Tuesday 6 January 2015

బాబోయ్! ఇంకెప్పుడూ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కి వెళ్ళను


మనుషులు నానా రకములు. వీరిలో కొందర్ని దురదృష్టం వెంటాడితే, ఇంకొందరు దురదృష్టాన్నే వెంటాడతారు. అటువంటివారిని దౌర్భాగ్యులు అనొచ్చునేమో! అటువంటి దౌర్భాగ్యుల్లో నేనూ వొకణ్నని చెప్పడానికి మిక్కిలి చింతిస్తున్నాను.

ఆదివారం మధ్యాహ్నం తప్ప విజయవాడ బుక్ ఫెస్టివల్ చూసే అవకాశం నాకు లేదు. అంచేత - నేనూ, నా భార్యా ఎంతో ప్లాన్ చేసుకుని మధ్యాహ్నం మూడింటికి ఇంట్లోంచి బయల్దేరాం. మా డ్రైవర్ చురుకైనవాడు - కరెక్టుగా యాభై నిమిషాల్లో ఫెస్టివల్ గ్రౌండ్‌కి తీసుకెళ్ళిపొయ్యాడు.

ఎండ క్రమేణా వేడిగా, ఉక్కపోతగా అనిపించసాగింది. ఆ ఎండలో - ప్రవేశ ద్వారం దగ్గర బడిపిల్లలు ఏదో స్కూల్ యూనిఫామ్ లో నాలుగైదు వరసల్లో చెమటలు కక్కుతూ ఇరుకిరుగ్గా నిలబడి వున్నారు (ఎందుకో తెలీదు). 

పబ్లిక్ ఎడ్రెస్ సిస్టంలో ఒక స్త్రీ విరామం లేకుండా చెబుతూనే వుంది - 'కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు విచ్చేస్తున్నారు. పిల్లలు మంత్రిగారికి పుష్ప గుచ్చాలు ఇస్తారు. స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు కరతాళ ధ్వనులతో (వీటినే 'చప్పట్లు' అని కూడా అంటారు) స్వాగతం చెప్పండి' - అని.

ఇప్పుడు పిల్లల తంటాకి కారణం అర్ధమైంది. బడిపిల్లల్ని స్వతంత్ర దినాలు, సమైక్యోద్యమాలకే కాదు - పుస్తక ప్రదర్శనలక్కూడా (అందునా సెలవురోజు) వాడేసుకుంటున్నారన్న మాట!

లోపలంతా (వీఐపీ) కార్లు, పోలీసులు, (పోలీసు) జీపులు, (పోలీసు) కుక్కలు - హడావుడిగా వుంది. కొద్దిసేపటికి మంత్రిగారు వచ్చారు. ఆయన తనదైన శైలిలో అనర్ఘళంగా ప్రసంగించడం మొదలెట్టారు. అక్కడంతా హడావుడిగా, గోలగోలగా, దుమ్ముదుమ్ముగా వుంది.

నాకు చాలా చికాగ్గా అనిపించసాగింది. ఇక్కడ వాతావరణం బుక్ ఫెస్టివల్‌లా లేదు - ఏదో తిరనాళ్ళలా వుంది, రాజకీయ నాయకుల ఎన్నికల సభలా వుంది. ఈ సమయంలో నేనిక్కడ వుండటం నా దురదృష్టం. 

స్టాల్స్ కూడా చాలా ఇరుగ్గా వున్నాయి. ఎంత ఇరుగ్గా అంటే - వొకళ్ళనొకళ్ళు రాసుకోకుండా పుస్తకాలు చూళ్ళేం! స్టాల్స్ ఇంకొంచెం పెద్దగా ఏర్పాటు చెయ్యడానికి నిర్వాహకులకి వున్న సమస్యేమిటో తెలీదు. 

హడావుడిగా ఏవో కొన్ని పుస్తకాలు కొనుక్కుని - ఆ గోల్లోంచి బయటపడి 'హమ్మయ్య!' అనుకున్నాం.

చివరాకరికి నేచెప్పేదేమనగా - బుక్ ఫెస్టివల్ మొన్న ఆదివారం నాకు భీభీత్సమైన అనుభవాన్ని మిగిల్చింది. అంచేత -

'బాబోయ్! ఇంకెప్పుడూ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కి వెళ్ళను.'   

(picture courtesy : Google)

18 comments:

  1. మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని "ఇంకెప్పుడూ ఎక్కడా బుక్ ఫెస్టివల్‌కి వెళ్ళకూడదు" గా మార్చుకోండి. అలా కాకుంటే బెజవాడ అభిమానులు మిమ్మల్ని అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది.

    ReplyDelete
    Replies
    1. బెజవాడ అభిమానులా!? ఎవరు?

      Delete
    2. రాంగోపాల్ వర్మ తీసిన బెజవాడ సినిమా అభిమానులు!

      Delete
  2. బెజవాడ అభిమానులేవారా?ఎంత మాట? ఎంత మాటంటివి! సారీ రాస్తివి?
    కానీ నీ కష్టాలని అర్ధం చేసుకోగలను!10 నెలల ముందు విజయవాడ రోడ్ల మీద ప్రయాణించటానికీ ఇప్పుడు ప్రయాణించటానికీ కూడా చాలా తేడా ఉంది!కానీ జయ్ గారన్నట్లు నువ్యా బెజవాడ అనే మాట తొలగించు!
    గౌతమ్

    ReplyDelete
    Replies
    1. సరే! నీ సలహాపై 'గుంటూరు బుక్ ఫెస్టివల్' అని మారుస్తున్నాను! ఒకేనా?

