Friday 29 August 2014

తెలుగు జాతి - తెలుగు రాజధాని


గత సంవత్సరం కొందరు ఉత్సాహవంతులు 'సమైక్యాంధ్ర' అంటూ భీభత్సమైన హడావుడి చేశారు. మైకు కనబడితే చాలు - 'మన తెలుగు భాష అత్యంత తీయనైనది, మన తెలుగు జాతి అత్యంత పవిత్రమైనది. ఈ భాషని నిలువుగా కోస్తారా? ఈ జాతిని ముక్కచెక్కలు చేస్తారా?' అంటూ భారీ డైలాగుల్తో తెగ రెచ్చిపొయ్యారు. 

మన తెలుగు జాతి నిజంగా అంత గొప్పదా? అదే నిజమైనట్లైతే - ప్రస్తుత పరిస్థితుల్లో మన వాదన ఎలా వుండాలి?

"మనది అత్యుత్తమమైన తెలుగు జాతి. కావున - మనకి అన్ని జిల్లాలవారూ సమానులే / మనవారే. అంచేత - తెలుగు సమాజంలోని అన్నివర్గాలవారం, ప్రాంతాలవారం ఒకచోట కూర్చొని - ప్రశాంతంగా / పారదర్శకంగా / శాస్త్రీయంగా / రాజకీయంగా సమాలోచనలు జరిపి రాజధాని నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయంలో కేంద్రప్రభుత్వాన్ని భాగం చేద్దాం. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా - కులమత ప్రాంతీయతలకి అతీతంగా తెలుగుజాతి భవిష్యత్తు అవసరాలకి అనుకూలంగా మాత్రమే వుండాలి."

ఈ వాదనా ధోరణి ఎక్కడైనా కనిపిస్తుంటే - అప్పుడు తెలుగు జాతి నిజంగా గొప్పదేనని ఒప్పుకుని తీరాలి.  

కానీ - యిప్పుడు వాతావరణం ఎలా వుంది?

ఎవరికి ఎక్కడ భూములు వుంటే అదే రాజధానికి అనుకూలం అని వాదిస్తున్నారు.

అధికార పార్టీవాళ్ళు రాజధాని వ్యవహారం తమ ఇంట్లో జరిగే పెళ్ళిలాగా, మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం అన్న రీతిన మాట్లాడుతున్నారు.

అందుకే - ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో రాజధాని కావాలంటున్నారు. 

ఉదాహరణకి - 

గౌరవనీయులైన పెద్దలు అన్నివిధాలా ఆలోచించి - 'కర్నూలు మన రాజధానికి అనుకూలం.' అని నిర్ణయించారనుకోండి. అప్పుడు కృష్ణాజిల్లావాళ్ళు 'మంచిది. కర్నూల్లో వున్నది కూడా మన తెలుగుజాతే కదా! పొన్లేండి.' అని ఊరుకుంటారా? ఊరుకోరు కదా?

కావున మనం అర్ధం చేసుకోవలసిందేనగా -

'తెలుగు భాష, తెలుగు జాతి' అనే భావన రొమేంటిక్‌గా కవితలు, పాటలు రాసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఉగాదినాడు శాలువా పురస్కారాలక్కూడా పనికొస్తుంది. అంతేతప్ప - ఒక ముఖ్యమైన రాజకీయ నిర్ణయానికి ఈ భావన ఏ మాత్రం పనికిరాదు. అంచేత - భాష, జాతి లాంటి శుష్క వాదనలకి స్వస్తి చెప్పి వాస్తవిక దృక్పధంతో ఆలోచన చెయ్యడం నేర్చుకుంటే మంచిది. 

(picture courtesy : Google)

15 comments:

  1. సమైక్య రాష్ట్రంలో జరిగిన పొరపాటుకూ ఇప్పటి రాజధాని గొడవకీ బోడిగుండుకీ మోకాలికీ వున్న సంబంధం వుంది.ఆ శివరాంకృష్నన్ పెద్ద మెంటల్ లాగా వున్నాడు.రాజధానిని వికేంద్రీకరించట మేమిటి నా బొంద? రాజధాని అంటే ఏమిటి?సెక్రటేరియట్, అసెంబ్లీ,హై కోర్టు ఇంకా రాష్ట్ర పరిధిలో వుందాల్సిన శాఖల ముఖ్య కార్యాలయాలు.వీట్ని తలో చోటా తగలేస్తే పరిపాలన యెలా వుంటుందో తెలుసా?ఇప్పటికీ డాక్యుమెంటేషన్ అంతా పేపర్ వర్క్ తోనే జరుగుతుందా లేదా?ఒక ఫైలు ఒక శాఖ అనుంచి మరో శాఖకి వెళ్ళాలంటే పొరుగూరు వెళ్ళాలా?

