హైదరాబాదు మన కోస్తా ప్రాంతం నుండి విడిపోయినందుకు మనం చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నాం. అందుకే మన కుర్రాళ్ళు రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. ఆవేశంతో ఊగిపోతూ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఈ చైతన్యం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది.
మన ప్రజలు, మన ప్రాంతం, మన భాష అంటూ ఆలోచిస్తూ.. నష్టం జరిగిందని భావిస్తే రియాక్ట్ అవ్వడం చాలాచాలా మంచిది (అది ఎంత ఆహేతుకమైనా ఆ స్పాంటేనియస్ రియాక్షన్ ని నేను సమర్దిస్తాను). ఆనందించదగ్గది. ప్రపంచంలో ఏ జాతికైనా ఇటువంటి లక్షణం కలిగి ఉండటం చాలా అవసరం. ఇది ఆ జాతి ఉన్నతికి ఎంతగానో దోహదం చేస్తుంది.
అందుకే ఎమోషనల్ గా ఆలోచిస్తే నా ప్రాంతానికి హైదరాబాదేం ఖర్మ? ముంబాయి, న్యూయార్క్ మహానగరాలు కూడా కావాలనిపిస్తుంది. ఇట్లా వాదించడం నాకు ఇష్టంగానే ఉంటుంది గానీ కష్టంగా ఉండదు. కానీ మన ఇష్టం వేరు.. రాజకీయ అవగాహన, ఆలోచన, అంచనాలు వేరు.
అయితే.. మన యువతకి 'ప్రశాంత' సమయంలో ఇంకేం పట్టదా? ఏమీ కనిపించవా? వినిపించవా? ఎందుకంత అలసత్వం, అంతులేని బాధ్యతా రాహిత్యం? గత కొన్నిరోజులుగా ఈ ప్రశ్నలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇబ్బంది పెడుతున్నాయి.
నిత్య జీవితంలో సాధారణ జీవనానికి ఎన్ని కష్టాలు! మనిషి మనిషిగా, గౌరవంగా బ్రతికే పరిస్థితుల నుండి ఎంతగా దిగజారిపోతున్నాం! డాక్టర్లు పేషంట్లని పీల్చేస్తారు. ప్లీడర్లు క్లయింట్లని మింగేస్తారు. ఒంటరి ఆడపిల్లకి కనీస రక్షణ కల్పించలేని దిక్కుమాలిన సమాజం సృష్టించుకున్నాం. అడవిలో పులుల కన్నా ప్రమాదకరంగా తయారవుతున్నాం. ఏం? వీళ్ళెవరూ మన ప్రాంతం వాళ్ళు కాదా? అప్పుడీ కుర్రాళ్ళు ఆవేశపడరెందుకు!
'ప్రశాంత' సమయంలో మన అభిమాన హీరోల (కుల) ర్యాలీలు అద్భుతంగా నిర్వహిస్తాం. ఓటుకి ఎవడెంత ఇచ్చాడనేది ఉత్సాహంగా చర్చించుకుంటాం. ఏం? ఇవన్నీ మన ప్రాంతానికి నష్టం కలిగించట్లేదా? కేవలం హైదరాబాద్ మనది కాదన్నప్పుడే ఎందుకీ ఆవేశం? అసలు మనకి ఉన్న ప్రాంతాన్ని సరీగ్గా పరిరక్షించుకుంటున్నామా? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకుంటున్నామా? లేదు కదా! ఎందుకు?
కారంచేడు, చుండూరులతో ప్రపంచ పటాన్ని ఎక్కాం. ఎంత సిగ్గుచేటు! మరి మరణించిన ఆ దళితులు మన ప్రాంతంవారు కాదా? ఒక కులం ఇంకో కులం మీద దాడి చెయ్యడం, పశువుల కన్నా హీనంగా చంపెయ్యడం ఘోరం, అమానుషం అని ఖండిస్తూ ఎప్పుడైనా ర్యాలీలు చేశామా? లేదు కదా. ఎందుకు?
నకీలీ విత్తనాలు, పురుగు మందులు, గిట్టుబాటు కాని రేట్లతో ఎంతమంది రైతులు చచ్చిపొతున్నారు? ఎంతమంది కిడ్నీలు అమ్ముకుంటున్నారు? మనం అప్పుడు ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ రైతుల పక్షాన ఎన్ని ర్యాలీలు తీశాం? వారి మరణానికి గల కారణాన్ని వెతికి వెతికి పట్టుకుని పీక పిసికి చంపేంత కోపం మనకి ఎందుకు రాలేదు! ఏం? ఆ మరణించిన రైతులు మన ప్రాంతంవారు కాదా?
