"రవణ మామా! కాఫీ." అంటూ హడావుడిగా లోపలకొచ్చాడు సుబ్బు.
చాలా రోజుల తరవాత వచ్చిన సుబ్బు రాక ఆనందం కలిగించింది.
"రా సుబ్బు! కూర్చో. పాపం! అద్వానికి ఎంత అవమానం జరిగిపోతుంది." దిగులుగా అన్నాను.
"ఇందులో నువ్వు బాధ పడేదేముంది? రాజకీయాలలో ఇది మామూలే. ఇక్కడ దయాదాక్షిణ్యాలు, మమతానురాగాలకి తావు లేదు మిత్రమా!" అన్నాడు సుబ్బు.
"సుబ్బు! అద్వాని భారత రాజకీయాల్ని దశాబ్దాలుగా ప్రభావితం చేసిన మహానాయకుడు." అన్నాను.
"కాదన్నదెవరు? ఆయన వాజపేయితో కలిసి ఒక గొప్ప ఆస్పత్రిని ఎంతో విజయవంతంగా నడిపిన మహానాయకుడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.
"ఏంటి! అద్వాని వాజపేయితో కలిసి ఆస్పత్రి నడిపాడా!" ఆశ్చర్యంగా అడిగాను.
"రవణ మావా! చాలా ఊళ్ళల్లో డాక్టర్లైన భార్యాభర్తలు ఆస్పత్రి నడుపుతుంటారు. ఇద్దర్లో ఒకరు పేషంట్ల పట్ల చాలా సౌమ్యంగా, స్నేహంగా ఉంటారు. ఇంకొకరు డబ్బు దగ్గర కఠినంగా, ఖచ్చితంగా ఉంటారు. 'డాక్టరయ్య దేవుడు! పేదోళ్ళంటే ఎంత కనికరం! డాక్టరమ్మకే ఎక్కళ్ళేని డబ్బాశ. నిలబెట్టి వసూలు చేస్తది.' అని పేషంట్లు అనుకుంటుంటారు."
ఇంతలో పొగలు గక్కుతూ వేడి కాఫీ వచ్చింది.
కాఫీ సిప్ చేస్తూ నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.
"వాస్తవానికి ఫీజు వసూళ్లు డాక్టరయ్య కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. ఇదే వారి విజయ రహస్యం. ఇది చాలా సింపుల్ బిజినెస్ టెక్నిక్. ఆస్పత్రిలో డాక్టరయ్య మాత్రమే ఉంటే కనీస ఫీజులు కూడా వసూలు కాక ఆస్పత్రి మూత పడుతుంది. ఒక్క డాక్టరమ్మే ఉన్నా కూడా పేషంట్లు రాక మూత పడుతుంది."
"అవును సుబ్బు! మనూళ్ళో కూడా ఈ టెక్నిక్ నడుస్తుంది. నీ అబ్జర్వేషన్ కరెక్ట్." అన్నాను.
"ఒప్పుకుంటున్నావుగా? ఓకే! ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ గూర్చి మాట్లాడుకుందాం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడిచినప్పుడు వాజపేయి, అద్వానిలు డాక్టరయ్య, డాక్టరమ్మల పాత్రలు పోషించారు. హిందుత్వవాదులు అద్వానిలో తమ ప్రాతినిధ్యాన్ని చూసుకుని తృప్తినొందారు. చంద్రబాబు, నితీష్ లు వాజపేయిని చూపిస్తూ పని కానిచ్చుకున్నారు. వాస్తవానికి వాజపేయి, అద్వానిలు ఒకటే. వారిద్దరూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఇట్లాంటి సర్దుబాటు చేసుకున్నారు."
"ఇంటరెస్టింగ్ సుబ్బు!" అన్నాను.
"ఒకరకంగా ఇప్పుడు ప్రజలకి మంచే జరిగింది." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
"ఎలా?" ఆసక్తిగా అడిగాను.