    ReplyDelete
    Replies
    1. నాకు ఈ విషయాల్లో అంత పరిజ్ఞానం లేదు కానీ - రాజధాని ఎంపిక పారదర్శకంగా జరగాలనే గొంతెమ్మ కోరిక మాత్రం వుంది. :)

      Delete

  2. శివరామకృష్ణన్ రిపోర్ట్ సంగతి అలా ఉంచండి.అసెంబ్లీ ని సమావేశపరచి అన్ని ప్రాంతాలవారిని ఒప్పించి ఒకచోట రాజధానిని నిర్మిస్తే బాగుంటుంది.పోనీ ఒకే కేంద్రంలో అన్ని ఆఫీసులూ రాజధానిలో పెట్టుకొన్నా హైకోర్టుమాత్రం ఇంకొక ప్రాంతంలో పెట్టాలి.అసలు విజయవాడ- గుంటూర్ల కన్నా విశాఖపట్టణమే రాజధాని కి సరియైన పట్టణం. నేను ఆ ప్రాతం వాడినే ఐనా అక్కడ రాజధానిని కోరుకోటంలేదు.ఎందుకంటే మిగతాప్రాంతాలవారికి దూరం కాబట్టి. రాయలసీమ వారి వాదనలను కూడా పట్టించుకోవాలి. అంతేకాని విజయవాడవాళ్ళ లాగ పెత్తనం చేస్తో మొంకు పట్టు పట్టకూడదు.ఆ ప్రాంతంలో భూములు కొనేసి కోట్లు గుమ్మరించి మేమేది చేసినా చెల్లుతుందని డామినేట్ చేస్తే ఎలాగ?నా అభిప్రాయంలో ఎలాగూ కొత్తనగరాన్ని నిర్మించుదామనుకొంటున్నారు కాబట్టి ఒంగోలు జిల్లా-గుంటూరు జిల్లా సరిహద్దుల్లో రాజధానిని నిర్మించి,హైకోర్టుని కర్నూలులో పెట్టితే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      >>ఆ ప్రాంతంలో భూములు కొనేసి కోట్లు గుమ్మరించి మేమేది చేసినా చెల్లుతుందని డామినేట్ చేస్తే ఎలాగ?<<

      జరుగుతున్నది అదే!

      Delete
  3. // భాష, జాతి లాంటి శుష్క వాదనలకి స్వస్తి చెప్పి వాస్తవిక దృక్పధంతో ఆలోచన చెయ్యడం నేర్చుకుంటే మంచిది. ల్ల్‌,,,,,,,,;] //
    నిజం చెప్పారు! మళ్లీ మినహాయింపులు ఇవ్వకండి. అంతా దేనిమీద నడవాలో దానిమీద నడుస్తున్నప్పుడు మళ్ళీ ఈ భాష అనే సెంట్‌ మెంట్‌ రాజకీయాలెందుకు? ఎందుకంటె అదికూడా నల్లేరు లో ఒక పీచుగా నైనా ఉపయోగ పడాలి గనుక! ఉడత సేవలా!

    ReplyDelete
  4. రమణ గారు,
    మీరు కూడా వాస్తవ పరిస్థితి లోకి రావాలి. మీరింకా ఒకప్పుడు సౌత్ లో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పౌరుడిలా అనుకొంట్టున్నట్లు ఉన్నారు. మీరు రాసే టపాలలో లీలగా ఆ అహంకార/గొప్పదనం భావన తొంగిచూస్తూంట్టుంది. ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జర్ఖండ్,చతిస్ గడ్ లాంటి చిన్న రాష్ట్రమని, జై గారు వచ్చి మీబ్లాగులో వ్యాఖ్యలు రాసినంత మాత్రాన తెలంగాణా, ఆంధ్రా ప్రజలు ఒకటి గాదని గుర్తుంచుకోవాలి :)

    ReplyDelete
    Replies
    1. >>మీరు రాసే టపాలలో లీలగా ఆ అహంకార/గొప్పదనం భావన తొంగిచూస్తూంట్టుంది.<<

      అవునా!

      Delete
    2. రమణగారూ పాపం ఆ శ్రీరామ్‌గారి మీద కొంచెం‌జాలిపడండి. ఎవరో ఆలంకారికుడు ఆనందవర్థనుడు అనే ఆయన చెప్పినట్లు యధాస్మై రోచతే విశ్వం తదే దం పరి వర్తతే (అంటే మనం ఏదృష్టితో చూస్తామో ప్రపంచాన్ని మనకి అది అలాగే మారి కనిపిస్తుందీ అని.) మీకు అహంకారమో సింగినాదమో ఉందీ‌ అని శ్రీరామ్‌గారు ఒక అభిప్రాయానికి వచ్చి స్థిరపడ్డాక ఆయనకు మీరు ఏది వ్రాసినా మీరు అలాగే అహంకారిలాగే కనిపించి తీరుతారు మరి! ఇకపోతే జైగారు అంటే జైగొట్టిముక్కలవారు తెలంగాణావాది కాబట్టి ఐనా ఆయనేదో ఇరురాష్ట్రాల ప్రజలు ఒక్కటే అని అన్నా ఆయనకు ఎదో ulterior motive తోనే అయ్యుంటుంది అని శ్రీరామ్‌గారి అనుమానం కాబట్టీ ఆయన మాటల్ని మీరు ఖండించేయకుండా ఉండటం వలన మీరు ఇంకా తెలుగ్జాతి మనది అన్న భావనలోనే ఉండి సరిగా చూడలేకపోతున్నారని సదరు వ్యాఖ్యాతగారికి అభిప్రాయం కలిగి దానిక్కారణం కూడా మీ అహంకారమే అని నిశ్చయం ఐపోయినట్లుంది. ఏతావాతా రాజకీయాల వెనుక మీరు పడనవుసరం లేదు పొరబాటున తలెత్తి చూశారో అవి మీ వెనకాలే పడతాయి ఏదోరకంగా.

