Thursday 13 June 2013

శ్రీశ్రీ దాశరధిని తిట్టెను

మనిషన్న వాడికి కోపం సహజం. కోపం రానివాడు అసలు మనిషే కాదని కూడా అంటారు. కోపంలో అనేక డిగ్రీలు. చిరుకోపం (చిరు అంటే చిరంజీవి కాదు), మామూలు కోపం, విపరీత కోపం, పిచ్చికోపం అంటూ గ్రేడింగ్ చేసుకోవచ్చు. కోపప్రదర్శన కూడా నానావిధములు. కొందరు నోరు చేసుకుంటే, ఇంకొందరు చెయ్యి కూడా చేసుకుంటారు.

అయితే కవులకి ఒక సౌలభ్యం ఉంది. కోపాన్ని కవిత రూపంలో రాసుకోవచ్చు. అందునా మహాకవి శ్రీశ్రీ అయితే ఇంక చెప్పేదేముంది!

ఒకానొక సందర్భంలో శ్రీశ్రీకి దాశరధిపై కోపమొచ్చింది. సందర్భం అప్రస్తుతం. ఇంకేముంది! కవివర్యుడు తన కవిత్వంతో మండిపడ్డాడు.

పొట్టి కవికి మొట్టికాయలు :-


ఏఁవిట్రోయ్ పొట్టి కవీ
ఎందుకింత దూకుడు
ఎడా పెడా వాయిస్తా
ఎండిన నీ మూకుడు

నేల మునగ చెట్టెక్కగ
నిచ్చెన వేస్తావటగా
శ్రీశ్రీనే ఎదిరించే
ఎత్తుకి పెరిగావటరా

పోట్టికవికి ఆవేశం
వెనకనించి పంపు
శరీరమే రొచ్చుగుంట
శారీరం కంపు

బూతులోంచి పుట్టాడు
బూతు పనికి సిద్ధం
అయినా అటువంటి మాట
లనరాదు నిషిద్ధం

(ఇకమీద వీడిమీద కవిత్వం ఖర్చు పెట్టడం దండుగ. నన్ను తిట్టే పాడే కోన్ కిస్కాల్లో వీడో స్తనంధయుడు. ఆఖరిసారిగా మాత్రం ఓ చిన్న వార్నింగ్)

ఒద్దుసుమా చెడిపోతావ్
ఒద్దికగా నడుచుకో
ఓనమాలు రానివాడ
ఒళ్ళు తెలిసి మసలుకో

(శ్రీశ్రీ 'సిప్రాలి' నుండి కొన్ని కవితలు. రచనా కాలం 1970)

శ్రీశ్రీ ఆరుద్రని కూడా బాగానే వాయించాడు. అదే సంపుటి నుండి ఈ కవిత కూడా చదవండి.

మిల్క్ ఆఫ్ మెగ్నీషియా :-

ఆరుద్ర చేస్తున్న విమర్శనాలు
అసాహిత్యానికి నిదర్శనాలు
అబద్దాల ప్రదర్శనాలు
అతగాడి ఇటీవలి ప్రరోచానాలు
అజీర్తి సుఖవిరోచనాలు

శ్రీశ్రీ తోటి కవుల్ని తిట్టినా.. ఆ తిట్లు కూడా అందంగా, లయబద్దంగా కనిపిస్తున్నాయి కదూ!

సో, మీకెవరిమీదనైనా కోపం ఉందా? మరెందుకాలస్యం? అర్జంటుగా కవిత్వం రాసి పడెయ్యండి!

(photo courtesy : Google)

18 comments:

  1. శ్రీశ్రీగారికీ సోమసుందర్‌గారికీ మధ్య కొన్ని రవరవలు యెగిసాయి 70వ దశకం మొదట్లో. నా కొక కందం చివరిపాదం మాత్రం యింకా గుర్తుంది:

    కం. ...............
    ....................................
    ...................
    రుచి తెలియని కండచీమ సుందరదోమా

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      సోమసుందర్ మీద శ్రీశ్రీ కవిత కోసం వెతుకుతుంటే.. ఇది కనపడింది.
      ------------------------
      నారాయణ నారాయణ
      ------------------------

      వెయ్యి పడగలు
      లక్ష పిడకలు
      లక్క పిడతలు
      కాగితపు పడవలు
      చాదస్తపు గొడవలు

