"పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. ఇవ్వాళ మీడియా వాళ్ళు మమ్మల్ని 'ఫ్రింజ్ గ్రూప్' అంటూ అవమానిస్తున్నారు." అంటూ ఈమధ్య నా మిత్రుడు తన ఆవేదన వెళ్ళబుచ్చాడు, అతను చాలా యేళ్ళుగా ఆరెస్సెస్‌లో ముఖ్యుడుగా వున్నాడు. నాకతని పట్ల జాలి కలిగింది. పాపం! ఆతను ఎన్నికలప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.
బీజేపీ అనే రాజకీయ పార్టీకి సిద్ధాంత మూలాలు ఆరెస్సెస్‌లో వున్నాయి, ఆరెస్సెస్ బీజేపీని రిమోట్ కంట్రోల్ చేస్తుంటుంది. ఇక్కడ మనం జనతా పార్టీ ప్రభుత్వంలోంచి బయటకొచ్చేప్పుడు వాజ్‌పాయి, అద్వానీలు 'తాము ఆరెస్సెస్ వారైనందుకు గర్విస్తున్నామని' చెప్పిన విషయం గుర్తు తెచ్చుకోవాలి.
పాకిస్తాన్ ముస్లిముల దేశమనీ, భారద్దేశం హిందువుల దేశమనీ - ఆరెస్సెస్ అభిప్రాయం. ఆరెస్సెస్ క్రైస్తవ మిషనరీలాగా కేవలం మతవ్యాప్తి చేసే సంస్థ కాదు. ఆరెస్సెస్ 'హిందూ రాష్ట్ర్' అనే ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో పని చేస్తున్న సంస్థ. మన ప్రధాని ఈ ఆరెస్సెస్ స్కూల్లోంచే పాఠాలు నేర్చుకుని వచ్చాడు.
ఆరెస్సెస్ అనే వృక్షానికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, హిందూ మహాసభ.. ఇట్లా పలు పేర్లతో అనేక పిలకలున్నాయి. ఈ సంస్థల్లో ఎంతో నిబద్ధతతో పన్జేసే కార్యకర్తలున్నారు. ప్రపంచంలో మతాన్ని ఆధారంగా చేసుకుని నడిచే ఏ సంస్థలోనైనా సభ్యులు మొండిగా వుంటారు.
మొన్న ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి రావడానికి ఆరెస్సెస్ ఎంతగానో శ్రమించింది. అందుకో ఉదాహరణ వారణాసి ఎన్నికలు. ఎన్నికలకి చాలా ముందునుండే ఆరెస్సెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈర్ష్య పడేంతగా కష్టపడ్డారు.
మోడీ 'అభివృద్ధి' స్లోగన్‌ని నమ్మో, కాంగ్రెస్ అవినీతికి విసిగిపోయ్యో - ప్రజలు కేంద్రప్రభుత్వాన్ని మోడీ చేతిలో పెట్టారు. ప్రభుత్వం రాజ్యంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఒక సంస్థ. దానికి నియమాలు, నిబంధనలు వుంటాయి. అందువల్ల ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి రాజ్యంగ సంస్థలపై నమ్మకం వున్నా, లేకపోయినా - తప్పనిసరిగా ఒక పద్ధతిగా పన్జెయ్యాలి. కాబట్టి సహజంగానే ప్రభుత్వం నడిపేవాళ్లకి కొన్ని ఇబ్బందులుంటాయి.
బీజేపి విజయం కోసం శ్రమించిన సాధువులు, సన్యాసులు, సన్యాసినులకి ఈ సంగతులు పట్టవు, వారికివి అనవసరం కూడా. వారికి తమ మతతత్వ ఎజెండా అమలే పవిత్ర కార్యం. ఒకరకంగా వారిది ముక్కుసూటి వ్యవహారం. 'వాజ్‌పేయి సమయంలో సంపూర్ణ మెజారిటీ లేదని రాముడి గుడి కట్టకుండా తప్పించుకున్నారు, ఇప్పుడు మనకి అడ్డేమిటి?' అనేది వీరి వాదన.
