ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సైంటిఫిక్ పేపర్ స్క్రీన్ షాట్. ఇది 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ' అనే ఒక మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఒరిజినల్ ఆర్టికల్. ఈ స్టడీ చేసినవారి declaration of interest వివరాలు స్క్రీన్ షాట్ చివర్లో చదువుకోవచ్చు. ఈ వివరాలు ఇచ్చే ఆనవాయితీ సైంటిఫిక్ జర్నల్స్ కి ఉంది. ఇవ్వాలనే నియమం కూడా ఉంది.
అసలీ వివరాలు ఎందుకివ్వాలి? ఒక ఉదాహరణ రాస్తాను. నేను ఒక రోగంలో X అనే మందుని Y అనే ఇంకో మందుతో పోలుస్తూ పరిశోధన చేస్తాను. 'ఈ రోగంలో X అనే మందు Y అనే మందు కన్నా బాగా పనిచేసింది.' అనే ఫలితంతో నా పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తాను. అయితే నా పరిశోధనకి X అనే మందు తయారుచేసే కంపెనీవాడు ఆర్ధిక సహాయం చేశాడు. అంటే ఇక్కడ నాకు conflict of interest ఉంది. నా పరిశోధనా పత్రాన్ని చదివేవారికి ఈ సంగతి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది శాస్త్రీయం. ఇలా చెప్పకుండా ప్రచురిస్తే అది మోసం చేసినట్లే అవుతుంది.
ఇప్పుడు మనం కొద్దిసేపు వార్తాపత్రికల వ్యాపారం గూర్చి మాట్లాడుకుందాం. వార్తాపత్రికల సంస్థలు వార్తలతో వ్యాపారం చేస్తాయి. వార్తాపత్రికల సంస్థలకి ఆదాయంలో అధికభాగం ప్రకటనల ద్వారా వస్తుంది. ఈ ప్రకటనల రేట్లు ఆయా పత్రికల సర్క్యులేషన్ అనుసరించి ఉంటాయి. కాబట్టి ప్రకటనలిచ్చే వ్యాపార సంస్థల ఇంటరెస్ట్ కి ఎటువంటి నష్టం ఉండదు. పత్రికా సంస్థలు వార్తలతో ముద్రితమైన పత్రికల్ని పాఠకునికి అమ్ముకుని మరికొంత ఆదాయం చేసుకుంటాయి. ఇది ఫక్తు వ్యాపారం. అంతిమంగా వార్తల కోసం పత్రికని కొని చదివే పాఠకుడే వినియోగదారుడు.
ఒక వస్తువు కొన్నప్పుడు వినియోగదారుడిగా మనక్కొన్ని హక్కులుంటాయి. ఉదాహరణగా బిస్కెట్ పేకెట్ సంగతే తీసుకుందాం. బిస్కెట్ పేకెట్ కవరుపై సంబంధిత వివరాలు ముద్రించి ఉంటాయి. అవి చదువుకున్నవాడు ఆ బిస్కెట్లు కొనుక్కోవచ్చు లేదా మానుకోవచ్చు. వినియోగదారుడిగా ఆ స్వేచ్చ మనకి ఉంటుంది. ఇక్కడ బిస్కెట్ల తయారీలో వాడిన పదార్ధాల సమాచారం వాటిని కొనబొయ్యేవాడికి తెలియజెయ్యడం అనేది ప్రాధమిక వ్యాపార సూత్రం. ఇప్పుడు ఇదే లాజిక్ ని మన వార్తాపత్రికలకి అన్వయించి చూద్దాం.
మనం మార్కెట్లో ఒక వార్తాపత్రిక వార్తలు తెలుసుకుందుకు కొనుక్కుంటాం. కొనేప్పుడు ఆ వార్తాపత్రిక కంటెంట్ గూర్చి మనకి అవగాహన ఉండదు. ఉదాహరణకి ఒక పత్రిక ఫలానా నాయకుడు అవినీతిపరుడు అని ఒక కథనం ప్రచురిస్తుంది. ఆ కథనం ఆ ఒక్క పత్రికలో మాత్రమే ఉంటుంది. అంటే ఆ కథనం విశ్వసనీయత లేని అసత్య, అర్ధసత్యాల కలయిక, మాటల గారడీ, మోసం. కానీ ఆ విషయం వినియోగదారుడైన పాఠకుడికి తెలీదు. అప్పుడు ఆ కథనాన్ని నిజమనుకునే ప్రమాదం ఉంది.