ఇవ్వాళ హైదారాబాద్ కోసం చెలరేగిన ఆవేశంలో పది పైసలైనా దాచుకుందాం. అలసత్వాన్ని, అరాచాకత్వాన్ని ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, ఎదిరిద్దాం.. మాట వినకపోతే పాతరేద్దాం. ఇప్పుడు ప్రశ్నించుకోవలసింది మనం ఏ ప్రాంతం వాళ్ళమని కాదు.. మనమందరం ఒక జాతిగా, సామూహిక శక్తిగా ఎలా పురోగమించాలని మాత్రమే. అప్పుడు మనం కోల్పోతున్నామనుకుంటున్న ఒక కాంక్రీట్ జంగిల్ పెద్ద నష్టమేమీ కాదు. నాకైతే మన యువతపై అంతులేని ఆశలున్నాయి. ఈ ఆశ దురాశ కాదనే నమ్మకం కూడా ఉంది.
(photo courtesy : Google)
ReplyDeleteటపా లో యువత యువత అంటూ మీరు మరీ యువత(రం) నించి దూరం ఐపోతున్నారేమో నండీ
జిలేబి
మీ ఆవేశం, సంఘర్షణ ఈ టపా లో ప్రస్పుటంగా కనిపిస్తుంది .
ReplyDeleteచూద్దాం ఏం జరుగుతుందో ..
అభివృద్ధి అంతా తీసుకుని వెళ్లి అక్కడ తగలెట్టడం వల్ల ఇదంతా ...
:venkat
బాగా వ్రాశారు. హైదరాబాదు అనేది ఒక అవకాశాల నిలయం అయితే అందులో తమకీ స్థానం ఉండాలని వివిధ ప్రాంతాల యువత కోరుకోవటం లో తప్పులేదు. విభజన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సమాన అవకాశాల విషయం లో స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే చితిమంటల్లో చలికాచుకునే మన నాయకులకు బాధ్యత ఉందంటే నమ్మలేం. ఇప్పటికైనా మన యువత కల్లు తెరచి బిరియానీ పేకెట్టుకో మందుగ్లాసుకో మోజుపడి వోట్లు వెయ్యటం మానుకోవాలి.
ReplyDeleteహైదరాబాదు ఏవిధంగా అవకాశాల నిలయం? ఇంకో రాజధాని వస్తే అది అవకాశాలను ఇవ్వలేదా? హైదరాబాదు మాత్రమె ఇచ్చే అవకాశాలు , ఇంకో రాజధాని ఇవ్వలేనివి ఏవి?
ReplyDeleteహైదరాబాదు ఉమ్మడిగా ఇస్తే ఇంకా నాశనమే అవ్వాలి. ఇద్దరూ దాన్ని దొరికినంత దోచుకోవడం, ఆక్రమించుకోవడానికి కొట్లాటలు రోజువారీ అవుతాయి. లేదా కాస్తో కూస్తో చిత్తశుద్ది ఉంటె ఇద్దరూ హైదరాబాదు వదిలేసి తమ మిగిలిన ప్రాంతాలు బాగు చేసుకొంటాయి.
రెంటిలో ఎలా ఉన్నా రెండుప్రాంతాల కీ రాజధాని ఉన్నా లేనట్లు అవుతుంది.
మౌళి గారూ, ఇప్పటి పరిస్థితుల్లో రాష్ట్ర యువత కు హైదరాబాదు అవకాశాల నిలయమే. ఇంకొక రాజధాని వస్తే అవకాశాలు ఇవ్వగలదు, అందులో సందేహం లేదు. కాని ఇంకొక అవకాశాల నిలయాన్ని రాత్రికి రాత్రి నిర్మించుకోలేరు కదా. అలా నిర్మించుకోగలిగితే మన దేశం లో ఎన్నో ముంబాయిలు ఢిల్లీలు వెలిసేవి. రాజధాని అనే పేరిట సచివాలయం, సెక్రెటీరియట్ కట్టేస్తే మన నాయకులకు పని దొరుకుతుందేమొగాని ప్రజానీకానికి కాదు. ఇప్పటికిప్పుడు ఎవరికో ఒకరికి ఇస్తే రెండవ వారు అసంతృప్తికి లోనవుతారు. కాబట్టి ప్రస్తుతానికి ఉమ్మడిగా ఉంచి భవిష్యత్తులో దానిపై నిర్ణయం తీసుకోవచ్చు.
Deleteసూర్య గారు ,
Deleteమీరే అవకాశాల గురించి మాట్లాడుతున్నారో చెప్పడం మరిచారు . మీరే కాదు రేపు కమిటీ ముందు ఇప్పుడు ఆందోళన చేస్తున్న వాళ్ళు చెప్పి తీరాలి . కమిటీ ముందు ఒకే పాట హైదరాబాద్ అనో సమైక్యం అనో అంటే కుదరదు . ఏం కావాలో స్పష్టంగా చెప్పి తీరాలి , లేదంటే ఇది ఉత్తుత్తి గొడవ అని వదిలేస్తారు.