      Delete
    2. రమణగారు,
      సం. 1971 ఆగష్టు నుండి సం. 1974 ఫిబ్రవరి వరకూ నేను రంపచోడవరంలో ఉన్నాను. (ఆ తరువాత హైదరాబాదు రావటం జరిగింది ECILలో ఉద్యోగం‌ సంపాదించుకోవటంతో.) ఈ‌ మధ్యకాలంలో బహుశః ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో ననుకుంటాను శ్రీశ్రీ - సోమసుందర్ మధ్య రవరవలు ప్రచురించబడింది. నాకు గుర్తున్నదల్లా యీ వివరాలతో పాటు, పైన చెప్పిన కందపద్యపాదం "రుచి తెలియని కండచీమ సుందరదోమా" అనేది మాత్రమే. నిజానికి యీ పాదంలో యతి సరిగా కుదిరటం లేదు. ఛందోమర్మజ్ఞుడైన శ్రీశ్రీ ఆలా యెలా వ్రాసి ఉంటాడు? ఒకవేళ "శుచి తెలియని కండచీమ సుందరదోమా" అన్నది సరియైన పాదమా? కావచ్చును - కాకపోవచ్చును. అయినా 40 యేళ్ల క్రిందటి జ్ఞాపకం సంగతి కదా. ఎవరైనా పైన ఇచ్చిన కాలం రిఫరెన్సుతో ఈ వివదానికి సంబంధించిన కవితలూ వివరాలు వెదుకవచ్చునని అనుకుంటున్నాను.

      Delete
  2. > సో, మీకెవరిమీదనైనా కోపం ఉందా? మరెందుకాలస్యం? అర్జంటుగా కవిత్వం రాసి పడెయ్యండి!

    నిజాయితీపరుణ్ణంటావ్
    నోట్లో నాలికే లేని వాణ్ణంటావ్
    కానీ లేవులే మా చెవుల్లో పూలు
    అంత పూర్తిగా కాములే వీపీలు
    జీటూ తోనే ఆక్షనయింది నీ పరువు
    బొగ్గు గేట్లో పడావు బాగానే నలుపు
    దేశభద్రతకి ఏది నీ ఎజెండా
    చైనా వాడికి చూపావ్ తెల్ల జెండా
    మొక్కుతావ్ రోజూ సోనియా కాళ్ళు
    బచ్చా రాహుల్ గాడితో ఎందుకీ తిట్లు
    ఉందిలే నీకు బాగానే కుర్చీ పిచ్చి
    నీతిపరుడైతే పొతాడు ఎపుడో విడిచి
    భలే రికార్డ్ స్రుష్టించావ్ భారత్ లో
    లేరు నీ కంటే పిరికి రాజు చరిత్రలో

    ReplyDelete
    Replies
    1. మిత్రమా,

      మన్మోహనుణ్ని మాబాగా ఉతికేశావ్
      మరెందుకింక ఆలశ్యం
      వేసుకో రెండు వీరతాళ్ళు

      Delete
    2. అయ్యా, మీ‌ తిట్టు కవితలో ఒకటి రెండు అసభ్యతా సూచక పదాలున్నట్లుగా తోస్తున్నది. గమనించగలరు.

      Delete
    3. GL డాక్టరుగారు,
      బాగా రాశారు కవిత. ఇంక బాగా చెప్పారు విషయాన్ని.
      కృష్ణ

      Delete
    4. థాంక్స్ రమణా! ఈ మిడి మిడి తెలుగు జ్ఞానితో కవితలు రాయించావు!!
      బి ఎస్ ఆర్

      Delete
    5. శ్యామలీయం గారూ, మీకు అసభ్యకరంగా కనపడ్డ పదాల్ని తొలగించాను.
      బి ఎస్ ఆర్

      నిజాయితీపరుణ్ణంటావ్
      నోట్లో నాలికే లేని వాణ్ణంటావ్
      కానీ లేవులే మా చెవుల్లో పూలు
      అంత సులువుగా కాములే ఫూలూ
      జీటూ తోనే ఆక్షనయింది నీ పరువు
      బొగ్గు గేట్లో అయింది బాగానే నలుపు
      మన దేశభద్రతకి ఏది నీ ఎజెండా
      చైనా వాడికి చూపావ్ తెల్ల జెండా
      మొక్కుతావ్ రోజూ సోనియా కాళ్ళు
      తింటావ్ కుర్ర గాంధీతో బాగా తిట్లు
      ఉందిలే నీకు బాగానే కుర్చీ పిచ్చి
      నీతిపరుడైతే పొతాడు ఎపుడో విడిచి
      భలే రికార్డ్ స్రుష్టించావ్ భారత్ లో
      లేరు నీ కంటే పిరికి రాజు చరిత్రలో

      Delete
    6. థాంక్స్ కృష్ణ గారు!
      బి ఎస్ ఆర్

      Delete
  3. ఈరోజు ఫలహారశాల (canteen) లో సగం వేపిన కూరగాయముక్కలు తిన్నాక నన్ను తెనాలి రామలింగడు కెలికినట్టనిపించింది. అన్నట్టు ఈ కవితలో ఏ పేరూ ఎవరినీ ఉద్దేశించినదిగాదు. అంతా కల్పితం.

    సిగరెట్టుద్రాగి ఎరుపుల
    సాంగత్యము చేత కల్లు చవిజూచితివా.
    దొంగల గురువా.. ఎక్కడ
    చెంగనాయకమ్మ చక్కగజెప్పెన్?