"ఇప్పుడు పేషంట్లకి ఏ కన్ఫ్యూజనూ లేదు. డాక్టరయ్య మంచాన పడ్డాడు. కావున ఆస్పత్రికి పేషంట్లు తగ్గారు. అందువల్ల ఆస్పత్రికి పూర్వవైభవం తెప్పించే పనిని మోడీ అనే కొత్త డాక్టరుకి అప్పజెప్పారు. ఇది నచ్చని డాక్టరమ్మ అలిగి వెళ్ళిపోయింది. ఈ కొత్త డాక్టరు అనుభవం లేనివాడేమీ కాదు. వాళ్ళ ఊరైన గుజరాత్ లో రాష్ట్రప్రభుత్వం అనే ఓ చిన్నఆస్పత్రిని లాభసాటిగా నడుపుతున్నాడు."
"మరి మోడీ ఇంత పెద్ద ఆస్పత్రిని నడపగలడంటావా?"
"అది మనం వెండి తెరపై చూడాలి. ఇప్పుడే ఎలా చెబుతాం? అయితే తన చిన్న ఆస్పత్రిలో మోడీ చేస్తున్న వైద్యం గూర్చి ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అంచేత ఇష్టమైతే మోడీ ఆస్పత్రిలోకి వెళ్తారు. లేకపోతే లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం." అంటూ టైం చూసుకుంటూ లేచాడు.
"మరిప్పుడు అద్వాని పరిస్థితేంటి సుబ్బు?"
"అద్వానికి పెద్దగా ఆప్షన్స్ లేవు. పార్టీవాళ్లు ఆయనకో ఉచితాసనం ఇచ్చి ధృతరాష్ట్రుడిలా కూర్చోమంటున్నారు. ఆయన అలా కూర్చోనైనా కూర్చోవాలి. లేదా బయటకి వెళ్లిపోవాలి. నిర్ణయించుకోవలసింది అద్వాని. మనం కాదు. వస్తాను. నాకు టైమైంది." అంటూ హడావుడిగా వెళ్ళాడు సుబ్బు.
(photo courtesy : Google)
True to the point!
ReplyDeleteSubbu is absolutely right, and Advani should have accepted it politely and remain as party advisory, he doesnt need this kind of exit from party after so many years.
And party should also at least console him and get him back
ఇప్పటి కుర్రాళ్ళకి అద్వాని గూర్చి సరీగ్గా తెలీకపోవచ్చు. అందుకే ఆయన పట్ల అంత అసహనంగా ఉన్నారు. అయితే సంఘపరివార్ mood అద్వాని గమనించలేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Deleteసంఘపరివార్ mood అద్వాని గమనించలేకపోవటం కారణం కాదనుకుంటాను. అద్వానీ గారికి ప్రధానిపీఠం యెక్కాలన్న కోరిక తీరలేదు. అప్పుడే 83 యేళ్ళు వచ్చేసాయి. ఇంక ప్రధానిపీఠం ఇంక యెప్పటికీ దక్కకపోవచ్చు. ఇదే చివరి అవకాశం అనుకుంటుటే ఈ మోడీ మోళీలో పడి యావత్తు భాజపా జనమూ మోడీ జపమే చేసి, తనకు వెన్నుగా యిన్నాళ్ళూ నిలచిన రా.స్వ.సంఘమూ అతగాడికే జై అంటే ఉక్కోషం తన్నుకొచ్చి మంకుపట్టుకు దిగాడు అద్వానీగారు. మోడీ ప్రచారసారథి మాత్రమేనట. దాదాపుగా ఇంట్లో కూర్చుని అద్వానీగారు చిరునవ్వులు ఒలకబోస్తూ రేపు ప్రధానిపీఠం యెక్కబోతాడట. ఈ అమాయకపువ్యూహాన్ని యెవరైనా హర్షిస్తారా? సచిన్ తెందూల్కర్ లాగా తానింకా నవయువకుడినే అని జనాన్ని నమ్మమంటే కుదురుతుందా?
DeleteI personally suspect Advani (same goes for Yeddy) was never the first choice of RSS: he committed the cardinal sin (in RSS eyes) of getting married! They just used him because they had no alternative at that time.
Delete
ReplyDeleteమీ టపా టైటిలు ప్లస్ టపా శీర్షిక కలిపి చదివితే వేరే అర్థం వస్తోందండోయ్ !!
ఇంతకీ మోడీ గారిల్లు డిల్లీ లో పెడతారా ? సుబ్బు అభిప్రాయం ఏమిటి ?