మొదట్నుండీ - హిందుత్వవాదులకి హిట్లర్, గోడ్సేలు ఇష్టులు. అలాగే - వారికి భారద్దేశం మొత్తాన్ని హిందూత్వ దేశంగా మార్చేద్దామనే ఆశయం వుంది. ఉదాహరణకి - హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కని జనాభా సంఖ్య పెంచుకోవాలనేది వారు ఎప్పట్నుండో ఈ దేశానికి ఇస్తున్న గొప్ప సలహా. ఇవ్వాళ హిందుత్వ పార్టీ అధికారంలోకి రాంగాన్లే ఈ విషయాలకి మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది, అంతే!
వాజ్‌పేయి ఒక ముసుగు మాత్రమేననీ, తమ లక్ష్యం వేరే వుందని (వాస్తవం) చెప్పిన గోవిందాచార్య ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ఇవ్వాళ ఎవరూ కూడా గోవిందాచార్య లాగా తెరమరుగయ్యే ప్రమాదం లేదు. ఎందుకంటే - మోడీ మూలాలు ఆరెస్సెస్‌లోనే వున్నాయి కాబట్టి. ప్రవీణ్ తొగాడియా, అశోక్ సింఘాల్, ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్, సాధ్వి నిరంజన్ జ్యోతి వంటివారిపై చర్య తీసుకునే ఉద్దేశం మోడీకి వుండదు - ఏదో 'షో కాజ్' నోటీసులంటూ షో చేయ్యడం తప్ప. ఎందుకంటే - తామంతా ఒక తానులో ముక్కలే కాబట్టి.
నేడు ప్రజల్ని మోసం చెయ్యడంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో - మనం సంఘపరివార్ శక్తుల నిజాయితీని అభినందించాలి. వారు మనసులో మాట దాచుకోకుండా - తమ అసలు లక్ష్యం ఏమిటో నిర్మొహమాటంగా చెబుతున్నారు. వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు కావున వినేవారిక్కూడా ఎటువంటి కన్‌ఫ్యూజన్ వుండదు. ఆ మాత్రం స్పష్టత వుంటేనే - తమకేం కావాలో, ఎవరు కావాలో ఈ దేశప్రజలు నిర్ణయించుకోగలుగుతారు.
(picture courtesy : Google)
నారదాయనమః
ReplyDeleteటైటిల్ తో తెగిడి టపా లో పొగడటం అంటే ఇదేనేమో ! జేకే !
ReplyDeleteజిలేబి
This comment has been removed by the author.
Deleteఈ టపా దెబ్బతో మీరో నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.
ReplyDeleteనాలుగు రాళ్ళేం ఖర్మ! ఈ మధ్య ఓ రాళ్ళకుప్పనే వెనకేశాను (spam లో)! :)
Deleteఊరందరిది ఒక దారైతె నులికట్టెది ఒక దారంటు ఉండకూడదు.
Deleteమీరు సంఘ్ పరి వార్ గురించి మరిన్ని వివరాలు ఇచ్చారు. నేను ఈ మధ్యనే విన్నాను. ఆయనెవరో మూంజే అంట పాసిస్టు ముస్సోలినీతో స్నేహ సంబాదాలు పెట్టుకొని పాసిజాన్ని దిగుమతి కి ప్రయత్నించారని ఆయన గురించి కాస్త వివరించి పుణ్యం కట్టు కోండి బాబ్బాబు.