      Delete
  3. దురదృష్టం మిమ్మల్ని వెంటడ లేదు. దాన్ని మీరు వేటాడనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజం నిజం..

      Delete
  4. I appreciate ur boldness to say this on a public platform where book lovers are fanatic to a great extent.

    ReplyDelete
  5. I think this particular frustration was precipitated by the arrival (or anticipated arrival) of a central minister. So, let us amend your resolution as "No one should invite ministers of any kind to book fairs". :)

    ReplyDelete
    Replies
    1. I agree with your amendment. But i am afraid the organisers may not agree with us!

      Delete
  6. అసలే కోతి ..... చందాన, అసలే బెజవాడ, ఆపైన ఆదివారం, ఆపైన మత్రివర్యుల తద్దిన (ఆ రోజు) వాయింపు .. పరిస్థితి ని అర్థం చేసుకోరూ!!!

    ReplyDelete
  7. రమణగారు,
    నేడు రిసోర్స్ క్రంచ్ ఎంతో ఉంది. మనుషులు ఎక్కడ దొరకటంలేదు. అందుకే పిల్లల వెంటపడుతున్నారు. వాళ్ళు ఇంటికి మహా ఎక్కువైతే ఇద్దరుంట్టున్నారు.లేకపోతే ఒక్కరే. మా ఇంట్లో ఫ్రిజ్ ఉంది,కారు ఉంది,యల్.సి.డి. టి.వి ఉంది అని ఎలా చెప్పుకొంటామో, ఒక పిల్ల/పిల్లవాడు ఉన్నాడని చెప్పుకోవటానికి నేటి తల్లిందడ్రులు వారిని కంట్టున్నారు. మీకు తెలిసిందే కదా వారొక్కరే మీటీంగ్ లకు డబ్బులు అడగనిది. ప్రైవేట్ స్కుల్ యజమాన్యం వారిని ఈ విధంగా సేవలకు ఉపయోగించుకొంట్టున్నాది.
    ఇన్నాళూ మీరు మార్క్సిస్ట్ మేధావుల పుస్తక ఆవిష్కరణ సభలకు మాత్రమే వెళ్లినట్లున్నారు. వారి సభలలో అక్కడో మనిషి ఇక్కడో మనిషి, దాదాపు హాలు ఖాళీ గా, రచయిత, ముఖ్య అతిధి, ఒక నలుగురైదుగురు మిత్రులతో సభ ప్రశాంతంగా, హుందాగా నిర్వహింపబడుతుందనే విషయం అందరైకి తెలుసిందే కదా! బహుశా మీరు మొదటిసారిగా బిజెపి మంత్రుల మీటీంగ్ లకి వెళ్ళినట్లున్నారు. అందుకే హడావుడిగా, గోలగోలగా, దుమ్ముదుమ్ముగా వుంది :) కృష్ణా సినేమాలు చూస్తూ పెరిగిన మీతరానికి చిరంజీవి బ్రేక్ డాన్స్ లు చూస్తే వెంటనే జీర్నించుకోవటం కష్టం. మీకు బిజెపి పాలన అలవాటు కావటానికి కొంతకాలం పడుతుంది. మొదట్లో ఇబ్బాంది కలిగినట్లు ఉన్నా, తరువాత అలవాటైపోతుంది. :)

    ReplyDelete
    Replies
    1. // అందుకే పిల్లల వెంటపడుతున్నారు. వాళ్ళు ఇంటికి మహా ఎక్కువైతే ఇద్దరుంట్టున్నారు.లేకపోతే ఒక్కరే. మా ఇంట్లో ఫ్రిజ్ ఉంది,కారు ఉంది,యల్.సి.డి. టి.వి ఉంది అని ఎలా చెప్పుకొంటామో, ఒక పిల్ల/పిల్లవాడు ఉన్నాడని చెప్పుకోవటానికి నేటి తల్లిందడ్రులు వారిని కంట్టున్నారు. మీకు తెలిసిందే కదా వారొక్కరే మీటీంగ్ లకు డబ్బులు అడగనిది. ప్రైవేట్ స్కుల్ యజమాన్యం వారిని ఈ విధంగా సేవలకు ఉపయోగించుకొంట్టున్నాది. //
      అంటే ప్ర యి వేట్‌ యాజమాంయాలు ఇలా కూడా సంపదిస్తున్నాయన్న మాట! ఇక్కడ పిల్లలు కూడా కేవల ప్రెష్టేజెస్‌ సింబల్‌ అన్న మాట. అవును ఇది రోబోల యుగము. కాదంటానికి మనమెవరం? :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete

  8. భలే వారండీ !

    ఆ ఫోటోలో అసలు మనుషులే లేకుండా ఉంటె అసలు జనాలు పుస్తక ప్రదర్శన లకి వెళుతున్నారా ఈ రోజుల్లో అనుకుంటా ఉంటె, మీరేమో మరీ రద్దీ గట్రా రాస్తారు !!

    జిలేబి

    ReplyDelete
  9. you are saved. you did not go to book festival in bezwada on the day when police occupied the ground on the day of chief minister's visit.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.