తనని తప్పుదోవ పట్టించే వార్తల నుండి పాఠకుణ్ని రక్షించాలంటే.. ఆ పత్రికపై పాఠకుడికి పూర్తి సమాచారం ఉండాలి. 'ఈ వార్తాపత్రికలో ఫలానా రాజకీయ నాయకుడు లేదా పార్టీకి అనుకూల అంశాలని మాత్రమే ప్రచురిస్తాం. ప్రతికూల అంశాలని ప్రచురించం. ఈ పత్రిక సొంతదారుడు ఫలానా రాజకీయపార్టీకి పూర్తి అనుకూలుడు. ఈ పత్రిక ఓనర్ ఫలానా రాజకీయపార్టీ తరఫున ఫలానా చట్టసభలో సభ్యుడు.' అంటూ నిజాల్ని వెల్లడిస్తూ తమ వార్తాపత్రిక యొక్క డిక్లేర్డ్ పాలసీని ముందు పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి.
ఈ డిక్లరేషన్ లేనప్పుడు సహజంగానే వినియోగదారుడు నష్టపోతాడు. తెలుగు పత్రికలవాళ్ళు వార్తల విశ్లేషణ అంటూ చేటభారతాలు రాస్తుంటారు. మన పత్రికాధిపతులకి, ఎడిటర్లకి రాజకీయమైన లక్ష్యాలు ఉన్నాయి. కావున వారి విశ్లేషణలు.. వారిష్టం. కానీ తమ వివరాలు వెల్లడించకుండా తామేదో సత్యశోధన చేసి నిజాన్ని కనుగొన్నామనే ధోరణిలో విశ్లేషణ రాయడం ఖచ్చితంగా మోసం కిందకి వస్తుంది. ఎందుకంటే అవన్నీ తెలివిగా తమకి అనుకూలంగా రాసుకుంటున్న విశ్లేషణలు కాబట్టి.
కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యులు, అభిమానుల కోసం వార్తాపత్రికల్ని నడుపుతుంటాయి. సహజంగానే అవి తమ పార్టీ అభిప్రాయాల్ని మాత్రమే ప్రచురిస్తాయి. కావున ఆ పత్రికలు ఎవర్నీ చీటింగ్ చేస్తున్నట్లు కాదు. ఎందుకంటే ఆ ఆ పత్రికల నిస్పాక్షికత పట్ల ఎవరికీ ఏ భ్రమలు ఉండవు కావున.
ఇక జాతీయస్థాయి పత్రికలైతే వార్తల్ని కవర్ చేసే విధానంలో వారి వ్యాపార దృక్పధం, కార్పోరేట్ అనుకూలత స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. వారు ఒక వార్తని తమకి అనుకూలంగా మలచుకునే తెలివితేటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. వార్తని అవసరమైనదానికన్నా ఎక్కువతక్కువలు ఎలా చెయ్యాలో కూడా జాతీయస్థాయి వార్తాపత్రికలకి కొట్టిన పిండి.
ఎందుకనో మొదట్నుండి మన తెలుగువాడికి పత్రికల విశ్వసనీయత విషయంలో పెద్ద పట్టింపు లేదు. చల్లారిన ఇడ్లీ ఇచ్చినందుకో, పెసరట్టులో ఉప్మా తక్కువైనందుకో సర్వర్ మీద ఇంతెత్తున లేవడానికి మాత్రమే మన తెలుగువాడి పౌరుషం పరిమితం. వార్తాపత్రికలు తమ సొంత ఎజెండా ప్రచారం చేసుకుంటూ.. వారి ఎజండా చదవడానికి మనచేతనే మన సొమ్ము ఖర్చు పెట్టించడం అనే మోసాన్ని అంత ముఖ్యమైన విషయంగా భావించడు.