నాకు ఒక విషయం మీదే మనదేశపు మేథావివర్గం మీద నిరసన హెచ్చు. వాళ్ళు కాంగ్రెసు తప్ప మరే పార్టీ కేంద్రంలో గాని ఏదైనా రాష్ట్రంలో కాని ఎక్కడన్నా అధికారంలో గనక ఉంటే అక్కడ వల్లమాలిన అల్లరి చేస్తారు. సదరు ప్రభుత్వపు పనితీరులో ఏవైనా లోపాలున్నాయేమోనని స్క్రూగేజీలూ, మైక్రోస్కోపులూ గట్రా పట్టుకొని మరీ పరిశీలిస్తారు అత్యంత నిష్ఠగా. అదే కాంగ్రెసు విషయంలో నైతే, అది ఎంతెంత క్షుద్రమైన పాలన నడిపిస్తున్నా కిమ్మనరు. ఒక్క వ్యాసంకాదు కదా ఒక్క వాక్యం కూడా పొరపాటున కూడా ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్డుతూ మాట్లాడనే మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే ఏంజరుగుతుందో బహుశః వారికి బాగా తెలుసు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు అశాశ్వతాలన్న సంగతీ తెలుసు కాబట్టి అలా చేస్తారన్నమాట మనం అర్థం చేసుకోవాలి మరి, నిన్నటిదాకా ఒక హిడెన్ ప్రైం మినిష్టర్ ప్రభుత్వాన్ని నడిపిస్తే (అది ఎంత దరిద్రంగా ఐనా సరే అది వేరే విషయం) మాట్లాడనివారు, ఈ రోజు వేరే పార్టీ అధికారాన్ని చేపట్టగానే దాని హిడెన్ అజెండాలను గురించి తెగ శోధించేస్తున్నారు, తెగ మాట్లాడేస్తున్నారు. తెగ హైరానపడిపోతున్నారు. భళి భళీ.
ReplyDeleteనాకు మీ కామెంట్ అర్ధం కాలేదు.
Deleteమీరు చెప్పదల్చుకుంది - నేను కాంగ్రెస్‌వాడిననా?
అబ్బే. మీరు కాంగ్రెసువారని నేను అనటం లేదు. మనదేశపు మేథావులందరి లాగానే, మీరుకూడా కాంగ్రెసేతరప్రభుత్వం కాబట్టే విమర్శనాస్త్రాలను వదుల్తున్నారేమో అంటున్నాను. ఒకవేళ కాంగ్రెసువారే దొరతనాన్ని నిలబెట్టుకొని ఉంటే, రాహులయ్య ఎంత అవకతవకగా దాన్ని నడిపిస్తున్నా, మిగతా అందరు దేశవాళీ మేథావుల్లాగానే మీరూ ఆట్టే మాట్లాడే వారు కారేమో నన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నాను. అంతే నండి.
Deleteశ్యామలీయం గారు,
Deleteకాంగ్రెస్ అవినీతికి, అసమర్థకు ప్రతీకగా మరి వుండవచ్చు. కాని ఆ రెండు లక్షణాలూ BJPలో లేక పోతే వాటిని కాంగ్రెస్‌కి అన్వయించ వచ్చు. కాని గతంలో BJP ప్రభుత్వాల్లో కుంభకోణాలు చూశాం. పక్కనే వున్న కర్నాటక BJP ప్రభుత్వంలో కుంభకోణాలు చూశాం. గత ఎన్నికల్లో అది వేల కోట్లు కర్చు పెట్టి గెలిచింది. అటువంటప్పుడు ఆ డబ్బులు రాబట్టుకోవాలనుకోకుండా పరిపాలిస్తుందని ఎందుకనుకోగలం?
ఇక పోతే వంశ పారంపర్యత BJP మొదటి శ్రేణి నాయకుల్లో కనిపించక పోయినా రెండవశ్రేనిలో తప్పకుండా వుంది. ఇలా రెండవ శ్రేణిలో ప్రోత్సహిస్తూ పోతే అది రేపు తప్పనిసరిగా మొదటి శ్రేణిలోకి కూడా వస్తుంది.
ఈ లక్షణాలన్నీ రెండు పార్టీల్లో సరి సమానంగా వుండగా, BJPలో అధికంగా వున్నది మత ఛాందస వాదం. ఇవాళ హిందూస్త్రీ నలుగురు కొడుకులను కనాలి అంటారు. రేపు కాలేజీకి ముసుగుతో రావాలంటారు. ఎల్లుండి నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. అందుకే ఆపార్టీని అనుమానంగా చూసేది.
