"సుబ్బూ!"
"ఊఁ"
"అంటే ట్రాఫిక్ సిగ్నళ్ళూ, దివంగత పార్టీ నాయకుల బొమ్మలు ఒకటే నంటావా సుబ్బూ?"
"నేనైతే మాత్రం అవుననే అనుకుంటున్నాను. "
(picture courtesy : Google)
"ఊఁ"
"మన రాజకీయా పార్టీలకి గొప్ప ఎజెండా ఉంటుంది. మరెంతో గొప్ప నాయకులుంటారు. అయినా మన బ్రతుకులు ఎందుకిలా తగలడ్డయ్యంటావ్?"
"సిటీల్లో ప్రతి కూడలిలో ట్రాఫిక్ లైట్లుంటాయ్. అయినా యాక్సిడెంట్లు ఎందుకు జరుగున్నయ్యంటావ్?"
"సుబ్బూ! అర్ధం లేకుండా మాట్లాడి విసిగించకు."
"మనూళ్ళో ముఖ్యమైన కూడళ్ళలోనూ ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి. కానీ వీటిని ఎవరూ పట్టించుకోరు. వాటి మానాన అవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు చూపిస్తుంటాయి. మన మానాన మనం వాహనాల్ని అడ్డదిడ్డంగా నడిపేస్తుంటాం. పొరబాటున ఎవడన్నా అమాయకుడు ఎర్రలైటు చూసి ఆగినట్లైతే.. వెనకనుండి వాణ్ని గుద్దేస్తారు. అనగా ట్రాఫిక్ లైట్లని పట్టించుకోకపోవడంలో మన జనాలకి ఒక యూనిటీ ఉంది, క్రమశిక్షణా ఉంది."
"అవును సుబ్బూ!"
"జనాలు ట్రాఫిక్ సిగ్నళ్ళని లెక్కచెయ్యక పోవడంలో చూపించిన యూనిటీ, క్రమశిక్షణా నాకు మన రాజకీయ పార్టీ కార్యకర్తల్లోనూ కనిపిస్తుంది. అన్ని కూడళ్ళల్లోనూ ట్రాఫిక్ లైట్లు ఉన్నట్లే అన్ని రాజకీయ పార్టీలకి ఒకప్పటి మహానాయకులు ఉంటారు. ఆ పాతతరం నాయకులకి గొప్ప సిద్ధాంతాలూ ఉండేవి. కానీ మన జనాలు ట్రాఫిక్ లైట్లని పట్టించుకొనట్లే ఆ నాయకుల సిద్ధాంతాల్ని సొంత పార్టీ కార్యకర్తలే పట్టించుకోరు."
"సుబ్బూ ! మరీ జనరలైజ్ చేస్తూ చెబుతున్నావ్. అర్ధం కావట్లేదు."
"ఓకే. ఉదాహరణకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బ్యాక్ గ్రౌండులో మహాత్మా గాంధి, నెహ్రూ బొమ్మలు ప్రముఖంగా కనిపిస్తుంటయ్. కానీ ఆ నాయకుల బొమ్మలకి, అక్కడ జరుగుతున్న సమావేశాలకి ఏ మాత్రం పొందిక ఉండదు. ఆ బొమ్మలు మన ట్రాఫిక్ లైట్లలాగే నిస్సహాయ సాక్షులుగా ఉండిపోతాయి."
"నిజమే సుబ్బూ!"
"తెలుగు దేశం పార్టీ మహానాడు సమావేశాల్లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తుంటాయి. ఆ బొమ్మల సాక్షిగా, తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన అనేక ప్రజాసంక్షేమ పథకాల్ని ఎత్తేసింది. మొన్న మహానాడులో రాష్ట్ర విభజనకి అనుకూలంగా TDP తీర్మానం చేసింది. బ్యాక్ గ్రౌండులో ఎన్టీఆర్ బొమ్మ వెలవెలపోయింది. అనగా అక్కడ ఎన్టీఆర్ స్పూర్తి ఉండదు. బొమ్మ మాత్రమే ఉంటుంది."
"మరప్పుడు ఆ బొమ్మలెందుకు సుబ్బూ?"
"పిచ్చివాడా! ఆ బొమ్మలే లేకపోతే ఈ పార్టీలకి credibility crisis వస్తుంది. మనం పట్టించుకోవట్లేదని ట్రాఫిక్ సిగ్నల్స్ అవతల పడేస్తే ఊరికి ఎంత నష్టం! పనికిరాని ఆ ట్రాఫిక్ సిగ్నళ్ళు, ఉత్సవ విగ్రహాల్లా ప్రపంచానికో గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఈ సెంటర్లో ట్రాఫిక్ ఒక పద్దతిగా, క్రమశిక్షణ పాటిస్తుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. దూరం నుండి చూసేవాళ్ళకి కన్నుల పండుగగా కూడా ఉంటుంది. ఆ విధంగా ట్రాఫిక్ లైట్లు పురజనులకి మానసికానందాన్ని కలిగిస్తాయి."
"అంటే ట్రాఫిక్ సిగ్నళ్ళూ, దివంగత పార్టీ నాయకుల బొమ్మలు ఒకటే నంటావా సుబ్బూ?"
"నేనైతే మాత్రం అవుననే అనుకుంటున్నాను. "
(picture courtesy : Google)
మోకాలికి బోడిగుండుకు మీలా ఇంత అందముగా ముడిపెట్టడము వేరెవ్వరికి సాధ్యము కాదు
ReplyDeleteఅవును కదూ!
Deleteఈ పోస్ట్ రాసినప్పుడు నేను కూడా ఇదే అనుకున్నాను.