ముందుగా - కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన పిల్లలకి అభినందనలు.
ఇప్పుడే దక్కన్ క్రానికల్‌లో వారి ఫోటో చూసి ఆశ్చర్యపొయ్యాను. విజయం సాధించినవారిని ఊరేగింపుగా రోడ్లంట తిప్పడం అర్ధం చేసుకోగలం. ఆ వేడుకేదో ఏ ఓపెన్ టాప్ జీపులోనో అయితే బాగుంటుంది కానీ - వారిని ఇలా 'రధం' ఎక్కించి తిప్పడమేమిటి! కొంచెం ఎబ్బెట్టుగా లేదూ?
రాచరిక వ్యవస్థ పోయింది, రాజులూ పొయ్యారు. కానీ కొంతమందిలో రాచరిక భావజాల బూజు మాత్రం బుర్ర నిండా దండిగా వుంటుంది. అది అప్పుడప్పుడూ ఇలా బయటపడుతూ వుంటుంది.
(photo courtesy : Deccan Chronicle)
గెలిచొచ్చిందే ... రాజరికపు పోటీలల్లో ... వాటి సంబరాలు రాచరికం పోకడలో ఉంటేనే అందం అనుకున్నారెమో!
ReplyDeleteనయ్యం మా బక్కన్న బ్రిటన్ పతకాలకి తెలంగానలో సంబరాలెంది అని ఆపలేదు!!.