Thursday 1 August 2013

జై సమైక్యాంద్రా



"ఉరే సుబ్బిగా! ఎప్పుడూలేంది ఇయ్యాల పొద్దుగూకులు బజార్లెంట బొచ్చెపోలీసులు తిరుగుతా వుండారేందిరా?"

"వార్నీ! నీకింకా తెలవదా? తెలంగాణా ఇచ్చేసారుగా."

"తెలంగాణానా! అంటే యేంది?"

"సోనియాగాందీ మన్దేసాన్ని నిలువునా సీల్చేసి తెలంగాణా ఇచ్చేసింది. ఐదరాబాదుని మనకాణ్నించి ఇడగొట్టింది."

"ఐదరాబాదా! అంటే యేంది?"

"ఐదరాబాదంటే రాజదాని నగరం. మన పెద్దోళ్ళు ఆల్డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టారంట. ఇప్ప్డడా తెలంగాణావోళ్ళు అయ్యన్ని నూకి మన్ని ఎనక్కి పంపించేస్తన్నారు."

"అమ్మ నీయమ్మ. మరీ ఇంతన్నేయమా! అయితే ఆళ్ళిప్పుడు నా బియ్యం కారుడు లాక్కుంటారా?"

"లాక్కోరు"

"ఆపరేసినీ కారుడు?"

"ఆరోగ్యస్రీ కార్డా? లాక్కోరు."

"కూల్డబ్బులు తగ్గిస్తారా?"

"అయ్యెందుకు తగ్గిస్తారు. తగ్గీరు."

"మరి నా డొక్కు సైకిలు?"

"దాన్నెవడు తీసుకుంటాడ్రా పిచ్చనాయాలా! దానికసలు సైనే సరీగ్గా లేదు!"

"ఓసోస్. పిచ్చనాయాలువి నువ్వేరా! నీదంతా అత్తిరిబిత్తిరి యవ్వారం. బొచ్చెపోలీసుల సంగతేందిరా అనడిగితే ఏందో తెలంగాణా అంటావు, ఐదరాబాదంటావు. మళ్ళీ మనయ్యన్నీ మనకాడే ఉంటయ్యంటావు. తెలీకపోతే తెలీదని సెప్పు. అంతేగానీ యెదవ కబుర్లు సెప్పమాక."

"నీయమ్మ నీతో మాట్టాడితే మెంటలెక్కుద్దిరా బాబూ! అరేయ్ ఎవుడ్రా అక్కడా? కూసింత ఆగండి.. నేనూ వస్తన్నా. జై సమైక్యాంద్రా!"

(photo courtesy : Google)

36 comments:

  1. మా బాగా సెలవిచ్చారు, గురూజీ భావ చౌర్యం చేసేస్తున్నాను..... ముఖపుస్తకం లో వేసేస్తా!

    ReplyDelete
    Replies
    1. మీ ఇష్టం.. ఎక్కడ కావాలంటే అక్కడ వేసేసుకోండి.

      (చెప్పి చేస్తే చౌర్యం అవ్వదేమో!)

      Delete
  2. హహ్హాహ్హాహ్హా.... అద్దిరిపోయింది... లాజిక్ & జోక్ :)

    ReplyDelete
  3. Ramana Garu,

    What you said may be true only in part! It is not about politicians or big businessman alone who would lose in Hyderabad. Unfortunately, in the short term there is going to be huge fallout for the educated youth in terms of higher education and employment opportunities (locally). And even for the ancillary employment for other class of people. Just to highlight few points..

    It is pitiful to visualise the fate of students and educated youth of Andhra region, looking for employment. If anyone has any doubts, please look at the website of the University of Hyderabad and see the applicable institutions from which a research scholar can continue work in their chosen field. These institutions range from public sector units like BHEL, ECIL, BDL, HAL defence labs like DRDL, RCI, MIDHANI, DMRL, NFC, research labs like IICT, CCMB, Agricultural University, NAARM, DOR, EEI. And coming to education you have IIT, IIIT, ISB, OU, JNTUH, BITS, Gandhi, Osmania etc in and around Hyderabad. The entire IT & Pharma industry is in and around Hyderabad. It may NOT be possible to create similar type and scale of institutions & industries in 5 years in any other city in Andhra, given the level of will and investment required! Intellectuals and politicians, please wake up! This is a disaster for the entire State of AP.

    - Ramachandra

    ReplyDelete
    Replies
    1. రమణగారినుంచి ఇంతకంటే మంచి పోస్టు ని మనం ఆశించకూడదు. తప్పు ఆయనది కాదులెండి, ఆయన చదివిన పుస్తకాలది. అందులో పాత్రలన్నీ ఇలాగే చాలా గొప్పగా ఉంటాయి.

      Delete
  4. రమణ గారూ: సుబ్బిగాడి అవసరం ఎందుకు, బడి పిల్లలు తక్కువయ్యారా?

    ReplyDelete

  5. Once Again Ramana gaaru!!

    One more feather in the cap of Dr Ramana gaaru.

    cheers
    zilebi

    ReplyDelete
  6. ఈ బాష అర్ధంకావట్లేదండీ.. "జై సమైక్యాంధ్రా" అన్నది మాత్రం అర్ధం అయింది :(

    ReplyDelete
  7. True Ya Ra it doesn't probably affect a large section of Population dirctly (probably you and me also) - The expense will affect the whole state and to some extent the country also... I've mixed feelings about it!
    Well written though.

    ReplyDelete
  8. I regularly read your posts. They are hilarious and sensitive. But this post is neither sensitive, nor it has logic.
    Hope you know the process of collection of various types taxes. Even a person who lives barely on a sqaure meal a day pays tax. These taxes were spent on some foreign land called Hyd(That it self is a crime). Now we are losing that too. It's a bigger loss.
    When a society stagnates economically, the first to suffer are the poor. They do not even get their square meal. This impact is not that visible, it's in direct. This may not happen in your Utopia. But till that time, the worst affected are people like Subbi. This does not mean they need t fall prey for selfish politics.

