"ఏంటి డల్ గా ఉన్నావ్?"
"ఎవర్నువ్వు!?"
"పాత తెలుగు సినిమాలు లెక్కలేనన్ని చూశావు. ఆ మాత్రం తెలుసుకోలేవా? ఇలా అద్దంలోంచి మాట్లాడగలిగే ఫెసిలిటీ ఎవరికుంటుంది? నేను నీ అంతరాత్మని."
"అలాగా! రా! ఇలా వచ్చి కూర్చో, అవునోయ్! బోర్ కొడుతుంది."
"బోర్ కొడుతుందా? ఇట్లాంటప్పుడు మనకి మనమే కొన్ని పన్లు కల్పించుకోవచ్చు. ఫరెక్జాంపుల్ మనకిష్టమైంది (ఆకలి లేకపోయినా) తినొచ్చు. పక్కమీద (నిద్ర రాకపోయినా) పడుకోవచ్చు. గడ్డం (పెరగక పోయినా) చేసుకోవచ్చు. వీపు (దురద పుట్టకపోయినా) గోక్కోవచ్చు. బ్లాగ్ పేరు (అవసరం లేకపోయినా) మార్చుకోవచ్చు."
"నువ్వే ఏదోక ఐడియా ఇవ్వరాదూ?"
"బాగుంది! ఎక్కడైనా ఆత్మలు ఐడియాలు చెప్తాయా? సర్లే, ఇప్పుడా గోక్కాడాలు, గీక్కోడాలు ఎందుగ్గానీ - ఓ పన్జెయ్. నీ 'పని లేక.. ' బ్లాగ్ పేరు మార్చెయ్యి. ఆ పేరుతొ ఇంకా ఎంతకాలం రాస్తావ్? విసుగనిపించట్లేదు?"
"అనిపిస్తుంది, నువ్వే ఓ మంచి పేరు సజెస్ట్ చెయ్యి."
"ఇది మరీ బాగుంది. ఎక్కడైనా ఆత్మలు పేర్లు సజెస్ట్ చేస్తాయా? ఆ పేరేదో నువ్వే చెప్పు, బాగుందో లేదో నే చెప్తా."
"ఓకే, 'రమణ రచనలు' ఎలా ఉంది?"
"బానే ఉంది, కానీ నాకో డౌట్! నీవసలు రచనలేనా?"
"నాదీ సేమ్ డౌట్. పోనీ - 'ఆలోచనా తరంగాలు'?"
"శబ్దతరంగాలు విన్నాను గానీ , ఆలోచనా తరంగాలు విన్లేదు. సర్లే! ఇదేదో బానే ఉంది, కానీ - నీకింత గంభీరమైన పేరు అవసరమా?"
"అవసరం లేదు, పోనీ - 'నేనూ - నా ఆలోచనలు'?"
"నువ్వు నీ ఆలోచనలే రాస్తావు. పక్కవాడి ఆలోచనలు రాయవు కదా!"
"అవును గదా! సర్లే - 'పసిడి పలుకులు' ఎలా ఉంది? చాలా క్లాస్ గా ఉంది కదూ!"
"అవును, చాలా క్లాస్ గా ఉంది. అప్పుడు నువ్వు పెద్దమనిషిలా సుభాషితాలే రాసుకుంటూ కూర్చోవాలి. అంత మంచి పేరు నీ రాతలకి సూట్ కాదు."
"అన్నింటికీ వంకలు పెడుతున్నావ్. ఆసలిప్పుడు నా బ్లాగ్ పేరు మార్చడం వల్ల నాక్కలిగే అదనపు ప్రయోజనమేమి? ఒకరకంగా ఈ 'పని లేక.. ' అన్న పేరే సుఖం. ఎప్పుడైనా వివాదంలో ఇరుక్కుంటే, పన్లేక రాస్తున్నానని తప్పించుకుంటున్నాను.. చదువరులూ క్షమించేస్తున్నారు."
"అలాగంటావా! అయితే ఓ పన్జెయ్యి."
"ఏంటి?"
"దుప్పటి కప్పుకుని బజ్జో."
"ఇది మంచి సలహా."
"మరి నే వెళ్తా."
"మంచిది! నీదే ఆలస్యం."
(నిఝంగా 'పని లేక.. ' రాసిన పోస్ట్!)
(picture courtesy : Google)
Very refreshing.
ReplyDeleteపని ఉన్నాకూడా చదవొచ్చుగదా! ఫరవాలెదు. నీ అంతరాత్మ కథలు నాకిష్టమే!
ReplyDeleteగౌతముడా,
Deleteనిన్న నా బ్లాగ్ పేరు (దాదాపు) మార్చినంత పని చేశాను. కానీ ఏ పేరుకి మార్చాలో తెలీలేదు.
(థాంక్స్ టు మై అంతరాత్మ!)
:)
ReplyDeleteబ్లాగ్ పేరు అలానే ఉంచి ,ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు ఈ మధ్య వరూధిని కన్ను మీ(బ్లాగ్ ) ఫై బాగా ఉంది :)
ReplyDeleteపనిలేని డాక్టరు :-)
ReplyDelete
ReplyDeleteSeriously Hilarious ! Truly Yours !
cheers
zilebi
ఇంతగా పనిలేకుండా నీకు టైం దొరికినందుకు నాకు చాల ఈర్శగా ఉంది .
ReplyDeleteగో వె ర
NALO NENU , ALAUNDI SIR
ReplyDelete