"ఈమధ్య తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరిద్దామనే కోరిక కలిగిందోయ్! ఒక మంచి రచయితని సజెస్ట్ చెయ్యి! చదివి పెడతాను."
"అలాగే! మీ టేస్టేవిఁటో చెబితే.. "
"స్వచ్ఛమైన రచయిత, స్వచ్ఛమైన పుస్తకం!"
"అర్ధం కాలేదు."
"ఓ పన్జెయ్! నీకిష్టమైనవాళ్ళ పేర్లు చెప్పు! చదవాలో లేదో నేను తేల్చుకుంటాను."
"రావిశాస్త్రి బాగా రాస్తాడు."
"నేను తాగుబోతులు రాసిన సాహిత్యం చదవను."
"పోనీ - కుటుంబరావు?"
"కమ్యూనిస్టులు దేశద్రోహులు, వాళ్ళని చదవరాదు."
"చలం?"
"చలంది క్రమశిక్షణ లేని జీవితం."
"శ్రీశ్రీ?"
"నథింగ్ డూయింగ్, శ్రీశ్రీ స్మోకర్."
"గురజాడ అప్పారావు?"
"...... "
"సార్సార్! ఇంకేం మాట్లాడకండి. గురజాడని తీసుకెళ్ళి చదూకోండి, నన్ను విముక్తుణ్ని చెయ్యండి."
"ఎందుకలా తొందర పడతావ్? కొంచెం ఆలోచించనీ! గురజాడకే అలవాటూ లేదని ఎలా చెప్పగలవ్? ఏమో ఎవరు చెప్పొచ్చారు - నశ్యం అలవాటుందేమో!"
"ఒట్టు! నన్ను నమ్మండి! ఆయనకే అలవాటూ లేదుట! పొద్దున్నే యోగాసనాలు కూడా వేసేవాట్ట! చరిత్రలో రాశారు."
"ఈ రోజుల్లో చరిత్రని నమ్మేదెవరు? ఎవరికనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఓ పన్జెయ్! గురజాడకి ఏ అలవాటు లేదని రూఢి చేసుకుని నీకు ఫోన్జేస్తాను. అప్పుడాయన పుస్తకాలు పంపీ! నాకు రచన బాగా లేకపోయినా పర్లేదు కానీ - రచయితకి మాత్రం ఆరోగ్యకరమైన అలవాట్లు, ఉక్కు క్రమశిక్షణ వుండాలి! అర్ధమైందా?"
"అర్ధం కాలేదు! అయినా - రచన బాగుండాలి గానీ రచయిత గూర్చి మనకెందుకండి?"
"కావాలి, రచయిత గూర్చే కావాలి! ప్రధానమంత్రి 'స్వచ్ఛభారత్' అంటూ ప్రజల చేతికి చీపుళ్ళిస్తున్నాడు. ఎందుకు?"
"ఎందుకు?"
"ఎందుకంటే - రోడ్లు శుభ్రంగా వుంటేనే ఊరు శుభ్రంగా వుంటుంది కాబట్టి! అందుకే చీపుళ్ళ పథకాన్ని 'స్వచ్ఛభారత్' అన్నారు. రచయితైనా అంతే! ముందు తను స్వచ్ఛంగా వుంటేనే స్వచ్ఛమైన పుస్తకం రాయగలడు! అప్పుడే దాన్ని 'స్వచ్ఛపుస్తక్' అంటారు!"
"స్వచ్ఛపుస్తక్!"
"అవును! ముందు నువ్వా నోరు మూసుకో, ఈగలు దూరగలవు! ఇక నే వెళ్తాను!"
(picture courtesy : Google)
చెప్పేది ఒకటి చేసేది ఒకటి-గా ఉండే వాళ్లను రచయితలంటారేమో గానీ, ప్రధాన్ మంత్రులని ఎవ్వరూ అనరు.:)
ReplyDeleteఅవును! నిజాయితీని రచయితల్నుండి మాత్రమే ఆశిస్తాం!
Delete
ReplyDeleteబ్లాగు లో ళ్ళ లోకం లో పని లేక రమణ గారని ఒకరు రాస్తూంటా రండీ - వీరు స్వచ్చ రచయితేనా ??
జేకే!!
జిలేబి
జిలేబి జీ!
Deleteఆ పనిలేని రమణ ఒక తుచ్ఛరచయిత! :)
అదేదో బ్లాగులో మార్క్సూ వగైరాల మీద జరిగిన చర్చ గుర్తొస్తూంది! ఇలా బ్లాగు చర్చల్ని గూడా ఏకి పారేస్తున్నారన్నమాట!
ReplyDeleteతెలుగు బ్లాగుల సంగతేమో గానీ (నేను పెద్దగా ఫాలో అవ్వను) - మార్క్స్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టడం అనేది మనం పుట్టకముందు నుండి జరుగుతూనే వుందిగా!