ప్రస్తుతానికి ఉమ్మడి గానె ఉంచారు , ఇక మీ అభ్యంతరం భవిష్యత్తులో రాజకీయాలు చేసి తెలంగాణా వాళ్ళని వెధవల్ని చేసి హైదరాబాదు ఎప్పటికీ ఉమ్మడి గానే ఉంచే అవకాసం లేకపోవడం .
నిజంగా ఈ పోరాటాలు చేసే వాళ్ళలో చిత్తశుద్ది ఉంటె ఇంకో రాజధాని ఏర్పడి తీరుతుంది. మనదేశం లో ఇంకో ముంబై, ఢిల్లీలు కావాలని జనం అనుకోలేదు. అలాగని ఏర్పడలేదనీ చెప్పకూడదు. పట్టణాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి . ఆంద్ర లోనే హైదరాబాద్ తప్ప ఇంకే ప్రాంతాన్నీ (రెండు భాగాలలో ) పట్టించు కోలేదు కాబట్టి విభజనకి దారి తీసింది.
హైదరాబాదులో ఏ అవకాశాలు ఉన్నాయో నేను చెప్పడం ఎందుకు, యువతను అడగండి. హైదరాబాదు లేని తెలంగాణని అంగీకరించమనే తెలంగాణ నాయకులని అడగండి. హైదరబాదుని ఒక్క తెలంగాణకే పరిమితం చేయడానికి ఒప్పుకోని సీమాంధ్ర నాయకులని అడగండి. ఒక రాష్ట్ర రాజధాని నగరం అభివృధ్ధి చెందిందంటే దాంట్లో అన్ని ప్రాంతాల ప్రజల ప్రమేయం ఉంది. "కాదు మేం ఒప్పుకోం" అంటే ఇక చర్చించడానికి ఏం లేదు. పది జిల్లలతో కూడిన తెలంగాణను ఇస్తున్నట్లు ప్రకటించే ముందు "మిగిలిన ప్రాంతానికి రాజధాని ఎక్కడ, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు ని ఎవరెవరు ఎంత భరిస్తారు , కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ముఖ్య సమస్యలు ఏముంటాయి, వాటిని పరిష్కరించడం ఎలా? రాష్ట్ర ఆదాయము/అప్పులు ఎలా పంచుతారు" అనే అంశాలను తేల్చి తెలంగాణేతర ప్రాంతాలకు సర్ది చెపితే ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల్లా విడిపోయి ఉండేవారు. కాని తెలంగాణేతర ప్రాంతాన్ని open end ప్రశ్న గా వదిలేసి హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నది రాజకీయ ప్రయోజనాలకే. ఈ ఆలోచనలకు 2009 నుంచి 3 సంవత్సరాల వ్యవధి ఉన్నా వదిలేసి ఇపుడు హఠాత్తుగా 6 నెలల్లోపే ప్రక్రియ మొత్తం పూర్తి చేసేస్తాం అనటం తెలంగాణకు నచ్చవచ్చేమోగాని మిగిలిన ప్రాంతానికి కాదు. మీరు అన్నట్లు ఉమ్మడి ప్రభుత్వం లో ఒక్క హైదరాబాదునే పట్టించుకుంటే విడిపోయేప్పుడు దాన్ని ఒకే రాష్ట్రానికి ఎలా పరిమితం చేసేస్తారు? ఈ విషయం లో మీరు ఎలా వాదించినా ఒకటి నిజం. "హైదరాబాదులో ఏది ఉందని తెలంగాణవాదులు వదులుకోడానికి ఇష్టపడట్లేదో, దానిని వదులుకోడానికి సీమాంధ్రులు కూడా ఇష్టపడట్లేదు. అది ఏమిటి అంటే తమ తమ ప్రయోజనాలు."
Deleteహైదరాబాద్ నో, భద్రాచలం నో మాకు కావాలి అని ఎవరైనా అడిగితె అది కేవలం అవకాశాలకోసం కాదు. నిర్ణయం జరిగిపోయింది , ముందు ఎవరూ వద్దనలెదు. ఇప్పుడు ఎవరి ప్రయోజనం కోసమో అని లాభం లెదు. ఇంతకుముందు లానే యువత హైదరాబాదు వెల్లొచ్చు .అది ఆంద్ర ప్రదేశ్ కి నష్టం.
Deleteఅన్ని ప్రాంతాల ప్రజల అంగీకారం తీసికొని ఒక నగరాన్ని అభివృద్ధి చెయ్యలేదు. అప్పుడు కూడా ఎవరి లాభం వాళ్ళు చూసుకొన్నారు.
