Friday, 23 January 2015

స్త్రీలకి చీరే శ్రీరామరక్ష!


"మన్ది హిందూదేశం."

"........ "

"ఇది పరమ పవిత్రమైన భూమి."

"....... "

"ఆడది ఆదిపరాశక్తి."

"........ "

"ఈ దేశంలో స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తాం."

"........ "

"స్త్రీల అందమంతా వారి చీరకట్టులోనే వుంది."

".......... "

"చీర మన భారతీయ సాంప్రదాయం."

"............ "

"స్త్రీలకి చీరే శ్రీరామరక్ష."

".......... "

"చీర కట్టిన స్త్రీని ఒక్కడు కూడా రేపు చెయ్యడు. చేస్తే నన్ను చెప్పుచ్చుకు కొట్టండి!"

"............ "

"బాపు బొమ్మకి చీరే అందం"

"............ "

"విశ్వనాథ్ సినిమాలకి చీరే ప్రాణం."

"............ "

"రోజులు మారిపోతున్నాయి, ఆడాళ్ళు మరీ బరితెగించిపోతున్నారు."

"............ "

"లేకపోతే ఆ డ్రస్సులేవిఁటీ ఛండాలంగా!"

"........... "

"జేసుదాసు అన్నాడంటే అనడా మరి?"

"......... "

"నన్నడిగితే చీర కట్టని ఆడదాన్ని షూట్ చేసి పారెయ్యాలంటాను."

"........... "

"దేశానికిప్పుడు మంచిరోజులొచ్చేశాయి. మన్ని రక్షించడానికి దేవుళ్ళా మోడీ వచ్చాడు! మోడీ మన్‌మోహన్‌లా ముంగి కాదు, అసలుసిసలైన మగాడు! ఆడాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచుతాడు!"

"............ "

"మేస్టారూ! ఇందాకట్నుండీ నేనే మాట్లాడుతున్నాను. మీరేంటి ఒక్క ముక్కా మాట్లాడరు!"

"ఏం మాట్లాడమంటారు? మీరు మాట్లాడుతున్నారుగా!"

"అవుననుకోండి! మీరసలేం మాట్లాడకపోతేనూ!"

"అయ్యా! మీరు 'శ్రీరామసేన' సభ్యులా?"

"రామరామ! ఆ పేరెప్పుడూ విన్లేదండీ!"

"తొగాడియా శిష్యులా?"

"మిరపకాయ తొడాలు తెల్సండీ! తొగాడియా తెలీదు."

"సాక్షి మహరాజ్?"

"బాపు రమణల 'సాక్షి' చూశాను, అంతే!"

"ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండీ, మీరేం చేస్తుంటారు?"

"ఇందులో అనుకోటానికేవుఁందండీ! 'పడవల పిచ్చయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? ఆ దుకాణం మాదేనండీ! 'పడవల పుల్లయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? అది మా బాబాయ్ కొడుకుల్దండీ! మాది చీర్లేపారవఁండీ! మా బాబాయోళ్ళది రెడీమేడ్ దుస్తుల యాపారవఁండీ! ఆళ్ళు కోట్లకి పడగలెత్తారండీ! మనం మాత్రం యిక్కడే వుండిపొయ్యావఁండీ!"

"అయ్యో!"

"ఏజేస్తావఁండీ? టైం బ్యాడండీ! ఇవ్వాళ ఆడలేడీసులు చీర్లు కట్టం తగ్గించేశారు కదండీ! మనం యాపారంలో దెబ్బైపొయ్యవఁండీ! మోడీ రావాలి - అప్పుడు గానీ ఈ ఆడముండలు చీర్లే కట్టాలని రూల్రాదని మా బామ్మర్ది చెప్తుంటాడండీ."

"ఓ! మీ సమస్య ఇప్పుడర్ధమైంది. మీ కోరిక నెరవాలని కోరుకుంటున్నాను."

"థాంక్సండీ!" 

(picture courtesy : Google)

19 comments:


  1. 'శ్రీ రమణ సారీ గేలరీ !

    మీరేమన్నా కొత్త దుకాణం బిజినెస్స్ పెడ్తూ న్నారాండీ గుంటూరు లో !!

    జిలేబి

    ReplyDelete
  2. స్త్రీలు చీరలు కట్టుకుంటే రేప్‌లు జరగవు అనేది హిందూత్వవాదుల ఉవాచ. అలాగైతే వాళ్ళు తమ పార్తీ నాయకురాలు కిరణ్ బేదీకి చీరలే కట్టుకోమని చెప్పాలి. ఆ ధైర్యం భాజపా నాయకులకి ఉందా?

    ReplyDelete
  3. /చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మ దీయ అందమతా చీరలోనే ఉన్నది/ అని పాడుకున్న దేశంలో చీరలకు డిమాండ్‌ లేక పోవడాం చీరల వ్యాపారం జోరుగా జరగక పోవటం ఎంత దారునాతి దారుణం! మరి వ్యాపార సంస్కృతి మీద దాడి చెయ్యాలి కానీ.... మోరల్‌ పోలీసింగ్‌ చేస్తే సరిపోతుందా?