      Delete
    3. శ్యామలీయం గారు,
      మీరు, రమణ గారు, నిరంహారులని మీకు నమ్మకమేమో నాకు మాత్రం అహంకారం ఉంది. నేను చేసిన ఆరోపణను సమయం వచ్చినపుడు నిరూపిస్తాను. మీరు ఓపిక పట్టండి.

      Delete
    4. శ్రీరాం గారు,

      అందరం అందరి అభిప్రాయాల్ని హాయిగా రాసుకుంటున్నాం. ఇలా రాసుకోవటం - మనకి ఒక హాబీ మాత్రమే. మీ కామెంట్లన్నీ పబ్లిష్ చేస్తున్నాను. మీపట్ల నాకు గౌరవం వుంది.

      రాసే దురదతో పోస్టుతుంటానే కానీ, నేను సీరియస్ బ్లాగర్ని కాదు.

      నేరాస్తున్న పోస్టుల్ని తెలుగు బ్లాగర్లు ఓపిగ్గా చదువుతున్నారు. వారికి ధన్యవాదాలు.

      నా పోస్టుల్లో అహంకారం / గొప్పదనం తొంగిచూసినా కొంపలు మునిగేదేముంది చెప్పండి?

      నా రాతలు (పబ్లిష్ చేసేముందు) ఎవరితోనైనా సెన్సార్ / ఎడిట్ చేయిద్దామన్నా, అది కుదరని పని కదా!

      మీరు కష్టపడి నిరూపించనవసరం లేకుండా ఇక్కడే ఇప్పుడే వొప్పేసుకుంటున్నాను -

      "నాకు అహంకార / గొప్పదనం భావం వుంది."

      సరేనా!

      Delete
  5. ఎదుటివాడి దగ్గరున్నదాన్ని భాగం పంచుకోవలంటే, పొత్తు కలుపుకోవాలి. పొత్తు కలుపుకోవాలంటే ఇద్దరి మధ్యన ఉన్న సామ్యమేదో చూపాలి.

    ఉదాహరణకు తమిళునితోనో, కన్నడిగుడితోనో పొత్తు కలుపుకోవాలంటే మనం దక్షిణ భారతీయులం అనాలి. అదే హైదరాబాదు వాడితోనైతే మనది తెలుగుజాతి అనాలి. అదే మోడీతో అనుకోండి... ఇద్దరిదీ అభివృద్ధి ఎజెండా అని చెప్పుకోవాలి (ఒకప్పుడు మతోన్మాది అని తిట్టినా సరే).

    ఇదంతా అఏదో ఒక లబ్దిని ఆశించినప్పుడు మాత్రమే. పొత్తు వల్ల ఉన్నది పోతుంది అనుకున్నప్పుడు (ఉదా: రాజధాని), అలాంటి సామ్యాలు (తద్వారా పొత్తునూ) వీలయినంత వరకు వదిలివేయాలి. ఇప్పుడు అదే జరుగుతోంది.

    ReplyDelete
    Replies
    1. మీరిలా కుండ బద్దలు కొట్టరాదు. :)

      Delete
  6. రమణ గారూ, అప్పుడెప్పుడో అవసరమయితే రాజధానికి మీ ఇల్లు స్థలాలు ఇస్తానన్నారు. అలాంటి ఉపద్రవం తప్పింది కాబట్టి హాయిగా ఉన్నట్టు ప్రస్తుత టపాలో అనిపిస్తుంది.

    ఇల్లలకగానే పండుగ కాదు. బెజవాడ వెతిరేకులు శివరామకృష్ణన్ ప్రభ్రుతలను తప్పుదోవ (లేదా అంతకన్నా ఇంకా ఎక్కువేదో) పట్టించినమాత్రాన కొంపలు అంటుకుపోవు. ఎకరానికి 10 కోట్ల వరకు పలికే భూములు అసమదీయుల వద్ద ఉండగా రాజధాని వేరే చోటికా? పసుపనే రంగు బెజవాడ అనే ఊరు కృష్ణా అనే నది ఉన్నంతకాలం జరగదు, జరగనివ్వరు.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నూటికి నూరుపాళ్ళు వాస్తవం.

      ఏదో - ఈలోపు కొద్దిసేపు కొంచెం ఆనందం. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.