షావుకారు సినిమా చూశారా?
ఈ సినిమా చూస్తుంటే - సావిత్రి (మధుబాల అయినా పర్లేదు) మన భుజం మీద చెయ్యేసి ఒళ్లోకి తీసుకుని - ప్రేమగా, ముద్దుగా బెజవాడ బాబాయ్ హోటల్ నేతి ఇడ్లీల్ని తినిపిస్తున్నంత హాయిగా వుంటుంది.
షావుకారు పాటలు విన్నవారికి తెలుగు సినిమా పాటల పట్ల గౌరవం పెరుగుతుంది. నాలుక్కాలాల పాటు నిలిచిపొయ్యేవే మంచిపాటలు అంటారు. షావుకారు పాటలు అంతకన్నా ఎక్కువే నిలిచిపొయ్యాయి.
మా వయసువాళ్ళకి 'బీజేపి' అంటే పల్చటి పెదాలతో చిరునవ్వులు చిందించే వాజ్‌పాయి.. టూత్‌బ్రష్ మీసాలు, బట్టతలతో సీరియస్‌గా కనిపించే అద్వాని మాత్రమే. వీళ్ళిద్దర్నీ కొందరు కృష్ణార్జునులతో పోల్చేవాళ్ళు. బీజేపి రాజకీయ ప్రత్యర్ధులు వాజ్‌పాయి కన్నా అద్వానీనే ప్రమాదకారిగా భావించేవాళ్ళు.
కాలం చిత్రమైనది, కఠినమైనది. అందుకే - మృదువుగా, కవితాత్మకంగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ - మరఫిరంగుల్నే పేల్చిన వాజ్‌పాయిని అనారోగ్యంతో కనుమరుగయ్యేలా చేసింది. కారణాలు ఏవైనప్పటికీ - లోహపురుషుడిగా పార్టీలో నీరాజనాలు అందుకున్న అద్వాని కూడా మనకి పెద్దగా కనిపించే అవసరం లేకుండా చేసింది.
ఇప్పుడు నాకు షావుకారు పాట జ్ఞాపకం వస్తుంది. 'మారిపోవురా కాలము, మారుట దానికి సహజమురా!' అవును! ఎంత నిజం!
(photo courtesy : Google)
యేమో లెండి, అడ్వాణీ గారు కూడా సర్దుకు పోయినట్టు వున్నాడు!యెంతకాలం ఆవేసపడినా యేదో ఒకనాటికి విశ్రాంతి అవసరమేగా!భాజపా వాళ్ళు మరీ కాంగ్రెసోళ్ళ మాదిరి చచ్చేదాకా నేనే రంగంలో వుండాలనే ఔరంగజేబులు కాదు.
ReplyDeleteకాలమహిమ! నాకు అంబాసిడర్ కారుని చూసినా 'అయ్యో' అనిపిస్తుంది.
Deleteకాంగ్రెస్ వాళ్ళ ల ఈసురో మంటూ ఉండకుండా, కొంచెం ధైర్యంగా , సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు
ReplyDeleteఅద్వానీని ఇంట్లో కూర్చోబెట్టడం సాహసోపేతమైన నిర్ణయం ఎలా అవుతుంది!
Delete