"మావాఁ! ఒకపక్క సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. నువ్వేమో తాపీగా చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నావు."
"ఉరే అల్లుడూ! నేనేమీ నీకు లాగా ఇంజినీరింగ్ చదువుకుని పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యట్లేదు. ఏదో పదో క్లాసు వెలగబెట్టి వ్యవసాయం చేసుకుంటున్నాను. నా చుట్ట నన్ను కాల్చుకోనీ."
"చదువుకోకపొతే మాత్రం నువ్వు మనిషివి కాదా? నీకు మాత్రం బాధ్యత ఉండదా? అమరజీవి పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్రప్రదేశ్ ని ముక్కలుగా చేసి, హైదరాబాదుని తెలంగాణా వాళ్ళు కాజేస్తున్నారు. మనం మన హైదరాబాదుని కాపాడుకోవాలి."
"అల్లుడూ! ఇలా చెబుతున్నానని ఏమనుకోమాక. చిన్నప్పుడు నేనూ సాంఘిక శాస్త్రం చదువుకున్నాను. మా పుస్తకాల్లో పొట్టి శ్రీరాములు 1952 లోనే మరణించారని రాశారు. ఆయన మద్రాసు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడాలని నిరాహార దీక్ష చేశాడు. అసువులు బాశాడు. ఇప్పుడు దీక్షలు చేసేవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా సెలైన్ కడుతున్నారు. పొట్టి శ్రీరాములు విషయంలో ఆనాటి పోలీసులు, డాక్టర్లు ఊరుకున్నారు. కారణం తెలీదు."
"మావాఁ! ఇప్పుడు ఉద్యమం చేస్తున్న రాజకీయ నాయకులకి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకి నీపాటి జ్ఞానం లేదనుకోకు."
"అంతమాట నేనంటానా అల్లుడూ?"
"మావాఁ! పాఠ్యపుస్తకాలు ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్లు వస్తుంటాయి. సబ్జక్టు కూడా మారుతుంటుంది. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందనేవాళ్ళు. మరిప్పుడు భూమి గుండ్రంగా ఉందని రాయట్లేదూ?"
"అల్లుడూ! సైన్స్ మారుతుంటుంది గానీ.. చరిత్ర ఎట్లా మారుతుంది?"
"అక్కడే పప్పులో కాలేశావు మావాఁ! ఏదీ నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకం ప్రకారం ప్రధానమంత్రి ఎవరో చెప్పు?"
"ఇందిరాగాంధీ."
"మరిప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రా? మన్మోహన్ సింగు కదా!"
"నిజవే అల్లుడూ!"
"మావాఁ! నీది మిడిమిడి జ్ఞానం. నీకు చరిత్ర తెలీదు. చెప్పినా అర్ధం చేసుకోలేవు. సైన్స్ సబ్జక్టు లాగే సోషల్ సబ్జక్టూ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. లేటెస్ట్ సోషల్ టెక్స్ట్ బుక్ ప్రకారం పొట్టి శ్రీరాములు హైదరాబాద్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 1956 లో అమరజీవి అయ్యాడు."
"నిజంగా!"
"ఇది పచ్చి నిజం. ఆయన ప్రాణ త్యాగ ఫలితంగానే హైదరాబాదుతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ మహానుభావుని ఆత్మ బలిదానం మనం వృధా పోనియ్యరాదు. అర్ధమైందా? చుట్ట కాల్చడం అయ్యిందిగా. ఇంక ఉద్యమ దిశగా నడువు."
"వార్నీ! ఈ మధ్య కాలంలో చరిత్ర మరీ ఇంత దారుణంగా మారిపోయిందా అల్లుడూ? సర్లే! అర్జంటుగా చెంబుకెళ్ళాల. ముందు నువ్వెళ్ళు. పని పూర్తి చేసుకుని ఎనకమాలగా నేనొచ్చెస్తా."
