నిన్నట్నుండి విసుగ్గా వుంది. వార్తా మాధ్యమాల స్థాయి ఎంతగా దిగజారింది! చివరాకరికి 'హిందూ' స్థాయి కూడా! శశి థరూర్ భార్య హత్య చేయబడిందట! అయితే ఏంటంట? (ఈ విషయంపై ఇంతకుముందు 'పాపం! సునంద పుష్కర్' అంటూ ఒక పోస్ట్ రాశాను.)
మన్దేశంలో రోజూ అనేక కారణాలతో హత్యలు జరుగుతూనే వుంటాయి. కానీ - శశి థరూరుని భార్య హత్య గూర్చి అన్ని జాతీయ టీవీ చానెళ్ళల్లో చర్చించారు, దాదాపు అన్ని వార్తా పత్రికల్లో బేనర్ ఐటంగా వచ్చింది! మొదట్లో నాకు ఆశ్చర్యంగా అనిపించింది గానీ, తరవాత విసుగ్గా అనిపించింది.
ఒక ప్రముఖ స్త్రీ మరణానికి కొంచెం కవరేజ్ ఊహించవచ్చు. ఎందుకంటే - ప్రజలకి ఆసక్తి కలిగించే అంశాలని కవర్ చెయ్యడం అనేది వార్తాలతో వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపార ధర్మం. కానీ - మరీ ఇంత అన్యాయమా!?
ఈ వార్తకి సామాజికంగా ప్రాధాన్యత లేదు. పోనీ రాజకీయంగా ప్రాధాన్యం వుందా? ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీకే దిక్కూదివాణం లేదు. అట్లాంటి కాంగ్రెస్ కీకారణ్యంలో శశి థరూర్ అనేవాడు ఓ చిట్టెలుక. ఒక పక్క ముఖ్యమంత్రి స్థాయిలో పన్జేసిన వ్యక్తులే బీజేపీలోకి చేరడానికి సాగిలపడి పొర్లుదండాలు పెడుతుంటే - ఈ చోటా నాయకుడితో బీజేపీకి పనేంటి! లేదు కదా?
నా మటుకు నాకు శశి థరూర్ భార్యని ఎవరు చంపారో బొత్తిగా అనవసరం. అది ఆ నేరం జరిగిన పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చూసుకుంటాడు. ఒకవేళ శశి థరూర్‌కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం వుంటే లోపలేస్తారు, రేపో మాపో శిక్ష వేస్తారు. అప్పుడాయన ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువంతపురం ప్రజల్లో ఒక్కడైనా ఒక్కపూట టీయైనా మానేస్తాడో లేదో తెలీదు.
పాపం! శశి థరూర్ కూడా చీపుళ్ళతో రోడ్లూడుస్తూ మోడీ గుడ్ బుక్స్‌లో వుంటానికి నానా తిప్పలు పడుతున్నాడు. అతని కష్టానికి ప్రతిఫలం వుంటుందో లేదో తెలీదు గానీ - ఈలోపు సుబ్రహ్మణ్యన్ స్వామి వూరుకునేట్టు లేడు! చూద్దాం ఏమవుతుందో!
(picture courtesy : Google)
అయ్యా డాక్టరు గారు,
ReplyDeleteఅసలు మన పత్రికలు ఆ కేసు గురుంచి ఇంత కవరేజి ఇవ్వటమే అర్చర్యంగా వుంది. బహుశా, వాళ్ళు కూడా, ఎండ మారింది, గొడుగు మార్చటం మంచిది అనుకుంటున్నారేమో !
మీరు కొద్దిగ ఉదార వాదుల వైపునుండి మధ్యలోకి వచి, ముందే ఒక అభిప్రాయానికి రాకుండా, కొంచెం సుబ్రమణ్య స్వామి చెప్పేది ఒకసారి వినండి.
ఆ కేసు ఎందుకు అంత ముఖ్యమైందొ తెలుస్తుంది. దుబాఇ నుండి పని చేసే శక్తులు, గత పదేళ్ళుగా మనల్ని పాలించిన "నిజాఇతీ" కలిగిన నాయకులు మరియు వాళ్ళు కష్తపడి సంపాదించిన డబ్బు, ఎలా ముడి పడి ఉన్నయో తెలుస్తుంది. ఆయన సునందగారు చనిపొఇన నాడే చెప్పాడు ఇది హత్య అని.
కాదు, నేను ప్రపంచాని తెలుపు మరియు నలుపులోనే చూస్తాను. ఇది ఇంక తెల్లగా అవలేదు. ఇంకా మచ్చలు వున్నై అని అనుకుంటే, కానివ్వండి!
కృష్ణ
ఐ.పి.ఎల్ అనే క్రీడా పోటీలో సునంద శశి థరూర్ లు ఒక టీం ని కొని .... ఆ తర్వాత ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆ టేం ని నిషేదించడం జరిగింది ...
ReplyDeleteసునంద చనిపోయే ముందు ఐ.ఎస్.ఐ ఏజెంట్ కం జర్నలిస్త్ అయిన పాకిస్తని స్త్రీ తో ట్విట్టెర్ లో గొడవ జరిగింది అందులో దేశ భద్రత కి సంబందించిన డాక్యుమెంట్ల ప్రస్తావన వచ్చింది.
కాస్త సమాచారం సేకరించి పొస్త్ చేస్తే బాగుంటుంది .... సుబ్రమన్య స్వామి అనగానే "ఎర్రగా" మారిపోయి పొస్టు కొట్టేస్థె ....గొప్ప అనిపించుకోదు!!.
శసి థరూర్ విదేశంగ షాఖ మంత్రి!!! ఆ హత్య జరిగినప్పుడు తనొక మంత్రి ....మంత్రి భర్య హత్య ఆత్మ హత్య అని రిపోర్ట్ ఎలా వచ్చింది .... జనానికి తెలియాలి ....
రమణగారు,
ReplyDeleteహిందూ పేపర్ కి ఒక స్థాయి ఉందనుకోవటం ఒక అభూత కల్పన. కోర్టు తీర్పులు, పాలసి డాక్యుమెంట్లలో వాడే, ఇంగ్లిష్ భాషను పేపర్లో వాడి గొప్ప స్టాండర్డ్స్ ఉన్నట్లు భ్రమ కలిపించేది. సోషల్ మీడీయా ఆవిర్భావంతో దాని ప్రభ అంతరించింది. ఏ ఒక్క రోజు అది సగటు మధ్యతరగతి భారతీయుల భావాలను ప్రతిబింబించలేదు, దూరపుకొండలు నునుపన్నట్లు విదేశి భావజాలకు అది ప్రచారం కల్పీంచేది. పేరుకి మాత్రం పెద్ద జాతీయ పత్రిక, స్వరాష్ట్రం తమిళనాడులొ అవినీతిపుట్ట అయిన రాజకీయ నాయకుల పై పోరాడిన చరిత్ర ఉన్నట్లు ఎక్కడా కనపడదు.
రమణ గారు మాత్రమే కాదు. నుతక్కి రాజ శేఖర్ గారు(తెలుగు వార్తలు బ్లాగ్) కూడ హిందు మార్కిస్ట్ పత్రిక అనే భ్రమ లొనె ఉన్నారు.
Delete
ReplyDeleteఆయ్, మా హిందూ వార్ని ఇంతేసి మాటలంటారా ! ఉండండి మీ పని జెబ్తా !
జిలేబి
ఈ పోస్ట్ నాకు నచ్చలేదు. అంత అంతగత్తెను మీరు అంత ఆషామాషీగా తీసిపారెయ్యడం నాకు బొత్తిగా నచ్చలేదు. మిమ్మల్ని ఖండిస్తున్నాను.
ReplyDelete