Sunday, 28 September 2014

ఒక జయలలిత అభిమాని ఆవేదన


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి శిక్ష పడ్డందుగ్గానూ ఆమె అభిమానులు పరమ ఘోరంగా ఏడుస్తున్నారు. ఈ స్థాయిలో ఏడుస్తున్నారంటే వారికి జయలలితంటే ఎంత అభిమానమో అర్ధమవుతుంది. మరీ వారంత కాకపోయినా - నాక్కూడా కొంత బాధగానే వుంది. అందుకు నాకున్న కారణాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి.

ఇప్పటి కుర్రాళ్ళు కత్తిలాంటి కత్రీనా కైఫ్‌ని వేడినిట్టూర్పులతో భారంగా చూస్తున్నట్లే - ఒకప్పుడు మేం నోరు తెరుచుకుని జయలలితని చూస్తుండేవాళ్ళం. మాదప్పుడు స్కూల్ వయసు కాబట్టి - మా ఎత్తుకు తగ్గట్టుగా పొట్టిగా, బొద్దుగా, ముద్దుగా వుండే జయలలిత అంటే చాలా ఇష్టంగా వుండేవాళ్ళం.

ఒకటా రెండా! ఎన్నని చెప్పను? జయలలిత బొచ్చెడన్ని సినిమాలు చేసింది. చిక్కడు - దొరకడు, గోపాలుడు - భూపాలుడు, కదలడు - వదలడు, గండికోట రహస్యం వంటి జానపద చిత్రరాజముల్లో ఎంతో హుషారుగా ఎన్టీఆర్‌తో స్టెప్పులేసింది (జయలలిత గొప్ప సాహసవంతురాలని నాకప్పుడే అర్ధమైంది).

ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకి వచ్చావా?  అంటూ 'తిక్కశంకరయ్య'లో రామారావుని ఆట పట్టించింది. ముత్యాలజల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే  అంటూ 'కథానాయకుడు'లో వర్షంలో తడుస్తూ గెంతులేసింది. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో  అంటూ 'అదృష్టవంతులు'లో క్లబ్బులో నర్తించింది.

ఆవిడ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి పొయ్యాక పురచి తలైవి అనీ, అమ్మ అనీ ఏవేవో పేర్లతో ప్రసిద్ధి చెందింది. అనేక ఎత్తుపల్లాలు చూసింది. జయలలిత పట్ల తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో కూడా నాకు జయలలిత పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు. ఇందుకు ఒకప్పటి నా జయలలిత ఇష్టమే కారణమని నా అనుమానం.

నేను చూసిన అనేక సినిమాల్లో హీరోయిన్‌గా చేసి నన్ను మిక్కిలి ఆనందింపచేసిన జయలలితకి గౌరవనీయులైన శ్రీకోర్టువారు శిక్ష విధించడం నన్నెంతో బాధకి గురిచేసింది. ఈ బాధ పూర్తిగా వ్యక్తిగతమైనదని మరొక్కసారి మనవి చేసుకుంటూ - జయలలిత కోసం గుండెలు బాదుకుంటూ ఏడ్చేవారి పట్ల సంఘీభావాన్ని తెలుపుతున్నాను!

(photo courtesy : Google)

9 comments:

  1. డిటో ...
    మరో సంఘీభావం ...

    ReplyDelete
  2. రమణ గారు,
    ఇప్పుడే అందిన వార్త.
    https://www.youtube.com/watch?v=HfnoAMYWplk

    ReplyDelete
  3. పోండీ డాట్రారు! మీ తరమంవాళ్లంతా ఇంతే! సమయ సందర్బం లేని చొళ్ళు.:)

    ReplyDelete
    Replies
    1. తిరుపాలు గారు,

      అన్నది మీరేనా? విన్నది నేనేనా? ఏదోలేండి! ఈ రోజుల్లో కుర్రాళ్ళలా మాకు సమయం సందర్భం లేకపోవచ్చు. కానీ - ఆ రోజులే వేరు! ఆ ఆప్యాయతలే వేరు!

      (గుమ్మడి వలె గుండె పట్టుకుని, నిట్టూరుస్తూ చదుకొనవలెను).

      Delete
  4. “Jayalalithaa was taken aback completely, as she had been made to believe by her team of lawyers that she would be acquitted,” says a source who was present during the proceedings. In fact some say, she had even told her driver that they would be back to leave at 12.30 pm.

    Though the judge pronounced the conviction around 11.30 am, there was no way to make calls and tell the media, or politi“Jayalalithaa was taken aback completely, as she had been made to believe by her team of lawyers that she would be acquitted,” says a source who was present during the proceedings. In fact some say, she had even told her driver that they would be back to leave at 12.30 pm.

    Though the judge pronounced the conviction around 11.30 am, there was no way to make calls and tell the media, or politicians and supporters waiting outside.

    http://www.thenewsminute.com/news_sections/1540cians and supporters waiting outside.

    http://www.thenewsminute.com/news_sections/1540

    ReplyDelete
  5. అన్నది మీరేనా? విన్నది నేనేనా? ....సంపూర్ణ రామాయణంలో జమునతో గుమ్మడి డైలాగ్ కదా...హ హ్హహ్హ...
    అదీ కాక తిరుపాలు గారిది కూడా మీ తరమే కదా...? అంటే మీరు మీరు కలిసి ఈ తరం వాళ్లని అపహాస్యం చేస్తున్నారా....? అన్యాయం

    ReplyDelete
  6. చందు తులసి గారు,
    వారి తరం, మీ తరం అయినది నాతరం కాదు! :)

    ReplyDelete
  7. మిగతా రాజకీయ నాయకులకు ఉన్న తెలివితేటలు జయలలితకు లేకపోయినందుకు నిజాంగా బాధ పడాల్సిందే సార్! ఉదాహారణకు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగారి ఆస్తి కేవలం 34 లక్షలేనట! మిగతాది మొత్తం కొడుకూ, కోడలూ, భార్యా, బినామీలదేనట! పాపం పెళ్ళీ పెటాకులు లేనందుకేమో, జయలలితకు ఆ ఫెసిలిటీ లేకపోయింది!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.