    ReplyDelete
  9. Specious fragment. Not able to emphathise with fellow andhrites. Show your self to you

    ReplyDelete
  10. బాగా చెప్పారు సార్. ఐదరాబాదు పోతే దెబ్బే కావొచ్చు కానీ దాని వల్ల డరివెక్టుగా గానీ ఇండవిరెక్టుగా గానీ ఎలాంటి దెబ్బ లేనోల్లంతా బాధ పడి, ఆక్రొషపడిపోతున్నారు. అమెరికా లో ఉన్నోడు, బెంగౌళూరులో ఉన్నోడు, అనకాపల్లిలో ఉన్నోడు సమానంగా బాధ పడిపోతున్నారు.

    రమణగారి మాట తో బాటూ ఈయన మాట కూడా యినండి కాస్త....

    http://loksatta.org/cms/index.php?option=com_content&view=article&id=1412&Itemid=60

    ReplyDelete
    Replies
    1. ఓహో, అంటే మనకి దెబ్బ ఉంటేనే మనం బాధపడాలన్నమాట. లేక పోతే నా --- ఏం పోయింది నిమ్మగడ్డ భానుమూర్తీ, అని సల్ల గా కూసోవాలన్నమాట ?

      Delete
  11. కామెంటిన మిత్రులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

    (రాష్ట్రాల్ని తెగ్గొట్టినా, కలిపినా.. గోచీపాతరాయుళ్ళ కష్టాలు మారవు అనే నా అవగాహన ఈ చిన్న పోస్ట్ రాయడానికి కారణం. అంతకుమించి పెద్దగా చర్చించడానికేమి లేదు.)

    ReplyDelete
    Replies
    1. రమణ గారు,
      తమకు వ్యక్తిగతం గా ఏ లాభమూ ఉండదనే ఈ అవగాహన, రోడ్ మీదికి వచ్చిన వారికి కూడా ఇంప్లిసిట్ గా ఉంటుంది. కాకపోతే, వాళ్ళు మాటలలో పెట్టలేరు. At the same time, వాళ్ళు ఓ సమూహం గా తమకు జరిగిందనుకొంటున్న అన్యాయానికి రియాక్ట్ అవుతున్నారు. group/social psychology గురించి మీకు చెప్పే సాహసం చేయను.
      మీరు చిన్న పిల్లల బడి చదువుల బరువు గురించి కొన్ని నాకిష్టమైన టపాలు రాశారు. మీ వేదన వలన స్కూలు బ్యాగు బరువు ఏమైనా తగ్గుతుందా? లేక వ్యక్తిగతం గా మీకేమైనా లాభం ఉందా? ఐనా మీ ఫీలింగ్స్ చెప్పటం మానలేదు కదా?

      Delete
    2. @మీ వేదన వలన స్కూలు బ్యాగు బరువు ఏమైనా తగ్గుతుందా?

      "గరీబీ హటావో", నినాదం వల్ల పేదరిక నిర్మూలనం జరిగిందా అని ప్రశ్నిస్తే? అలా అనడం వల్ల అస్సలు ప్రయోజనం జరగలేదు అని ఎవరంటారు

      Delete
  12. క్షమించండి.మీ వయసుకు మీ వృత్తికీ ఏ మాత్రం పొసగని టపా ఇది.ఒక రాష్ట్రం విభజింపబడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసే ఈ టపా వ్రాసారా? కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు శక్తిని ధారపోసిన సీమాంధ్రులకు ఉమ్మడి రాజధాని-హైదరాబాదు నిధులివ్వం అంటున్నారు తెలంగాణావాదులు? ఇది ఏ రకమైన నీతి? మద్రాసు నుంచి ఒకసారి, కర్నూలు నుంచి మరోసారి బిచాణా సర్దుకుని రాజీపడినందుకు ఇప్పుడు మావి ఊరుమ్మడి బ్రతుకులైపోయాయి.ఈ రోజు కొత్త రాజధానిని నిర్మించుకోడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయిలు అవసరమవుతాయి. ఆ డబ్బు ఎవడిస్తాడు ? కేంద్రమా ? ఒక వేళ కేంద్రం పదివేల కోట్లిస్తామన్నా ఆ హామీని నమ్మేదెవరు? సంవత్సరం క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డే తిరుపతి అభివృద్ధి కోసం 400 కోట్లు ఖర్చు పెడతాం అని ప్రగల్భాలాలు పలికారు.ఇంతవరకు 4 కోట్లు విదిలించిన పాపన పోలేదు. ఇలా ఉంటాయి రాజకీయ నాయకుల వాగ్దానాలు. రాష్ట్ర రాజధాననే ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ అభివృద్ధికి కోసం కొన్ని తరాలు తమ కష్టాన్ని అక్కడ దాచుకున్నాయి. అవి రేపు దోచుకోబడవని మీరెలా గ్యారెంటీ ఇవ్వగలరు ? తాగునీరు మాటేమిటి ? ఇతర వనరుల సంగతేంటి ? ఇన్నాళ్ళూ భాషేతరులతో తన్నులాడుకున్నాం. ఇప్పుడు ఒకే జాతి వాళ్ళం కాట్ల కుక్కలా కొట్టుకు చావాలి.ఇది ఒక జాతి పతనానికి దోహదం చెయ్యదా ?