(photos courtesy : Google)
చరిత్రదేమున్నదండి చెరిపేస్తే చేరిగిపోయ్యేది. నేలే కదిలిపోతుంటే చరిత్ర ఒక లెక్కా. ఈ లింకులో చూడండి తెలంగాణా ఎక్కడ ఉండేదో: http://www.iloveindia.com/history/medieval-india/bahamani-kingdom.html 13వ శతాబ్దంలో సముద్రం వడ్డున ఉన్న తెలంగాణా, హైదరాబాదుకి షిఫ్టు అయిపోలా..??
ReplyDeleteసరిగ్గా చెప్పారు. చరిత్రదేముంది? చింపేస్తే చినిగిపోతుంది. అలాగే సరిహద్దుల రూపూరేఖలూ మారిపోతూనే ఉంటాయి.
Deleteఐతే ఇంకో పనిచేద్దాం. పై బొమ్మలో ముక్క కూడా కలిపేసి తెలంగాణా ఇచ్చేద్దాం. మొత్తంగా 1800 సంవత్సరం నాటి యధాతధస్తిథి కి తీసుకుపోదాం. బ్రిటీషోడిని కూడా వెనక్కి పిలిచేద్దాం. ఓపనైపోతుంది.
-
ఆత్రేయ
nice...
ReplyDeleteడాక్టర్ గారు,
ReplyDeleteఈ రోజు మధ్యాన్నం ఇండియన్ పాలిటి బుక్ లో రాష్ట్ర్రాలు యేర్పడే విధానం చదువుతూ పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నుండి విడిపోయే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం 1952లో చనిపోయాడని చదివి కరెక్టుగా నాకు ఇదే అనుమానం వచ్చింది.
కాని ఇప్పటి వుద్యమాలు చూస్టుంటే ఆయన నిజంగానే ఆంధ్రప్రదేశ్ కోసం చనిపోయాడని చెబుతున్నారు.
యెంచేద్దాం వుద్యమాలకాలం.
రమేష్ బాబు
Dar Ramana Garu,
ReplyDelete1. There was considerable sentiment towards a united Telugu state from 1930s itself.
2. While AP was formed Visaalandhra sentiment was strong from both sides, Telangana()Madapati hanmantharao, Nurgula Ramakrishna Rao etc) and Andhra . Even Varavara rao confirmed this
3. Potti Sreeraamulu gaaru's sacrifice precipitated the formation of Andhra state.
3.The formation of Andhra state was a step towards united AP. This was expressed by Prakasam Pantulu etc.That's why Karnool was declared as "Temporary" capital. There's no AP without Andhra state.
4. Indirectly, Amarajeevis sacrifice was also one the cause of AP.
5. Nobody told Amarajeevi's sacrifice was done in 1956.
http://aksharsatya.blogspot.ca/2013/08/blog-post_24.html?m=1
Deleteవిశాలంద్రకు తెలంగాణాలో కూడా అంత ఇష్టం ఉంటె మొదటి SRC మరో రకంగా ఎందుకు చెప్పింది చెప్మా?
తెలంగాణకు విశాలాంద్ర బహు ఇష్టం అయితే పూర్తిగా ఏకపక్షంగా(తెలంగాణకు) ఉన్న 'పెద్దమనుషుల ఒప్పందం'ను ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ప్రతిపాదించినట్లు , ఒప్పుకున్నట్లు?
తెలంగాణతో కూడిన విశాలాంద్ర తన ప్రయత్నమని అమరజీవి చెప్పినట్లు ఎక్కడా లేదే?
