Thursday 20 November 2014

పాలగుమ్మి సాయినాథ్


మనిషికి డబ్బెందుకు? బ్రతకడానికి డబ్బు అవసరం. సుఖమయ జీవనం కోసం కూడా డబ్బు చాలా అవసరం. ఆపై ఆ డబ్బు అవసరం ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఆయా వ్యక్తుల ఆలోచనా సరళి బట్టి వుంటుంది. 

మనిషి జీవనానికి అనేక వృత్తులు. అన్ని వృత్తులు ఒకేలా వుండవు. కొన్ని వృత్తులు రెండువైపులా పదునున్న కత్తిలా ప్రత్యేకమైనవి.  

ఇందుకు ఒక ఉదాహరణ - వైద్యవృత్తి. ఈ వృత్తిలో ఎంతగానో సంపాదించే అవకాశం వున్నా - అసలా ఆలోచనే లేకుండా - రోగుల సేవ కోసం మాత్రమే పరితపించిన వైద్యులు నాకు తెలుసు. అలాగే - సంపాదనే ధ్యేయంగా రోగుల రక్తం పీల్చి బలిసిన వైద్యులూ నాకు తెలుసు.

ఇంకో ఉదాహణ - పత్రికా రంగం. ఈ రంగంలో - కనీస విలువలు లేనివారి నుండి, ఎంతో నిబద్దత కలిగినవారిదాకా అనేకరకాలైనవారు వుంటారు. పత్రికా విలేఖరులు భాధ్యతా రాహిత్యంగా పన్జేస్తారని ఒకప్పుడు అనుకునేవాణ్ని. పతంజలి 'పెంపుడు జంతువులు' నవల చదివాకా - నా అభిప్రాయం మార్చుకున్నాను.

దేవాలయాలు పవిత్రమైనవే - అందులో పన్జేసే ఉద్యోగులు పవిత్రులు కానక్కర్లేదు. ధర్మాసుపత్రులు పేదల సేవ కోసమే - ఆ ఆస్పత్రి వైద్యులు సేవాతత్పరులు కానక్కర్లేదు. పత్రికా రంగం భాధ్యతాయుతమైనదే - ఆ పత్రికల్ని నడిపే యాజమాన్యాలు భాధ్యాతాయుతులు కానక్కర్లేదు.  

కావున - కొన్ని వృత్తులు ఒకవైపు నుండి - ఎంతో బాధ్యతాయుతమైనవీ, పవిత్రమైనవీగానూ.. ఇంకోవైపు నుండి - చాలా దరిద్రపుగొట్టువీ, దుర్మార్గమైనవీగానూ నేను భావిస్తున్నాను. అనగా - ఇవి విఠలాచార్య సినిమాలో కత్తి వంటివి. ఆ కత్తిని హీరో ఎన్టీఆర్ సద్వినియోగం చేస్తే, విలన్ రాజనాల దుర్వినియోగం చేస్తాడు.

'ది హిందూ' పత్రిక రూరల్ రిపోర్టర్‌గా పన్జేసిన పాలగుమ్మి సాయినాథ్ తన వృత్తికి వన్నె తెచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆయన రైతు సమస్యల గూర్చి అనేక వ్యాసాలు ప్రచురించాడు. ఆ వ్యాసాలు చదివిన నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. రైతుల జీవనం గూర్చి ఏమాత్రం అవగాహన లేని నేను - రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో అర్ధం చేసుకున్నానంటే - అందుక్కారణం పి.సాయినాథ్ రచనలే.

పి.సాయినాథ్ తెలుగువాడు. మనిషన్నాక - ఏదోక భాషలో పుట్టక తప్పదు. అంచేత - ఫలానా వ్యక్తి 'తెలుగు తేజం' అంటూ తెలుగు వార్తా పత్రికల వికార భాష నేను రాయను. ఈ దేశంలో ఆకలికి, దరిద్రానికి మూలాల్ని శోధించే వ్యక్తి - తమిళ తేజమైనా, కొంకిణీ తేజమైనా మనకొచ్చిన ఇబ్బంది లేదు. 

పత్రికా రంగంలో పి.సాయినాథ్ చేసిన కృషి చాలా విలువైనది. ఈనాడు మనక్కనిపించే మనిషి మనిషి కాదు, వార్త వార్త కాదు. వార్తలు వినోద స్థాయికి దిగజారుతున్న సరికొత్త యుగంలో మనమున్నాం. అంచేత - ఇవ్వాళ ఇంతకుముందు కన్నా - నిజాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా, నిబద్దతతో రాయగలిగే మరింతమంది సాయినాథ్‌ల అవసరం మనకుంది.  

సాయినాథ్ ఈమధ్య హిందూలోంచి బయటకొచ్చేశాడు. మంచిది! ఇప్పుడింక బంధాలేవీఁ వున్నట్లుగా లేవు - హాయిగా, ప్రశాంతంగా పన్జేసుకోవచ్చు. 

పాలగుమ్మి సాయినాథ్‌కి అభినందనలు. 
     
