Friday 8 August 2014

మన ఎంపీగారి గొప్పసలహా


నిన్న పార్లమెంటులో మన తెలుగు ఎంపీగారు 'ఆడవాళ్ళు హుందాగా వుండే దుస్తులు ధరించాలని' గొప్ప సలహా ఇచ్చారు. సాధారణంగా ఇట్లాంటి అమూల్యమైన సలహాలు ఏ మతపెద్దల నుండో, మతతత్వ రాజకీయ పార్టీలవాళ్ళ నుండో వింటుంటాం. అయితే ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఈ విధమైన సలహా ఇవ్వడం ఆశ్చర్యమే. 

నాకయితే మన ఎంపీగారు పురుషాహంకారంతో మాట్లాడినట్లు అనిపించలేదు. ప్రసంగం ఆయనే రాసుకున్నాడో, ఎవరన్నా రాసిచ్చారో తెలీదు గానీ - చివర్లో కొంత గుమ్మడి మార్కు ఫినిషింగ్ టచ్ ఇద్దామనుకుని (గొప్ప కోసం) అలా చదివాడనిపిస్తుంది. మీడియావాళ్ళతో ఆయన తత్తరపాటు చూస్తే ఆయనకసలు తను మాట్లాడింది 'తప్పు' అనికూడా తెలిసినట్లుగా లేదు పాపం!

గత కొంతకాలంగా కోస్తాంధ్ర ఎంపీలుగా పారిశ్రామికవేత్తలే ఎన్నికవుతున్నారు. ఇది తెలుగువారికి గర్వకారణం. మనవాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించిన తరవాత, ప్రజాసేవ చెయ్యాలనే ఉత్తమ తలంపు కలిగి, ఎంతో కష్టపడి తమ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఎంతో ఆనందదాయకం. వీరు ఎంపీలుగా అయ్యేది తమ వ్యాపార అభివృద్ధి కోసమేనని కొందరు గిట్టనివాళ్ళు అంటారు. ఇది కేవలం కుళ్ళుబోతు వాదన. 

'టు ఎర్ ఈజ్ హ్యూమన్' అన్నారు పెద్దలు. మనమందరం తప్పులు చేస్తూనే వుంటాం. చాలాసార్లు చేసేది తప్పు అని తెలీకే చేస్తుంటాం. అమెరికావాడు వరలక్ష్మి వ్రత మహత్యం గూర్చి, ఆఫ్రికావాడు ఆవకాయ గూర్చి మాట్లాడుతున్నప్పుడు వినడానికి బహుముచ్చటగా వుంటుంది. అందులో తప్పులున్నా అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదు. కారణం - వాళ్ళు ఆ మాత్రం మాట్లాడమే గొప్పవిషయం!

(photo courtesy : Google)

13 comments:

  1. ఆరేళ్ళ పసిపిల్లలపై జరిగే అత్యాచారాలకు ఏ వస్త్రధారణ కారణమో కూడా చెబితే బాగుండేది.

    ReplyDelete
  2. సార్‌, ఈ రోజు వరలక్ష్మి వ్రతం. ఆయన స్త్రీలను వరలక్ష్మి లా దుస్తులు ధరించి దేవతలా ఉండమన్నారు. తప్పేంటండీ? మీరు మరీను! అది మన సాంప్రాదాయం. అది చెప్పడం కూడా తప్పే! అమ్మో! అమ్మో!
    అయినా కొందరు గిట్టనివాళ్ళు ఇలాగే అంటారు లెండీ. ఇది కేవలం కుళ్ళుబోతు వాదన. అయినా తెలవక అడ్గుతున్నాను. ఏలిన వారు ఎవరనుకుంటున్నారు మీరి? తప్పును తిరగేసి చెపుతున్నారు?

    ReplyDelete
  3. దొంగలున్నారు జాగ్రత్త...అని చెప్పడంలో తప్పుందటే...ఇదీ తప్పే...

    ReplyDelete
  4. సాధారణంగా ఇట్లాంటి అమూల్యమైన సలహాలు ఏ మతపెద్దల నుండో, మతతత్వ రాజకీయ పార్టీలవాళ్ళ నుండో
    రమణ గారు,
    సమజం గురించి సలహాలు ఇవ్వటానికి లెఫ్ట్ లిబెరల్స్ మాత్రమే ఎమైనా పేటంట్ హక్కు ఉందా?

    ReplyDelete
    Replies
    1. Ramana Gaaru,
      You did not answer my question. I am waiting for your reply.

      Delete
    2. Dear SriRam గారు,

      We know each other too well. I respect your views. Let's not get into argument, because it would a waste of time for both of us. Blogging is just a hobby for me and i'm fully aware that many people disagree with my views and that's it.

      Hope i answered you. :)

      Delete
  5. I fully agree with Murali Mohan garu..100% correct..

    ReplyDelete
  6. స్వంత ప్రసంగం కాకున్నా చానెల్స్ లో వివరణ ఇచ్చుకోడానికి స్వంతంగానే తిప్పలు పడ్డట్టున్నాడు . తను మాట్లాడింది తప్పు అని ముందు తెలియకపోతే ఇప్పుడన్నా తెలియచెయ్యాలి కాబట్టి వివాదం. లేదా అటువంటి మూర్ఖులకి ప్రతినిధి గా ముద్ర వెయ్యబడతాడు.

    ReplyDelete
  7. అసలు లోపం వస్తాల్లో లేదు, మనం చూసే చూపులో వుంది.విలువలకూ వలువలకూ వాటి కంటూ సొంత అస్తిత్వం లేదు.మనం గట్టిగా పట్టుకుంటేనే మనని అతుక్కుని వుంటాయి.వొదిలేస్తే జారిపోతాయి.

    స్త్రీ వైపు కామ దృష్టితో చూసేవాడు నిండుగా కప్పుకున్నా లెక్క చెయ్యడు.ఇంతకు ముందు జరిగిన, ఇప్పుదు జరుగుతున్న, ఇకముందు జరగబోయే మాంభంగాలకు గురయ్యేది వొంటి నిండా బట్తలు తొడుక్కుని తల దించుకు తిరిగే మధ్య తరగతి ఆదపిల్లలే!ఆ వలువల్ని విప్పసి నిస్సిగ్గుగా తిరిగే మదవతులు ఈ రేపిష్టులకి అందనంత యెత్తులో వున్నారు!

    సమస్య వస్త్రధారణకి సంబంధించినది కాదు, గమనించండి?!

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. మురళీమోహన్ ఏమన్నాడో పక్కన పెడితే, నాదో ధర్మ సందేహం.

    ఆడవాళ్ళు డీసెంట్‌గా డ్రెస్ చేసుకోమంటే తప్పు అంటున్నారు. ఇన్‌డీసెంట్‌గా డ్రెస్ చేసుకోమంటే ఒప్పు అంటారా?

    ReplyDelete
    Replies
    1. Others cannot determine one's sense of decency. Would it be okay for me to brand Jeans as indecent and proscribe the same for you?

      I personally don't find the MPs comments offensive but when some people try to rationalize the sexual harassment by blaming it on the victims' dress or taste, I find such argument perverse. By the way he respectable MP could have encouraged us respect one's individuality and their liberty of deciding what is good for them.

      I think we are taking the comments of an MP too seriously. I don't think he deserves even criticism :-)

      Delete

comments will be moderated, will take sometime to appear.