    ReplyDelete
    Replies
    1. పాటలో చీర రంగేమిటి అసలు చీర వేసుకుందా అనే సోయి ఇప్పుడు లేదండి. వినిపించేది చీర కనిపించేది వేరొకటి ఉండే పాటలు చాలా ఉన్నాయి :)

      Delete
    2. అవును!, చాలానే వచ్చాయి :) మాయల పకీరు ప్రాణం చిలకలోనే ఉన్నట్లు ఈ దేశ సంస్కృతి ప్రాణం చీరలోనే ఉందటా:)

      Delete
  4. ఏం మాట్లాడమంటారు? మీరే మాట్లాడుతున్నారుగా!
    అవును, అన్ని ఇల్స్ కీ కారకుడు మోదీయే!
    ఏవిటీ, గుజరాత్ లో చీరలు వేసుకోరా? హూ కేర్స్, ఇది మోదీ తప్పే.

    ReplyDelete
  5. స్త్రీలకు ..రే శ్రీరామరక్ష అని ఆ మధ్య ఒక సినిమాలో అన్నారు మరి.

    ReplyDelete
  6. what about ladies in the puranas and epics. Sita was wearing saree but was kidnapped by Ravana. It is not the dress that saves ladies, it is the approach to women among the women that saves them.

    ReplyDelete
  7. Hi Doctor.. you became latest victim of plagiarism..
    Some shameless people have published this article without acknowledging..
    http://palukuteniyalu.blogspot.in/2015/01/blog-post_0.html

    This has grownup again like cancer.. :(

    ReplyDelete
    Replies
    1. Thanks for the information.

      ఈ వింజమూరి వెంకట అప్పారావు అనే కాపీ పేస్టు రాయుడు నిన్న కూడా నా పాత పోస్టొకదాన్ని తన రచనగా వేసుకున్నాడు - http://palukuteniyalu.blogspot.in/2015/01/blog-post_35.html

      నాకు తెలిసి నా పోస్టు దొంగల్లో ఈ అప్పారావు మూడోవాడు.

      అప్పారావులు అప్పులే కాదు, దొంగతనాలూ చేస్తారు. :)

      Delete
    2. డాక్టరుగారూ,

      ఈ చోరుల సంగతి గొప్ప తమాషా. మీరు గాని వారి చౌర్యం గురించి గాని అల్లరి గాని చేసారంటే గాని వారు మీకు దారుణంగా పిచ్చెక్కిందని కూడా తెగ ప్రచారం చేసేస్తారు. వారి ఆటలు కట్టించేందుకేమన్నా చట్టాలేమన్నా ఉన్నాయేమో చూడండి. లేకుంటే వాళ్ళాడింది ఆట పాడింది పాటగా ఉంది వాళ్ళ వ్యవహారం.

      ఎందుకో గాని నిన్నరాత్రే వింజమూరి శివరామారావుగారిని తలచుకున్నాను, పొద్దున్నే ఈ వింజమూరిని గురించి చదువవలసి వస్తుందనుకోలేదు.

      Delete
    3. పాపం దొంగిలించలేదండి. టపాలని అప్పుగానే తీసుకుని ఉంటారు. అవసరం తీరగానే తిరిగి ఇచ్చేస్తారులెండి.

      Delete
    4. పాపం! అల్ప సంతోషులు :)

      Delete
  8. Ramana gaaru,
    you can avoid copying to some extend by doing this. not sure you tried it already.
    http://crawlist.blogspot.com/2014/05/How-to-disable-Text-selection-in-Blogger-to-preventing-copy-paste.html

    Gopi

    ReplyDelete
    Replies
    1. Gopi garu,

      Now i did it and it's working well. Thanks a lot.

      Delete
    2. పోనీ లెండి.. కాపీ కొట్టి మీ టపా లో నే కామెంటు గా పో 'షూట్' చేస్తున్నా !

      కన్నము వేయు వారలకు తెలియని విద్యయా నీరజాక్షా అని సామెత ఉండనే ఉంది !

      ""ఇందులో అనుకోటానికేవుఁందండీ! 'పడవల పిచ్చయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? ఆ దుకాణం మాదేనండీ! 'పడవల పుల్లయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? అది మా బాబాయ్ కొడుకుల్దండీ! మాది చీర్లేపారవఁండీ! మా బాబాయోళ్ళది రెడీమేడ్ దుస్తుల యాపారవఁండీ! ఆళ్ళు కోట్లకి పడగలెత్తారండీ! మనం మాత్రం యిక్కడే వుండిపొయ్యా...."

      మొత్తం కాపీ జేస్తే బాగోదు !!

      జేకే
      జిలేబి

      Delete
    3. జిలేబీ జీ,

      ఒక ఐడియాని పట్టుకుని అప్పటికప్పుడు సరదాగా రాసేస్తుంటాం. అసలు తెలుగు బ్లాగుల్ని చదివేవాళ్ళే తక్కువ. మళ్ళీ అందులోనే కాపీకొట్టేవాళ్ళు కూడా! నవ్వొస్తుంది కదూ!?

      Delete
  9. అయ్యా, జిలేబి గారు పీకిన పీకుడు అర్ధం కాకపోవడం నిజంగా వారికి శ్రీరామ రక్షే.

    ReplyDelete
  10. కామతురాణాం న పిల్లర్నముసలి - అన్న చిలకమర్తి ఇప్పుడుంటే రేపాతురాణాం న చీరర్నబికిని అనేవారేమో :-)

    అం'తరంగం' (whyweare2066.wordpress.com)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.