Delete*ఈ రోజుల్లో చరిత్రని నమ్మేదెవరు? ఎవరికనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు*
ReplyDeleteమీరు భలే వారే! ఇప్పుడిప్పుడే అసలైన భారతదేశ చరిత్ర బయటికి వస్తున్నాది. ఇన్నాళ్లు దేశచరిత్రను తొక్కిపెట్టారు. ప్రపంచంలో సైన్స్, మాథ్స్ అభివృద్దికి భారతదేశం మొదటి నుంచి కృషిచేసింది. ఎన్నీటినో కనుగొన్నది. బ్రిటిష్ వారి పాలనలో మనదేశం నుంచి సుమారు పది ట్రిలియన్ డాలర్ల సంపద తరలించుకెళ్ళారు. భారతీయుల సంపదే, నేడు యురోప్,అమెరికాల లో చెప్పుకొంట్టున్న ఆధునికత, సైన్స్ & టెక్నాలజి రంగాలలో ప్రగతికి ఆధారం. భారత దేశం నుంచి నాలేడ్జ్, సంపదను అన్నిటిని ఎత్తుకెళ్ళి అభివృద్ది చెంది, భారతీయులు వెనుక బడినవారని, వారికి మూడానమ్మకాలు ఎక్కువని ప్రచారం చేయటానికి మార్క్సిస్ట్ మేధావులను బాగా వాడుకొన్నారు. అంతకన్నా ఈ మేధావులు పూర్తి సహకారం అందించారంటే బాగుంట్టుందేమో!
http://en.wikisource.org/wiki/A_Few_Facts_about_British_Rule_in_India
రోమిల్లా థాపర్,ఇర్ఫాన్ హబీబ్ వంటి ప్రముఖ చరిత్రకారులు యునివర్సిటిలలో కూచొని, చరిత్రను ఇష్టంవచ్చినట్లు వక్రీకరించారు. వీళ్ల భండారాన్ని అరుణ్ శౌరి బయట పెట్టాడు. హిందువులు కనుకొన్న ఆవిష్కరణలన్ని అరబ్బులు, తెల్లవారు, వారి ఖాతాలో కి వేసుకొని పేరుకొట్టేసి, ఇన్నాళ్లు యంజాయ్ చేశారు. ఇప్పుడు హిందువులు వాటిని క్లైం చేయటం మొదలు పెట్టేసరికి, సెక్యులర్ మేధావులు రంగంలోకి దిగారు. ఆ మేధావులలో చాలామంది నెహ్రూ రాసిన డిస్కవరి ఆఫ్ ఇండియాను కూడా చదవలేదు. ఆయనే హిందువులు కనుకొన్న నూతన ఆవిష్కరణలను ఏకరువుపెట్టాడు.
The Discovery of India by JAWAHARLAL NEHRU
search for "Mathematics in Ancient India", Read Page 215-219
https://archive.org/stream/DiscoveryOfIndia/TheDiscoveryOfIndia-jawaharlalNehru_djvu.txt
________
Why Indian science scores
http://www.thehindu.com/thehindu/mag/2003/06/08/stories/2003060800310300.html
ReplyDeleteఆహా పనిలేక రమణ గారు , నిజము చెప్పు తూచ్ రచయితలు !
నిజము చెప్పువారే స్వచ్చులు !
కావున తూచ్ రచయితలే స్వచ్చ రచయితలు
కావున వారివే స్వచ్చ పుస్తక్ లు !
కావున అవియే చదువ వలె !!
చీర్స్
జిలేబి
జిలేబిగారు, మీరన్నమాట స్వచ్చులేకదా! అబ్బే మాట కొత్తగా ఉంటేనూ అడిగేను, అదేనా లేక మరొకటా అని...
Deleteరావిశాస్త్రికి తాగుబోతు బిరుదు ఇస్తే శ్రీశ్రీ అభిమానులు నొచ్చుకుంటారు:!
ReplyDeleteఎవరండీ రావిశాస్త్రిని పట్టుకుని తాగుబోతన్నవారూ?
Deletesarma గారు,
Deleteనే.. నే కాదండి!
ఒట్టు! ఆ అన్నాయనెవరో నాకు తెలీదండీ!!
జై గారు,
Deleteశ్రీశ్రీ అభిమానులంతా (దాదాపుగా) రావిశాస్త్రి అభిమానులే! కాబట్టి నొచ్చుకునే అవకాశం లేదు. :)
ఇదన్యాయమండీ! రావి శాస్త్రికి అభిమానులులేరనా?
Deleteశర్మ గారూ,
Deleteరావిశాస్త్రికి అభిమానులు లేరు - వీరాభిమానులే వున్నారు! :)
రాసేవారు సెలెబ్రిటీ అయితే చచ్చు పుస్తకం కూడా స్వచ్ఛపుస్తకం అయిపోతుంది. మహాకవి అనబడే ఓ పెద్దాయన ప్రతి రచనా (అంతబాగా లేకపోయినా) చదివి ఆహా ఓహో అనుకోవట్లా?
Deleteస్వచ్ఛమైన పుస్తకాలు కావాలంటే తాళపత్రగ్రంథాలు చదువుకోవాలి.
ReplyDeleteఅదేదో తాళ పత్రాలన్ని నిజం మాట్లాడుతున్నట్లు! :)
Deleteజీవితాన్ని వ్యాఖ్యానించే రచయితలు వాళ్లు తాగుబోతులైతేనేమి తిరుగుబోతులైతేనేమి. వారు చెప్పే సత్యమే కావాలి.తల్లీ తండ్రులు తాము చేసిన తప్పుల వల్ల తమకొచ్చిన అష్ట కష్టాలన్ని తమ పిల్లలకు రాకూడదని భావిస్తారో అలా తమలాగే చెడిపోవాలను మంచి రచయితలు కోరుకోరు దయ్యాల భూతాల కాస్మోరా రచయితలు తప్ప. సమాజం చెడి పోతే తాము బాగు పడాలనుకొన్న వారు తప్ప. అందు వల్ల రచయితలు రాసేదే మనకు ముఖ్యం గానీ వాల్లు ఎలాంటి వారు అన్న దంతో నిమిత్తం లేదు.
మీరు ఏ కోవలోకి చెందుతారు? నేను అభిమానినే లెండి. :)
ReplyDeletesarma గారు,
Deleteనాది 'పిచ్చి అభిమానం' కోవ. :))