జిలేబి
జిలేబి జి,
Deleteచాలా పోస్టులకి ఈ (అర్ధం మారే) సమస్య వస్తుంది. చేసేదేం లేదు.
ప్రస్తుతానికి మోడికి ఢిల్లీ చాలా దూరంలో ఉంది. ఆయన చేసే ప్రయాణం బట్టి ఢిల్లీలో ఇల్లు సంగతి తేలుతుంది. ఇప్పుడే చెప్పటం కష్టం.
(అయినా సుబ్బుని అడిగి చూస్తాను.)
డాక్టర్ ల సంగతి సరే , మరి పేషెంట్ ల సంగతి ఏమిటి ? నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు .....
ReplyDeleteఈ టపాకి సంబంధించినంతమటుకూ.. పేషంట్లు అంటే ఓటర్లు అనుకోవాలి. ఏ ఆస్పత్రికి వెళ్ళాలో నిర్ణయించుకోవలసింది వారే.
Deleteఅంతే గదండీ....తండ్రి నుండి పెత్తనం కొడుక్కి వచ్చిన కొత్తలో తల్లి కాస్త చిరాకు పడడం మామూలే అదే...ఎలా నడిపిస్తాడో-ఇప్పటి పేరుని కొనసాగిస్తాడో లేదో అన్న చిన్న శంఖ
ReplyDeleteరాజశేఖర్ దాసరి గారు......సర్కారు దావఖానాకు మీలాంటీ డబ్బున్న దొరలు రావొద్దండీ ఎంచక్కా దందా చేస్కోండి(స్కాములు గట్రా!).
రాజీనామా చేసి అద్వాని రాజకీయంగా తప్పిదం చేశాడని అర్ధమవుతుంది. అద్వాని మరీ ఇంతలా miscalculate చెయ్యడం నన్ను ఆశ్చర్యపరిచింది.
DeleteThis comment has been removed by the author.
Deleteరమణగారు,
Deleteనిన్నరాత్రి ఒక వ్యాఖ్యను రాసి తొలగించాను. అది డిలిట్ సెక్షన్ లో ఉండవచ్చు. మీరు చదువుకొండి. తొలగించటనికి కారణం నాన్నగారి ఆరోగ్యం కారణాల రీత్యా, ఈ వారం అంతా ఆసుపత్రిలో గడపవలసి వస్తుంది. అందువలన నేను ఇంటర్నెట్ చూసే అవకాశమే లేదు. స్మార్ట్ పోన్ పని చేయటంలేదు. ఎవరైన ఆ విషయం పైన చర్చిస్తే నేను ప్రతిస్పందించటానికి అందుబాటులో ఉండను కనుక ఆ వ్యాఖ్యను తొలగించాను.
UG SriRam గారు,
Deleteమీ నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త. I wish him all the best.
(నాకు తొలగించిన వ్యాఖ్యని ఎలా చదవాలో తెలీదు.)
ADVANI SANGATEMOGANI DATARU, WIFE AND HUSBAND DOCTORS LO OKARU SOWMYAM,DAYA MAROKARU DABBU DAGGARA KATHINAM CHALA MANDINI GUNTURU LONE CHUSA.
ReplyDeleteగుంటూరు ఆస్పత్రుల్లో మాత్రమే ఈ వాజ్ పేయి + అద్వాని తరహా strategy నడుస్తుందంటారా!
Deleteచూశారా! మనూళ్ళో పేషంట్లే కాదు.. డాక్టర్లూ తెలివైనవారే!
>డాక్టరయ్య మంచాన పడ్డాడు. కావున ఆస్పత్రికి పేషంట్లు తగ్గారు. అందువల్ల ఆస్పత్రికి పూర్వవైభవం తెప్పించే పనిని మోడీ అనే కొత్త డాక్టరుకి అప్పజెప్పారు. ఇది నచ్చని డాక్టరమ్మ అలిగి వెళ్ళిపోయింది
ReplyDeleteఆ డాక్టరమ్మ కూడ వెలితే, ఇంకో డాక్టరమ్మను వెతకాలి. కాని బ్రహ్మచారి డాక్టరయ్యకు డాక్టరమ్మను వెతకాలంటే కొంచెం కష్టమే. మరి మన సుబ్బు మామ ఎవరికి వోటు వేస్తారో?