ఇప్పుడు క్రొత్త రాజధాని నిర్మాణమూ అంతే సాగుతుంది. ఈ నాలుగేళ్ళలో ఎవరేం అడిగారో వాటికి మాత్రం కాంగ్రెస్ తన నిర్ణయం లో సమాధానం ఇచ్చిన్ది. ఇప్పటికీ రోడ్లపై ఉన్న యువత కూడా అడగని వాటికి సమాధానం ఏది అని ఇక్కడ అడిగితె సమాధానం ఉండదు. వాళ్ళే చెప్పాలి. అసలెవరికీ ఇంకా క్రొత్త రాజధాని ఎక్కడ అని ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదు. లేదా అవసరం లేదా?
అన్ని ప్రాంతాల ప్రజల అంగీకారం తీసుకొని ఒక నగరాన్ని వృధ్ధి చెయ్యలేదు. అలాగే అన్ని ప్రాంతాల అంగీకారం తీసుకొని విభజన చెయ్యలేదు. అందుకే ఈ గొడవ అంతా. హైదరాబాదు తెలంగాణలో ఉన్నా యువత వెళ్ళి రావొచ్చు. అలాగే ఉమ్మడిగా ఉన్నా, లేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నా సరే యువత నిర్భయంగా వెళ్ళి రావచ్చు. ఎవరూ వద్దనరు. ఇంతకాలం అడిగినవాటిని కాంగ్రెస్ సమాధానం ఇచ్చింది. అందుకే ఇపుడు కొత్తగా అడుగుతున్నారు (దేశం లోని మిగతా డిమాండ్లతో సహా). ప్రత్యేక ఉద్యమం కొందరికి మహోద్యమంగా కనిపిస్తే, సమైక్య ఉద్యమం మరి కొందరికి మహోన్నతంగా కనిపించవచ్చు. కాదని ఎలా అనగలం. ఒక పిల్లాడు ఏడిస్తే మమ్మీ చాక్లెట్ ఇచ్చిందనుకోండి. ఇంకో పిల్లాడు ఊరుకుంటాడా? వాడూ అడగడూ? ఇదీ అంతే. విభజన అనేది రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిది. దాన్ని డీల్ చెయ్యటం లో సో కాల్డ్ అధిష్టానం జాగ్రత్తలు పాటించలేదు.
Delete
Deleteరెండు సార్లు జనంతో పనిలేకుండా చేసారన్నమాట. అయితే ఈ రెండుసార్లూ చేసిందెవరు మరి.
నిజంగా? అన్నిప్రాంతాల అంగీకారం తీసికోలేదా ? అదే నిజం అయితే ఇప్పుడు ఉన్న ఉద్యమం ఎప్పుడో మొదలయ్యేది. ఇప్పుడు మొదలయ్యిందంటే అది సమైక్యం కోసం కాదన్నమాట.
మరిప్పుడు తెలంగాణలో జనాలంతా ఎందుకు మిలియన్ మార్చులూ గట్రా చేయట్లేదంటా? అంటే తెలంగాణ ఉద్యమం అంతా ఉట్టిదేనన్నమాట. కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తెలిస్తే సీమాంధ్రులు అప్పుడే తడాఖా చూపేవారు. ఇవ్వదని, తెలంగాణ డిమాండ్లో రాజకీయనాయకుల స్వార్థప్రయోజనాలు తప్ప మరేమీ లేదని దృఢంగా నమ్మారు కాబట్టే సైలెంటుగా కూర్చున్నారు. ఆంధ్రా ప్రజలేంటి.. తెలంగాణ ప్రజలే ఆఖరి దాకా అపనమ్మకంగానే చూశారు... కాంగ్రెస్ నిజంగానే తెలంగాణ ఇచ్చేస్తుందా అని. ఇచ్చేస్తానని చెప్పగానే సీమాంధ్రులు ఇప్పుడు అసలు తడాఖా చూపుతున్నారు. అయినా తెలంగాణలో ఉద్యమానికీ ఆంధ్రలో ఉద్యమానికీ హస్తిమశకాంతరం. తెలంగాణలో నాయకులు, జేఏసీల డ్రివెన్ ఉద్యమం. మూణ్నెల్ల ముందే ఆ మార్చ్.. ఈమార్చ్ అని హడావుడి చేయడం. చివరికి చతికిల పడటం. ఆంధ్రాలో జరుగుతున్నవి నిజంగా ఆవేదనతో చేసే మెరుపు సమ్మెలు. ఈస్థాయి ఉద్యమం.. మళ్లీ చెబుతున్నా.. ఈ స్థాయి ఉద్యమం తెలంగాణలో ఈ 60 ఏళ్లలో లేదు.
DeleteSurya garu,
ReplyDeleteNow thanks to uncertainty over telangana more ppl from seemandhra are going Chennai& Bangalore for job opportunities. Pvt companies doesn't discriminate on basis of region.