    తెలంగాణ వల్లనో సమైక్యాంధ్ర వల్లనో మీ జీవితం లోనూ ,నా జీవితంలోనూ నేరుగా పెద్ద మార్పులు రాకపోవచ్చు.కానీ ప్రభుత్వాల మీద, వాటి ఉద్యోగాల మీద కొండంత ఆశలు పెట్టుకున్నవాళ్ళు కోట్లలో ఉన్నారు.వాళ్ళ జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకమై పోయాయి

    ReplyDelete
    Replies
    1. Had you shown equal amount of concern when 610 GO was not implemented, things could have been otherwise today. Why did Andhra people fight against the Mulki rules and the rule of separate budget in 73 ? How can they be so much selfish then and talk like this now ? Today is the turn of Telangana people. They are having their laugh.

      Delete
    2. Sripal bhai, they won't understand. Enjoy the circus when it goes on.

      Delete
    3. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

      //కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు శక్తిని ధారపోసిన సీమాంధ్రులకు//

      సీమాన్ద్రులలో ఈ త్యాగమూర్తుల పేర్లు కూడా మీరు వివరిస్తే సబబుగా ఉండేది. మన ప్రాంతం నుండి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అంతటి మహనీయుల విగ్రహాలు టాంక్బండ్ పై పెట్టించడానికి ప్రయత్నిద్దాము. హైదరాబాదు అభివ్రిద్ది చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లే అని తమ రక్త మాంసాలను నిస్వార్ధం గా ధారపోసిన వారిని అందరినీ కేంద్రప్రభుత్వ పురస్కారాలకి సిఫార్సు చెయ్యాల్సిన్దె.


      @@ మద్రాసు నుంచి ఒకసారి, కర్నూలు నుంచి మరోసారి బిచాణా సర్దుకుని రాజీపడినందుకు ఇప్పుడు మావి ఊరుమ్మడి బ్రతుకులైపోయాయి@@

      కలిసి ఉండడం కరెక్ట్ అయితే మద్రాసులోనే కలిసుండి మనము గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం. విడిపోయిన మనం మంచి రాజధాని దొరుకుద్దని హైదరాబాదు కి వెళ్ళాము. వెళ్ళిన వాళ్ళు బానే ఉన్నారు. వెళ్ళనివారి కోసం ఎవరూ సమైక్యాన్ద్రా అనలేదు. అని ఉంటె విభజన జరిగేది కాదు.


      @ ఒక వేళ కేంద్రం పదివేల కోట్లిస్తామన్నా ఆ హామీని నమ్మేదెవరు?



      నమ్మొద్దు, మొక్కుబడికోసమొ , పనికి రాని పౌరుషం కోసమో ఇన్నాళ్ళు, ఇకముందు జై సమైక్యాంధ్ర అని టై పాస్ చెయ్యకుండా వీటి ని తెచ్చుకోడానికి పోరాటం చెయ్యాలి. వాళ్లకి కావలసిన రాష్ట్రం ఎలా తెచ్చుకున్నారో అలానే పోరాడితే అన్నీ వస్తాయి . గుడ్డిగా ఓటేస్తే అడిగే హక్కు ఉండదు.



      @ రాష్ట్ర రాజధాననే ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ అభివృద్ధికి కోసం కొన్ని తరాలు తమ కష్టాన్ని అక్కడ దాచుకున్నాయి. అవి రేపు దోచుకోబడవని మీరెలా గ్యారెంటీ ఇవ్వగలరు ?



      ఇంకా నయం ఈ విభజన వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది , ఆ నష్టం ఎవరు పూడుస్తారు అని అడగలేదు. ఇప్పటికీ హైదరాబాదు ఆస్తులు అన్న గొడవే కాని నిజానికి ఇప్పటి ఆంద్ర ప్రదేశ్ కి ఉన్న సమస్య తో పోలిస్తే , హైదరాబాదులో డబ్బులు దాచుకొన్న వారి సమస్య ఏ మూల ? అసలు వారి గురించి ఎందుకు బాధపడాలి?? వాళ్లకి లాభమే జరిగిందో నష్టమే జరిగిందో ఆంధ్రలోని విద్యార్దులకా లెక్క?






      @@@ ఇప్పుడు ఒకే జాతి వాళ్ళం కాట్ల కుక్కలా కొట్టుకు చావాలి.ఇది ఒక జాతి పతనానికి దోహదం చెయ్యదా ?


      మనం చాలా 'ఒకే జాతుల్లో ' భాగం . ఏ ఏ ఒకే జాతుల్ని ప్రేమిస్తున్నామని ఇప్పుడు ప్రేమలు విఫలం అయ్యాయని బాధ పడడానికి. అన్ని జాతులూ పోరాడాల్సింది కేంద్రం తోనే !


      @@@ కానీ ప్రభుత్వాల మీద, వాటి ఉద్యోగాల మీద కొండంత ఆశలు పెట్టుకున్నవాళ్ళు కోట్లలో ఉన్నారు.వాళ్ళ జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకమై పోయాయి

      ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే హైదరాబాదు ఉండాలా? లేక తెలంగాణా ఉండాలా ? ప్రభుత్వం అక్కడే ఉందా ? లేక ఆంద్ర లో వ్యవసాయ కూలీలు తగ్గిపోతారని భయమా ??

      Delete
    4. Circus of Tg ended, now merger circus of TRS with CON is pending. Then YSR-CP merger circus with CON, bargaining with ConBI clean chits. Then on both sides CON govt with greater circus. If TRS sleeps with CON that is politics, if Vijayashanti merges with CONs that is antiparty activity. This is different circus.

      agitations in Assam, Darjeeling and other parts predicted in SKC. All being circussed by none other than robber Andhras to sabotage great Telangana.

      Delete
    5. @మౌళి

      @@@సీమాన్ద్రులలో ఈ త్యాగమూర్తుల పేర్లు కూడా మీరు వివరిస్తే సబబుగా ఉండేది. మన ప్రాంతం నుండి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అంతటి మహనీయుల విగ్రహాలు టాంక్బండ్ పై పెట్టించడానికి ప్రయత్నిద్దాము.