ఉపసంహారం :
ప్రస్తుతం రాజకీయ పార్టీల రాజకీయాల కన్నా వార్తాపత్రికల రాజకీయాలు ఎక్కువైపొయ్యాయి. ఈ ధోరణి మారాలనే ఆశ అయితే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు మారదు అనే వాస్తవిక దృక్పధమూ ఉంది. తెలుగు భాష మాట్లాడేవాళ్ళలో అక్షరాస్యత తక్కువ. అక్షరాస్యుల్లో కూడా రాజకీయ అక్షరాస్యత మరీ తక్కువ. వీరి సంఖ్య పెరిగేదాకా పత్రికలు తమ ధోరణి మార్చుకునే అనివార్యత ఏర్పడదు. అప్పటిదాకా మనకీ పక్షపాత వార్తలే శరణ్యం.
(photos courtesy : Google)
సులువైన భాషలో చాలా సరళంగా చెప్పావ్! మెడికల్ జర్నల్స్ లో ఉండే డిక్లరేషన్లు (ఫైనాన్షియల్ ఇంటరెస్టు) రాటానికి కూడా చాలా ఏళ్ళు పట్టాయి. అంతా చదువరులు, ఙానులు (గ్నానులు) అయిన వర్గానికే అంత సమయం పడితే ఇక నిఉవ్వు చెప్పిన నిరక్షరాస్యులకూ (అందులో రాజకీయ నిరక్షరాస్యులకు) ఇంకెంత సమయం పట్టుద్దో!!!
ReplyDeleteఇంకో విషయం, ఈ మెడికల్ జర్నల్స్ లో వచ్చే పరిశోధనలు చాలా వరకు ప్రభుత్వ సొమ్ముతోనో, NIH గ్రాంటు సొమ్ముతోనో జరుగుతాయ్. దాన్ని ఈ మెడికల్ జర్నల్స్ ప్రచురించి బాగాడబ్బు చేసుకొంటారు! ఇంకా పైగా మనం వాటిని ముద్రిస్తే కాపీ రైటు, గాడిద గుడ్డు అని మందలింపులు, ఫైన్లు!!! అన్నట్టు నువ్వు ప్రచురినంచిన జర్నల్ పిక్చర్ కి పర్మిషన్ తీసుకొని ఉంటావని ఆశిస్తాను, లేకపోతే ఆ దేవుడే దిక్కు!!!
గౌతం
డియర్ గౌతం,
Deleteథాంక్యూ.
మెడికల్ జర్నల్స్ లో తరచుగా తగిలే source of support, conflict of interest అనే పదాలు ఈ పోస్టుకి ప్రేరణ. మెడికల్ జర్నల్స్ చేసే అరాచకాల గూర్చి నువ్వు చెప్పినదానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
(బహుశా BJP వాడికి తన జర్నల్ ఆర్టికల్ని ఒక తెలుగు బ్లాగులో స్క్రీన్ షాట్ తీసి వాడారని తెలీకపోవచ్చు.)
ఇక్కడెదో జర్నల్స్ గురించి చర్చ జరుగుతున్నట్టున్నది, పానకంలో బుడగ లాగా నావో రెండు(మూడు) లింకులు
Deletehttp://gowers.wordpress.com/2013/05/27/elsevier-journals-has-anything-changed/
http://en.wikipedia.org/wiki/Aaron_Swartz
( I feel certain that the world will eventually catch up to Aaron’s passionate belief that the results of publicly-funded research should be freely available to the public. - Scott http://www.scottaaronson.com/blog/?p=1230)
ఏ జర్నల్ చుసినా ఇదే గొడవా?
[అబ్బా, అజ్ఞాత ఆప్షన్ లేని బ్లాగుల్లో కామెంట్ పెట్టాలి అంటే పెద్ద తలనొప్పు బాబు]
తార గారు,
Deleteమీ లింకులకి ధన్యవాదాలు.
అజ్ఞాత ఆప్షన్ తీసెయ్యడానికి నాకో కారణం ఉంది. నా పోస్టుల్లో (కొన్నిసార్లు) అజ్ఞాతలు బీభత్సమైన కామెంట్లు రాస్తారు. అటు తరవాత వాళ్ళల్లోవాళ్ళే విమర్శించుకుంటూ (వాళ్లకి పాత తగాదాలేవో ఉండి ఉండొచ్చు) కామెంట్లు రాసేసుకుంటుంటారు. నాది ప్రేక్షక పాత్ర అయిపోతుంది. అయినా నాకభ్యంతరం లేదు కానీ.. అజ్ఞాతలు ఒక్కోసారి నా బ్లాగులో కామెంట్లు రాసేవాళ్ళని heckle చేస్తున్నారు. ఇది నాకు చాలా అభ్యంతరకరం (అయినప్పటికీ నా బ్లాగులో కామెంట్ మోడరేషన్ లేదు. గమనించగలరు). అంతకుమించి మరేం లేదు. మీవంటివారికి ఇబ్బందనిపిస్తే ఎత్తెయ్యడానికి నాకు అస్సలు అభ్యంతరం లేదు.