ఇదంతా కాంగ్రెస్స్ రాసుకున్న నాటికలొ భాగాలు. ఇప్పుడు హఠాత్తుగా ఎవరూ దాని అవినీతి గాని, పరిపాలన గురుంచి గాని, జగన్ గురుంచిగాని ఎవరూ మాట్లాడటం లెదు. కొద్దిరొజుల్లొ , ఈ నిర్ణయాన్ని వాయిదా వేసి, ఎన్నికల తరువాత అని అంటారు. ఈలొపల కొద్ది మంది అమాయక చక్ర వర్తులు ప్రాణాలు తీసుకుంటారు. 2014 ఎన్నికలకు గాను, తెలంగాణా ఇచినట్లు వుంటుంది, ఇవ్వనట్లు వుంటుది. అతి తక్కువ జ్ఞాపక శక్తి వున్న మన ప్రజానీకానికి, ఇదొక్కటే గుర్తు వుంటుంది.
ReplyDeleteవిడగొట్టు, ఎన్ని అడ్డ దారులైన తొక్కు, గెలువు. దేశానికి ఎంత నష్టం వచిన పర్లేదు అనేది ఇందిరా గాంధి నుంచి అనుసరిస్తున్నదే.
ఎందుకనో ఒక CBN గాని, నితిష్ కుమార్గాని, ఒక మోడి లాంటి నేతలు, ఆ పార్టీలో నుండి ఎప్పటికి రారు. ఒక YSR, జగన్, ఇలంటి వాల్లు కొ కొల్లలగా పుట్టిస్తుంది. "నా కాళ్ళ దగ్గర కుక్కలాగ వుండి, నువ్వు వెళ్ళి ఎన్ని అడమైన పనులన్న చెసుకో" అన్నది కంగ్రెస్స్ పార్టీ యొక్క ఒకే ఒక్క నిబందన. మిగతా పర్టీలలొ ఎంత అవినీతి వున్నా, ఎవడొ ఒకడు, నిజాయితీ వున్నవాడు వచె అవకాసం వుంది. కంగ్రెస్స్ పార్టీలో ఆ అవకాశమే లెదు. జనాలు ఆ పార్టీకి ఎందుకు వొట్లు వేస్తారొ తెలియదు. మన గుంటూరులొనే చూడండి, ఆ రాయపాటికి, కన్నాకి, ఇప్పుడు వాళ్ళ కొడుకులకు ఇంకా జనాలు వొట్లు వేసి గెలిపిస్తున్నారు.
మరీ ఆవేశపడిపోతున్నారే యువతలాగా :)) ఆచరణెక్కువ ఆలోచన.....
ReplyDeleteఅవును.
ReplyDeleteఈనాటి యువత కలం స్నేహం మర్చిపోయారు.
ఇప్పుడు చాలామందికి కావలిసింది కులం స్నేహం మాత్రమే.
ఫేస్‌బుక్కుల్లో కూడ కులం గ్రూపులే.
రమణ గారూ మీరు రోజుకో మాట మార్చడం బొత్తిగా బాలేదు. ఇంకా తెలుగు టీవీలు చూడడం మొదలెట్టలేదా?
ReplyDeleteనిజంగా ఆలోచన రేకెత్తించేలా రాశారు. మీరు లేవనెత్తిన సమస్యలన్నీ అందరి మదినీ తొలచివేసేవే. నిజానికి ఇటీవలే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున పెల్లుబుకిన రెండు ఉద్యమాలు.. Anti Corruption Movement & Delhi Nirbhaya Movements లో ప్రధానంగా ముందుకొచ్చింది యువతరమే. మరింత అభినందించదగ్గ విషయమేమంటే, ఈ ఉద్యమాల్లో కుల, మత, ప్రాంత, భాషా వైషమ్యాలకు అతీతంగా యువతరం నిరసన గళం విప్పింది. అవి విజయవంతమయ్యాయా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే, ఆ సామాజిక స్పృహ, బాధ్యత అనేవి యువతరంలో లేకపోలేదు. ఎటొచ్చీ, ఆ యువతను ఎవరు లీడ్ చేస్తారన్నదే ప్రతీసారీ భేతాళప్రశ్నగా ఉంటోంది. దురదృష్టమేమంటే, ప్రజల కోసం పనిచేస్తున్నామని ఉత్తర ప్రగల్భాలు పలికే కుహనా కమ్యూనిస్టు పార్టీలు (నేను కమ్యూనిజాన్ని గౌరవిస్తాను) అవకాశవాద ఓట్ల, సీట్ల రాజకీయాల్లో పీకల్దాకా కూరుకుపోయి (వీరి చారిత్రక తప్పిదాలకు అంతేలేదు) చివరికి తోకపార్టీలుగా మిగిలిపోయాయి. మరీ చోద్యమేమంటే, యువతీయువకులంతా కెరీరిస్టులుగా మారిపోతున్నారు, వాళ్లు ఉద్యమాల్లోకి రావట్లేదని ఈ ఎర్రనేతలు గొంతులు చించుకుంటున్నారట. అసలు వీళ్లు మతి ఉండే మాట్లాడుతున్నారా? ఏ ఆర్గనైజేషన్ దన్ను లేని అన్నా హజారే పిలుపునిస్తే దేశవ్యాప్తంగా ‘‘అవినీతి’’కి వ్యతిరేకంగా యువత కదిలారే; ఎవ్వరూ ఆర్గనైజ్ చేయకుండానే ‘‘ఢిల్లీ నిర్భయ ఘటన’’ విషయంలోను ఊరూరా యువతరం నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారే.. మరి మన అపర కమ్యూనిస్టులకు ఇవన్నీ ఏం పట్టవా? ఇక మరోవైపు, పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ డబ్బు, మద్యం, చోటామోటా పదవుల్ని ఎరగా వేసి యువతరాన్ని లొంగదీసుకుని భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ, మనోభావాల్ని దెబ్బతీస్తూ తమకు కావాలసిన అవకాశవాద, అరాచక రాజకీయాల్ని నడిపించుకుంటున్నాయి. మీరన్నట్టు, నేడు దేశవ్యాప్తంగా... విద్య లేదు. వైద్యం లేదు. ఉద్యోగాల్లేవు. అన్నదాతల ఆత్మహత్యలు. స్త్రీలకు రక్షణ లేదు. అవినీతికి అంతే లేదు. మద్యం, మాదక ద్రవ్యాలపై నియంత్రణ లేదు. క్రీడలు భ్రష్టు పట్టిపోయాయి. మరోవైపు కులాల కుమ్ములాటలు. మత విధ్వంసకాండ. ప్రాంతాల మధ్య చిచ్చులు. ఎక్కడిక్కడ అరాచకం, అరాజకీయం. మీరు అభిలషించినట్టు, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలసీలను ప్రశ్నిస్తూ యువతరం ఈ రోజు కాకపోయినా మున్ముందైనా ఐక్యమై కదలుతారని ఆశిద్దాం. థాంక్యూ.
ReplyDeleteమొన్న ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఇదే చెప్పాడు.
Deleteప్రస్తుతం మనదేశానికి అన్నీ ఉన్నాయి, యువత ఏదైనా చెయ్యగలదు కాని, దిశానిర్దేశం చేసే నాయకులే లేరని.
తెలంగాణా ఉద్యమంలో ముందున్న ఘనత కూడా యువకులదే. 1969 లో కూడా విద్యార్తులు యువకులే ముందు వరసలో ఉన్నారు.
ReplyDeleteతెలంగాణా "వి"నాయకులు పదవులకు ప్రలోభాలకు లొంగి ఈసారి మళ్ళీ ప్రజల ఆకాంక్షకు ద్రోహం చేయకపోవడం కూడా యువకుల ఖాతాలోనే వేయాలి. గత కొద్ది ఏళ్లుగా కేంద్రం నాయకులని కొని ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నాలు ఎన్నో చేసినా, విద్యార్తులు చెప్పుదెబ్బలు కోడతారనే భయంతో అవి ఫలించలేదు.
మీ వేదన అర్థమయింది. నిజమే, యువత చాల విషయాలకు స్పందించలేదు.
ReplyDeleteవాళ్ళు ఆవేశంలో ఉన్నపుడు, వేరే ఆందోళనలో ఉన్నపుడు అవన్నీ అడిగి ప్రయోజనం లేదు. వాళ్ళు ఇంకా గందరగోళ పడతారు.
అందుకని వాళ్ళు ప్రస్తుతం ఏం చెయ్యాలో చెప్పగలిగితే, వాళ్ళకి, వాళ్ళని చూసి సంతోషించే వాళ్ళంగా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది.
వాళ్ళు యువత. వాళ్ళ తెలివితోనూ, టెక్నాలజీ తోనూ, రాజధాని నాలుగు అయిదేళ్ళలో కట్టుకోవటం అంత పెద్ద కష్టమేమి కాదు. కావలిసింది సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పటం. వాళ్లకి తెలీదా? అంటే తెలియకపోవచ్చు. కొన్నాళ్ళు మద్రాసు మీద, కొన్ని దశాబ్దాలు హైదరాబాద్ మీద పడి బతికిన వాళ్ళకి (పాపం, ఈ పరిస్థితికి నేటి యువత కారణం కాదు.) కష్టం ఏం తెలుస్తుంది. కష్టం తెలియని వాడికి గౌరవం అంటే కూడా ఏమిటో తెలీదు. ఏ రాజధాని అలవోకగా నిర్మింపబడలేదు. ఆ ప్రాసెస్ లో కష్టం ఉంటుంది. ఫీల్ ఉంటుంది. అందులో తాత తండ్రుల కష్టం, పారంపర్య జ్ఞానం, వారసత్వం ఉంటుంది. దానివల్లనే తెలంగాణా వాళ్ళు, దశాబ్దాలుగా పోరాటం చెయ్యగలిగారు అనుకుంట.