ఇటువంటి విషయాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పక్షపాతి అని ముద్ర వేయడం సరికాదు. పోస్టులో చర్చించిన అభిప్రాయాలపై మీ అభ్యంతరాలు గనక వుంటే వాటిని తెలియజేయడం శోభస్కరంగా వుంటుందని నా అభిప్రాయం.
శ్రీకాంత్ గారూ, మీరు ఉటంకించిన విషయాల వాస్తవాలను కాస్సేపు పక్కన పెడదాం.
Deleteదేశంలో చదువుకున్న "మధ్యతరగతి" పట్టణ అగ్రవర్ణ మగవారిలో భాజపా/ఆర్యెస్యెస్ మత వాదాన్ని సమర్తించే వారు ఎక్కువన్నది మీరూ ఒప్పుకుంటారని నా నమ్మకం. ఈ వాదానికి ఈ వర్గంలో ఉన్న మద్దతు మీడియాలో కనిపించే మేధావులలో అదే ప్రపోర్షన్ లేదు.
కాంగ్రెస్/వామపక్ష/నాస్తిక/బహుజన/సెక్యులర్ (కాస్త ఓవర్లాప్ ఉన్నా ఇవి వేర్వేరు వర్గాలు) మేధావులు చదువుకున్న "మధ్యతరగతి" పట్టణ అగ్రవర్ణ మగవారిలో ఆవేరేజీ కన్నా ఎక్కువే. వీరందరూ భాజపా/ఆర్యెస్యెస్ మత వాదాన్ని వ్యతిరేకిస్తారు.
Intellegentia does not reflect the articulate educated upper caste "middle class" urban men. This undeniable fact gives raise to antagonistic feelings in this otherwise all powerful group. We need to interpret the resultant outpouring in this context.
శ్యామలీయం గారు,
Deleteరమణ గారు కాంగ్రెస్సు వాది అని అనుకోను. దానికంటే కూడా పెద్ద గ్రూప్ ఒకటి వుంది. అదే ISIS( Indian Sickulars and so called Intellectual's Society ) . అందులో ఎప్పుడో లో చేరిపోయారు. ఒక్కస్సారి ఈ టపాని మళ్ళీ చదవండి. దెనితో మొదలు పెట్టారు, ఎం చెప్పదలుచుకున్నారు, మొత్తానికి ఎవరిని తిడుతూ నింపేశారో అర్దం అవుతుంది.
విమర్శిస్తారు గాని, విమర్శని తట్టుకోలేకపొతున్నారు
కృష్ణ
GK గారు: మీ విమర్శ లేనిపోని ఆరోపణలతో, హేళనలతో కూది చాలా చౌకబారుగా ఉంది. మీకు వీలైతే పోస్టులోని కంటెంతుపై మీ అభ్యంతరాలని నేరుగా వ్యక్త పరచి ఉండుండాల్సింది. please stop attributing the author unduly intensions and such propaganda to colour all the opposition as enimies of the nation.
Deleteహిందూ చాందస మతతత్వ వాదం ఆధారంగా మోడీ గెలువలేదు. అయితే దాన్ని పూర్తిగా వదిలేసుకున్నా ఆయన గెలిచే వాడు కాదు. The religious right vote is an important component of the BJP vote bank but inadequate on its own.
ReplyDeleteఅయోధ్య ఉదంతం పీకులో ఉన్నప్పుడు వినిపించిన सौगंध राम का, मंदिर वही बनाएंगे స్లొగనుకు ఒక పక్కవాద్యం కూడా ఉండేది: मंदिर बनेनबाने सरकार ज़रूर बनाएंगे!
ఇంతకీ ఈ టపా సారాంశం ఏమిటో అర్ధం కాలేదు.
