"ఉన్మాదం రోగుల కోసం మానసిక వైద్యుల అవగాహన సదస్సు."
ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్లో ఈ వార్త చదవంగాన్లే కంగారుపడ్డాను. సైకియాట్రీ వైద్యంలో 'ఉన్మాదం' అనే జబ్బు ఉన్నట్లు నాకు తెలీదు. కొద్దిసేపటి తరవాత నాకర్ధమైందేమనగా స్కిజోఫ్రీనియా అనబడే ఓ మానసిక రోగానికి తెలుగు అనువాదం 'ఉన్మాదం' అని. మనసు దిగులుగా అయిపొయింది.
నాకెందుకో 'ఉన్మాదం' అంటే ఉగ్రవాదం టైపులో ఏదో తిట్టులాగా అనిపించింది. తలపెట్టిందేమో schizophrenia రోగం పట్ల అవగాహన కార్యక్రమం. వచ్చినవారిని ఉన్మాదులు అంటే.. పిలిచి మరీ అవమానించినట్లవుతుందేమో! ఉన్మాదం అనే అనువాద పదం తెలుగు నిఘంటువు ప్రకారం కరెక్టే ఆవ్వచ్చు. కానీ వినడానికి ఏ మాత్రం బాలేదు.
మన భాషాభిమానులు రోగాల పేర్ల విషయంలో కొంత నిబద్ధత పాటించాల్సిన అవసరం ఉంది. స్కిజోఫ్రీనియా అనేది జర్మన్ భాషా పదం. ఇంగ్లీషువాడు దాన్ని స్కిజోఫ్రీనియాగానే ఉంచేశాడు గానీ తన భాషలోకి అనువదింప పూనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా రొగాలకి ఒకటే పేరు ఉంటే మంచిది. అందువల్ల ఎవరికీ నష్టం కూడా లేదు.
'అతిసారం' అంటే కలరా అన్నసంగతి నాకు మొన్నటిదాకా తెలీదు. hypertension ని ఆంగ్లంలో బ్లడ్ ప్రెషర్ (BP) అంటారు. బిపి అంటే చదువుకోనివారిక్కూడా అర్ధమౌతుంది. కానీ తెలుగులో రక్తపోటు (ఏదో కత్తిపోటులా అనిపిస్తుంది కదూ) అంటూ భయాందోళనకి గురిచేస్తారు. diabetes అంటే తెలుగులో మధుమేహం (నాకు మధుబాల గుర్తొస్తుంది) అంటారు. typhoid అంటే విషజ్వరమట!
తెలుగు భాషాభిమానం అంటే విషయాన్ని complicate చేసుకోవటం కాకూడదు. ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పదాల్ని (అది ఏ భాషైనా పరవాలేదు) అలా వదిలేస్తేనే ఉత్తమం. ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలం (మార్జాలం గుర్తొస్తుంది) అంటూ ఏదో మాయాజాలం చెయ్యనేల! ఇలా అంటే మన professional భాషాభిమానులు ఒప్పుకోరు. వారికి కృతకమైన తెలుగు అనువాద పదాలంటేనే ఇష్టం.
అపరిచితుడు సినిమా గుర్తుంది కదూ! కొందరు భాషాభిమానులు స్టేజి ఎక్కేదాకా వాడుకభాష (తెలుగు + ఇంగ్లీషు పదాలు కలగలిపి) లో మాట్లాడతారు. మైక్ ముందుకొచ్చి స్వచ్చమైన తెలుగు మాట్లాడటం మొదలెడతారు.. రిమో రాముగా మారినట్లు. ఇంకొందరు మైక్ ముందు చక్కటి తెలుగులో మాట్లాడి.. స్టేజ్ దిగంగాన్లే 'సంస్కృతం' మొదలెడతారు.. రాము అపరిచితుడుగా మారినట్లు.
నాకెందుకో మొదట్నుండి మాతృభాషపై (చాలామందికి ఉన్నట్లు) తీవ్రమైన మమకారం లేదు. అందువల్లనేనేమో 'తెలుగు భాషని పసిబిడ్డలా సాకుదాం' అనే నినాదం నాకు అర్ధం కాదు! ఈ రోజుల్లో ఇంట్లో మాతృమూర్తులకే దిక్కులేదు.. ఇక మాతృభాషకి అంత పవిత్రత దేనికో! ఈ టాపిక్ తో "భాష - పెసరట్టు" అంటూ లోగడ ఓ టపా రాశాను.
నేను ఆంధ్రాలో పుట్టాను కావున తెలుగులో బ్లాగు రాసుకుంటున్నాను. కేరళలో పుట్టినట్లైతే నా బ్లాగుని మలయాళం భాషలో రాసుకునేవాణ్ని. నా భాష తెలుగు కావటం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. దానికి లేని పవిత్రత అంటగట్టడం అనవసరం. కుక్కలక్కూడా కుక్కభాష ఉంటుంది కదా!
ఒకప్పుడు తెలుగుభాష అంతపుర కన్య. గురజాడ, గిడుగు ఆ కన్యని గుమ్మంలోకి తీసుకొచ్చారు. శ్రీపాద, శ్రీశ్రీ రోడ్డు మీదకి తెచ్చారు. రావిశాస్త్రి అలగా జనంలోకి తీసుకెళ్ళాడు. మా.గోఖలే, కేశవరెడ్డి సమాజపు అట్టడుగు లోతులు చూపిస్తే.. నామిని పల్లెజనుల బూతుభాష కూడా నేర్పించాడు. ప్రతిసారీ (భాషా) శంకరశాస్త్రి 'శారదా!' అంటూ గావుకేక పెడుతూనే ఉన్నాడు. అయినా లాభం లేకపోతుంది.
మనం సాధ్యమైనంతవరకు ఈ ధూమశకట యంత్రాలకీ, అంతర్జాలలకీ దూరంగా జరిగితే మంచిదని నా అభిప్రాయం. భాష అనేది ఎవణ్నో ఉద్ధరించడానిక్కాదు. మన ఆలోచనల్ని చెప్పుకోడానికి, రాసుకోడానికి మాత్రమే. అంతకుమించి ఏ భాషక్కూడా ప్రయోజనం లేదు. రేప్పొద్దున భాషలన్నీ అంతరించిపోయి సైగలు చేసుకుంటూ బ్రతికే రోజులొస్తే మనం కూడా ఇంచక్కా సైగలు చేసుకుంటూనే బ్రతికేద్దాం. నాకైతే అది కూడా హాయిగానే ఉంటుంది.
అంకితం..
తెలుగుభాషలో అనువాద పదాలు అంటూ కంకర్రాళ్ళ భాషని మనపై రుద్దడానికి ప్రయత్నించే విజ్ఞులకి.
(picture courtesy : Google)
కుక్కలక్కూడా కుక్కభాష ఉంటుంది కదా!
ReplyDeleteప్రతిసారీ (భాషా) శంకరశాస్త్రి 'శారదా!' అంటూ గావుకేక పెడుతూనే ఉన్నాడు. అయినా లాభం లేకపోతుంది.
:) super.
చక్కగా చెప్పారు డాట్రారు. ఇప్పుడు అంతగా లేదు కానీ, కొన్నాళ్ళ క్రితం కొందరు తెలుగోన్మాదుల బ్లాగుల్లో ఈ 'తెలుగులోకి తర్జుమా' పైత్యం చాలా ఎక్కువగా ఉండేది!
ReplyDeleteఒకప్పుడు నేను ఈ-తెలుగువాళ్ళతో కలిసి తిరిగేవాణ్ణి. వీవెన్ గారు వైజాగ్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ నుండి ఋషికొండ బీచ్ వరకు తీసుకెళ్ళింది నేనే. కానీ 'అంతర్జాలం' లాంటి కర్ణకఠోర పదాలని జన బాహుళ్యంలోకి వ్యాప్తి చెయ్యడం సాధ్యం కాదనిపించి ఈ-తెలుగుకి శాస్వతంగా దూరమయ్యాను.
Deleteనేను కూడా ఆ గుంపు కి ఈ అంతర్జాలం లాంటి పదాల వల్లనే దూరమయ్యాను. విపరీతమైన తిక్క మనుషులు చాలా యాక్టివ్ గా వుండే వాళ్ళు.
DeleteEenadu news paper is thouroughly inspired by e-Telugu. ఒకప్పుడు నేను "వార్త" దిన పత్రిక చదివేవాణ్ణి. అది మానేసి ఈనాడులోకి వస్తే ఇందులో పాషాణపాకపు భాష భరించాల్సి వచ్చింది. సాక్షి ఎలాగూ సొంత డబ్బా పత్రిక. ఆ పత్రిక నేను కొనలేను. కొంచెం బాగుంటుందని ఈనాడు పత్రిక కొంటే ఇక్కడ చదవలేని పాషాణపాకపు భాష కనిపిస్తోంది.
Delete@Sudhakar
Deleteవిపరీతమైన తిక్క మనుషులు చాలా యాక్టివ్ గా వుండే వాళ్ళు. బాగా చెప్పారు
అనువాదం, భాషాభిమానం కావల్సిందే! పిల్లి అంటే బిడాలంలా ఉండకూడదు.అతి చేస్తే గతి చెడుతుందని :)
ReplyDeleteఏంటో మీకు కుక్కల భాష తెలిసిపోతోంది :)
/* ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలం (మార్జాలం గుర్తొస్తుంది) అంటూ ఏదో మాయాజాలం చెయ్యనేల
ReplyDeleteదీనితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, అంతర్జాలం అని మక్కికి మక్కి తర్జుమా చెయ్యాల్సిన అవసరం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు.. కొన్నిసార్లు, ముఖ్యంగా తరచూ వాడే నామవాచకాలని అలాగే ఉంచితే మంచిదేమో, అది ఏ భాష విషయంలోనైనా!
ఇదితప్ప మీరు చెప్పిన చాలా విషయాలను అంగీకరించలేకపోతున్నాను. భాషాభిమానం మరీ అతిగానంతవరకు మంచిదేననిపిస్తుంది, ఒకరకంగా అవసరం కూడానేమో!
ఇంకా నయం, మొన్నా మధ్య 'ఆసనాలు పుస్తకీకరించారు' అని చదివాను ఎక్కడో (సీట్స్ బుక్ చేసారు అన్నదానికి అనువాదం ట). అప్పటినుంచి ఎవరి వెనకాల చూసినా పుస్తకాలే కనిపిస్తున్నాయి. ఇదేదో మానసికోన్మాదం అనుకుని మీదగ్గరికి వద్దామనుకున్నాను కానీ మీ దర్సనానికి రుసుం వసూలు చేస్తారని భయపడి ఆగిపోయాను...దహా.
ReplyDelete'అతిసారం' అంటే కలరా అన్నసంగతి నాకు మొన్నటిదాకా తెలీదు"
ReplyDeleteనాకు ఇప్పుడే తెలిసింది . ఒక క్రొత్త విషయం తెలిపినందుకు తాన్ కుష్ ఊ (ఇది కేంద్ర ప్రభుత్వము తెలుగు ప్రకటనలలో వాడే తెలుగు , దీనిని ఆంగ్లం లో అనగా English లో Thank You అంటారు )
ఒక సారి ఇండియా టుడే email ని "విద్యుల్లేఖ" గా అనువదించింది.
ReplyDeleteఈనాడు పత్రిక వాళ్ళు "గోడపత్రిక" అని రాస్తున్నారు. నాకు గోడపత్రిక అంటే ఏమిటో అర్థం కాలేదు. అది ఇంగ్లీషు లో
wall poster కు అనువాదం అని మొన్నే తెలిసింది.
నరులెవరూ ముట్టని ఆహారాన్నే భుజిస్తామనేవాళ్ళకి మనం ఏమి చెప్పగలము? ఈనాడువాళ్ళు విశాఖపట్నం ఎడిషన్‌లో "గుత్తేదారు" అనే పదం రోజూ వ్రాస్తున్నారు కానీ ఈ నగరంలో ఆ పదానికి అర్థం తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు. "అంతర్జాలం" అనే పదానికి అర్థం తెలిసినవాళ్ళు మాత్రం ఈ నగరంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు నక్కవానిపాలెంలో, ఇంకొకరు HB కోలనీలో. వీళ్ళిద్దరూ బ్లాగర్లు కావడం వల్లే వీళ్ళకి ఆ పదం తెలిసింది కానీ మిగితావాళ్ళకి ఆ పదం అర్థమయ్యే అవకాశమే లేదు. అయినా ఈనాడువారికి అదో వెర్రి. "మేము అందరం ఒక టైపూ, మీరింకొక టైపూ" అన్నట్టు!.
Deleteప్రవీణ్,
Deleteగుత్త అన్న పదం మీకు తెలియక పోవచ్చు కాని అది మొదటి నుండి మూడు తెలుగు ప్రాంతాల్లోనూ వాడుకలో వున్నదే. మరీ ముఖ్యంగా గ్రామీణులకు మనకన్నా బాగా తెలుసు. ముఖ్యంగా అది పోస్టులో చర్చించిన "అంతర్జాలం" లాంటి కృత్రిమ పదం కాదు.