(photo courtesy : Google)

11 comments:

  1. నిక్కచ్చిగా నిబద్ధతతో వార్త రాయగలవారు చాలా మందే ఉన్నారు.........కాని ప్రచురించే పత్రికలున్నాయా>>>? అనే సందేహం.

    ReplyDelete
  2. సాయినాధ్ మంచి జర్నలిస్ట్. ముఖ్యంగా పల్లెలపట్ల, రైతుల పట్ల వార్తలెలా ఉండాలి అన్న పాజిటివ్ వైఖరి వ్యక్తి. శర్మ గారన్నట్లు చాలా మంచి జర్నలిస్టులున్నా వాటిని యధాతధంగా ప్రచురించే దమ్మున్న యాజమాన్యాలు లేవనేది సత్యం.

    ReplyDelete
  3. సాయినాద్ లాంటి జర్నలిస్టులు ఉండడం అరుదు-ముఖ్యంగా ఇటీవలీ కాలంలో. జర్నలిస్టులే కాదు ప్రొఫెషంకు ముఖ్యత్వం ఇచ్చి సంపాదనా సెకండరీగా చూసే వారు మరీ అరుదు, అంతే గాక, వారికి కావలైసిన వేదికలుండడం కూడా చాలా అరుదు. అరుదైన విషయాన్ని చెప్పిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete

  4. పాల గుమ్మి పద్మరాజు గారికి కి ఈయన ఏమవు తారండీ ??

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసినంత మేరకు - ఈయన ఆయనకి ఏమీ అవ్వరు!

      Delete
  5. డబ్బు అవసరం ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఆయా వ్యక్తుల ఆలోచనా సరళి బట్టి వుంటుంది.

    మనిషికి ఎంత డబ్బు అవసరం అన్న, ఆలోచన సరళి ఇంట్లో ఇల్లాలు, కులం, సన్నిహితులైన బంధు మిత్రుల ఆలోచన సరళి పైన ఉంట్టుంది. సాయినాథ్ గారు ఉద్యోగం వదిలి వేయటానికి, తనకు నచ్చిన పని చేసుకోవటాని అతని భార్య సహకారం ఎంతో ఉంట్టుంది. ఆవిడే సహకరించకపోతే వేంటనే ఇంకొక కొత్త ఉద్యోగం చేరి, భవసాగరం ఈదటానికి ప్రయత్నిస్తూండేవారేమో!

    ReplyDelete
  6. There is nothing wrong to make money ethically. There is nothing wrong in wanting material things or a better life for him or her-self and the family. One can work extra hard to achieve this and can fully exploit their skills and reputation in the process. As long as the transaction is voluntary and not forced I have no issues with it. Erecting this high bar of unimpeachable morality, extreme sacrifice and martyrdom is the talk of the societies where no morality exists in general. This man obviously is a great reporter and does his job well. Leaving The Hindu does not make for a sacrifice. Perhaps he lives on his best selling books; may be he is after fame and not money (which is equally terrible in my view); perhaps he does not need any money at all as the grandson of the late President V.V. Girl. I prefer normal people doing normal things and may be occasional extraordinary things. His own web page is nothing, but, a litany of the great things he has done. The News Laundry questioned him with some justification I might add, why he could not be an activist and do something about the suicides rather than simply chronicling them. BTW, the suicide rates are going up not down, his great reporting notwithstanding.

    ReplyDelete
  7. P. Sainath is a Brahmin and anti-CBN. No wonder Dr. Ramana admires him, get a life Doc

    ReplyDelete
    Replies
    1. Wait a minute Nag, that is an unfair bite. What makes you think Dr. Ramana is a Brahmin admirer and what makes you think he is anti-CBN?! He has written plenty that can be construed as slighting the Brahmins and their ethos.One can only surmise that he is a pro-poor people. I don't like his solutions for poverty and other ills and have been critical of him many a time. But, to ascribe caste bias to Dr. Ramana and maligning him is not right.

      Delete
  8. బాబు చిట్టి నాగు, రమణ గారిని అనే ముందు మీరు ఒక్క ప్రశ్న వేసుకొని ఉంటే బాగుండేది. దేశంలోని భూమంతా ఎక్కువ గా ఉండేది భుస్వామ్య కులాల వారి దగ్గరే గదా! వ్యవసాయం దెబ్బతిని, రైతుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటే భుస్వామ్యా కుటుంబాల నుంచి ఒక పాలగుమ్మి సాయినాథ్ వంటి వ్యక్తి ఎందుకు రాలేకపోయాడు ? అని, అదే రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్ర బాబు గారు, రైతులా పరిస్థితి బాగా లేకపోతే అర్థం చేసుకోవటంలో ఎందుకు విఫలమయ్యాడు? అని. Give him a break.

    ReplyDelete
  9. నాగు,

    ఎదుటివారికి కుల పక్షపాతం ఆపాదించటం, నీలాంటి కుల పిచ్చిగాళ్ళకి ఉన్న అలవాటు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.