ReplyDeleteహిందువులు ఎక్కువమందిని కని జనాభా పెంచుకోవాలని ఒక భా.జ.పా. రాజకీయ నాయకుడి అభిప్రాయం. దురదృష్టవశాత్తు భావప్రకటనా స్వేచ్ఛపై ఎక్కడలేని ఉపన్యాసాలను దంచే మేధావులు, భా.జ.పా. నేతల విషయానికొచ్చేసరికి ఎక్కడలేని ఆందోళనా వ్యక్తం చేస్తారు! ఆయన తన అభిప్రాయం చెప్పాడే కానీ, అలా ఎక్కువమందిని కనకపోతే చంపుతామని, కంటే డబ్బులిస్తామని మభ్యపెట్టాడా. ఇక్కడి లింకులో ఓ వార్త ఉంది. ఓసారి చదివి చూడండి.
ReplyDeletehttp://timesofindia.indiatimes.com/india/Fall-in-numbers-prompts-Kerala-churchs-call-for-more-children/articleshow/3139315.cms
http://www.bbc.com/news/world-south-asia-15219950
http://old.richarddawkins.net/articles/643410-india-kerala-churches-reward-big-families
శ్యామలీయం గారి వ్యాఖ్యలో రెండు విషయాలు ఉన్నాయి.
ReplyDelete1) ఒకట్రెండు మీడియా సంస్థలు మినహాయించి కాంగ్రెస్ అవినీతిని బయట పెట్టడంలో మీడియా ఎప్పుడూ ముందడుగులో ఉంది. సోనియా back seat driving చేస్తున్నారన్న వదంతుల్నీ పత్రికలు బాగానే మోశాయి. బహుశా మీరు వాటిని convenientగా మర్చిపోయారేమో!
"ఒకవేళ మాట్లాడితే ఏంజరుగుతుందో బహుశః వారికి బాగా తెలుసు." అంత సీనేమీ లేదు. మీరు అనవసరంగా భయప(పె)డుతున్నారని, ఒక villainous image సృస్టించజూస్తున్నారనీ నా అభిప్రాయం. మనదేమీ రష్యాకాదు. ఇక్కడ KGBలాంటి సంస్థలు రహస్యంగా స్టేట్ స్పాన్సర్డ్ అస్సాసినేషనులూ అవ్వీ ఏమీ చెయ్యడంలేదు.
2) మరిప్పుడు భాజపా అభిమానులు చేస్తున్నదేమిటి? ఇదిమాత్రం పక్షపాతం కాదా?
ప్రస్తుతం బాలగోపాల్ 'ముస్లిం ఐడెంటిటీ' చదువుతున్నాను. నాకు బాలగోపాల్ విషయాన్ని సంక్లిష్టంగా చెబుతున్నట్లుగా తోచింది.
ReplyDelete'కాంగ్రెస్ అవినీతి పార్టీ, బీజేపి మతతత్వ పార్టీ - దొందూ దొందే!' అని మొన్న ఎవరో అనంగాన్లే -
'ఎలా అవుతుంది? కాదు గదా!' అనుకున్నాను.
నా ఆలోచనల్ని బాలగోపాల్ కన్నా సింపుల్‌గా (బేసిక్స్‌తో - చందమామ కథలా) రాయాలనే లక్ష్యంతో ఈ పోస్టు రాశాను.
ఈ పోస్ట్ చదివినవారికీ, ఓపిగ్గా కామెంట్ రాసిన వారికీ - అందరికీ ధన్యవాదాలు.
(కామెంట్ పాలసీకి విరుద్ధంగా వున్న కారణాన కొన్ని కామెంట్లు పబ్లిష్ చెయ్యలేదు.)
Nothing wrong with wanting to shape the country in the native culture, ethos and
ReplyDeletereligion. Every country does that, but, in India it raises a hue and cry. Self
flagellation and self goals are our specialty!
Well said
DeleteBJP = Congress - Minority(+SC,ST etc) Appeasement + Communal politics ( Thru RSS + VHP +xyz.sena's )
ReplyDeleteమీరు క్రమంగా మరో 'కత్తి'లా తయారవుతున్నారన్నమాట! ఈ కామెంటు మీకు అర్ధం అవుతుందో లేదో గానీ చాలా మందికి అర్ధం అవుతుంది లెండి :)
ReplyDelete