పొలాన్ని గుత్తకు తీసుకుని పండించడం, తోటను గుత్తకు తీసుకుని ఫలసాయాన్ని అమ్ముకోవడం అన్నది అనాదిగా ఉపయోగిస్తున్న పదాలే.
ఇక ఇల్లును రెండు రకాలుగా కట్టించే వారు. పనివారికీ, మేస్త్రీలకీ కూళ్ళిచ్చి కట్టించడం ఒకటైతే, రెండోది మేస్త్రీతోనే గుత్తాగా మాట్లాడుకొని కట్టించుకోవడం. (మిగతా పనివారికి మేస్త్రీయే చెల్లించుకుంటాడు. ఇప్పటి కాంట్రాక్టును పోలిన పురాతన విధానమన్నమాట).
ఇలా గుత్తకు ఎవరు తీసుకుంటారో వారే గుత్తేదారు. వాటాదారు, పట్టాదారు లాగా అన్నమాట.
గుత్త : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
ఋఎంత్, అ చొంత్రచ్త్.
ఆ ఊరిని గుత్తచేసికొన్నాడు హె తూక్ థె విల్లగె ఒన్ రెంత్.
గుత్త : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
వైకృత విశేష్యము
1. అంతయును ఒకేసారి వెలకు కొనుట. (జట్టీ)
2. యజమానికి తగిన ఫలమిచ్చుటకు ఒప్పుకొని భూమ్యాదులను తన అనుభవమున ఉంచుకొనుట. కౌలు.
గుత్త : మాండలిక పదకోశం (తె.అ.) 1985
మొత్తం, పరిపూర్ణమైన అజమాయిషీ [కోస్తా; తెలంగాణం]
పరిపూర్ణమైన బాధ్యత, మొత్తంమీద
గుత్త : శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975
కంట్రాక్టు
ఉదా: సినిమాహాలు గుత్తకిచ్చేశారు
మీ పోస్ట్ కి పెద్ద బింగో సారూ..
ReplyDeleteఈ జబ్బు ఇప్పటిది కాదండీ. ఈ డ్యామేజు ఈరోజుది కాదండీ. న్యూస్ పేపర్లు సంగతే చెప్తున్నారు మీరు. తెలుగు మీడియం సైన్స్, Maths పుస్తకాల్లో technical terms కి భయానకమైన అనువాదాలు చేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.
కాలేజీలకొచ్చాక సబ్జెక్ట్ తెలిసినా పదాలు అర్ధం కాక పడే ఇబ్బంది మామూలుగా ఉండదు..!
మనకి అర్ధమైనంతవరకూ తెలుగు పదాలు వాడటం మంచిదే. కానీ కొత్తగా చిత్ర విచిత్రమైన పదాలని సృష్టించి రాస్తున్నారు.
వాటిని అలాగే ఉంచేస్తే వచ్చి చచ్చే నష్టమేమిటో నాకర్ధం ఏడవదు.
నాకు గుర్తున్నవి కొన్ని మీ స్టైల్ లో
Millicon Oil drop experiment -> మిల్లీకాన్ తైలబిందు ప్రయోగం (ఏదో చేతబడి చేసినట్టు)
న్యూటన్ జడత్వనియమం (మధ్యలో జడలెందుకు వస్తున్నాయా.. అనుకునేవాడిని)
Elasticity -> తలతన్యత (నాడు డెఫినిషన్ అర్ధమయ్యింది గానీ ఈ పదం మాత్రం అర్ధం కాలా)
Matrix కి మాత్రికలు అనీ (ఏదో మాత్రలూ,జంతికలూ కలిపి మింగినట్ట్టు)
Domain కి ప్రదేశం అనీ, ఇంకా ముషలకం, మట్టిగడ్డలూ.. నా తలకాయానా...!!
Universal Gas Constant - సార్వత్రిక వాయు స్థిరాంకం .
DeleteDear Ramana,
ReplyDeleteExcellent write up on language nazis. I thought ఉన్మాదం meant insanity. At least google defines Schizophrenia as మనోవైకల్యం. But, I agree, leaving the terms as they are is the best approach. Also, hopefully, people would stop changing the well known (and many times famous) names of the cities!
BTW, what do you call this condition?
http://vimeo.com/66753575
BSR
’కుక్కలక్కూడా కుక్కభాష ఉంటుంది కదా’ - వెల్ సెడ్. దాన్ని యాక్సెప్ట్ చేసే మీరు, ’అంతర్జాల’ లాంటి వర్డ్స్ తో కూడిన లాంగ్వేజీని యాక్సెప్ట్ చెయ్యలేకపోవడమేంటి? దానికి ఓల్డ్ తెలుగనో వంకర తెలుగనో మరోటనో పేరు పెట్టి దాని మానాన దాన్ని బతకనీయొచ్చు కదా! మీరు మాట్టాడేదాన్ని బోల్డ్ తెలుగనో సంకర తెలుగనో మరోటనో సరిపెట్టుకుంటారు ఓల్డ్ పీపుల్. బోల్డ్ పీపుల్కు ఓల్డ్ లాంగ్వేజీ మాట్టాడాల్సిన నెసెసిటీ లేదు, అలాగే ఓల్డ్ పీపుల్కు బోల్డ్ టైప్ లాంగ్వేజీ మాట్టాడాల్సిన నెసెసిటీ లేదు. అట్టాగే మాట్టాడకూడదన్న రూలూ లేదు. చైనీస్ లాంగ్వేజీలో జపనీస్ లాంగ్వేజీలో రెండో నాలుగో వెరైటీలున్నాయంట గదా, సేమ్ అలాగే మనకూ టూ వెరైటీసుంటై. వాట్స్ రాంగ్? మన మదరు, మన టంగూ.. ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళం టాక్కుందాం, స్పీక్కుందాం!
ReplyDeleteపోతే.. రక్తపోటు నాకేమీ కత్తిపోటులాగా అనిపించడంలేదు. ఆ మాటను చిన్నప్పటి నుండి వింటున్నాను. అంచేతే బహుశా అలా అనిపించడం లేదేమో! అందుగ్గాను మీర్నన్ను క్షమించాలి. హార్టెటాక్ అనే మాటకంటే గుండెపోటనే వర్డే గబుక్కున తలపుకు వస్తుంది. ఇయ్యాళ్టిక్కూడా గడియారమనే అంటాగానీ, వాచ్ అనే వర్డ్ గబుక్కున రాదు. బహుశా నాలాంటి వాళ్ళ లాంగ్వేజీని ఓల్డని కూడా అనకూడదేమో.. నాటు తెలుగనో, మోటు తెలుగనో, ప్రోటో తెలుగనో పిలవాలేమో! ఏదేమైనా సరే.. నా ’పవిత్ర’ తెలుగుకు గాను బోల్డ్ పీపులంతా నన్ను క్షమించెయ్యాలి.
అయితే డాక్టర్గారూ, ధూమశకటమనే మాటను ఒక్కసారి కూడా ఓల్డుల నోట గానీ, బొల్డుల నోటగానీ విన్లేదు నేను. కానీ ఎగతాళి చెసేవాళ్ళ నోట మాత్రం ఎన్నో సార్లు విన్నాను - ఆ వరసలోనే ఇవ్వాళ మీ ఈ పోస్ట్లో చదివాను. ఎగతాళి చేసేటపుడు ఏమైనా వాడొచ్చేమోలెండి, ఎగతాళాతురాణామ్..
ఏంటో.. ఏ వర్కూ లేక తర్కించడానిక్కూచున్నట్టుగా ఉంది నేను.
పెద్దయ్యా, మీ భాష మీరు మాటాడుకుంటే గొడవ లేదు..
Deleteదాన్ని జనాలమీదకి గోడపత్రికల్లా వదలితే.. అర్థం కాక సత్తన్నాం
డాట్టర్లకి గుండెపోటు, హార్టెటాకు అర్థం కావు... వాల్ల భాషలో దాన్ని MI అంటారు.
అండర్స్టాండైంది బుల్లబ్బాయి గారూ. నే రాసేది అర్థం గాక మీరు భాషా సంకర సాస్త్రి లాగా అరుస్తున్నారన్న మాట! మీ కండర్స్టాండయ్యేలా చెప్పేందుకు ట్రై చేస్తా... నేనంటున్నదేంటంటే- 'సారదా..హ్!' అంటూ గావుకేకలు పెట్టకండి, శంకరశాస్త్రులను పట్టించుకోకండి. దట్సాల్!
Deleteచదువరి గారు,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలు. ముందుగా.. నా టపా వల్ల మీ మనసు నొప్పించినట్లైతే వెరీ సారీ.
కొన్ని రోగాలకి తెలుగు పేర్లు విని ఆశ్చర్యపోయి.. తరవాత చికాకు పడి.. చేతిలో బ్లాగుంది కదాని ఒక టపా రాసేశాను.
మాతృభాష, పితృభాషల కాన్సెప్ట్ పట్ల నాక్కొన్ని అభ్యంతరాలున్నాయి. పన్లోపనిగా అవి కూడా రాసేశాను.
నా టపాలో టపటపా నా ఆలోచనలు రికార్డ్ చేశాను. అంతే! అంతకుమించి ఏ టపాకైనా పరమార్ధం ఉంటుందనుకోను.
old / new.. అన్నిరకాల భాషలు బ్రతికే ఉంటాయి.. లేదా చచ్చిపోతాయి. అవుననడానికి / కాదనడానికి నేనెవర్ని!
నాకు నచ్చినా, నచ్చకపోయినా జనబాహుళ్యంలో ఏ పదం ప్రచారంలో ఉంటుందో అదే నేను రాసి తీరాలి. ఎందుకంటే నేను బ్లాగులు రాసేది నా అభిప్రాయ వ్యక్తీకరణ కోసం. ఎక్కువమందికి అర్ధమయ్యేలా రాయడం అనేది రాసేవాడి స్వార్ధమే!
నాకు నా అభిప్రాయాలే సరైనవనుకునే అజ్ఞానమూ లేదు. ఎందుకనగా నేను linguist ని కాదు. భాషాశాస్త్రంలో నేను layman ని మాత్రమే. అయితే layman క్కూడా అభిప్రాయాలు ఉంటాయి.
This comment has been removed by a blog administrator.
Delete7 years ago, I consulted a dermatologist in Srikakulam. When I said that I had red spots on my breach (gudha bhaagam), he thought that I was using foul language. He said "దాన్ని గుద అనకూడదు, పిరుదులు అనాలి. నువ్వు ఈ భాష ఎక్కడ నేర్చావు". Not only the names of diseases, even the names of organs sound odd to hear.
Deleteరాజ్ కుమార్ గారూ, నేను ఇలా చదూకున్నట్టు గుర్తు..
ReplyDeleteElasticity -> స్థితి స్థాపకత్వం
Surface Tension -> తలతన్యత
నాది తప్పైనా కావచ్చు - సరిదిద్దగలరు.
ReplyDeleteడాట్రుగారు మన తరంగ దైర్ఘ్యాలు (wavelengths) బాగా కలుస్తున్నాయి... శీతోష్ణస్థితి (weather) ప్రభావమేమో
మీరు రాసే పౌన:పున్యం (frequency) కొంచెం పెంచడి
namaskaram andi..
ReplyDeletemee alochanu,raathalu naku chala nachutayi...
kaani endhuko, ivaala chala diguluga vundi...
meeru cheppina konni vishayalanu oppukunnappatiki, endhuko chala vishayalatho ekivabinchalekapothunnanu...
1. స్కిజోఫ్రీనియా అనబడే ఓ మానసిక రోగానికి తెలుగు అనువాదం 'ఉన్మాదం' అని ... నాకెందుకో 'ఉన్మాదం' అంటే ఉగ్రవాదం టైపులో ఏదో తిట్టులాగా అనిపించి... telugu baaaga telisina meeke adhi tittu la anipisthe.. konni rojula tharvatha asalaina teluguki ardhalu evariki teliyakunda pothayi...
2. ప్రపంచవ్యాప్తంగా రొగాలకి ఒకటే పేరు ఉంటే మంచిది. అందువల్ల ఎవరికీ నష్టం కూడా లేదు. .. oka nastam vundi... eenadu manaki valla padalu,perlu telisinavi gaani...chala varaku rogalu eppatinuncho vunnavi... manasikha rogalu kooda.. alane vatiki chikistha kuda vunnadi.. mana poorvikulu entho kastapadi rasina gradhalalo vunna aa chikisthanu telusukovadaniki, telugu perlu aithe konchem sulabhamu...
3.కుక్కలక్కూడా కుక్కభాష ఉంటుంది...avunu.. pakka bashanu telusukovadam thappukaadhu...
kaaani...mana bhasha manaku mana samskruthini nerputhundi..
prathidaniki .... manchi , chedu vuntundi...
alage ee bashabhimanam valla kooda..
chivariga.. thappulunte manninchandi
మొరిగే కుక్కలు కరవ్వనే సామేతను మీ ఉన్మాద మేతకు నిదర్శనం. మాములు మాటలకోసమే తడబడే ఈ కాలంలో గ్రాంధిక భాషను గ్రాసంగా మీకు ఎవరు పెడుతున్నారు? తర్జుమా అవసరానికి అడిగితే ఆదుకునే భాష కానీ, ప్రతి అడ్డమైనవాడి ముందు మాట్లాడితే కుక్క భాష కాకపోతే పక్కా తెలుగు భాష ఎలావుతుంది? ముందుగా మీరు భాషావేశంలో అసమాన సాహసం చూపారు. ముందు మీకు తెలుగు భాష మీద మక్కువ ఎక్కువయ్యేసరికి తర్జుమాను అడ్డుపెట్టుకుని ఎకసక్కాలాడటం మీ ప్రతిభాపాటవాలను స్వయంగా అవిష్కరించుకోవడం అనుకుంటాను.
ReplyDeleteఅయ్యా,
Deleteమీరు నన్ను క్షమించాలి. మీరేం చెబుతున్నారో నాకర్ధం కాలేదు.
అయ్యా,
Deleteమీరు నన్ను క్షమించాలి. మీరేం చెబుతున్నారో నాకర్ధం కాలేదు.
hahahaha good one
కుక్కల భాష కుక్కల కి కుడా ఉంటుంది well said మీకు అమ్మ భాష కి కుక్క భాష కి ఆట్టే తేడా లేదన్న మాట ......... అంటే మీరు మనిషిగా పుట్టడం , doctor కావటం అన్ని accidental గానే జరిగాయని ఒప్పుకున్నందుకు సంతోషం
ReplyDeleteనాకు తెలుగు, ఇంగ్లీషు భాషలు తెలుసు. కన్నడం, హిందీభాషలు కొంచెం అర్ధమవుతాయి.
Delete(అమ్మభాష, నాన్నభాష, అమ్మమ్మభాష.. నాకు ఇవేవీ తెలీదు.)
Deletey.v ramana gaaru
kalam evari kosam aagadu. jana samaanyaniki ardamvavvni leda ardam chesukoleni vanni kramanga kanumarugavuthayi.meeru rasina vyasam bavundi.
prajalu premanchanidi evolutionlo baaganga anthamavvalsindi.prema okkate dennani kala garbham lo munigipokunda chestundi.chooddam telugu bhashanu enthala enthakal janam premistharoo
డాక్టర్ గారు: కొంత కాలం క్రితం బ్లాగుల్లో ఈ సబ్జెక్ట్ మీద పెద్ద పెద్ద పోరాటాలు, కత్తియుద్ధాలు చాలా జరిగాయి. మీరు అవి చూసినట్లు లేరు.:))
ReplyDeleteనాకు తెలీదు. అయినా ఇందులో యుద్ధాలు జరిగేంత సీరియస్ విషయం ఏముంది! ఎవడికిష్టమొచ్చిన రీతిలో వాడు రాసుకుంటాడు. కొన్ని రోగాలకి తెలుగు పేర్లు నాకు నచ్చలేదు. ఆ విషయాన్నే రాశాను.
Delete
ReplyDeleteమీ పోస్టు భేషుగ్గా ఉంది.
ఈ మధ్య ప్రతీ సాహిత్య సభలోనూ, ఇంటా బయటా కూడా, తెలుగు భాష చచ్చిపోతోందని నిక్షేపంలా ఉన్న భాషని బలవంతంగా అంపశయ్యమీద పడుక్కోబెట్టి పబ్బం గుడుపుకుంటున్నారు చాలా మంది. పదికోట్ల పైగా ఉన్న ఆంధ్ర దేశంలో కనీసం సగానికి సగం మంది తెలుగులో మాట్లాడుతున్నారు కదా? ఈ చావడాలూ, తద్దినాలూ ఎప్పటికీ అర్థం కావు.
ఇంగ్లీషు పదాలని తెలుగులోకి మారుస్తున్నామన్న భ్రమలో చాలా సంస్కృత పదాలు వాడేస్తారు. ఉదాహరణ - అంతర్జాలం. జాలం అన్నది సంస్కృత పదం. దాని ముందున్నదీ అదే. సంస్కృత పదం అరువు తెచ్చుకోవడానికి లేని ఇబ్బంది, మూల భాష పదం వాడితే తప్పేవిటో అర్థం కాదు. Road ని రోడ్డుగా పలకడానికి లేని అభ్యంతరం సైంటిఫిక్ పదాలు అలా వాడడంలో తప్పేవిటట?
నాకో చిన్న సందేహం. మిమ్మల్ని వైద్యులు గారూ అని సంబోధించలా లేక డాక్టర్ సార్ ( డాక్టర్ గారూ లో భాషా సంకరం ఉంది.) అని పిలవాలా?
ఈ భాషల గురించి 1972లో హిందీ నటుడు బల్రాజ్ సహాని చాలా బాగా చెప్పాడు:
http://www.eemaata.com/em/issues/201209/1981.html
వీలయితే చదవండి. కనీసం సగంమందికైనా ఆయన చెప్పింది ఎక్కితే ఏ భాషా చావదు.
-బ్రహ్మానందం గొర్తి
క్షమించాలి. మీటపా నాకు నచ్చలేదు.
ReplyDeleteకేవలం తెలుగు ఉన్మాదమేనా ? మీకు తమిళ ఉన్మాదం గురించి తెలుసా? తమిళనాడులో వారి భాషకు పెద్దపీట వేయటానికి వారు యేమీమొగమాట పడటం లేదు. మీ లాంటీ అత్యాధునికు లెవరూ వెక్కిరించట్లేదో - లేక - అలాంటీ సాహసాలు కుదరవో. తమిళమీడియంలో చదువుకే అగ్రతాంబూలం అక్కడ. పారిభాషికపదాలు వారు బాగానే తయారుచేసున్నా రనుకుంటాను. అన్నట్లు చైనా, జపాను, కొరియా, రష్యా తదితరదేశాలలో వారి వారి భాషలకూ పెద్దపీటే. అందుకే అవి అంతర్జాతీయంగా సగర్వంగా వెలుగుతున్నాయి. ఏ రమణల వెక్కిరింపులూ లేకుండా. కన్నడసోదరులకూ వారిభాషను గౌరవించుకొనే విషయంలో యేమో మొగమాటం లేదు. మన తెలుగువాళ్ళకు మాత్రం స్వపక్షవిరోధం స్వభావమే లాగుంది!
మీకు తెలుగు భాషపట్ల గౌరవం లేకపోవచ్చును. అది చాలా అభినందనీయ విషయంగా మీకు అనిపించవచ్చును. ఆధునికులలో అనేకులు మీతో తందానా అనవచ్చును. దానికి మీతో విభేదించేవారు యేమీ చేయలేరు. కాని ఒక విన్నపం యేమిటంటే తెలుగుభాషపట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండటం యేదో మానసిక రోగం అన్న ధోరణిలో మీరు వ్రాయటం చాలా ఆవేదన కలిగించింది.
సమాధానం కాలమే చెబుతుంది, మీ ధోరణి సరైనదేనా అన్న ప్రశ్నకు. కాలో దురతిక్రమణీయః. స్వస్తి.
ReplyDeleteడా;రమణగారూ,ఎవరికిష్టమైన బ్లాగులు వాళ్ళు రాసుకోవచ్చును.అవి రహస్యం కావు కాబట్టి ఎవరైనా వారి యిష్టప్రకారం వాటిపై కామెంట్ చెయ్యవచ్చును.కాని కొన్ని decentహద్దుల్ని మాత్రం పాటించాలని నా అభిప్రాయం.
ఇంక అసలు విషయనికివస్తే ,' అతిసర్వత్ర వర్జయేత్ ' అన్నారు. కాని మరీ చాదస్తానికి పోకుండా ,మన భాషని పరిపుష్టం చేయడానికి సాంకేతికపదాలని సృష్టించుకోవచ్చును.వీలుకానివి ఇంగ్లీషు వంటి ఇతరభాషలనుంచి అరువు తెచ్చుకో వచ్చును. కొన్ని నిత్య వ్యవహారంలో సామాన్య ప్రజలు ఇప్పటికే వాటిని వాడుతున్నారు కదా.ఇంగ్లిష్ కూడా ఇతరభాషలనుంచి ఎన్నోపదాలు అరువుతెచ్చుకుంది. ఆర్థిక,రాజకీయ ,సాంఘికరంగాల్లో ,కళారంగంలోను మన తెలుగు పత్రికలు ఎన్నో తెలుగుపదాలని సృష్టించి వాడుకలోకి తెచ్చాయి.సైన్సెస్ విషయంలోనే యీ ఇబ్బంది వస్తుంది.
ఇక medical terms విషయంలో మీరు నేను ఇటీవల రచించిన English-Telugu medical dictionary ,ఇంతకు పూర్వమే Dr.O.A.Sarma రచించిన English-Telugu medical dictionary లను పరిశీలించండి.
ఉన్మాదము అనే పదం పూర్వం నుంచి ఉన్నదే insanityఅనే అర్థం లో.ఐతే schizophrenia కి పూర్వంలేదు కాబట్టి కొత్త పదం సృష్టించుకోవచ్చును.లేదా అదే వాడవచ్చును.ఇంక 'మధుమేహం' ,రక్తపోటు,అతిసారము,గుండెపోటు ,రక్తహీనత,వంటి వాడుకలో ఉన్న పదాలు వాడవచ్చును .ఆయుర్వేదం పూర్వం నుంచి ఉన్నదే కదా!టెక్నికల్,ప్రొఫెషనల్ మీటింగ్స్ లో తప్పించి మామూలు టైములో వీలయినంతవరకు ,తెలుగుపదాలు వాడటం మంచిదే.మన స్పెషలిస్టు డాక్టర్లు సలహాలు,ఇంటర్వ్యూల్లో ఇలాగే చేస్తున్నారుకదా.మనభాషని అభివృద్ధి చేసుకోడంలో తప్పేమీ లేదు.అది భాషా నాజీజం అనిపించుకోదు.గ్రంథవిస్తరభీతితో ఇంతటితో ఆపివేస్తున్నాను.
Dr.M.V.Ramanarao .M.S.D.O.
Dr. Ramanarao garu, I like your commensensical and practical approach to language. In any event, I am not going to argue with someone who wrote a book on the topic!
ReplyDeleteYou are absolutely right. Languages are dynamic and ever evolving and they indeed borrow many words from each other. There are many Indian origin words in English language such as juggernaut, pundit, guru, jungle, pyjamas, thug, verandah, shampoo, mulligatawny, pariah, bandana and so on.
So, I would say there is no shame in importing a foreign origin word when there is no readily available equivalent in one's own mother tongue. I especially do not like this new word invention binge which results in idiotic tongue twisting mockery of sorts.
Since, you alluded to (I think) my use of the words language nazi. let me explain. I detest the hypocritical insistence of some, on others to speak only in pure mother tongue and treat the use of foreign language or words as some kind of unpatriotic moral depravation unworthy of their origin. All the while these worthies send their children to English medium schools and cannot wait for them to go abroad for betterment of their lives. Then there are those holier than thou pseudo pure language speakers that get on stage and deliver sanctimonious lectures our good doc, Ramana referred to in his blog post. Language essentially is a communication tool, but, thoughts and ideas are more important than language per se. Lastly, language unfortunately is used by politicians to bring discord and disunity in various cities and states. These are the people I have in mind when I said language nazi - not people who would like to promote the native tongue and wishing it to flourish.
Let me take crack at Telugu translation for schizophrenia: విచ్చేద మతి
BSR
విచ్చేద మతి
Deletehahah good one
కామెంటిన మిత్రులకి ధన్యవాదాలు.
ReplyDeleteనాకు భాషా శాస్త్రం తెలీదు. తెలుగులో కూడా మాట్లాడే భాష మాత్రమే వచ్చు. తెలుగు వ్యాకరణంలో బేసిక్స్ కూడా తెలీదు. ఇంగ్లీషు సరీగ్గా రానివాడు ఇంగ్లీషు భాష పట్ల చికాకు పడతాడు. బహుశా నాదీ ఆ కేసేనేమో!
ఈ టాపిక్ లోతు నిజంగా నాకు తెలీదు. schizophrenia కి తెలుగు పదం విని చికాగ్గా టపా రాసేశాను. బ్లాగులు రాస్తుండటం వల్ల లాభం ఉంది.. నష్టమూ ఉంది. మన విజ్ఞానం, అజ్ఞానం.. రెండూ కూడా uncensored గా ప్రదర్శించుకుంటాం.
నా అభిప్రాయం నచ్చిన వారికి నా టపా బాగుంది. నచ్చనివారికి బాలేదు. నాకు టపాలో రాసినదాని కన్నా extra జ్ఞానం లేదు. అంచేత టపాలో నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలే కరెక్ట్ అని defend చేసుకోను (చేసుకోలేను కాబట్టి).
భవిష్యత్తులో నా భాషాజ్ఞానం పెరిగి నా టపాలో నేరాసిన అభిప్రాయాలు తప్పనిపిస్తే ఆ విషయాన్ని unconditional గా ఒప్పుకుంటూ ఇంకో టపా రాయడానికి సిద్ధం.
నా బ్లాగ్ చదివి, ఆసక్తిగా చర్చలో పాల్గొన్న పెద్దలకి, పిన్నలకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
తమిళ సోదరులకు భాషా దురభిమానం ఎక్కువంటారు కన్నడ మరాఠీసోదరులకు భాషాభిమానం తక్కువేమీ కాదు చైనాలో Russia లో వారి మాతృభాషలోనే medicine engineering పుస్తకాలు తర్జుమా చేయించుకొని ఎప్పటినుంచో బోధన చేస్తున్నారు శర్మ గారు చైనా లో పుట్టివుంటే చైనా భాషలో చదివి డాక్టర్ అయ్యేవారు!కొన్నిపదాలు తెలుగులో ప్రచలితం కావడానికి సమయం పడుతుంది కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తాయి.పరిభాషా సులభీకరణ క్రమక్రమంగా జరుగుతుంది!డాక్టర్ భద్రిరాజు లృష్ణమూర్తి లాంటి ప్రపంచస్తాయి భాషావేత్తలు మాతృభాషలోనే విద్యాబోధన జరిగితే శాస్త్ర జ్నానావగాహన ఎక్కువ పెరుగుతుందని తమ పరిశోధనల ద్వారా నిరూపించారు,వీలయినంతవరకు మాతృభాషలోనే శాస్త్ర సాంకేతిక పరిభాషను క్రమంగా సృష్టించుకోవాలన్నారు. మీ టపా నాకు నచ్చలేదని చెప్పటానికి విచారిస్తున్నాను!!మీకు భావప్రకటనాస్వేచ్ఛ ఉన్నట్లే మీ బ్లాగు పాటకులకు కూడా ఉంటుందికదా!అయితే నా ఈ వ్యాఖ్య నచ్చకపోతే తొలగించేస్వ్చ్చ మీకు ఉంది!
ReplyDeleteవ్యాఖ్యకి ధన్యవాదాలు. ఇంత మంచి వ్యాఖ్యని తొలగించేంత అజ్ఞానిని కాదు.
Delete(మాట్లాడేభాషలోనే విద్యాబోధన అనేది different topic అని అనుకుంటున్నాను.)
జనాలు ఏ భాష మాట్లాడితే ఆ భాష లో రాయక తప్పదు. కానీ జనాలు ఆ భాష ని (పదాలని) వాడక తప్పని పరిస్థితి ప్రసార మాధ్యమాల ద్వారా, కిరణ్, బాబు, నాగ్ లాంటి సెలబ్రిటీ ల ద్వారా కలుగుతోంది.
ReplyDeleteభాష కమ్యూనికేట్ చేయటం కోసమే! కానీ భాష శూన్యం లో ఏమీ ఉండదు. రాజకీయాలూ, ఆర్ధిక అంశాలూ దానిని ప్రభావితం చేస్తాయి. ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ లో కథలు రాస్తూ డబ్బు సంపాదించి బతకొచ్చు. తెలుగు లో అలా ఎందుకు చేయలేం!
మా కంపెనీ లొ ఉండే తెలుగు కుర్రాళ్ళ లో చాలా మందికి తెలుగు చదవటం, రాయటం రాదు. ఆ.. తెలుగు కు వచ్చే ప్రమాదమేమీ లేదని, మన కడుపు లో చల్ల కదలక ఉందామా? తరువాతి స్టేజ్ తెలుగు మాట్లాడటం సరిగా రాక పోవటం.
మీరు ఒక చివర లో తెలుగు అతి వాదుల గురించి మాట్లాడారు. ఇంకో చివర లో , "డాడీ, కమింగ్ స్టాప్ లో బస్ నుంచీ గెట్ డౌన్ అయ్యి, యెస్టర్ డే ఐరన్ మాన్ కి ఇచ్చిన క్లాత్స్ తీసుకొంటాను", లాంటి వాడకం ఎక్కువైపోతోంది.
ఈ తరువాతి స్టేజ్.. లంబాడా భాష లా తెలుగు అధ్వాహ్నం గా మాట్లాడటం మాత్రమే వచ్చిన జనాలు ఉండటం.
అన్నట్లు మా ఆఫీసు ఓ లంబాడా ఆయన మానేజర్. ఆయనకి లంబాడా భాష రాదు. తెలుగే మాట్లాడుతాడు. వాళ్ళ అమ్మ మాట్లాడితే (లంబాడా భాష లో) ఆయనకు అర్ధమౌతుందట. ఆయన కొడుకుల కి లంబాడా భాష అర్ధం కూడా కాదు. ఓ నాలుగైదు తరాల తరువాత తెలుగు కి కూడా ఇదే గతి పట్టవచ్చు. అయినా "మన సంపాదన మనకే ఉంటుంది. తెలుగు కి బదులుగా ఇంగ్లీష్ మాట్లాడుతాం పెద్ద తేడా ఏముంది?", అనుకొంటే OK.
గిడుగూ వగైరాలు భాషమీది ప్రేమ తోనే వాడుక భాషా ఉద్యమాలు చేశారు. కానీ వాడుక భాలోకి ఆర్ధిక రాజకీయ (పవర్) కారణాల వలన వస్తున్న పదాలను తగ్గించటం మంచిది.
కష్టమైన సంస్కృత పదాల గురించి వర్రీ అవద్దు..మన జనాలు వాటిని కూడ ఇంగ్లీషులానే తమవి గా చేసుకొంటారి. బ్రహ్మాండం, బెమ్మాండం అవలా? అగ్రహారం అగ్గురోరం అవ్వలా? మొన్నో పల్లెటూళ్ళో ఓ రైతు కూలీ, "సర్వైవ్ కావటం కష్టం", అనటం విని ఆశ్చర్య పోయాను. బతకటం కష్టం అనే అతి సులువైన వ్యక్తీకరణ ఉండగా సర్వైవ్ అన్న పద్మ్ తెలుగు లోకి ఎలా ప్రవేశించింది? టీవీ లో ఏ చంద్ర బాబో, కిరణ్ కుమారో వాడటం వలనా, లేక సినిమా లో ఏ దిక్కుమలిన డయలాగ్ రైటరో రాయటం వలన.
ఇంగ్లీషులో అనేక పరభాషా పదాలు ప్రవేశిస్తున్నాయి. కానీ ఇంగ్లీషు గురించి బ్రిటీషు వాళ్ళు ఆందోళన చెందటం లా.. కానీ తెలుగు లో ఇంగ్లీషు పదాల గురించి తెలుగు వాళ్ళు ఎందుకు చింతిస్తునారు?
ReplyDeleteఇంగ్లీషు అనేక దేశాల లో, జనాభాలలో విస్తరిస్తున్న భాష. అధికారం, ఆర్ధికం అందుకు తోడవుతోంది. కానీ తెలుగు అలా కాదే! తెలుగు విస్తరించటం అటుంచి, ఒకప్పుడు వాడకం లో ఉండే తమిళ కన్నడ దేశాల నుంచీ గెంటి వేయబడుతోంది.
ఇంగ్లీషు లోకి గురు, జంగల్ లాంటి పదాలు ముఖ్యం గా వలస పాలన కాలం లో ప్రవేశించాయి. ఈ మధ్య కాలం లో ఇంగ్లీషు లోకి వెళ్ళిన దేశీ పదం ఏది? ఎన్ని సంవత్సరాలకో సారి ఎన్ని పదాలు వెళ్తున్నాయి?
తెలుగు పరిస్థితి అది కాదు. తెలుగు లో పెరుగుతున్న ఇంగ్లీష్ పదాలు యేళ్ళ తో పాటు పెరుతున్నాయి. ఓ నాలుగేళ్ళ కీ ఇప్పటికీ మనం మాట్లాడే తెలుగు లో పెరిగిన ఇంగ్లీష్ పదాలు చూసుకోవచ్చు. రావిశాస్త్రి భాష లో చెప్పాలంటే, ఇంగ్లీషు తో మన ది , "పులీ లేడీ సంబంధవా? లేక రెండు లేళ్ళ మధ్య ఉండే సంబంధమా?", తేల్చుకోవాలి.
రమణ గారే వేరే సందర్భం లో చెప్పినట్లు, చాలా మంది తాము మాట్లాడే తెలుగు లాంటి తెలుగైతేనే(ఇంగ్లీష్ పదాల మోతాదు ఆ స్థాయి లో ఉంటే మాత్రమే) అది యాక్సెప్టబుల్ తెలుగు అనుకొంటున్నారు. అంతకంటే స్వచ్చమైందైతే అది ఛాదస్తపు తెలుగు. తక్కువైనదైతే పలచబడిన తెలుగు. మరి కొన్నాళ్ళ కి పలచబడిన తెలుగే యాక్సెప్టబుల్ అవుతుంది. అ తరువాత మొత్తం ఇంగ్లీషే తలమానికం. అప్పుడు తెలుగు ఓ మరుగుపడిన ఆటవిక భాష అనుకొంటారు.
Read it: http://politics.teluguwebmedia.in/2013/05/blog-post.html
ReplyDeleteహన్నా,
ReplyDeleteఈ డాటేరు బాబు కి జనాల పల్స్ మరీ రూడి గా తెలుసు !
ఖచ్చితం గా ఎక్కడ కొడితే ఎక్కడ 'బెణుకు'లు వదులునో కామెంటు కనకం రస రమ్య నాట్య మాడునో మరీ తెలుసును !!
తెలుగూ జిందా తో బాద్ మే దేఖేంగే !!
చీర్స్
జిలేబి
గుడ్ వన్ జిలేబి గారు!
ReplyDeleteచియర్స్
బి ఎస్ ఆర్
ఇందాక నేను మా వీధిలోనే ఒక ENT డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆయన క్లినిక్‌లోని తన కేబిన్‌లోనే లాప్‌టాప్ పెట్టుకుని ఫేస్‌బుక్ చేసుకుంటున్నాడు. మీరు కూడా అలా చేస్తుంటారా రమణ గారు?
ReplyDeleteఅవును. నా చాంబర్లో లాప్ టాప్, డెస్క్ టాప్ రెండూ ఉంటాయి. ఒక్కోసారి పేషంట్లని చూట్టం అపి మరీ కామెంట్లు రాస్తుంటాను. ఇదో రోగం!
Deleteసారు,
ReplyDeleteమీరు కేరళ లో పుడితే మలయాళం లో మాట్లాడ్తారు. వాకే . కానీ ఇక్కడ విషయం ఇంగ్లీషుకీ తెలుగు కీ. మనం ఆంధ్ర దేశం లో పుట్టి ఇంగ్లీషు లో అనర్గళం గా మాట్లాడేస్తాం. మీరు ఏ ఇంగ్లాండు లోనో ఓ తెల్లోడిగా పుడితే, తెలుగు మీడియం చదువులు చదువుతారా? మీరు అప్పుడు తెలుగు ఛానల్స్ చూస్తారా? తెలుగు మాట్లాడటం ఓ స్టేటస్ సింబల్ అవుతుందా?
పైన ఆయనెవరో కోట్లమంది మాట్లాడే భాష ఎలా ఛస్తుందన్నారు. సరిగ్గా అదే ప్రాబ్లం. కొన్ని కోట్లమంది..అదే ప్రాబ్లం. కొన్ని కోట్లమంది ఇంగ్లీషంటే మోజు పెంచుకొంటే, ఇంకా వాల్లు మాట్లాడే భాష ఎలా బతికి బట్టకడుతుంది?
తెలుగు లోంచీ ఇంగ్లీషులోకి పోయే పదాలు ఓ చిన్న పిల్ల కాలువ లాంటివి. దాని దెబ్బకి కొండలు కొట్టుకు పోవు. ఇంగ్లీషు లోంచీ తెలుగు లోకి వచ్చే పదాలు ఓ సునామీ లా వస్తున్నాయి. దాని దెబ్బకి తెలుగు కొండలూ గుట్టలూ కొట్టుకుపోతాయి. జనాలంతా ఇంగ్లీషులో ఆలోచించి తెలుగు లో బరకటం దానికి ఓ threshold లాంటిది. ఈ త్రెషోల్డ్ దాటక పోతే ఏదో పక్క భాషని మన భాష లో ఇముడ్చుకొని పరిపుష్టమౌతున్నాం అనుకోవచ్చు. కానీ ఈ పరయి భాష లో ఆలోచించటం అనే లిమిట్ దాటిన ప్రతి భాష దారీ కొన్నాళ్ళకి గోదారే.
స్టేజీ పై శుధ్ధ తెలుగు మాట్లాడిన వాళ్ళు కనీసం స్టేజీ మీదయినా తెలుగు మాట్లాడుతున్నారని సంతోషించండి. స్టేజీ కింద కూడా మాట్లాడాలని ఆశించండి . తెలుగు భాష అనేది ఇంకా దాని పై రాజకీయాలు చేయగల ఒక అంశం గా ఉందంటే సంతోషం గా ఉంది. కానీ వాస్తవం వేరు. తెలుగు దేశం లో కులం పై రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రాంతం పై జరుగుతున్నాయి. భాష పై కాగడా వేసినా రాజకీయాలు కనపడటం లేదు.
నేను తెలుగోడి గా పుట్టినా తమిళ భాష చలా గొప్పదని ఒప్పుకొంటాను (దాని లోని సాహిత్యం, ప్రాచీనత వగైరాల వలన). మనం ఏ భాష లో పుట్టామనే విషయం తో సంబంధం లేకుండా, ఆబ్జెక్టివ్ గా కొన్ని భాషలు గొప్పవి అవుతాయి.
అన్నట్టు సారు, గృహప్రవేశం లాంటి పదాల కు house warming ceremony అనే phrase కనిపట్టి వడుతున్న వారినేమనాలి? అలానే వడుగు అనే ముచ్చ్టైన మాటకి thread ceremony అట.
ReplyDeleteస్వచమైన తెలుగు వాడుక పదాలకు ఇలా ఆంగ్ల పదాలు కనిపెట్టి పలికేవాళ్ళని చూచినా , ఆంగ్ల సాంకేతిక పదాలకు తెలుగు తర్జుమాలో అర్ధంకాని గ్రాంధిక పదాలు వాడినా.. రెండూ మింగుడు పడవు. క్రియా పదాలు తప్ప , మిగతా అంతా ఇంగ్లీష్ లో (అదే తెంగ్లిష్ ) లో మాట్లాడేవాళ్ళని చూస్తే చిరాకు వస్తుంది. ఉదా : పైన బొందలపాటి గారు చెప్పిన వాక్యం. నాకైతే తెలుగు బ్లాగ్ లో మధ్యలో ఇంగ్లీష్ కామెంట్ కనిపిస్తే అస్సలు చదవ బుద్ది కాదు. కానీ ఇంగ్లీష్ సైట్స్ చాల చూస్తూ కామెంట్స్ చదువుతాను . ఒక భాష లో మాట్లాడుతూ, చదువుతూ వుంది, మధ్యలో వేరే భాష ప్రవేశిస్తే, అకస్మాత్తుగా బండి గేర్స్ మార్చినట్లు ఇబ్బందిగా వుంటుంది.
Delete"కానీ ఇంగ్లీష్ సైట్స్ చాల చూస్తూ కామెంట్స్ చదువుతాను . ఒక భాష లో మాట్లాడుతూ, చదువుతూ వుంది, మధ్యలో వేరే భాష ప్రవేశిస్తే, అకస్మాత్తుగా బండి గేర్స్ మార్చినట్లు ఇబ్బందిగా వుంటుంది."
Deleteఈ పైన మీరు రాసిన పదాల సముదాయం నాకర్ధం కావటం లేదు. ఓహో, "చాలా" చూస్తూ; చదువుతూ "ఉండి" అంటున్నారా?! మరి ఈ కల్తీ పదాలెందుకు? సైట్స్, కామెంట్స్, గేర్స్, వగైరా!
భాషాభిమానం పేరిట ఎందుకీ కష్టాలండీ బాబు?!
బి ఎస్ ఆర్
సందర్భం వచింది కాబట్టి రాయాలనిపించింది.
ReplyDeleteప్రపంచంలొ యూదు జాతి, జపనీయులని, చూస్తె , ఒకప్పుడు వాళ్ళ దేశాలు సర్వ నాశనం అయ్యాయి. కాని , ఈరొజు చాలా రంగాలలొ వాళ్ళూ అభివ్రుధి సాధించారు. ఒకరకంగా ఒక జాతి దాని భాష , సంస్క్రుతి , మతం మీద గౌరవం వున్నప్పుడే ఆ జాతి ఉన్నతంగా వుంటుందని అనిపిస్తుంది. లెకపొతె 2000 సంవత్సరాలుగ వున్న తెలుగు బాష ఇంకొ 100 ఎళ్ళలో మరుగుపడిపోవచు.
అంతర్లీనంగా తెలుగు మరుగు పడిపోటానికి మన జాతికి మన మీదే పెద్దగా గౌరవం లెకపొవటం వల్లనే అని నా అభిప్రాయం.
అలాగె నేను ఖచితంగా చెప్పగలను తమిళం, బెంగాలీ ఇంకొ 1000 ఏళ్ళ తరవాత కూడ వుంటై అని చెప్పగలను.
నర నరాల బానిసత్వం నింపుకొన్న మనలో చాల మందికి అది తెలుగు తెగులు లాగా అనిపిస్తుంది. ఎందుకంటె బానిసలకి స్వంతగా అలొచిచె తెలివి తేటలు వుండవు.
కృష్ణ
The success of the Japanese and jews may have little to do with their language. I would argue their cultures (political, economic and social), work ethic, education systems and their gene pool may have more to do with it. While Japanese are a monolithic society, Jews are a varied bunch with multiple languages - majority today are English speakers. Jews have garnered most Nobel prizes per capita compared to any other ethnic group in the world. No jew insists on speaking Hebrew or Yiddish! Many successful groups speak multiple languages which is to their advantage in communication and commerce.
DeleteYou also introduce religion into the picture. The group with utmost respect and strict adherence to their religion is the most violent and most backward in the world today. I am a free market believer and would say like anything else language also has to win in the market place on its own merits. BTW, which Telugu we are so fondly after? The Telangana one, the Rayalaseema one or the coastal Andhra variety?
Languages don't enslave people. Lack of character and pride in one's self, complete and utter disregard to fellow human's rights, discrimination on the basis of caste/fairness of the skin, creed and religion, child labor and perennially electing corrupt people to high offices do,
అయ్యా
Deleteమీరు కూడా ఒక డాక్టరుగారని మీ ప్రొఫైల్ చూసి గ్రహించాను. సంతోషం.
ఇది తెలుగు బ్లాగు. మీరు దానిని, దానిలో ఉన్న వ్యాఖ్యలనూ తెలుగులో ఉన్నా చక్కగా చదువగలిగారు.
మరి మీ వ్యాఖ్యను తెలుగులో యెందుకు వ్రాయలేదు?
తెలుగుభాషలో వ్రాయటం మీ స్థాయికి తగదను కున్నారా?
భావవ్యక్తీకరణకు తెలుగు అంత అనువైన భాష కాదనుకున్నారా?
మీకు తెలుగులో వ్రాయటం కొరకు తగిన పరిజ్ఞానం అందుబాటులో లేదా?
ఏదైనా మీ కారణం వ్యాఖ్యలు తెలుగులో వ్రాయకపోవటం బాధాకరం. కించిదభ్యంతరకరం కూడా.
స్వస్తి.
అయ్యా,
Deleteఈ బ్లాగ్ లో తెలుగులోనే రాయాలని తెలియదు నాకు! పైన నా తెలుగు స్పందన కూడా ఉంది చూడండి. మాత్రు భాష లో మాట్లాడటానికి నాకు నామోషీ లేదూ, స్థాయి తక్కువని అనుకోవడమూ లేదు. ఇంగ్లీష్ లో రాయడం కీ బోర్డ్ మీద తేలిక. పైగా భావవ్యక్తీకరణం కొస్తే, నాకు ఇంగ్లీషే సులువు. మీరీ విషయంలో బాధలూ, అభ్యంతరాలూ - కించెత్తో, తాడిచెట్టంతో - పడక్ఖర్లా. దయచేసి నా వ్యాఖ్యలు పట్టించుకోకండి.
నమస్తే!
GLDoc గారు,
Deleteమీరు అభివృధికి బాషకి లంకె పెట్టారు. నా ఉద్దేశం అది కాదు. పైగా మీరు గౌరవానికి , మూర్ఖత్వాన్ని ఒకే గాట కట్టేశారు.
ఇతె వైద్యులుగారు చెప్పినట్లు , కొన్నింటికి వెరే భాష పదాలే వాడితె మంచిదేమొ. కాని, ప్రస్తుతం, మన భాష (అదేగాదు, మిగతావి కూడ ) పట్టించుకోని వాళ్ళే ఎక్కువ.
కృష్ణ
తెలుగు వ్యాకరణానికీ, ఇంగ్లిష్ వ్యాకరణానికీ మధ్య నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఇంగ్లిష్‌లో common noun (జాతి వాచకం) ముందు the లేదా a పెట్టాలి. The nature park అంటే ప్రకృతి వనం అని అర్థం. ఒకవేళ ఇందులోంచి the తీసేస్తే దీని అర్థం మారిపోతుంది. అప్పుడు అది Nature అనే పేరు ఉన్న పార్క్ అని అర్థం వస్తుంది. అలా జరిగితే అది proper noun (సంజ్ఞా వాచకం)గా మారిపోతుంది. తెలుగులో the, a లాంటి నిర్వాచకాలు ఉండవు. ఉప్పుటేరు అంటే నిజంగా ఉప్పు నీళ్ళు ఉన్న ఏరా లేదా ఉప్పు అనే పేరు ఉన్న ఏరా అనే సందేహం వస్తుంది. ఒక ఇంగ్లిష్‌వాడు తెలుగు నేర్చుకుంటే ఈ విషయంలో తప్పకుండా అయోమయపడతాడు. ఒక ఇంగ్లిష్‌వాడు ఇండియాకి వచ్చినప్పుడు ఇలాంటిదే జరిగింది. తన భాషలో the, aలు లేకుండా మాట్లాడితే అది వ్యాకరణ దోషం అవుతుందనీ, భారతీయులు ఈ వ్యాకరణం ఎక్కడ నేర్చుకున్నారో తనకి అర్థం కాలేదనీ ఆయన అన్నాడు. You can't even learn English by mixing English words in Telugu. I am sure about it.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteTelugu isn't going to be extinct because most of the Teluguites aren't trained in English grammar. I have seen only two proficient English speakers in our Telugu blogosphere. They are Bharadwaja and Geetacharya.
ReplyDelete"No jew insists on speaking Hebrew or Yiddish!" - తప్పు!
ReplyDeleteఎందుకు తప్పంటే..
హీబ్రూయే మాట్టాడాలి, దాన్లోకి ఇంగ్లీషు పదాలు చొప్పించకూడదు, కొత్త ఇంగ్లీషు పదాలకు అనువాదాలుగా హీబ్రూ పదాలను కాయించాలి అని ఇజ్రాయిలీలు భావిస్తారు. ఐటీ కి సంబంధించిన పదాలకు వాళ్ళు తమ భాషలో పదాలు కనిపెట్టారు, పాతవాటికి మెరుగులు దిద్దారు.
హీబ్రూ పదకోశంలోకి పెద్దయెత్తున ఇంగ్లీషు ప్రవేశించకుండా ఉండేందుకు వాళ్ళు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఇంగ్లీషు భాషకు ప్రత్యామ్నాయంగా, పాత హీబ్రూ పదాలను తీసుకుని వాటిని ఆధునికీకరించి కొత్త పదాలను వాళ్ళు కనిపెడుతున్నారు. అంతేగానీ ఇంగ్లీషు పదాలను నేరుగా తీసుకోవడం లేదు. హీబ్రూ విశ్వవిద్యాలయం ఏటా 2000 దాకా కొత్త పదాలను కనిపెడుతుంది. అధికారిక పత్రాల్లో ఇంగ్లీషు పదాలు వాడకూడదు. వ్యాపార సంస్థలు కేవలం ఇంగ్లీషు మాత్రమే వాడతామంటే కుదరదక్కడ. ఇజ్రాయిల్ పార్లమెంటులో సభ్యులు హీబ్రూ భాషలోనే మాట్టాడాలి. హీబ్రూ భాష పరిరక్షణ కోసం చట్టముందక్కడ. ఇజ్రాయిలీ అధికారులు విదేశాల్లో చేసే ప్రసంగాలు తప్పనిసరిగా హీబ్రూలోనే ఉండాలి..
పైవన్నీ వాళ్ళు ఎందుకు చేసారంటే -తమ భాషను రక్షించుకునేందుకు. హీబ్రూ తన ప్రతిష్టను కోల్పోతూండడం, పిల్లలు తమ మాటల్లో ఇంగ్లీషు పదాలను విరివిగా వాడటం వాళ్ళకు నచ్చలేదు. అందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. సంస్కృతి, భాష విడదీయరానివని బహుశా వాళ్ళకు తెలుసేమో!
DeleteI stick to my statement. Let me explain.
There are more jews living outside of Israel than within - with just half as many living in the USA alone. Israelis speak different native tongues - Hebrew 49%, Arabic 18%, Russian 15% and the rest other languages, but, most importantly, 89.7% of them speak English. When you consider jewish population of the world, an overwhelming majority indeed speak English and over half of them as their mother tongue.
Hebrew is the official language of Knesset (or Israeli parliament) and they do encourage Hebrew in schools - although almost all schools require English language learning as well. Insisting on language by the governments is akin to the self aggrandizing Arabic first announcement on an Emirates flight, Dutch on KLM or Hindi on Jet Airways even though majority of the passengers don't follow the language.
There is no requirement for Israelis to speak Hebrew when the officials are abroad. Indeed almost all of them make their case in eloquent English on American TV and elsewhere. If you have contrary information, I would like to see the link.
No jew would insist on speaking in Hebrew only - a less than majority language in Israel itself. They would speak whatever language that gets the job done which is practical. I have countless jewish friends and associates from everywhere including Israel and I interact with them daily.
As far as language development and creating whole departments for inventing new translations for English words - nothing wrong with that - as long as people are free to speak whatever language. These kind of native language-first groups of course can and will get political funding on emotive basis almost everywhere.
https://en.wikipedia.org/wiki/Languages_of_Israel
http://en.wikipedia.org/wiki/Jewish_population_by_country
http://en.wikipedia.org/wiki/List_of_countries_by_English-speaking_population
http://www.hum.huji.ac.il/english/units.php?cat=3359&incat=3301
http://www.youtube.com/watch?v=FhaUVmYBXD0
http://www.youtube.com/watch?v=IAugy7cTNNg
BSR
As far as language development and creating whole departments for inventing new translations for English words - nothing wrong with that - as long as people are free to speak whatever language. - బాగా చెప్పారు GIdoc గారూ. చాలా చక్కగా చెప్పారు. మొదటి నుంచీ మీ వాదనలో ఈ భావన ఉంది. అయితే ఈ టపా మళ్ళీ ఒకసారి చదివి ఈ వ్యాఖ్యకు, టపాకూ ఉన్న మౌలికమైన తేడా చూడండి-
ReplyDeleteకొత్త పదాలెందుకు, ఉన్నవాటినే ఆపాటున వాడేసుకోవచ్చుగా, అర్థం పర్థం లేని అనువాదాలెందుకు అని డాక్టరు గారు (సారీ సార్, ఈ మాటలో భాషా సంకరముందంట. తప్పదు, నాకు ఇంతకంటే మంచి తెలుగు రాదు) అంటున్నారు. కొత్త పదాలు కనిపెడితే మంచిదే అని అంటున్నారు, మీరు.
"Many successful groups speak multiple languages which is to their advantage in communication and commerce." - మళ్ళీ సరిగ్గా చెప్పార్సార్. మనమూ అలాగే నేర్చుకోవాలి. ఇతర భాషలు నేర్చుకోవాలనే విషయంపై ఇక్కడ భిన్నాభిప్రాయాలున్నాయని నాకు అనిపించడం లేదు. అయితే ఇక్కడి చర్చ ఏంటంటే.. మన భాషను కాపాడుకోవాలి కదా, మనమూ కొత్త పదాలను సృష్టించుకోవాలి కదా, అపుడే గదా మన భాష కూడా పరిపుష్టమయ్యేది అని కొందరు అంటున్నారు. (మన సంభాషణలో వీలు కోసం వీళ్ళను ’శంకరులు’ అని పిలుచుకుందాం) కొత్త పదాలు అక్కర్లేదు, ఇంగ్లీషు పదాలను ఉన్నవి ఉన్నట్టుగా వాడాలి అని మరి కొందరంటున్నారు (వీళ్ళను ’సంకరులు’ అని అందాం). వేరే భాష మాట్టాడ్డం వేరు, మన భాషలో మన పదాలతోటే మాట్టాడ్డం వేరు.
కింది వాక్యాలను చూడండి:
1. నేను రేపు మాణింగ్ విజయవాడ వెళ్తున్నాను!
2. అయామ్ గోయింగ్ టు విజయవాడ రేప్పొద్దున్నే!
రెండో వాక్యం అదో రకంగా ఉండటంలో విశేషమేమీ లేదు, మొదటిది ఇంపుగా ఉండటంకూడా పెద్ద సమస్యేమీ కాదు. కానీ ’అందులో తప్పేముందంటా’ అని వాదించబూనడమే తెలుగుకున్న అసలు సమస్య!
టూకీగా శంకరులు ఏమంటారంటే -సాధ్యమైనంతలో తెలుగులోనే కొత్త పదాలను సృష్టించుకుందాం, లేదా పాత పదాలకు మెరుగు పెడదాం. సంకరులు ’కొత్త పదాలను కనుక్కోడమెందుకు, ఇంగ్లీషు పదాలను ఆపాటి వాడేసుకోవచ్చుగా’ అని అంటారు.
కోవచ్చు. అయితే, మనలో చాలామందికి దిక్కుమాలిన జబ్బొకటుంది. మనది కానిదేదైనా మనకు ముద్దే. మనదైతే బహు సులకన. ఇంగ్లీషులో మాట్టాడితే గొప్పనుకుంటాం. ఇంగ్లీషొచ్చినంత బాగా తెలుగొచ్చేడవదండీ అని చెప్పుకోడం మనకు మోజు, గొప్ప. తెలుగు మాటలు మాట్టాడ్డం మోటు మనకు. ఈ భావన అంతర్లీనంగా ఉండబట్టే ఇవ్వాళ మన ఊళ్ళలో కూడా, రైతుల దగ్గర్నుండి గొడ్దను కాసే బుడ్డాడి దాకా, ఇంగ్లీషు ముక్కలు (ఇంగ్లీషు’లో’ కాదులెండి) మాట్టాడ్డం చూస్తూంటాం. సారవా దాళవా అనే వాడే లేడు, ఖరీఫ్ రబీ అని హిందీ మాటలొచ్చాయి. ఎరువులు, పురుగుమందులూ కావు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. నాటు వెయ్యడాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటం కూడా విన్నాన్నేను. పల్లెటూళ్ళలో పప్పన్నాల కెళ్ళారా ఈ మధ్య మీరు? -రైసు, ఆయిలు, ఘీ, కర్రీ, కరుడు, బట్టర్ మిల్కు.. ఇదీ వరస! ఇప్పుటిది కాదిది, ఎప్పుడో పుట్టిన జబ్బే! ఇంత మాయదారి జబ్బున్న మనకు అసలు తెలుగు మాటలే లేకపోతే పట్టపగ్గాలుంటాయా? మార్నింగు వేకప్పైంది స్టార్టు, నైటు స్లీపుకు పోయేదాకా, వితౌటీవెన్ వన్ తెలుగు వర్డు, టాకేందుకు ట్రై చైమూ? చేస్తాం. శంకరుల భయమదే అయ్యుంటుంది. అదే జరిగితే తెలుగు మిగలదని వాళ్ళ ఆందోళన. అందుకే ’తెలుగు పదాలను కనిపెడదాం, తెలుగు మిగలక పోవడానికి పద సంపద లేకపోవడం కారణం కాకుడద’నేది వాళ్ల తపన.
ఆ.., అసలు తెలుగు మిగలాల్సిన అవసరమేందంటా? మిగలకపోతే ఏందంటా? ఏదుంటే అదే మాట్టాడతాం, ఏదీ లేకపోతే సైగల్జేసుకుంటాం, బాషేమైనా బగమంతుడా అని సంకరులంటున్నారు. కొందరు శంకరులకు అది కొత్తగా, వింతగా అనిపించి భయపడిపోయారు.
నాకిలా అనిపించిందండీ!
ఉంటాను!
చదువరిగారు,
Deleteచాలా బాగా చెప్పరండి.
@GIDoc,
ReplyDeleteBTW, which Telugu we are so fondly after? The Telangana one, the Rayalaseema one or the coastal Andhra variety?
అన్ని తెలుగు లూ. ఒక్కో తెలుగు లో ఒక్కో విధమైన మాధుర్యం ఉంటుంది. రాయల సీమ నాది, తెలంగాణ నాది, సర్కారు నాది నెల్లూరు నాది. ఇంకా బెంగళూరు తెలుగూ, మదరాసు తెలుగూ, అమ్రికా టెల్గూ, బ్రిటన్ తెల్గూ అన్నీ మావే!
మీకు ఏ ఇంగ్లీష్ వల్ల లాభముంది? బ్రిటన్ ఇంగ్లీషా, వాడితో యుధ్ధం చేసిన అమ్రికా వాడి ఇంగ్లీషా, వీడి గురించి ఎప్పుడూ ఆడి పోసుకొనే కెనడా ఆంగ్లమా? లేకా ఆస్ట్రేలియా వెరైటీనా, సౌత్ ఆఫ్రికానా? కెన్యన్ ఇంగ్లీషా? లేక ఇండియన్ ఇంగ్లీషా? సింగపూర్ చింకీ ఇంగ్లీహ్సా? ఇంకా సవా లక్ష ఇతర యాసలా?
ఈ ప్రశ్న ఎందుకు వేశాను అంటే వేరే భాషల్ని సహించలేని వారు, సొంత భాషలో యాసల్ని కూడా భరించలేరని నా ఉద్దేశ్యం (పైకి ఎలా చెప్పినా). మరి ప్రాంతీయ సోదరుల భాషని ప్రేమతో అంగీకరించే వారు, దేశ భాష ఐన హిందీ ని కూడా గౌరవంతో నేర్చుకుంటారా, వాడతారా? తమిళ్నాడు ఉదాహరణ మరి వెరేగా చెపుతోంది.
Deleteఇక నాకు నచ్చే ఇంగ్లీష్ అంటారా: అర్థం అయ్యేట్లుగా మాట్లాడే ఏ ఇంగ్లీష్ ఐనా ఫర్వాలేదు. ప్రపంచంలో ఆంగ్లం మాట్లాడే దేశాల్లో ప్రస్తుతం ఇండియా ద్వితీయ స్థానంలో ఉంది - త్వరలో ప్రధమ స్థానం తీసుకో గలదు. కాబట్టి, భారతీయమైన ఆంగ్లం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కూడా.
బి ఎస్ ఆర్
Do you really think that Indians (except Anglo-Indians) speak correct English? Check this link: How do the native English speakers laugh at Indian English
DeleteAlso check one of my additions in the page:
Delete>>>>>>>>>>
Capital letters should be used only for these following purposes:
1.To begin a sentence (Only the first letter of the first word should be capital).
2.To use it as the first letter of a proper noun. (The word "language" is a common noun and the word "Telugu" is a proper noun. The first letter of the word "language" needed not be capital since it is a common noun. The first letter of the word "Telugu" must be capital since it is a proper noun. )
It is unnecessary and also grammatically wrong to use all capital letters in a word or a sentence. — Preceding unsigned comment added by106.78.129.2 (talk) 10:15, 30 May 2013 (UTC)
>>>>>>>>>>
I saw your entry in Wikipedia. As a user and supporter of Wiki I applaud you for taking time to add material there.
DeleteKudos!
OT, how did you get the HTML link in to the comment?
Thanks!
BSR
I am not a regular user in Wikepedia. My name isn't registered but my IP addresses (Idea and Tata Docomo) are visible.
DeleteComing to the point of HTML, Blogspot allows some HTML codes. You can use the anchor code but you should not use specifications like target="_blank".
భాష వెనక చాలా మనుగడ కి సంబంధించిన విషయాలుంటాయి.
ReplyDeleteఉదా: మనకి ఇంగ్లీష్ రాక పోతే హాలీవుడ్ సినిమాల కి ఇండియన్ మార్కెట్ కి యాక్సెస్ ఉండేది కాదు. అప్పుడు ఆ మార్కెట్ మన దేశీ సినిమాల దే. (అమెరికా తెల్లోడి సినిమా మార్కెట్ లో తెలుగు సినిమా ల కి వాటా లేనట్లే ఇది కూడా.)
తమిళ నాడు లో హిందీ సినిమా లు పెద్ద గా ఆడవు. ఆ మార్కెట్ అంతా తమిళ సినిమా ల దే. కానీ ఆంధ్ర దేశం లో ఆ మార్కెట్ ని మనం హిందీ సినిమా ల తో కలిసి పంచుకోవాలి.
అమెరికా వాడి కల్చర్ ని మన మీద వదలక పోతే మన వాళ్ళ ఫుడ్ మార్కెట్ లో వాడికి షేర్ లేదు (పిజ్జా బర్గర్ ల రూపం లో).
I don't think that American English has own grammar rules that contradict Standard British English. మన తెలుగు విషయానికి వస్తే "వెనకమాల, గుంజిండు, చేసుద్ధి" లాంటి ప్రాంతీయ పదాలు వాడడం వ్యాకరణ విరుద్ధం. ఇంగ్లిష్‌లో అలా కాదు. ఆ భాష మాట్లాడే దేశాలలో చదువురానివాళ్ళు ఉపయోగించే slangని ఉపయోగించడం వ్యాకరణ విరుద్ధం. కానీ train station లాంటి ప్రాంతీయ పదాలని ఉపయోగించడం వ్యాకరణ విరుద్ధం కాదు.
ReplyDeleteరమణ గారి ప్రశ్న ప్రాంతీయత గురించి కాదనుకుంటాను. నరులెవరూ ముట్టని ఆహారాన్నే భుజిస్తామనే అదో టైప్ జీవులలాగ జనులెవరికీ అర్థం కాని గుత్తేదారు లాంటి పదాలని ఉపయోగిస్తున్న ఈనాడు జాతి శూకరాల గురించే ఈ పోస్ట్‌ని వ్రాశారనుకుంటాను.