    ReplyDelete


  4. ఈ తిట్టు కవిత్వం పూర్వం నుంచీ ఉన్నదే.ఒక కవి ఐతే ' చంద్రలేఖావిలాపము 'అని ఒకరాజుని,అతని ఉంపుడుగత్తెని ఉద్దేశించి పచ్చిబూతుకావ్యమే రాసాడు.దాశరథి గురించి శ్రీశ్రీ ఇంకా అసభ్యంగా కూడా రాసాడు.ప్రతిగా శ్రీశ్రీ ని తిడుతూ దాశరథి కూడారాసాడు.సోమసుందర్ని కూడా వెకిలిగా అపహాస్యంచేస్తూ శ్రీశ్రీ రాసాడు.అతనికి సంయమనం ,నిగ్రహం తక్కువ.విమర్శని సహించలేడు.ఎంత గొప్పవాళ్ళయినా ఇలాంటి అసభ్యపురాతలు రాస్తే మనం ఖండించవలసిందే.

    ReplyDelete
  5. నేనైతే తిట్ల కవిత్వం వ్రాయక్కర లేదు . మామూలు కవిత్వం వ్రాస్తేనే చదివిన వారు శ్రీ శ్రీ దగ్గరకు డైరెక్ట్ గా వెళతారు .

    ReplyDelete
  6. శ్రీశ్రీకి నోటి దురద కాస్త ఎక్కువే. మహాప్రస్తానం అంకితంలో బూతులు వాడాడు. సొంత అన్నను తూలనాడాడు. సినారెను వెక్కిరించాడు. మహాప్రస్తానం ముందుమాట రాసిన చలాన్ని సైతం వదలలేదు. ఎంత గొప్ప కవయినా నోరు పారేసుకోవడం సరి కాదన్న విషయం నేర్చుకోలేదు

    ReplyDelete
    Replies
    1. Jai Gottimukkala గారు,

      బహుకాల కామెంట్దర్శనం. సుస్వాగతం.

      శ్రీశ్రీ తనకి నచ్చిన కవిత్వాన్ని (ఎవరేమనుకున్నా) సమర్ధించాడు (ఉదా.. దిగంబర కవులు). నచ్చనివారిని తూర్పారబట్టాడు.

      ఆయన ఆరుద్ర, శేషేంద్ర శర్మ, నారాయణ రెడ్డి, నారాయణ బాబుల్ని గొప్పగా మెచ్చుకున్నాడు. తరవాత వారికివారికీ చెడింది. శ్రీశ్రీ కమ్యూనిస్టు కావటం కూడా కవులకి (ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణకి) ఇబ్బందిగా ఉండేది.

      శ్రీశ్రీని తిట్టినంతగా ఏ తెలుగుకవినీ మరెవరూ తిట్టలేదు. ఆరుద్ర శ్రీశ్రీ, రావిశాస్త్రి రెండో భార్యల్ని చాలా నీచంగా తిట్టాడు. ఇదంతా చరిత్ర.

      అసలు శ్రీశ్రీ గానీ మరొకరు గానీ మర్యాదస్తుడిగా ఉండాలని మనం ఎందుకు ఆశించాలి? ఇది మన మధ్యతరగతి మొరాలిటీ కాదా?

      Delete
    2. శ్రీశ్రీ అయినా ఎంకవరయినా ఎవరి వ్యక్తిగత విషయాలు వారివె, మనం దూరకూడదు.

      అయితే శ్రీశ్రీ ఇతర కవులను తన రచనల మాధ్యమంలో తిట్టడం వల్ల ఇవి "మాత్రం" public domain లోకి వస్తాయి. అందుకే పాథకులకు హక్కు ఉంటుందని నా అభిప్రాయం.

      Yes, it reflects middle class morality. We must remember though that Srisri's primary audience was the middle class. He was never popular among the "mass" unlike Gaddar, Vangapandu etc.

      Delete




  7. ఒక్క విషయం మాత్రం రాయవలసివుంది.కవులు,ఇతర కళాకారుల వ్యక్తిగతజీవితం గురించి మనం పట్టించుకోనక్కరలేదు.వాళ్ళూ మానవమాత్రులే.వ్యసనాలూ,బలహీనతలూ,రాగద్వేషాలూ ఉండవచ్చును. ఐతే శ్రీశ్రీ గాని మరొక కవి,రచయత,కాని రాసి పబ్లిష్ చేసింది బాగుంటే మెచ్చుకుంటాము.కాని అసహ్యకరంగాను,అశ్లీలంగానూ.,తిడుతూ రాస్తే (ఎందుకంటే అది అందరు చదువుతారుకాబట్టి } మనం తప్పుబట్టవచ్చును.

    ReplyDelete
  8. yv ramana

    mee sense of humor superb.ee comment ee post ki kaadu mee blogki.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.