      రాష్ట్ర రాజధాని అన్నాక అక్కడ ఉంటేనో,చదువుకుంటేనో,ఉద్యోగం చేస్తోనో భవిష్యత్తు బాగుంటుందని ఇతర ప్రాంతాల వాళ్ళూ వస్తారు.ప్రజలు రావడం మొదలుపెడితే అభివృద్ధి అదే జరుగుతుంది.ఇలా కాకుండా ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఆకర్షితులై పరిశ్రమలు పెట్టి తాము ఎదుగుతూ నలుగురికి ఉపాధినిచ్చినవాళ్ళూ ఉన్నారు.ఇదంతా అభివృద్ధి కాక మరేమిటి? వాళ్ళ పేర్లు చెప్పమనడం హాస్యాస్పదం. పేర్లు తెలుసుకొని ఏం చేస్తారు. మహామహుల విగ్రహాలకే దిక్కులేదు.మీరు కొత్త విగ్రహాలు పేట్టించి ఏం సాధిస్తారు ?

      @కలిసి ఉండడం కరెక్ట్ అయితే మద్రాసులోనే కలిసుండి మనము గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం.

      కలిసి ఉండటం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే సరైన చర్చలు లేకుండా ఏకపక్షంగా ఒక రాష్ట్రాన్ని విభజించటం అన్యాయం.చర్చలంటే అవకాశవాద రాజకీయ పక్షాలతో బేరాలు సాగించటం కాదు.కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతకంటే పెద్దది.తనంతట తానుగా నిజానిజాలు తెలుసుకోవాలి.నిజంగా అన్యాయం జరిగిందనుకుంటే అప్పుడే ఇతర అవకాశాలు పరిశీలించాలి. అన్యాయం జరిగిన ప్రతి ప్రాంతానికీ ఒక రాష్ట్రాన్నిస్తూ పోవటం కాదు.


      @వెళ్ళిన వాళ్ళు బానే ఉన్నారు.


      ఎక్కడ బాగానే ఉన్నారు? .ఉద్యమం పేరు చెప్పి కొట్టింది బెదిరించింది సీమాంధ్రులనే,ఆస్తులు ధ్వంసం చేసింది సీమాంధ్రులవే ? రాష్ట్రేతరులవి కాదు . అన్నీ మరచిపోయారా? అవసరం తమది కాబట్టి ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెల్లు అంటున్నారు. డిగ్గీరాజా ఏమో సీమాంధ్రులు నిరభ్యంతరంగా ఉండోచ్చు అంటాడు. కే.సి.యార్ ఏమో ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్ళిపోవాల్సిందే అంటాడు. ఎక్కడినుంచీ కల్పిస్తారు భధ్రత ?


      @@@ఇంకా నయం ఈ విభజన వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది , ఆ నష్టం ఎవరు పూడుస్తారు అని అడగలేదు.

      స్టాక్ మార్కెట్ల మీద మీకున్నంత ఆపారమైన అవగాహన నాకు లేదు లెండి.నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చెబుతాను.ప్రత్యేక వాదాల పేరుతో రాష్ట్రాల్లో అరాచాకాలు ప్రబలితే పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుంది.పరిశ్రమల ప్రగతి కుంటుపడితే వాటి ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి.

      పరిశ్రమల ఫలితాలను బట్టే స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయని మీకు తెలుసనుకుంటాను.

      @@@ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే హైదరాబాదు ఉండాలా? లేక తెలంగాణా ఉండాలా ? ప్రభుత్వం అక్కడే ఉందా?

      ఇది వితండవాదం.పెట్టుకోవాలనుకుంటే మండలానికో ప్రభుత్వం పెట్టుకోవచ్చు.కాని దాని వల్ల కలిగే ఆర్థిక భారం మాటేవిటి ? ఒక రాష్ట్రాన్ని విభజించి కొత్త ప్రభుత్వాన్ని సృష్టించి సమర్థవంతంగా నడపాలంటే ముందు అందుకు తగ్గ మౌలిక వనరులు సమకూర్చుకోవాలి.ప్రపంచ బ్యాంకు ఉదారంగా అప్పిచ్చినా దాన్ని మొయ్యాల్సింది మనమే.న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాలి. ఇదంతా మీరనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు

      ఆంధ్రలో వ్యవయసాయ కూలీల గురుంచి మాట్లాడి మీరేం చెప్పదలచుకున్నారో నాకర్థం కాలేదు.

      Delete
    6. @ Jai gottimukkala

      If whatever you have being doing from the past xx years can be termed as a Circus, then let ours also be called the same.

      Delete
    7. బెల్లంకొండ గారు మీరు చాలా శ్రమపడి సమాధానలు ఇచ్చిమట్లున్నారు. మీరు పని లేక బ్లాగుకి కొత్త గామొసు. డాక్టర్ గారు సైక్రియార్టిస్ట్ గదా ఆయన బ్లాగులో కొంతమంది మెంటల్ మల్లమ్మ లాంటి పేషంట్లు తారస పడుతూంటారు. వాళ్లు చాలా ప్రశ్నలు వేసి చర్చిస్తూంటరు. అది నీకు తెలియదెమొ! ఇక మీదట సమాధానాలు ఇచ్చె ముందు జాగ్రత్త తీసుకొనేది.

      Delete
    8. ముందుగా ఒకమాట , ఇప్పుడు సీమాంధ్ర కి సమస్య ఉంది. విభజన అంగీకారం అయినా ఇలా విభజన ప్రకటన జరగడం ఎవరికీ సంతోషంగా లేదు . చాలా విషయాల్లో స్పష్టత రావాలి . కాని కేవలం ఇప్పుడు నిధులకోసం రాజకీయ పక్షాలు చేసే పోరాటం మాత్రమె ఉండడం బాధాకరం , అలా రాజకీయనాయకులు నడుపుతున్న ఆందోళనలు వారికే లాభం కాని అక్కడ రోడ్డు పైకి వఛ్చిన జనాలకి కాదు. ఆందోళన జరగాలి కాని జై సమైక్యాన్ద్రా అని కాదు. విభజనలో స్పష్టత కావాలి అని అడగాలి. మధ్యలో ఎవరో వచ్చి రూల్స్ మాట్లాడుతున్నారు (ఉద్యోగుల గురించి ) అంటే కారణం వాళ్లకి కావాల్సింది వాళ్ళు స్పష్టంగా చెపుతున్నారు అని అర్ధం . అదే పని ఇక్కడా జరగాలి. హైదరాబాదులో ఉన్న ఉద్యోగులూ మాట్లాడాలి .


      @@@@ ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఆకర్షితులై
      జనం కోసం ప్రభుత్వ ప్రోత్సాహాలకు ఆకర్షితులయ్యారా?? అలాంటి వారికి తెలంగాణా తో సమస్య అసలు ఉండకూడదు ! అంత మంచివాళ్ళ పేర్లు చెప్పమనడం కూడా హాస్యాస్పదమా??? దీన్ని ఏ వాదం అనవచ్చు?
      పేర్లు చెప్పకుండా ఎన్నేళ్ళయినా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోవచ్చ్చు, చెప్పాకా ఆ అవకాసం ఉండదు మరి.
      తెలంగాణా అభివృద్ధి చేసిన వారి విగ్రహాలకు దిక్కు మహ బాగా ఉంటుంది. నేను పెట్టించడం ఎంటండి, మీ లాంటి అభిమానులే పోరాడుతున్నారు కదా. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఆకర్షితులయ్యే వారు ఆంద్ర కు కూడా వస్తారు. వాళ్ళు రాకపోతే ఇంకొకరు వస్తారు.
      @@@@ సరైన చర్చలు లేకుండా ఏకపక్షంగా ఒక రాష్ట్రాన్ని విభజించటం అన్యాయం.
      ఆ మాట మొదటిసారి అంటే తప్పు లేదు , మళ్ళీ నాలుగు సంవత్సరాలకి , ఇన్ని మీటింగులు పెట్టాక కూడా ఎందుకు చర్చించలేదు ? జనం ఎందుకు ఈ సమస్యలు చర్చిన్చుకోలేదు ఇన్నాళ్ళూ??? చక్కగా చర్చించుకున్నారు . అవకాశవాదం రాజకీయాలకే స్వంతమా , లేక నాలుగేళ్ళు నిద్రలో ఉంది ఇప్పుడే మేల్కొన్నామని చెప్పే వారి స్వంతమా ??? ఈ నాలుగేళ్ళలో సరే ఆలోచించలేదు , మరి ఇప్పుడు కూడా అంతే నా ?
      @@@@.ఉద్యమం పేరు చెప్పి కొట్టింది బెదిరించింది సీమాంధ్రులనే,ఆస్తులు ధ్వంసం చేసింది సీమాంధ్రులవే ?
      ఎప్పటినుండి తన్నారు? ఎంతమందిని తన్నారు ??? పరిశ్రమలు పెట్టి బాగు పడ్డవారిని , ఉద్యోగాలు చేసికొనే వాళ్ళని , చివరికి సినిమాలకి వెళ్ళే వాళ్ళని , తీసే వాళ్ళని కూడా తన్ని ఉంటారు అయితే . మరి అలాంటప్పుడు అక్కడినుండి వాళ్ళనయినా తరిమి కొట్టాలి, లేదా తన్నిచ్చు కొన్న వాళ్ళు తప్పుకుని రావాలి . ఉద్యమం పేరుతొ తెలుగు వాళ్ళనే ఇబ్బంది పెడతారు ఎవరైనా, ఎందుకంటె వాళ్ళ మీద పెత్తనం చేస్తున్న వాల్లపైనే వారు ఉద్యమం చేసింది.
      @@@@@ అవసరం తమది కాబట్టి ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెల్లు అంటున్నారు.
      మనం కూడా ఇప్పటికీ అలానే బెదిరిస్తున్నాం వాళ్ళని
      @@@ ప్రత్యేక వాదాల పేరుతో రాష్ట్రాల్లో అరాచాకాలు ప్రబలితే పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుంది
      అవునా , కాపిటల్ లో ఉన్న తెలంగాణా వాళ్ళనందరినీ తరిమికొట్టి , జై సమైక్యన్ద్రా అని రాష్ట్రాన్ని నిలబెట్టుకొంటే పరిశ్రమలు ప్రగతి పదంలో దూసుకుపోతాయి కదా ? ఒక్క హైదరాబాదు కోసం అటు వాళ్ళని, ఇటు ఆంధ్రా ప్రజలని దరిద్రులను చేసినా పర్లేదు , పరిశ్రమలకోసం రాష్ట్రం కాని జనం కోసం కాదు అన్నమాట . లేకపోతె ఇంకా ఆంద్ర ఊర్లలో ఉన్న జనాన్ని కూడా అక్కడి పరిశ్రమల దగ్గరికి తరలించి ప్రగతి పధం లో నడిపించే బృహత్తర పధకాలకు ఏమైనా ఆటంకం కలిగి ఉంటె చెప్పండి. అప్పుడు నిజంగానే ఆంధ్రకు తీరని అన్యాయం జరిగినట్లే.
      @@@@@@@ డిగ్గీరాజా ఏమో సీమాంధ్రులు నిరభ్యంతరంగా ఉండోచ్చు అంటాడు. కే.సి.యార్ ఏమో ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్ళిపోవాల్సిందే అంటాడు. @@@@@@@@
      రెండూ నిజమే. తెలంగాణా వాళ్లకి పక్క రాష్ట్రం లో ఊడిగం చెయ్యడం ఇష్టం లేదో, లేక వాళ్ళ ప్రాంతాలకు దూరం గా ఉండడం కష్టం గా ఉందొ. ఆ మాత్రం ప్రేమ అభిమానం ఎవరికయినా ఉంటాయి. అయినా హైదరాబాదు లో ఉన్నవాళ్ళు రానంటారేమో కాని , మిగిలిన తెలంగాణా ప్రాంతం లో ఉన్న ఆంధ్రులకి మాత్రం కొద్దో గొప్పో మందికి ఉండదా తన వాళ్ళకి దగ్గరగా ఉద్యోగాలు చేసికోవాలని, తమ ప్రాంత అభివృద్ధి కోసం పని చెయ్యాలని. లేకపోతె మాత్రం మిగిలిన ఆంధ్రులు వాళ్ళకోసం దేహి అని అనరు అంతే కదా
      మొత్తంగా అక్కడి ఆంద్ర ఉద్యోగులకి ఇక్కడికి రావడం పైన యెంత ఆసక్తి ఉందొ, అక్కడి వాళ్ళ కి ఎవయి నా ఉంటె ఆ సమస్యల గురించి ఆంధ్రలో ఉన్నవారికీ అంతే ఆసక్తి ఉంటుంది . అందుకే నా ఈ సమాధానం. అక్కడి ఉద్యోగులు వెనక్కి రావడం మన ఆంద్ర ప్రజలకు ఇష్టం / అక్కర లేదా, అయితే చెప్పండి .
      @ @@@@ఎక్కడినుంచీ కల్పిస్తారు భధ్రత ?
      ఇన్నాళ్ళూ వాళ్ళు కోరుకోన్నదీ భద్రతే. వాళ్ళ భద్రత కోసం వాళ్ళే పోరాటం చెసారు. ఒకరు కల్పించడం ఏంటి. ఇప్పుడు ఆంధ్రలో జరిగే ఉద్యమాలు ఆంధ్రలో సమస్యలకోసం, హైదరాబాదులో లేని సమస్యల కోసం కాదు. ఇప్పుడు సమైక్యన్ద్రా అని బెదిరిస్తున్నది వీలయినంత నిధులు తెచ్చుకోవడానికి .కాని రోడ్లమీదకి వచ్చి అరుస్తున్నది అన్ని వర్గాలలోనే వారు కాదు.

      Delete
    9. ముందుగా ఒకమాట , ఇప్పుడు సీమాంధ్ర కి సమస్య ఉంది. విభజన అంగీకారం అయినా ఇలా విభజన ప్రకటన జరగడం ఎవరికీ సంతోషంగా లేదు . చాలా విషయాల్లో స్పష్టత రావాలి . కాని కేవలం ఇప్పుడు నిధులకోసం రాజకీయ పక్షాలు చేసే పోరాటం మాత్రమె ఉండడం బాధాకరం , అలా రాజకీయనాయకులు నడుపుతున్న ఆందోళనలు వారికే లాభం కాని అక్కడ రోడ్డు పైకి వఛ్చిన జనాలకి కాదు. ఆందోళన జరగాలి కాని జై సమైక్యాన్ద్రా అని కాదు. విభజనలో స్పష్టత కావాలి అని అడగాలి. మధ్యలో ఎవరో వచ్చి రూల్స్ మాట్లాడుతున్నారు (ఉద్యోగుల గురించి ) అంటే కారణం వాళ్లకి కావాల్సింది వాళ్ళు స్పష్టంగా చెపుతున్నారు అని అర్ధం . అదే పని ఇక్కడా జరగాలి. హైదరాబాదులో ఉన్న ఉద్యోగులూ మాట్లాడాలి .


      @@@@ ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఆకర్షితులై
      జనం కోసం ప్రభుత్వ ప్రోత్సాహాలకు ఆకర్షితులయ్యారా?? అలాంటి వారికి తెలంగాణా తో సమస్య అసలు ఉండకూడదు ! అంత మంచివాళ్ళ పేర్లు చెప్పమనడం కూడా హాస్యాస్పదమా??? దీన్ని ఏ వాదం అనవచ్చు?
      పేర్లు చెప్పకుండా ఎన్నేళ్ళయినా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోవచ్చ్చు, చెప్పాకా ఆ అవకాసం ఉండదు మరి.
      తెలంగాణా అభివృద్ధి చేసిన వారి విగ్రహాలకు దిక్కు మహ బాగా ఉంటుంది. నేను పెట్టించడం ఎంటండి, మీ లాంటి అభిమానులే పోరాడుతున్నారు కదా. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఆకర్షితులయ్యే వారు ఆంద్ర కు కూడా వస్తారు. వాళ్ళు రాకపోతే ఇంకొకరు వస్తారు.

      @@@@ సరైన చర్చలు లేకుండా ఏకపక్షంగా ఒక రాష్ట్రాన్ని విభజించటం అన్యాయం.

      ఆ మాట మొదటిసారి అంటే తప్పు లేదు , మళ్ళీ నాలుగు సంవత్సరాలకి , ఇన్ని మీటింగులు పెట్టాక కూడా ఎందుకు చర్చించలేదు ? జనం ఎందుకు ఈ సమస్యలు చర్చిన్చుకోలేదు ఇన్నాళ్ళూ??? చక్కగా చర్చించుకున్నారు . అవకాశవాదం రాజకీయాలకే స్వంతమా , లేక నాలుగేళ్ళు నిద్రలో ఉంది ఇప్పుడే మేల్కొన్నామని చెప్పే వారి స్వంతమా ??? ఈ నాలుగేళ్ళలో సరే ఆలోచించలేదు , మరి ఇప్పుడు కూడా అంతే నా ?

      @@@@.ఉద్యమం పేరు చెప్పి కొట్టింది బెదిరించింది సీమాంధ్రులనే,ఆస్తులు ధ్వంసం చేసింది సీమాంధ్రులవే ?

      ఎప్పటినుండి తన్నారు? ఎంతమందిని తన్నారు ??? పరిశ్రమలు పెట్టి బాగు పడ్డవారిని , ఉద్యోగాలు చేసికొనే వాళ్ళని , చివరికి సినిమాలకి వెళ్ళే వాళ్ళని , తీసే వాళ్ళని కూడా తన్ని ఉంటారు అయితే . మరి అలాంటప్పుడు అక్కడినుండి వాళ్ళనయినా తరిమి కొట్టాలి, లేదా తన్నిచ్చు కొన్న వాళ్ళు తప్పుకుని రావాలి . ఉద్యమం పేరుతొ తెలుగు వాళ్ళనే ఇబ్బంది పెడతారు ఎవరైనా, ఎందుకంటె వాళ్ళ మీద పెత్తనం చేస్తున్న వాల్లపైనే వారు ఉద్యమం చేసింది.

      @@@@@ అవసరం తమది కాబట్టి ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెల్లు అంటున్నారు.
      మనం కూడా ఇప్పటికీ అలానే బెదిరిస్తున్నాం వాళ్ళని

      @@@ ప్రత్యేక వాదాల పేరుతో రాష్ట్రాల్లో అరాచాకాలు ప్రబలితే పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుంది
      అవునా , కాపిటల్ లో ఉన్న తెలంగాణా వాళ్ళనందరినీ తరిమికొట్టి , జై సమైక్యన్ద్రా అని రాష్ట్రాన్ని నిలబెట్టుకొంటే పరిశ్రమలు ప్రగతి పదంలో దూసుకుపోతాయి కదా ? ఒక్క హైదరాబాదు కోసం అటు వాళ్ళని, ఇటు ఆంధ్రా ప్రజలని దరిద్రులను చేసినా పర్లేదు , పరిశ్రమలకోసం రాష్ట్రం కాని జనం కోసం కాదు అన్నమాట . లేకపోతె ఇంకా ఆంద్ర ఊర్లలో ఉన్న జనాన్ని కూడా అక్కడి పరిశ్రమల దగ్గరికి తరలించి ప్రగతి పధం లో నడిపించే బృహత్తర పధకాలకు ఏమైనా ఆటంకం కలిగి ఉంటె చెప్పండి. అప్పుడు నిజంగానే ఆంధ్రకు తీరని అన్యాయం జరిగినట్లే.

      @@@@@@@ డిగ్గీరాజా ఏమో సీమాంధ్రులు నిరభ్యంతరంగా ఉండోచ్చు అంటాడు. కే.సి.యార్ ఏమో ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్ళిపోవాల్సిందే అంటాడు. @@@@@@@@
      రెండూ నిజమే. తెలంగాణా వాళ్లకి పక్క రాష్ట్రం లో ఊడిగం చెయ్యడం ఇష్టం లేదో, లేక వాళ్ళ ప్రాంతాలకు దూరం గా ఉండడం కష్టం గా ఉందొ. ఆ మాత్రం ప్రేమ అభిమానం ఎవరికయినా ఉంటాయి. అయినా హైదరాబాదు లో ఉన్నవాళ్ళు రానంటారేమో కాని , మిగిలిన తెలంగాణా ప్రాంతం లో ఉన్న ఆంధ్రులకి మాత్రం కొద్దో గొప్పో మందికి ఉండదా తన వాళ్ళకి దగ్గరగా ఉద్యోగాలు చేసికోవాలని, తమ ప్రాంత అభివృద్ధి కోసం పని చెయ్యాలని. లేకపోతె మాత్రం మిగిలిన ఆంధ్రులు వాళ్ళకోసం దేహి అని అనరు అంతే కదా
      మొత్తంగా అక్కడి ఆంద్ర ఉద్యోగులకి ఇక్కడికి రావడం పైన యెంత ఆసక్తి ఉందొ, అక్కడి వాళ్ళ కి ఎవయి నా ఉంటె ఆ సమస్యల గురించి ఆంధ్రలో ఉన్నవారికీ అంతే ఆసక్తి ఉంటుంది . అందుకే నా ఈ సమాధానం. అక్కడి ఉద్యోగులు వెనక్కి రావడం మన ఆంద్ర ప్రజలకు ఇష్టం / అక్కర లేదా, అయితే చెప్పండి .

      @ @@@@ఎక్కడినుంచీ కల్పిస్తారు భధ్రత ?
      ఇన్నాళ్ళూ వాళ్ళు కోరుకోన్నదీ భద్రతే. వాళ్ళ భద్రత కోసం వాళ్ళే పోరాటం చెసారు. ఒకరు కల్పించడం ఏంటి. ఇప్పుడు ఆంధ్రలో జరిగే ఉద్యమాలు ఆంధ్రలో సమస్యలకోసం, హైదరాబాదులో లేని సమస్యల కోసం కాదు. ఇప్పుడు సమైక్యన్ద్రా అని బెదిరిస్తున్నది వీలయినంత నిధులు తెచ్చుకోవడానికి .కాని రోడ్లమీదకి వచ్చి అరుస్తున్నది అన్ని వర్గాలలోనే వారు కాదు.

      Delete
    10. @@@@ పరిశ్రమల ఫలితాలను బట్టే స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయని మీకు తెలుసనుకుంటాను.
      అబ్బే నాకు తెలియదండీ . ఏ ఫలితాలు జగన్ కంపెనీలల్లోకి పెట్టుబడులు వరదల్లా తీసికొని వచ్చింది??? సరే జగన్ ప్రత్యేకం అనుకొంటే వదిలెయ్యన్ది. ఏ ఫలితాలు చూపించి RPL విలువ వామనావతారం ఎత్తింది ? ఇంకా ఏ ఫలితాలకి వాళ్ళు వదిలే ప్రతి పేపర్ కంపెనీ కి అధిక ప్రీమియం వస్తున్నది ??? సరే ఇదీ వదిలేద్దాం . విప్రో కి ఏ ఫలితాలు లేక మరి సంవత్సరాల తరబడి అక్కడే కొట్టుకుంటున్నది ???