ఎందుకు వచ్చిందో ఒక అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే, తలెత్తుకుని నిలబడచ్చు. కష్టం తెలిసినవాడికి తనని తాను గౌరవించుకోవటం, ఎదటి వాళ్ళని గౌరవించటం ఎలాగో తెలిసే అవకాశం ఉంది. కష్టమో, సుఖమో కొత్త రాజధాని నిర్మించుకోవటమే మంచిది. మీ తరం విజ్ఞానఖనులు (దేశ, విదేశాల్లో ఉన్న వాళ్ళంతా) పిల్లలతో నిలబడాలి.
‘హైదరాబాద్ ఇస్తావా! చస్తావా!’ అనేకంటే, ‘మాకు కావలసిన నిధులు ఇస్తావా! చస్తావా!’ అనటం మంచిదేమో? ఆలోచించాలి.
Thanks for this blog post sir. Exactly same is true for the youth of Telangana as well. If they showed 10% if interest and anger that they showed for the demand of Telangana state on issues such as those mentioned by you, how excellent could it have been !
ReplyDeleteమిత్రులారా,
ReplyDeleteఈ పోస్ట్ self explanatory. కావున నేను కొత్తగా చెప్పేదేమీ లేదు.
చక్కటి కామెంట్లు రాశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మొన్నటి నుండి నా మదిలో మెదిలే ప్రశ్నలను ఇలా మీ బ్లాగ్ లో చూడ్డం కాస్త ఆశ్చర్యంగా గాను, ఆనందంగాను ఉందండీ. ఇంతకు మించి ఏమీ రాయలేకపోతున్నాను. బాధగా ఉంది.
ReplyDeleteఆంధ్రులకు సరైన రాజకీయ నాయకత్వం సమకూడితే మరో నగరం కట్టుకోటం పెద్ద సమస్యే కాదు. అసలు సమస్యే నాయకత్వం కొరవడటం. మన ప్రయోజనాల కోసం ఆలోచించేవాడు లేడనే జనం రోడ్ల మీదకొచ్చి గొడవ. మన మెగాస్టార్ కాపులకు బీసీ హోదా అని, కర్నూలు వాళ్ళు రాయల తెలంగాణ అని, వక్స్ బోర్డని బేరాలు మాట్లాడుకుంటున్నారంట టైమ్స్ ఆఫ్ ఇండియా వాడి కధనం.
ReplyDeletehttp://timesofindia.indiatimes.com/india/Now-Seemandhra-netas-bargain-for-special-packages/articleshow/21666127.cms
ఇలాంటి మందనేసుకుని బాగుపడటం అటుంచి ఇంకా నాశనం అవుతామని జనం కంగారు. ఒక్క ఆంధ్ర నాయకుడన్నా కేంద్రం మెడ మీద కూర్చుని మనకు జరగవలసినవి జరిపిస్తాము, మన హక్కులకు భంగం కలిగితే అడ్దుకుంటాం అనట్లా. అలా అనిపించాలని జనం పంతం. కాంగ్రెస్‍ని ఎన్నుకున్నందుకు నిండా మునిగాం.
1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?
ReplyDelete2. తెలంగాణా వాదులకి తెలుసో లేదో గాని విభజన నిర్ణయం జరిగాక సమైక్యాంధ్ర ఆందోళనల వెనక రాష్త్ర స్థాయి కాంగ్రెసు పెద్దలే ఉన్నారనేది యెమి చెబుతున్నది? ఇస్తారేమో అన్నప్పుదు హడావుడి చెసి ఇవ్వరని ధీమాగా ఉన్నప్పుదు ఆగిపోవటంలా నత్త నదక నడిచే ఉద్యమానికి చురుకు తెప్పించటం కొసమే వాళ్ళు ఈ ప్రకటన చేసారు. దాన్ని వేడెక్కించి ఆ బూచిని చూపించి విభజనని యెన్నికల తర్వాతకి వాయిదా వెయ్యటం కోసం అక్కడి పెద్దన్నలూ ఇక్కడి చిన్నన్నలూ కలిసి ఆడుథున్న దొంగాట ఇది.