ఇన్ డైరెక్టుగా అమరజీవి త్యాగం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం అయితే మరి గాంధి, పటేల్ లు కూడా ఇన్ డైరెక్టుగా కారణాలే కదా, మరి వారిని కూడా రాష్ట్ర ఏర్పాటులో అమరజివితొ సమానంగా కోలుడ్డామా? (గాంది లేకపోతె స్వతంత్ర భారతం లేదు అంటే ఆంధ్ర ప్రదేశ్ లేదు, పటేల్ లేక పొతే హైదరాబాదు రాష్ట్రం లేదు అంటే తెలంగాణా లేదు, ఇన్ డైరెక్టుగా )
FYI, in 1940s your favorite author Kodavatiganti. Kutumbarao wondered aloud if formation Andhra Nation was the right thing :-)
ReplyDeleteSome more info, Raavi Saastri released a letter opposing the T-movement of 60s. But termed the Jai Andhra movement of 72 as peoples movement.
మిత్రులారా,
ReplyDeleteఈ పోస్టు కంటెంట్ చాలా సిల్లీగా ఉందని నాకు తెలుసు. అందుకే నిన్న రాత్రి దాకా నాకీ పోస్ట్ రాసే ఉద్దేశ్యం కూడా లేదు.
గత రెండు వారాలుగా నాకు (repeated గా) ఆశ్చర్యం కలిగించేదేమనగా.. (నా ఇద్దరు పిల్లలతో సహా) ఇక్కడ కుర్రాళ్ళకి పొట్టి శ్రీరాములు ఎవరో తెలీదు! (sad but true!)
నిన్నటిదాకా పొట్టి శ్రీరాములు గూర్చి మనవాళ్ళకి అంతా తెలుసు, కానీ విషయాన్ని twist చేసి, రాజకీయంగా తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారని అనుకున్నాను (ఇది కొంత అర్ధం చేసుకోవచ్చు).
ఒక రాజకీయ అభిప్రాయం కలిగి ఉండటం వేరు.. అసలు విషయమే తెలీని అజ్ఞానం వేరు. ఇది దురదృష్టం.
ఈ కుర్రాళ్ళు పొద్దస్తమానం Facebook లో ఉంటారు. వందల కొద్దీ 'friends' ఉంటారు. కానీ ఒక క్లిక్ ఇచ్చి wiki చూసి, విషయం చదివే ఓపిక వీళ్ళకి లేదు! (ఉదా : నా కూతురు).
ప్రస్తుతం మన దేశంలో ఉన్న విద్యావిధానంలో.. మన దేశానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందో కూడా తెలీకుండా.. కార్డియాక్ సర్జన్ అవ్వొచ్చు, రాకెట్ సైంటిస్ట్ అవ్వొచ్చు. అది మన ఖర్మ!
మీరు చెప్పింది అక్షరాలా నిజం.
Deleteమన విద్యావ్యవస్థ కేవలం సొంత ఆలోచన లేకుండా పని చేయడం నేర్పిస్థుంది.
ఇప్పుడున్న పిల్లలకు గాంధి, నెహ్రు లు తప్ప మిగిలిన freedom fighters తెలీదు.
దేశానికి స్వతంత్ర్యం కేవలం congress వల్లనే వచ్హిందని, దేశాన్ని అభివ్రుద్ది చేసింది ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి మాత్రమేనని పిల్లలకి నేర్పించకపొతే congress అధికారం లొ వుండేదెలా?
"ఇప్పుడు దీక్షలు చేసేవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా సెలైన్ కడుతున్నారు. పొట్టి శ్రీరాములు విషయంలో ఆనాటి పోలీసులు, డాక్టర్లు ఊరుకున్నారు. కారణం తెలీదు."
ReplyDeleteIt's a case of once bitten twice shy. శ్రీరాములు దీక్షని దీక్ష సమయం లో పెద్దగా పట్టించుకోలేదు. (గాంధీ గారు కూడా సెలైన్ ఎక్కించుకోకుండా దీక్షకు చేశారు). కానీ ఆయన చనిపోయిన తరువాత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. తరువాత ప్రభుత్వాలు రిస్క్ తీసుకోదలచవు. దీక్షలో ఎవరైనా చనిపోతే మళ్ళీ పెద్ద గొడవలు జరుగుతాయి.
