"దండాల్దొరా! ఆకలేత్తంది! ఈడేవఁన్నా దొరుకుద్దేవోఁనని.. "
"ఈ చెత్తకుండీ దగ్గర ఏం దొరుకుందని కాపలా కాస్తున్నార్రా!?"
"ఈ గోడవతల వొటేల్లో ఏదో పారిటీ అండే! ఆళ్ళు తినంగా మిగిలింది యేసేది యీడే గదండే!"
"ఓ! మీరు ఎంగిలిస్తరాకుల బ్యాచా! వురే యెదవల్లారా! ఇదేమన్నా మీ వూళ్ళో ఉడిపి హోటల్ అనుకున్నారా! ఇదో ఫైవ్ స్టార్ హోటల్. ఇక్కడ తినంగా మిగిలింది పారెయ్యరు, దాచిపెడ్తారు. దాన్నే రేపు మళ్ళీ ఫ్రెష్‌గా అందమైన స్టీలు బొచ్చెల్లో సర్దుతారు. హిక్.. "
"అట్టా సద్దెన్నాలు యేడి సేస్కోడం ఎందుకండే!"
"చెప్పినా మీకర్ధం కాదులే! హిక్.. "
"అయ్యబాబోయ్! తవఁరుగోరు తూలిపోతాన్నరేందండే?"
"హిక్.. హేపీ న్యూ యియర్రా! హిక్.."
"అంటే యేందండే?"
"అంటే ఆనందంగా పార్టీ చేసుకుంటూ.. హిక్.. నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం అన్నమాట! హిక్.. "
"అట్టా సెయ్యకపోతే కొత్తేడాది రాదాండే!"
"హిక్.. అట్లాంటి పెద్దిషయాలు మీకెందుగ్గానీ.. ఒక మంచి పోజివ్వండ్రా! ఫోటో తీస్తాను. హిక్.. "
"ఎందుకండే!?"
"ఒరే! నేనవరనుకున్నారు? భారద్దేశంలో పేదరికాన్ని అందంగా ఫొటోలు తీసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫొటోగ్రాఫర్ని! ఆ స్టార్ హోటల్లో కూడా నా ఫొటో ఎక్జిబిషన్ ఉందిరా! హిక్.. హిక్.. "
"దండాలండే!"
"దగ్గరగా రాకండి! కంపు భరించలేకపోతున్నా! ఏదీ! ఆ చెత్తకుండీ పక్కన దీనంగా మొహం పెట్టి కూర్చోండి! ఆ అదీ.. హిక్.. ఫొటో బాగా వచ్చిందిరా! ఇంక పోండి. హిక్.. "
"దొరా! ఆకల్తో సచ్చేట్లున్నాం. తిండానికేమన్నా డబ్బులివ్వు దొరా!"
"ఒరే! లాగిపెట్టి తన్నానంటే చచ్చూరుకుంటారు. హిక్.. దొంగ రాస్కెల్స్! ఇప్పుడు మీకు తీసిన ఫొటో ఎన్ని దేశాల్లో చూస్తారో తెలుసా? అది చాల్లేరా మీ మొహాలకి! హిక్.. మందు మీదున్నానని డబ్బులు కాజేద్దామని చూస్తార్రా బ్లడీ ఫూల్స్! గెట్ లాస్ట్! హిక్.. హిక్.. హిక్.. "
(photo courtesy : Google)
మాబాగా చెప్పారండీ హిక్.. పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది హిక్..
ReplyDeleteనూతన సంవత్సర శుభకాంక్షలు సర్!
ReplyDeleteమీపోష్ట్ కలచి వేసింది.
హిక్.. హిక్.. హిక్.
రావి శాస్త్రి గారి ఛాయలు స్పష్టంగా కనిపించాయి, hip hip hurrah
ReplyDelete