"మరి నీ భార్యని పుట్టింటికి పంపించేశావెందుకు?"
"మాట తప్పే మనుషులంటే నాకు అసహ్యం. ఇస్తానని ఒప్పుకున్న కట్నాన్ని పెండింగ్ పెట్టాడు మా మామ దరిద్రుడు. ఆ కట్నం వసూలయ్యేదాకా నా భార్యని ఇటు రావొద్దన్నానే గానీ - నాకు నా భార్యంటే మిక్కిలి గౌరవం."
"బయట టాక్ వేరేలా వుందే! నువ్వు కట్నం బాకీకి పదిరూపాయిలు వడ్డీ కట్టి, ఆ వడ్డీకి చక్రవడ్డీలేస్తున్నావని.."
"అవన్నీ పుకార్లు. నమ్మకు."
"మీ అమ్మని వృద్ధాశ్రమంలో వుంచావెందుకు?"
"అమ్మకి గుండెజబ్బు. బాధతో తెల్లవార్లు ఒకటే మూలుగుతుంటుంది. ఆ బాధ చూళ్లేక వృద్ధాశ్రమంలో చేర్పించానే గానీ - నాకు అమ్మంటే మిక్కిలి గౌరవం."
"బయట టాక్ వేరేలా వుందే! ఆవిడ ఆస్తిని నీ పేర రాయించేసుకుని వదిలించుకున్నావని.. "
"అవన్నీ పుకార్లు. నమ్మకు."
"నీ ఇంట్లో ఒక స్త్రీ... "
"ఓ! ఆవిడా? తను నా స్నేహితుడి భార్య. పాపం! భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో వుంటే, ఇంట్లో ఆశ్రయం కల్పించాను. చెప్పానుగా! నాకు ఆడవాళ్ళంటే మిక్కిలి గౌరవం."
"బయట టాక్ వేరేలా వుందే! ఆమెని నీతో వుంచుకోటానికి నువ్వే ఆమె భర్తని లేపేశావని.. "
"అవన్నీ పుకార్లు. నమ్మకు."
(picture courtesy : Google)
ఈ మధ్య ఎమన్నా తెలుగు పేపర్లు చదివారా ???
ReplyDeleteలేదు. ఎందుకని అడుగుతున్నారు?
Deleteఇవన్నీ వట్టి పుకార్లు నమ్మకండి! ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అంతా ట్రాష్స్! అంతా పాంటసీ! :)
ReplyDeleteనమ్మొద్దనే నేనూ చెబుతున్నాను. :)
Deleteకొడవటిగంటి కుటుంబరావు 'గల్పిక'లు చదివే వుంటారు. అప్పుడప్పుడు అవి గుర్తొచ్చి, ఇలా రాస్తుంటాను. అదీ సంగతి!