      కాబట్టి గుడ్డిగా తెలంగాణా గురించి, అక్కడి పరిశ్రమలు, అక్కడి తెలుగు వీరుల కోసం ఆయాసపడి ఉపయోగం లేదు , అవసరం అంతకన్నా లేదు. ఆంద్ర ప్రాంతానికి కష్ట సమయమే ఇది , కాని బాధితులు హైదరాబాదులో పరిశ్రమలు పెట్టిన వారో , అక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేసికొంటున్న వారో కాదు .


      @@@@@@@.పెట్టుకోవాలనుకుంటే మండలానికో ప్రభుత్వం పెట్టుకోవచ్చు.
      అవునా , ఎవరు సెలవిచ్చారు మీకు . అనుకోని చూడండి పెట్టుకోగలరో లేదో . ఇన్ని ఆర్దికభారాలు తెలిసిన వారు , ఇన్నాళ్ళు తెలంగాణా లో ఉన్న వారు అక్కడి సమస్యలను ఎందుకు అర్ధం చేసికోలేదు ??అంత పెద్ద హైదరాబాదు ని బాగు చేసి అవతల పడేసిన వాళ్లకి, ఇక మిగిలిన ప్రాంతాలు ఒక లెక్కా ? ప్రత్యేకాంధ్ర కోసం మనం పోరాదినప్పుడు ఈ ఖర్చులు, లెక్కలు మనకి తెలిసినవే.
      హైదరాబాదులో పరిశ్రమల స్థాయిలోనో , అక్కడికెళ్ళి సుఖంగా ఉన్నవాళ్ళ గురించో హడావిడి పడేవాళ్ళకి ఆంద్ర లో రైతు కూలీలు పెద్ద లెక్క కాదనుకుంటాను . కాబట్టి మీరు పట్టించుకోనక్కరలేదు

      Delete
    11. LOL...నేను అనని వాటిని నాకు ఆపాదిస్తున్నారు.వాదించే ఉద్దేశ్యం నాకు లేదు.మీ ఫ్లోలో మీరు చెలరేగిపోండి.

      Delete
    12. అవునా, అక్కడ అననివి ఏవి quote చెయ్యలెదు. మీ భాష సరి చేసికొని మాట్లాడడానికి రండి. అసలు మొదటి వ్యాఖ్యలోనే వ్యక్తులను ఉద్దేశిస్తూ తప్పుడు మాటలు ఉన్నాయి. అప్పుడు ఇంకో తప్పుడు మాట . చేతకాకపోతే మాట్లాడొద్దు .

      Delete
  13. 1. NTR 2.ANR 3. KRISHNA 4.RAMAANAYUDU 5.APOLO PRATAP C REDDY 6. CHANDRA BABU 7. JAGAN fo not you think these people sacrifised a lot ?

    ReplyDelete
    Replies
    1. Sacrifice ? ANR, Krishna and Ramanaidu built their studios on free land provided by AP govt. which otherwise belongs to the citizens of Hyderabad.

      Delete
    2. @Anonymous garu,
      meeru cheppina vallandaru, edo oka field lo kastapadi paikocharu. baagu paddaru.... andulo vaaru chesina sacrifice ento meere cheppali...

      ika CBN and YSJR lu politicians. valla pani politics, andulo sacrifice anedaaniki chotundaa???

      Delete
  14. not related to ur post but related to telugu bhasha abhvrudhi from ramoji rao
    yday it published one article on brooch designed by salvador dali saying "kalam kannu". It is translation of the name of the brooch- "eye of time". name should be published as name . Y unnecessary translation to telugu. kalam kannu ante adenti ra babu ani burra badhalu kottukunnanu.

    ReplyDelete
  15. Political prostitution is not unconstitutional. That is why SP,BSP,YSR-CP,TRS, RJD, BJP,CPI,CPM, DMK, AIADMK all ganged up CONs in making a constitutional amendment to dust-bin SC judgement. It is a kind of unity in diversity, which we must be proud of, with no other way. What do you say?

    ReplyDelete
  16. నా బోణీ బాగుందోచ్.... కామెంట్ల తోక చాలా పొడవుంది.
    అన్ని ఖంపెనీలు అక్కడే పెట్టినప్పుడు అడగలేదేఅమి నాయనలారా.... ఆ ఏముంది లే తెలంగాణా వారి భూములేగా పోయేది సెజ్ కి బలయ్యేది మనం కాదు కదా..... మన పంటభూములు క్షేమం అనుకున్నారు కదా.... ఆ సదరు సెంట్రల్ గవర్నమెంటు కంపెనీలు ఒక్క చోట కుప్ప కొడితే ఈ మాదిరి గొడవ చేసుండొచ్చు కదా అప్పుడు మీ ప్రంతం లో విద్యావంతులు ఏమిచేసారు?

    ట్యాక్స్ లు ... ఫరెన్ ల్యాండు ....అయ్బాబోయ్ ఈ ప్రశ్న బానిసాలుగా ఇటలీ బొమ్మ కి వోటు వేసిన మీ తరం.... అన్ని ప్రాంతాల వారు అడగాల్సింది 1992 బోఫొర్స్ .... 2009 2 లకారాల 2జి స్కాము లు బయటపడినప్పుడు... అప్పుడు ఉత్తరభారతం అట్టూడిగి పోతే మన దక్షినాన నాకేం పొయింది లె ఉచిత దేవుడు వై. ఎస్ చాలు (ఎందుకు- అవును) అనుకుని నిశ్శబ్ధం పాటించారు కదా...
    అనుభవించండీ 51 కాంగీ ని ఎత్తుకున్నందుకు బాగానే జరిగింది మన ఆ.ప్ర కి!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.