3. అవును అది మాకూ తెలుసనే తెలంగణా వాదులకి నేనొక సూటి ప్రశ్న వేస్తాను. ఇట్లాంటి కాంగెసుతో కచరా గారు యెందుకంత మమేకమయ్యారో, రాష్ట్రం రావటమంటూ జరిగితే అది కాంగ్రెసు వల్లనే అని నొక్కి చెప్పారో నిన్న గాక మొన్న రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో కలిసి పోవడానికి గూడా సిద్దపడ్దారో మీరు తేల్చుకొవల్సి వొస్తుంది.
4. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యెమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?
5. తెలంగానా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఈవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూదు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?
6. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుంతుంది? విదిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్తంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్త్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్త్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.
ReplyDelete7. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వదం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.
8. తెలంగణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబాల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెందు రాష్త్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.
9. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్ల పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.
10. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపదే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విదిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విదిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)
ఇక ఆఖరుగా రెండు మాటలు చెప్పి నా వాదనని ముగిస్తాను.ఒకనాడు దేశం కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్న రోజున భాషాప్రయుక్త రాష్త్రాల పేరుతో మనం ఒక ఒరవడి దిద్దాం. అదే దారిలో మిగతా వాళ్ళూ నడిచారు. ఇవ్వాల మళ్ళీ అధికార వికేంద్రీకరణ సాధిస్తే మళ్ళీ మనం అందరికీ కొత్తదారి చూపించిన వాళ్ళ మవుతాం.నాకు చాలా బాధగా అనిపించే విషయం ఒకటి ఉంది. తెలంగణా వాదులు మా భాష వేరు అంటున్నారు. అది చాలా తప్పు.మనం ఆ రొజున వేరే వాళ్ళకి వొదిలేసిన రాష్త్రాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరం తెలుగు వాళ్ళమే. నేను క్రిష్ణా జిల్లా వాడినే అయినా రాగద్వేషాలు లేని నిందు మనస్సుతో ఒక మాట చెబుతున్నా. క్రిష్నా జిల్లా నించి అధికార కేంద్రాన్ని అంటకాగి బాగా బలిసిన వాళ్ళు ఇతర జిల్లల వాళ్ళని చాలా హీనంగా చూసారు, చూస్తున్నారు,ఇకముందు కూదా వాళ్ళు సంస్కారం గలిగి ప్రవర్తిస్తారని నేననుకోవదం లేదు. వాళ్ళీ రోజున మా భాష నీటైనది అనుకోవడం సంస్కృతం తో అవసరమైన దానికన్న యెక్కువగా సంకరం అవ్వడం వల్ల వొచ్చిందే. తెలంగాణా లో మాట్లదేదీ, రాయల సీమలో మట్లాడేదీ, అంధ్రా జిల్లాల్లో మట్లాడేదీ అంతా తెలుగే. అన్నీ మాండలికాలు మాత్రమే.అవి వాదుక ఈజీ గా ఉండడం కోసం యేర్పడిన యాసలు మాత్రమే. ఉపనిషత్తులలో శ్రేయము ప్రేయము అని ఒక భావన ఉంది. దాని అర్ధమేమిటంటే శ్రేయం కలిగించేది ఇష్టమైనది కూదా అయితే వెంటనే తీసేసుకో - నిన్నెవరూ అపలేరు కూడ. ప్రియమైనది శ్రేయము కాదని తెలిసినప్పుదు తొందర పడగూడదు. అలా తీసుకుంటే తర్వాత నష్టం నీకే. అలాగే ఒకటి మనకు శ్రేయస్సు నిచ్చేది అయితే అప్పటికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇష్టం కలిగించుకోవలసిందే, యెందుకంటే అది నీకు మంచి చేస్తుంది గనక.ఈ ఉపనిషత్తుల సుత్తిని నా స్వంత అవసరానికి వేస్తున్నానండీ యేమనుకోకండేం:-) ఇంకోటి, పైన నేను చెప్పినవన్నీ నా వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నా మాటల వల్ల అసలే వేడిగా ఉన్న వాతావరణం ఇంకా వేడెక్కని విధంగానే చెప్పినా తమకిష్టం లేని సంగతి కనబడ్దగానే నన్ను మాత్రం ద్వేషించకుండా ఉంటారని:-)
ReplyDeleteనా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.
విభజనా? వికేంద్రీకరణా? యేది ఉత్తమం?
హరిబాబు గారూ!
ReplyDelete‘విభజనా!- వికేంద్రీకరనా!’ అనే మీమాంస ఎందుకండీ? పది జిల్లాల తెలంగాణలో విభజన ప్రయోగం, proposed ఆంధ్రప్రదేశ్ లో వికేంద్రీకరణ ప్రయోగం చేస్తే బాగుంటుంది కదా! రిజల్ట్స్ ని బట్టి ఏది బాగుంటే దాన్ని మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు.