Monday, 12 January 2015

'అకారసం'


"రచయితగారూ! నమస్కారం!"

"నమస్కారం!"

"మీ రచనలన్నీ చదివాం, మాకు బాగా నచ్చాయి."

"సంతోషం!"

"మీ ఆలోచనలు మా రచయితల సంఘం ఆలోచనలకి దగ్గరగా వున్నాయి."

"థాంక్యూ!"

"మీరు మా సంఘంలో చేరాలని మా కోరిక."

"మీరు అభ్యుధయ రచయితల సంఘం - 'అరసం' వాళ్ళా?"

"కాదు."

"విప్లవ రచయితల సంఘం - 'విరసం' వాళ్ళా?"

"కాదు."

"హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుందని రోజువారీ గుండెలు బాదుకునే జాతీయవాద రైటిస్టు రచయితలా?"

"కాదు."

"మరి?"

"మా రచయితల సంఘం పేరు - 'అకారసం'."

"పేరెప్పుడూ విన్లేదే!"

"వినకపోవడమేమిటండీ! ఈ మధ్యన మా సంఘం పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంటేనూ!"

"అలాగా! నా అజ్ఞానాన్ని మన్నించండి. 'అకారసం' అంటే ఏంటి?"

"అర్ధం కాని రచయితల సంఘం."

"పేరు వెరైటీగా వుందే! మీ సంఘ సభ్యుల లక్ష్యం - పాఠకులకి అర్ధం కాకుండా రాయడమా?"

"పాఠకులకి అర్ధం కాకుండా రాయడం ఇప్పుడు ఓల్డు ఫేషనైపోయిందండీ!"

"మరి?"

"మేమిప్పుడు మాకే అర్ధం కాకుండా రాస్తున్నాం!"

(picture courtesy : Google)

13 comments:

  1. ఏమిటో! నాకు వికారంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. ఎందుకు!? మరీ అంత ఛండాలంగా రాశానా?

      Delete
    2. కాదండి, మీ సంఘం పేరు చదివి.

      Delete
  2. డాట్రు గారు,
    మీరెఫ్ఫుడు చేరారు ఈ 'అకారసం'ఘం లో?

    ReplyDelete
    Replies
    1. నేను ఫౌండింగ్ మెంబర్నండీ! నాది పెర్మనెంట్ మెంబర్‌షిప్! :)

      Delete
  3. ఇలా ఉంటేనే అద్బుతమంటున్నారు పాఠకులు. పాఠకుల అభురుచే రచయితుల అభిరుచి.

    మీ ' అకారసా నికి శుభా కాంక్షలు సార్‌,

    ReplyDelete
  4. Maa LBDN society lantide. Look Busy Do Nothing society.
    Putcha

    ReplyDelete
  5. మీరు ఈ బ్లాగుకి ఆ ఫొటో ఎందుకు పెట్టారో అర్ధం కాలేదండీ!! అదే 'అకారసం ' అంటారా?? :-))))

    ReplyDelete
    Replies

    1. శ్రీ నివాస్ గారు,

      ఆ ఫోటో లో నే అకారసం వారి సూక్ష్మం ఉందండీ !

      మా మా లుక్ అట్ బూ బూ దే అన్న డేలా ఫాంటే జమైకన్ పాట వినాలి దాన్ని అర్థం చేసుకోవడానికి !!

      జిలేబి

      Delete
    2. జిలేబీ గారూ - ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు!!! :-)))))

      కొంపతీసి మీరు కూడా 'అకారసం ' లో చేరిపోయారా ఏమిటి? :-))))

