస్తారు." సరదాగా అన్నా ఎప్పుడో అప్పుడు ప్రతీ మనిషి ఒక్కసారైనా అనుకునే విషయం అనుకుంటాను. ముళ్ళపూడి వారి చమత్కారం మళ్ళి నాకు మీలో కనబడుతోంది (అతిశయోక్తి కాదు సుమా)

    ReplyDelete
  16. mee vadu gundene marstadu
    maanetalu Manishene marstadu dabbu kosam
    eka meevadenta
    atte sambarapadakandi
    taravasa meevantu ravochu...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.