ReplyDeleteBoth shankaras and sankaras(asa some one defined above) can stick to their respective arguments. its fine untill one group forces the other group to follow their line or seeks government intervention. both are free to follow & propagate their line of thought without forcing others.
ReplyDeleteGIDoc మహాశయా,
ReplyDelete"Language essentially is a communication tool, but, thoughts and ideas are more important than language per se."
భాష లేని thought కి స్పష్టత ఉండదు. అటువంటి ఆలోచన వలన పెద్ద గా ఉపయోగం ఉండదు. భాష లేని thought మబ్బులాంటిది. భాష తో దానికి స్పష్టత ఏర్పడి అది ద్రవీభవించిన చినుకౌతుంది. ఈ చినుకు ని ఇంకా maathematics లాంటి ఉపకరణాలు quantify చేయటానికి ఉపకరిస్తాయి.భాష కి అందని complex patterns ని మాత్స్ ఒక చట్రం లోనికి తీసుకొని వస్తుంది. అందుకే maths ని సైన్స్ యొక్క భాష అంటారు.
మొత్తానికి భాష లేకుండా abstarct/modern science and art field లో సాధ్యమయ్యేది చాలా తక్కువ.
"ఏ భాషైతే ఏముంది?", అనటానికి కూడా లేదు. ఆలోచనలకి మాతృభాష ఎక్కువ స్పష్టత ఇస్తుందని ఐన్స్టీన్ దగ్గరి నుంచీ అందరూ అంగీకరించిన విషయం.
I have not said there is no need for language. I merely stated thoughts and ideas are more important.
DeleteThe issue of language and thought is complex and controversial. While earlier theorists like Benjamin Lee Whorf (1897-1941; of “Sapir-Whorf Hypothesis” also known as Linguistic relativity) held that the structure of a language affects the ways in which its respective speakers conceptualize their world. Language determines thought and that linguistic categories limit and determine cognitive categories.
Multiple studies (1960-1980) have discredited the Whorfian theory demonstrating that linguistic diversity is a surface veneer that masks the underlying universal cognitive principles. Many criticized Whorf for his anecdotal and speculative arguments.
http://en.wikipedia.org/wiki/Benjamin_Lee_Whorf
https://en.wikipedia.org/wiki/Linguistic_relativity
http://www.newrepublic.com/article/112273/does-language-shape-thought-pernicious-persistence-theory#
http://www.scientificamerican.com/article.cfm?id=does-language-shape-what
http://theweek.com/article/index/244685/is-it-possible-to-think-without-language
The study of a remote Australian aboriginal language called, Guugu Yimithirr from North Queensland showed that not all languages conform to our thinking. Guugu Yimithirr does not use egocentric coordinates at all. They do not use words like left or right, in front of or behind to describe position of the objects. They use cardinal directions - east, west, north and south. So, even if a language does not have a word for behind this does not necessarily mean that its speakers would not be able to understand the concept. Matses in Peru, for example obliges its speakers to specify exactly how they came to know about the facts they are reporting. All this and more is covered in this fascinating New York Times article: http://www.nytimes.com/2010/08/29/magazine/29language-t.html?pagewanted=all&_r=0
Which comes first, language or thought? It's like the chicken and egg question. Do we learn to think before we speak, or does language shape our thoughts? New experiments with five-month-olds favor the conclusion that thought comes first. http://www.news.harvard.edu/gazette/2004/07.22/21-think.html
So, it seems more or less settled that language per se is less important for thought and cognitive processing. While language is needed for the expression of thoughts, there is nothing to prove that it needs to be in mother tongue.
When one introduces a second language in a child’s curriculum is of some import - especially as it relates to science. I very much like the balanced approach proposed by J.V. Narlikar. http://www.iucaa.ernet.in:8080/xmlui/bitstream/handle/11007/2049/445E%20Science.pdf?sequence=1
With all due respect to Albert Einstein whom I admire as a great physicist and a genius, is no linguist. He recorded a speech for the British Association for the Advancement of Science in 1941 called “The Common Language of Science” in which he talks about the importance of language to thought - especially the language of science, with its mathematical signs, as having a truly global role in influencing the way people think. He never talked about mother tongue being superior in imparting clarity as you state. I have the link to his voice recording: http://www.openculture.com/2013/03/listen_as_albert_einstein_reads_the_common_language_of_science_1941.html.
Talking about mother tongue, Einstein’s was German. I am not sure how much he was fond of it after Hitler’s genocide of jews. In any event, he learned some Yiddish much later. He went to French high schools in Switzerland and of course lived rest of his life in the USA and spoke English.
Yes, math can be considered a language, just like music.
BSR
I am not a link man: However Einstein mother tongue science etc few links:
Deletehttp://www.iucaa.ernet.in:8080/jspui/bitstream/11007/1830/1/116E%20Science%20is%20learned%20best%20in%20the%20mother%20tongue.pdf
http://www.iucaa.ernet.in:8080/xmlui/bitstream/handle/11007/2049/445E%20Science.pdf?sequence=1
Looks like education in mother tongue should be pursued in primary level and then its OK to switch to english or whatever.
Sorry, one of your link got pasted by mistake. A few of other links I googled are lost.Those links are about equally strong argument supporting the importance of language in maturing thoughts. I wanted to present the counter view. My job is done
DeleteIndeed this is from one of my links. In this article (both links you provide above are to the same article from Times of India), Mr. J.V. Narlikar talks about his own views on when to introduce English as a medium of instruction for sciences in India. Besides a reference to how Einstein switches to his mother tongue, German whenever he got excited in scientific arguments, there is nothing in it to say what you claim, i.e., Einstein said mother tongue makes one think clearly.
DeleteI am patient and I will wait for you to provide proof for your argument. Until such time your job is not done.
Cheers!
BSR
1. I don't have much time.Typing from office..
DeleteI am OK if you think my job is not done. Feel free to think you won the argument.
My memory of Einstein endorsing openly may be wrong. But his switching to german itself indicates hi comfort with German. I read a book where the writer was telling eistein felt he could express ideas better in german. Can you prove Einstein did not endorse mother tongue? Your job will not be done untill such time (according to your own argument)
2.Just google "effect of language on thinking", there are quite some links that support role of language. I agree that there can be thinking without lamguage. But such kind of thinking will not be suitable for the development abstract science/art.
That is a weird argument. You are the one that made the assertion and obviously you should be the one to substantiate it. So, unless you can produce data to support your statement (which I doubt you can), your sweeping conclusions should be deemed meaningless. Thanks for the debate though. Have a good day.
DeleteBSR
This comment has been removed by the author.
ReplyDeleteWatch this video: http://www.youtube.com/watch?v=iu5TfPbvIc8&feature=youtube_gdata_player
ReplyDeleteAnd imagine the pig as Ramoji Rao.
1.చైనా, రష్యాల్లో వైద్యవిద్య ఆంగ్లంలో ఉందా? మన దేశంలో ఉన్నంతగా ఆంగ్లం ప్రాచుర్యంలో ఉందా? లేదనుకుంటున్నాను. అప్పుడు ఆ దేశాల్ని మనం (మనకి) మోడల్ గా తీసుకోటం కుదరదు.
ReplyDelete2. ఆంగ్లవైద్యశాస్త్రంలో రోగాల పేర్లన్నీ ఆంగ్లంలో ఉండవు. ఆ రోగం గూర్చి పరిశోధన చేసిన శాస్త్రవేత్త పేరుపై గానీ (ఉదా.. Parkinson's disease, Huntington's chorea), ఆ రోగకారక క్రిమి పేరుపైన గానీ (ఉదా.. tuberculosis, cholera) ఉంటాయి.
తెలుగులో రోగ లక్షణాలననుసరించి పేర్లు ఉంటున్నాయి. ఉదా.. క్షయ రోగం (tuberculosis). కుష్టు వ్యాధి (leprosy). ఈ పేర్లు అధికారకంగా మనకి ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డుపై దర్శనమిస్తాయి. ఒక రోగికి నీకు క్షయ / కుష్టు / బొల్లి ఉంది అని చెప్పటం ఇబ్బందిగా ఉంటుంది (మనకి ఎంత భాషాభిమానం ఉన్నా). ఈ పేర్లు ఇంకో తెలుగు పేరుకి మార్చవలసి అవసరం ఉంది.
చాలాయేళ్ళుగా tuberculosis ని Koch's గానూ, leprosy ని Hansen's disease గానూ ఆంగ్ల వైద్యులు చెబుతున్నారు (ఆ రోగాల పేర్లకి taboo ఉండటం చేత). ఈ కొత్త పేర్లు కూడా ఆంగ్లం కాదని (ఇవి శాస్త్రవేత్తల పేర్లు మాత్రమే) గమనించగలరు. పాతపేర్ల వల్ల ఇబ్బందిగా ఉందని కొత్తపేర్లు పెట్టారు. అంతే.
కొన్ని రోగాల పేర్లు ఉచ్చరించటానికి ఇబ్బందిగా కూడా ఉంటాయి. ఉదా.. gallbladder stones ని పిత్తాశయంలో రాళ్ళు అనాలి. కంఠసర్పి అంటే diphtheria (అనుకుంటాను).
(రోగాల) ఆంగ్ల పేర్లకి తెలుగు పేర్లు recommend చేస్తున్న భాషాశాస్త్రవేత్తలు (ఎవరు వాళ్ళు? అందులో ఎవరైనా వైద్యులు ఉన్నారా?) వైద్యుడికీ, రోగులకి కల practical ఇబ్బందుల పట్ల sensitive గా ఉండాలని భావిస్తుస్తున్నాను.
..(రోగాల) ఆంగ్ల పేర్లకి తెలుగు పేర్లు recommend చేస్తున్న భాషాశాస్త్రవేత్తలు (ఎవరు వాళ్ళు? అందులో ఎవరైనా వైద్యులు ఉన్నారా?)..
Deleteperfect.
next, మజ్జిగ ని బట్టర్ మిల్క్ అంటున్నారు అని దానికి విరుగుడు గా అంతర్జాలం లాంటి పదాలు సృష్టించి జబ్బలు చరుచుకోవడం మూర్ఖత్వం.
finally, నా వ్యాఖ్యని మీరు తొలగించినందుకు నిరశన వ్యక్తం చేస్తున్నాను.
Bullabbai గారు,
Deleteమీరు నన్ను క్షమించాలి.
(మీ వ్యాఖ్య చదువరి గారి పట్ల పరుషంగా ఉందనిపించింది. అందుకే తొలగించాను. నా బ్లాగులో కామెంట్లు రాస్తున్నవారిపట్ల నాకు చాలా గౌరవభావం ఉంది. గమనించగలరు.)
Well said!
DeleteDear Ramana,
ReplyDeleteCan you please allow links to be active and clickable in your blog?
Thanks!
BSR
BSR, you should manually type HTML codes.
ReplyDeleteOh! OK. Thanks Praveen.
DeleteLet me give it a try.
http://badiga.com
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteThe author of the blog can do nothing on this regard. It's in the hands of Blogspot's administrators.
ReplyDeleteవామ్మో! విషయం చాలానే ఉందే! పోస్ట్ రాసేప్పుడు లోతు తెలీలేదు. ఇంకానయం.. దిగలేదు.. మునిగిపొయ్యేవాణ్ని!
ReplyDelete(దిగకుండా.. కాళ్ళు కడుక్కుని తెలివిగా బయటపడ్డావ్. రవణా! ఎంతైనా నువ్వు జీనియస్వోయ్!)
ఈనాడు ఉద్యోగుల్లో కొంత మంది బ్లాగర్లు ఉండడం వల్లే ఆ పత్రికకి ఈ దరిద్రం అంటిందని నా అనుమానం. బ్లాగుల్లో ఎంత మంది "అంతర్జాలం" అనే పదాన్ని వాడినా నిజజీవితంలో ఎవరూ ఆ పదాన్ని వాడరని ఒక ఈనాడు ఉద్యోగే అన్నట్టు నాకు గుర్తుంది. లేదా రామోజీ రావు బ్లాగులు చదవే వ్యక్తి కావడం వల్ల కూడా ఆయన పత్రికకి ఈ దరిద్రం అంటి ఉంటుంది. ఎందుకంటే ఈ పైత్యం వేరే ఏ పత్రికకీ లేదు.
ReplyDeleteతెలుగు పేరుతో జనానికి అర్థం కాని పదాలని ప్రోత్సహించడం తమ అజెండాలో ఉందని ఈ-తెలుగువాళ్ళు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా వ్రాయలేదు. అందుకే నేను ఆ సంఘంలో చేరాను. కానీ చేరిన తరువాత వాస్తవాలు ఇంకోలా కనిపించాయి. అందుకే నేను ఈ-తెలుగుకి రాజీనామా చేశాను. ఈనాడు దిన పత్రిక వాళ్ళ వెర్రి కూడా ఇలాంటిదే. ఎప్పుడో నిజాం కాలంలో వాడిన గుత్తేదారు అనే పదాన్ని రోజూ విశాఖపట్నం ఎడిషన్‌లో ముద్రిస్తున్నారు. 1766 వరకు నిజాం పాలనలో ఉన్న విశాఖపట్నం తరువాత బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో ఉపయోగించిన మహా కరగ్రాహి (కలెక్టర్) లాంటి పదాలే ఇక్కడి జనానికి అర్థం కావు. అటువంటప్పుడు నిజాం కాలం నాటి పదాలైన గుత్తేదారు, మూజువాణీ, కైఫీయతులు లాంటివి ఇక్కడి జనానికి ఎలా అర్థమవుతాయి?
ReplyDeleteప్రవీణ్ గారు,
ReplyDeleteఈ-తెలుగు గురుంచి ఇప్పుడే తెలిసింది మీ టపా చూసిన తరువాత.
మీరు చెప్పే `అంతర్జాలం` వగైరా వగైరా మాటలు కొంచెం అతిగానే అనిపిస్తాయి. మీలాంటి వాళ్ళు వదిలేశారు, మూర్ఖులు పట్టుకొని వేళ్ళాడుతున్నారు. అందుకే మీలాంటి వాళ్ళు వుండి ఉంటే, ఆ అతి ని తగ్గించగలిగి ఉండే వాళ్ళు. గోదావరిని, ఇంగ్లీషువాడు, `ద` పలకలేక `గొడావరి` అని రాస్తే, దాన్ని `గొడావరి` అనెదో గొప్పగా పలికే బానిసల్నె ఎక్కువ మందిని చూసాను.
నేను ఇంత కసిగా ఎందుకు బానిసలని అంటున్నానంటే, నా చిన్నపటి నుండీ , తెలుగును ఖూనీ చెస్తూ మాట్లాడితే, లేదా, ఎక్కువ ఆంగ్ల పదాలు కలిపి మట్లాడితేనే గొప్ప అని చెప్పె పంతుళ్ళు, కథలు, సినిమాలు, పెద్దలు మాత్రమె ఎక్కువ తగిలారు. `అంగ్లాన్ని, మన అవసరానికి వాడుకోవచ్చు, అందుకోసం నెర్చుకోవచ్చు, కానీ , మన భాషని ఎప్పటికి తక్కువ చెసుకొవద్దు` అని చెప్పిన గొప్పవాడెవ్వడూ తగల్లెదు. ఒక 30 సంవత్సరాల క్రితం గాబోలు, NTR అని ఒక్కాయన మాత్రం చెప్పాడు. నేను, అమెరికా వచి ఇక్కడి జనాలని చూసిన తరువాత గాని అర్ధం కాలేదు.
Due to difficulty in typing lekhini, I am switching to english. (another example we need to make it easy to use our language, not difficult)
I will end this by quoting this real life example. I met a US lawyer (a caucasian lawyer) who happened to deal with an Indian case in Indian court. She was so surprised at the english used in courts and quite frankly she found it difficult to understand. And she said why do Indian courts still use that old british english? Why can't you use your own language? Until that moment, it never occur to me that 'why do we use english which majority people do not understand?' It hardly takes, probably 1000 or 2000 words to deal with ALL court proceedings. Can't we simply prepare dictionaries to translate from english to our own and also among our own languages? But even after 65 yrs we still sticking to our master's language. That is the reason I say, we all are (including me ) are slaves for 800 yrs and still in slavery. Occasionally we get some independent thinking people, but we brand them 'తెలుగు పిచ్చొళ్ళు' .
We need someone with balanced mind, who can take our language more adoptable to modern times, and make it easy to use. To make that more useful, we may have to accept outside language words which is perfectly fine. Unfortunately it is difficult to get such people with balanced mind and even more difficult to keep them in power. Somehow people with less skills or unqualified always sit at helm. OR may be they have more willing ness than balanced minde people.
మన డాక్టరు గారే చెప్పాలి. ఎమంటారు రమణగారు?
కృష్ణ
రమణ గారు,
ReplyDeleteమీరు ఈ టపా ప్రాక్టికల్ గా అలోచించి, మెరుగైన వ్యవహర శైలి కోసం రాశారు. కాని మన సమాజం లో అన్నీ అలా కుదరదు అని మరొకసారి నిరూపణ అయ్యింది.
మీరు లాజిక్ ని లాజిక్ తొ పొరాడ వచ్చు. (మీరు ఇక్కడ పొరాడటనికి రాయటం లేదు, ఎదో నా సొంత అలొచనలను రాస్తున్నాను అంటారు) కాని emotions ని ఎలాగ fight చేస్తారు.?
you said what ever you felt practical. కానీ , చదువరుల స్పందన చాలా interesting గా ఉంది.
నేను మీకు గొప్ప విసన కర్ర అండీ.
ReplyDeleteరేపు మళ్ళీ ఇదే అలవరసల మీద కలుసుకుందాం అని శ్రీలంక నించి మీనాక్షి పొన్నుదురై అక్క అనేది గతించిన కాలం లో! wavelngths / frequency no yedo okati.
మనకి అర్థమ్ కాలేధని ,తప్పుగా మాల్తాడడం తప్పు అని నా అభిప్రయమ్.
ReplyDeleteRead it: https://plus.google.com/113328872010907615365/posts/TBgD7jmcUmh
ReplyDeleteకుక్కలకు కూడా కుక్క భాష ఉంటుంది, కానీ అవి తమ భాష వదిలేసి పిల్లుల భాష మాట్లాడవు. కన్న తల్లిని, కన్న దేశాన్ని, తనదైన భాషనీ గౌరవించుకో లేనివాడు ఎంత గొప్పవాడైనా వాడి జీవితం వ్యర్థం.
ReplyDelete>>కుక్కలకు కూడా కుక్క భాష ఉంటుంది, కానీ అవి తమ భాష వదిలేసి పిల్లుల భాష మాట్లాడవు.
Deleteకుక్కలు మాట్లాడదామని ముచ్చటపడ్డా పిల్లుల భాష మాట్లాడలేవు.:)
>>కన్న తల్లిని, కన్న దేశాన్ని, తనదైన భాషనీ గౌరవించుకో లేనివాడు ఎంత గొప్పవాడైనా వాడి జీవితం వ్యర్థం.
అయితే నా జీవతం వ్యర్ధమే! :))
"ఇంగ్లీషువాడు దాన్ని స్కిజోఫ్రీనియాగానే ఉంచేశాడు గానీ తన భాషలోకి అనువదింప పూనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా రొగాలకి ఒకటే పేరు ఉంటే మంచిది. అందువల్ల ఎవరికీ నష్టం కూడా లేదు".
ReplyDeleteఅద్భుతమైఅన మాట చెప్పారు మాష్టారూ.
"'అతిసారం' అంటే కలరా అన్నసంగతి నాకు మొన్నటిదాకా తెలీదు".
నాక్కూడా తెలియదు మీరు ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది.
" Professional భాషాభిమానులు"
భలే మాట వాడారు మాష్టారూ. అంతే కావాలి. నాక్కూడా ఈ Professional భాషాభిమానులు చూస్తుంటే వళ్ళు మండుకొస్తున్నది. భాషను చెడగొట్టేస్తున్నారు కదా!
"ప్రతిసారీ (భాషా) శంకరశాస్త్రి 'శారదా!' అంటూ గావుకేక పెడుతూనే ఉన్నాడు. అయినా లాభం లేకపోతుంది"
ఇవ్వాళ బాంకు సమ్మె. ఆ కారణాన మా ఆవిడకు వచ్చిన కష్టం నేను మామూలు టైములో ఇంట్లో ఉండటం, పనేమీ లేక పోవటం. పనేమీ లేక , "పనిలేక" బ్లాగు చదువుతూ, పై మాటలు చదివి నేను కొట్టిన కేరింతలు, చప్పట్లు విని మా ఆవిడ నన్ను ఎవరన్నా సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసికెళ్ళాలని హైదరాబాదులో ఉన్న వాళ్ళ అన్నయ్యలకు ఫోను చెయ్యటం వినలేదనుకుంటోంది "పిచ్చిది". నేను ఎవరు వ్రాసినది చదివి ఇలా అయిపొయ్యానో తెలిదుగా మరి!
మనం సాధ్యమైనంతవరకు ఈ ధూమశకట యంత్రాలకీ, అంతర్జాలలకీ దూరంగా జరిగితే మంచిదని నా అభిప్రాయం. చివరగా అద్భుతమైన మాట అని ముగించరు. ఒరే, తెలుగు భాషా "గుంపు" ల వాళ్ళూ వింటున్నారా!
చివరగా కొంత స్వోత్కర్ష, వీలుంటే నెను వ్రాసిన ఈ వ్యాసం చదవండి చాలా కాలం అయ్యింది. అయినా సరే నా అభిప్రాయాలు అవ్వే.
http://saahitya-abhimaani.blogspot.in/2010/08/blog-post_29.html
మీకు కామెంట్లుగా ఇంతమంది వ్రాశారు కానీ యు ట్యూబ్ కు తెలుగేమిటో ఒక్కళ్ళూ చెప్పారు కాదు. బాబోయ్ వెంటపడకండి, నేను వంద కిలోల పైన బరువున్నవాణ్ణి పరిగెత్తలేను
You Tube : "మీ గొట్టం" అని అనొచ్చుకదండి
Delete@Aditya
Deleteనా పాయింటు అదే. కొత్త పదాలు తయారుచేస్తున్నామనుకుంటూ, ఆంగ్లంలో ఉన్న పదాలకు యధాతధ అనువాదాలు చేస్తే యు ట్యూబ్ కు తెలుగులో ఎబ్బెట్టుగా ఉండే పదమే వస్తుంది.
అసలు యు ట్యూబ్ కు ఆంగ్లంలో ఐనా సరే ఆ పేరు ఎలా వచ్చింది! ట్యూబ్ అంటే టి.వి లొ బొమ్మ వచ్చే తెరకు(ప్రస్తుతం ఉన్న ఎల్ సి డి/ఎల్ యి డి లు రాక ముందు)కూడా ట్యూబ్ అన్న పదమే వాడేవారు. అందుకని టి.వి ప్రాచుర్యంలోకి వచ్చాక ట్యూబ్ అనేమాట టి.వి కి పర్యాయ పదంగా వచ్చింది. యు ట్యూబ్ అంటే మనకు టివి లోలాగ కనపడేది కాబట్టి ఇంగ్లీషులో యు ట్యూబ్(మీ టి వి అనే అర్ధంలో) అంటే ఎబ్బెట్టుగా లేదు. అదే పదాన్ని తెలుగులోకి తెద్దామని అదుర్దాగా అనువాద పదం తయారుచేస్తే మీరు అన్న భ్రష్ట పదమే పుడుతుంది. అంతగా తప్పదు యు ట్యూబ్ కు తెలుగు పదం ఉండి తీరాలని భీష్మించుకుని కూచునేవాళ్ళ కోసం "మీ టి వి" అనాలి తప్ప మీరు చెప్పే మాట వాడటం భాషను చెడగొట్టటమే అవుతుంది అని, డాక్టరుగారు పెట్టిన వ్యాస శీర్షికను నిజమని నిరూపిస్తుంది అని నా అభిప్రాయం
Your Tube : "మీ గొట్టం" అవుతుందండి.
ReplyDeleteYou, Tube! : "ఒరే గొట్టం" అవుతుందండి.
మరేనండి.
టెక్నాలజి అభివృద్ది ఆయిన తరువాత ఎన్నో సాధనాలు వెలుగు లోకి వచ్చాయి... వాటికి అచ్చ తెలుగు లోకి అనువదించి తెలుగు భాష ను మేమే బతికిస్తున్నాము అని తమకు తామే జబ్బలు చరచుకొనే పత్రికల ను చూస్తే అసహ్యం కలుగుతుంది.... ఉదాహరణ కు సెల్ ఫోన్ ను చరవాణి అని కొన్ని రోజులు ఊదరగొట్టారు... చర వాణి లో చరం సంస్కృత పదమే వాణి సంస్కృత పదమే (నాకు తెలిసినంత వరకు) అది తెలుగు పదం ఎలా అవుతుందో వారికే తెలియాలి.. మళ్ళీ ఇప్పుడు దాన్నే చేవాణి అని రాస్తున్నారు... గ్యాస్ సిలిండర్ ను వాయు బండ అని రాస్తున్నారు. వాయు తెలుగు పదం ఎలా అవుతుంది... ? ఆ పత్రిక ను చూసి కొత్తగా వేరే వార్తా పత్రికలు తెలుగు భాష ను ఖూనీ చేస్తున్నాయి. ప్రతి వస్తువు కు, ప్రతి విషయానికి, ప్రతీ అంశానికి తెలుగు పదాన్ని పుట్టించి తెలుగు భాష ను బతికిస్తున్నామనే పేరుతో తెలుగు భాష ను చంపేస్తున్నారు.. రమణ గారు కరెక్ట్ గానే చెప్పారు.....
ReplyDelete