      Delete
  6. సార్ ,
    మీరు రాసే ప్రతీ దానిలోను, హిందూ వాదులు అంటూ ఎత్తి పొడుస్తున్నరు? ఎందుకు? రచయితలకి, వాళ్ళకి ఎం సంభందం? చెప్పండి? మీ పేరును బట్టి మీరు హిందువులు అనే అనుకుంటున్నాను. మీరు హిందువులు కాబట్టి, మీరు ఎమైన అనొచ్చు అని అనుకుంట్టున్నారా? ఒక వేళ్ళ అలా అనుకుంటే, మీరు మీ మతాన్ని ఉద్దరించఖర్లేదు, దయచేసి అవహేళన చేయకండి. (మీరు అనుకో వచు, నేను అతివాదులను అంటున్నాను, మతాన్ని కాదు అని! కాని 90 శాతం మందికి అది మతాని అన్నట్లె వుంటుంది. మీరు మానసిక వైద్యులు. మీకు చెప్పల్సిన వసరం లేదు అనుకుంటున్నాను. ఆమిర్ ఖాన్ సినెమా చూసి, "అహా మతం ఎంత చెడది" అనుకోరు. చూసిన వాళ్ళకు మనిపిస్తుందో, ఇక్కడ మీకు మరీ వివరించాల్సిన వసరంలేదు అనుకుంటున్నను. మీరు చూస్తే ఒక్కసారి అలొచించండి "ఆమిర్ ఖాన్ ఏమి అలొచిస్తూ వుంటాడొ" అని)
    మీరు మతం మార్చుకుంటే, కనీసం ఒక కారణం వుంది అనుకొవచు. లేదు నేను నాస్తికుడిని అంటార? మీరు ఇంకొకళ్ళ గురుంచి ఎప్పుడూ రాసినట్లు గుర్తులేదు. ఈ మధ్యే మన ఓవైసి గారు ఎదో అన్నారు. వాళ్ళ తమ్ముడు ఎప్పుడూ ఎదూ ఒకటి అంటూనే వుంటాడు. కానీ మీరు ఎమీ పెద్ద ఆవేశపడి రాసినట్లు గుర్తులేదు. బహుశా రాస్తే ఎమౌతుందో అందరికి తెలుసు. ప్రపంచ స్తాయిలొ హిందు మతం 4 వ స్తానంలొ వుంది. మన రాష్త్రంలో వున్న 2 పెద్ద కాలేజీ వాళ్ళు చిన్న చిన్న కాలేజీలనుకూడా బతక నీయకుండా చెస్తారు అని అంటారు. ఎందుకు చెప్పండి? ప్రపంచలొ 75% జనాభా 2 పెద్ద మతాలకు సంభదించిన వాళ్ళే. కానీ ఇతర మతాల మీద దాడులు జరుగుతూనే వుంటున్నాయి. ఎందుకు?
    మీ స్నేహితులు చాలామంది USA/UK వున్నారు కదా. ఒక సారి వాళ్ళను అడగంది. ఎందుకంటీ ఇవన్నీ అర్దం కావాలంటె వేరే స్తాయిలొ ఆలొచనలు కావాలి. మన దేశంలొ మనం చదివే చదువుకి, కుహనా లౌకిక వాదుల అలొచనాల ప్రవాహంలో ఇవనీ అర్దం కావాలంటే చాలా పెద్ద ప్రయత్నమే కావాలి. కాని పశ్చిమ దేశాల వాళ్ళతొ పని చేసి, వాళ్ళతొ సహ జీవనం చేసిన తరువాతగాని కొన్ని విషయాలు అర్దం కావు.
    ఎటు చూసినా గాని 10 మైళ్ళ మేర బురద వుండే ప్రదేశంలో పుట్టిన పందికి, పాపం నేల అంటె, బురదే కాదు, పచటి పచిక కూడా వుంటుంది అంటె బహుశా అది నమ్మక పొవచు.

    (ఇక్కడ నేను మిమల్ని తిట్టాను అని అనుకుంటే, పొరపాటు. మానసిక వైధ్యులు మీరే పొరపడినట్లు. మరి మీరు రాసేవి చూసి ఎంతమంది మీ ఆలొచనలని సరిగ్గా అర్దం చేసుకుంటారు?? )


    కృష్ణ

    ReplyDelete
  7. మీరు పి.ర.సం. సభ్యులు మాత్రమే అనుకున్నా ఇన్నాల్లూ.

    ReplyDelete
  8. డాక్టరు గారు,
    నా కామెంట్స్ ఆపేసినట్లున్నారు? Hope I didn't offend you and its not my intention(not apologetic).
    I am okay with writings, but I strongly feel it ALWAYS projects one side. And suppresses other side due to fear. But calls themselves as balanced writing.

    Krishna

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.