@bandi,
Deleteమీకా భయం అక్కర్లేదు.
ఇప్పటి నాయకులు ఏరోజు అరెస్ట్ అవ్వాలో ముందుగానే పోలీసువారితో చర్చించుకుని మరీ దీక్షలు చేస్తున్నారు. అరెస్టు రోజు మెడికల్ టెస్టుల్లో హఠాత్తుగా బిపి, షుగర్ లెవల్స్ పడిపోతాయి!
పొట్టి శ్రీరాములు అన్న ఆయన ఆంధ్ర రాష్ట్రం...తెలుగు ప్రజలు...ఒక రాష్ట్రం..అని ఉద్యమించాడు...ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడిందని తెలుసు, కానీ జనానికి....మీ అంత వికిపీడియాలు చదివే నాలెడ్జ్ లెదు పాపం...తెలుగు వాళ్ళు కోడి గుడ్డుకి ఈకలు పీకి....కాలు వేరూ...చెయ్యి వేరు...అని చెప్పేంత గ్నానులని... వాళ్ళకి తెలియదు...కాలు కాలే!!చెయ్యి చెయ్యే...ఒకటెలా అవుతాయి?మొండెం నుంచి విరిచెయ్యండి డాట్రారూ!!
ReplyDelete(చరిత్రంతా కెలుక్కుని జనాన్ని... వెర్రి వాళ్లంటున్నారన్న భాద తో
పొట్టి శ్రీరాములు అన్న ఆయన ఆంధ్ర రాష్ట్రం...తెలుగు ప్రజలు...ఒక రాష్ట్రం..అని ఉద్యమించాడు...ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడిందని తెలుసు, కానీ జనానికి....మీ అంత వికిపీడియాలు చదివే నాలెడ్జ్ లెదు పాపం...తెలుగు వాళ్ళు కోడి గుడ్డుకి ఈకలు పీకి....కాలు వేరూ...చెయ్యి వేరు...అని చెప్పేంత గ్నానులని... వాళ్ళకి తెలియదు...కాలు కాలే!!చెయ్యి చెయ్యే...ఒకటెలా అవుతాయి?మొండెం నుంచి విరిచెయ్యండి డాట్రారూ!!
ReplyDelete(చరిత్రంతా కెలుక్కుని జనాన్ని... వెర్రి వాళ్లంటున్నారన్న భాద తో)
@kvsv,
Deleteనేన్రాసిన పోస్టు ఆంధ్రప్రదేశ్ గూర్చి. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా మీకు అనిపించిందా!
(మీ కాలు, చెయ్యి, మొండెం భాష నాకర్ధం కాలేదు.)
మీరు చెప్పిన "ఒక" తెలుగు రాష్టం పేరు ఆంద్ర. అది 1953లొ ఏర్పడింది. దానికి అప్పట్లో గుండె కాయ లేదా? లేకుండానే మూడేళ్ళు బతికిండా?
Deletesuper post....
ReplyDeleteyes even i believe that 90% of the ppl who r on roads agitating dont know y they r opposing Telangana.
"ప్రస్తుతం మన దేశంలో ఉన్న విద్యావిధానంలో.. మన దేశానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందో కూడా తెలీకుండా.. కార్డియాక్ సర్జన్ అవ్వొచ్చు, రాకెట్ సైంటిస్ట్ అవ్వొచ్చు. అది మన ఖర్మ!"
a cardiac surgeon need not know about Indian independence if he is not interested. but with our education system most of the students dont know the basics of the subject they r graduating in. I have seen many computer engineers who dont even know basic operation of a computer.....
medical education కూడా అలానే తయారైంది. దానికి కారణాలు అనేకం. వీలైతే ఒక పోస్టు రాస్తాను. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం.
Deleteచరిత్ర మార్చుకున్న ఆంధ్రప్రదేశ్ - roopu marchukunna partylu
ReplyDelete