>>అటు తరవాత వాళ్ళల్లోవాళ్ళే విమర్శించుకుంటూ
Deleteఅదో టైం పాస్
>>అయినప్పటికీ నా బ్లాగులో కామెంట్ మోడరేషన్ లేదు. గమనించగలరు
ఉంటే మీకదో టైం వేస్ట్.
>>మీవంటివారికి ఇబ్బందనిపిస్తే
సచ్చినా అనను, కొంత మందికి తెలుగు బ్లాగ్ లోకంలో ఏకైక అజ్ఞాత నేనే అనేది గట్టి నమ్మకం, స్యూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నంత నిజం అని నమ్ముతారు కుడా. అజ్ఞాత ఆప్షన్ లేకపోతే అదొక కొద్దిలో కొద్దిగా ఊరట.
నేనేదో అమావాస్యకి పౌర్ణమికి బ్లాగులు చూస్తాను, కామెంట్లు రాయడం ఇంకా అరుదు, సైన్ అవుట్ చేసి సైన్ ఇన్ చెయ్యడం అనేది కొద్దిగా ఇబ్బంది అంతే తప్ప ఇదో విశేషం కాదు, ఒకప్పుడు తెలుగు బ్లాగుల్లో వచ్చిన కొన్ని సైన్సు వ్యాసాల వలన నేను చాలా లాభ పడ్డాను అని, ఏవో పైన లాంటి పనికిమాలిన లింకులు ఇస్తుంటాను, అవి చదువుతారు చదవరు అని కాదు, ఆ వ్యక్తులని పరిచయం చెయ్యడం కోసం, వారి గురించి ఎవరైనా తెలుసుకొని, మోటివేట్ అవుతారు అనే.
ఇక, మీరు సాధారణ మానసిక రుగ్మతల గురించి, ప్రజల అపోహల గురించి వ్రాస్తే బాగుంటుంది అని మాత్రం ఉన్నది, నేను చాలా చోట్ల ఒట్టి dementia పట్టుకుని పెద్దలని నానా హింసలు పెట్టే (కావాలని కాదు ఏవో మూఢనమ్మకాలతో) పిల్లల్ని, డాక్టర్లని చూసాని, మీరు అటువంటి వాటి గురించి వ్రాస్తే బాగుణ్ణు. (I mean common psychological disorders)
@తార,
Delete>>మీరు సాధారణ మానసిక రుగ్మతల గురించి, ప్రజల అపోహల గురించి వ్రాస్తే బాగుంటుంది అని మాత్రం ఉన్నది.<<
ఇది నాకు సాధ్యం కాని పని.
1. వైజ్ఞానిక విషయాలు తెలుగులో నేను పెద్దగా చదవలేదు. వైద్యానికి సంబంధించి చాలా పదాలు తెలుగులో వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేనా పదాలతో పరిచయం పెంచుకుని.. psychological disorders మీద టపా రాసేకన్నా.. నాకిష్టమైన పెసరట్లు, సిగరెట్ల మీద చాలా టపాలు రాసేసుకోవచ్చు. ఎంతో సుఖం!
2. తెలుగు బ్లాగర్లలో ఇంగ్లీషు రానివారు తక్కువ. ఆ తక్కువమంది కోసం ఎంతమేర రాయాలి? నాకు తెలీదు.
3. నాకు సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? కారు ఎలా నడుస్తుంది? లాంటి విషయాలు తెలీదు. తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు (అవి రిపేర్ చేసువాళ్ళు ఉన్నారుగా). అలాగే రోగం వస్తే డాక్టర్ దగ్గరకెళ్లమని మనం చెప్పక్కర్లేదు. రోగం లేకుండా.. రోగాల గూర్చి తెలుసుకుని బుర్ర పాడుచేసుకోవటం దండగ అనేది నా అభిప్రాయం.
4. ఈ రోజుకీ సైకియాట్రిస్ట్ దగ్గరకి వచ్చేముందు దయ్యాలు, దర్గా, చర్చి, రంగురాళ్ళు.. అన్నీ కానిచ్చుకుని వచ్చేవారు ఎక్కువ. మంచిదే. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాదనడానికి మనమెవరం? అసలు నాకైతే వాళ్లతోనే హాయిగా ఉంటుంది.. కొద్దోగొప్పో మందులు తిన్నగా వాడతారు!
...రాజకీయ పార్టీల రాజకీయాల కన్నా వార్తాపత్రికల రాజకీయాలు ఎక్కువైపొయ్యాయి..."
ReplyDeleteనిజమైన నిజం చెప్పారు.
నిజమైన నిజం చెప్పారు.
నిజమైన నిజం ఏమిటి అనుకుంటారేమో! అవును నిజంలాగ కనిపించే అనేకానేక అబధ్ధాలు మనం రోజు డబ్బెట్టి కొనుక్కుంటూ ఉంటాము చూస్తూ ఉంటాము. అందుకని నిజం అని వేరే ఊంటుందని నా ఊహ. ఊహ మాత్రమే.
మీరు వ్రాసినది మాత్రం నిజమైన నిజం, పాఠకులు అదే ఈ మీడియా వినియోగదారులు అనుకునేదీనూ.
న్యూస్ పేపర్స్ ని ఎవరు రెగ్యులేట్ చెయ్యాలనే విషయం కొంచెం కాంప్లికేటెడ్. ప్రస్తుతం ప్రింట్ మీడియా సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటున్నాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి కొంత రెగ్యులేటోరి ఓవర్‌సైట్ ఉంది కానీ - ప్రెస్ ఫ్రీడం, ప్రెస్ స్టాండర్డ్‌లు ఈ ప్రభుత్వ శాఖ ముఖ్య లక్ష్యాలు అఫిషియల్ గా. రూలింగ్ పార్టీ ని కాపాడటం, డిసెంట్ ని తొక్కెయడం, ప్రతిపక్షాలని భాదించడం వాళ్ళ అనఫిషియల్ మాటో - ఎస్పషల్లీ ఈ జస్టిస్ మార్కండేయ్ కాట్జూ గారొచ్చినప్పుడ్నించి. మార్కండేయ్ గారు ఎలెక్ట్రానిక్ మీడియాని కూడా రెగ్యులేట్ చెయ్యాలని చూస్తున్నారు. అన్‌రెగ్యులేటెడ్ మీడియా అంటే మనకు నచ్చక పోవచ్చు - కానీ, ప్రెస్ ఫ్రీడం ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో నేను చెప్పనక్కర లేదు. అసలే ఇండియా ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ లో 140 స్థానానికి పడిపోయింది ఈమధ్య. టైంస్ ఆఫ్ ఇండియా లో ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన రోజుటి హెడ్లైన్ చూడండి: "D.E.M O'Cracy beloved husband of T.Ruth, father of L.I.Bertie, brother of Faith, Hope and Justica expired on 26 June,1975"
ReplyDeleteనాకైతె ఒక నాన్ గవమెంటల్ అంబడ్స్మన్ లాంటి బాడీ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. అమెరికా లో ప్రముఖ పత్రికలికి సొంత అంబడ్స్‌మన్లు ఉంటారు. ఇక వోనర్‌షిప్, పార్టీ అఫిలియేషన్, కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ లాంటి డిస్‌క్లోజర్లు పెట్టడానికి పెద్ద కష్టమేమి కనపడడం లేదు.
చివరిగా, ప్రజలేమి తెలియని వారనుకోకండి. మన దేశంలోనూ, మన రాష్త్రంలోనూ ఉన్న న్యూస్ పేపర్ రీడర్‌షిప్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు! డియర్ రమణా, మన డౌనింగ్ స్ట్రీట్ - అదే, శంకర్ విలాస్ కార్నర్ లో ఎలాటి విపరీతమైన రాజకీయ చర్చలు జరిగేయి మన మెడికల్ కాలెజ్ రోజుల్లో?
బి ఎస్ ఆర్
Dear BSR,
Deleteనిజమే! శంకరవిలాస్ కార్నర్ రాజకీయ చర్చలు చాలా హై స్టాండర్డ్ లో ఉండేవి.
(నేను మాత్రం stands లో display చేసిన 'హిందూనేషన్' అనే ఒక yellow magazine ని నోరు తెరుచుకుని చూస్తుండేవాణ్ని!)
>>ఇక వోనర్‌షిప్, పార్టీ అఫిలియేషన్, కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ లాంటి డిస్‌క్లోజర్లు పెట్టడానికి పెద్ద కష్టమేమి కనపడడం లేదు.<<
అప్పుడింక తెలుగులో న్యూస్ పేపర్లు అంటూ ఏమీ మిగలకపోవచ్చు.
for commentary on mainstream media, see: http://www.mediacrooks.com/
ReplyDeleteAn excellent article by Ravinar. Thanks for the link, Bullabbai garu. I completely agree with his views. English media in India operates in a parallel universe! I loved this Tvaleen Singh's article on LKA: Narendra Modi’s march continues as Advani gets in his own way
DeleteBSR
Sorry for the typo. I meant Tavleen Singh.
DeleteHere is a nice piece on press freedom in Hindustan Times:Free press in India a myth: 66A proves it
BSR
If you liked those, then you would like the following too:
Deletehttp://www.openthemagazine.com/article/nation/remote-mindset
http://www.firstpost.com/politics/the-inside-story-of-how-sonias-spin-doctoring-works-882659.html
>> అక్షరాస్యుల్లో కూడా రాజకీయ అక్షరాస్యత మరీ తక్కువ. వీరి సంఖ్య పెరిగేదాకా పత్రికలు తమ ధోరణి మార్చుకునే అనివార్యత ఏర్పడదు.
ReplyDeleteVery important observation. I tollay agree with you.
i dont see any need for regulation of media.....in AP everyone are aware which newspaper supports which party......infact regulation (statutory) is more dangerous than no regulation. Instead of regulations independent private organizations can rate and rank media firms on several parameters (Just like how CRISIL and ICRA rate financial instruments).
ReplyDeleteYup!
DeleteUntil people got educated, we cant come over this situation. Gongalilo annam tintu, botchu vatchinadi anna chandana. Litiracy may solve this problem up to some extent.
ReplyDeleteఐ పి యల్ క్రికేట్ శ్రీశాంత్ ఎపిసోడ్ విషయంలో న్న ఇంగ్లిష్ మీడియా వాళ్లు, వాళ్ల అతి తెలివి తేటలతో తిమ్మిని బమ్మిగా చేయబోయారు. కానీ శ్రీనివాసన్ వారి ఎత్తులను చిత్తుచేశాడు. ఈ టపాలో వ్యాఖ్యలను చదివితే అర్థమైపోతుంది.
ReplyDeletehttp://tinyurl.com/p7lavs6
రమణగారు,
ReplyDeleteసోషల్ మీడీయాలో నిజాలు మాట్లాడి, సాక్షాలతో సహా చూపించి, వాదించేవారికి ఇంటర్నేట్ హిందూవులు అని పేరుపెట్టారు. మొదటిసారిగా ఆ పేరు పెట్టింది సాగరికా గోష్. వీరిలో ఎక్కువగా బ్రాహ్మణ, బనియాలు ఉంటారు అని వారి పైన సాక్షాధారాలతో వ్యాసాలు రాసిన వారిలో ప్రముఖ పాత్రికేయులు,చర్రిత్రకారులు అయిన రామచంద్ర గుహ ఒకరు. బ్లాగులు వలన, అక్కడ జరిగే చర్చలవలన చాలామంది ప్రముఖుల భావజాల ఆధిపత్యం ప్రశ్నించబడటం వీరి కోపానికి కారణం. మీరు ఈ మధ్య కొన్నిసార్లు తెలిసో తెలియకో సిద్దాంతం కళ్లజోడును పెట్టుకొని చూడకుండా నిజాలను రాస్తున్నరు. మిమ్మల్ని కూడా త్వరలో ఇంటర్నేట్ హిందూవు గా ముద్రవేసినా ఆశ్చర్యపోనక్కరలేదేమో! :):)
'kontamandi dongalu potladukonte konnisaarlu manaku nijaalu andutaayi'.This is one useful side-effect of manufacturing consent.the task of discovery of truth lies with people like YOU. Rajamohan
ReplyDelete