"సుబ్బూ! అడ్డమైన గడ్డీ అడ్డదిడ్డంగా మేస్తావు. పెట్టెడు సిగరెట్లు సునాయాసంగా ఊది పడేస్తావు. ఆ పాడు వక్కపొడి పలుకులు బఠాణీల్లాగా నముల్తుంటావు. వద్దురా బాబూ అని చిలక్కి చెప్పినట్లు చెబుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మాత్రం కుక్కతోకే. అనుభవించు." ఒక్కో పదం నొక్కి పలుకుతూ అన్నాను.
అంతలోనే దిగాలుగా కూర్చునున్న సుబ్బుని చూస్తే జాలేసింది. రెండ్రోజులుగా సుబ్బు పంటినొప్పితో బాధ పడుతున్నాడు. ఇవ్వాళ మావాడికి నొప్పి భరింపరానిదిగా తయారైంది. అదీ విషయం.
"సర్లే పద. డెంటల్ డాక్టర్ దగ్గర కెళ్ళొద్దాం. నాకు ఆట్టే టైం లేదు." టైం చూసుకుంటూ అన్నాను.
"నీతో నేన్రాను. నువ్వూ, ఆ డాక్టరు నా పంటి గూర్చి డిసైడ్ చేసేసి ఏదో చేస్తారు. హడావుడిగా పన్ను పీకించినా పీకేంచేస్తావు." నిదానంగా అన్నాడు సుబ్బు.
"అర్ధం కాలేదు. అంటే నామీద నీకు నమ్మకం లేదా?" అడిగాను.
"లేదు. నిన్ను నమ్మి నా పన్ను నీ చేతిలో పెట్టలేను." సన్నగా నవ్వుతూ అన్నాడు సుబ్బు.
నాకు చికాగ్గా అనిపించింది.
"సుబ్బు! ఎక్కువ మాట్లాడకు. న్యాయంగానైతే నీమీద జాలి చూపకూడదు."
"చూడబోతే నా టూత్ ఏక్ నీకు సంతోషంగా ఉన్నట్లుంది ." అంటూ అరచెయ్యి దవడపై ఆనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు.
పాపం! బిడ్డడికి నొప్పి బాగా ఉన్నట్లుంది. అందుకే తలతిక్కగా మాట్లాడుతున్నాడు.
"సరే. నా ఫ్రెండ్ డాక్టర్ సుబ్బానాయుడుకి ఫోన్ చేసి చెబుతాను. ఇక్కడతనే టాప్ డెంటల్ డాక్టర్. కార్లో వెళ్లి నీ పన్ను నువ్వే చూపించుకో మిత్రమా." అన్నాను.
"పోనీ నీ పంటిని నిదానంగా, స్పెషల్ గా, ఓ పది నిమిషాల పాటు చూడమని చెబుతాను. ఓకేనా?" నవ్వుతూ అన్నాను.
"అసలు నాకో అనుమానం. పళ్ళ డాక్టర్లు ఒకడి నోట్లో పెట్టిన instrument సరీగ్గా కడక్కుండా ఇంకోళ్ళ నోట్లో పెట్టరని గ్యారంటీ ఏంటి?" అన్నాడు సుబ్బు.
"ఇన్ని డౌట్లు గుండె ఆపరేషన్ చేయించుకునే వాడిక్కూడా రావు సుబ్బు." అసహనంగా అన్నాను.
"పన్ను నాది. నొప్పి కూడా నాదే. నాకీ వివరాలు చాలా అవసరం." నొప్పిగా నవ్వాడు సుబ్బు.
"సర్లే. పోనీ డాక్టర్ రెడ్డి దగ్గరకి వెళ్తావా? ఆయన దగ్గర జనం తక్కువగా ఉంటారు. శ్రద్ధగా చూస్తాడు." అన్నాను.
"అంత శ్రద్ధగా చూసేవాడైతే ప్రాక్టీసు లేకుండా ఖాళీగా ఎందుకుంటాడు? ఆయన వైద్యంలో ఏదో లోపం ఉండుంటుంది. నేను పోను." స్థిరంగా అన్నాడు సుబ్బు.
"నీకు నీ పంటినొప్పికి ట్రీట్మెంట్ కావాలా? డాక్టర్ల బయోడేటా కావాలా?" సుబ్బు అనుమానాల్తో చికాకనిపిస్తుంది.
"పిచ్చివాడా! ఎవడైనా పళ్ళ డాక్టర్ల గూర్చే బాగా విచారించాలి. కాళ్ళూచేతులు రెండు రెండుంటాయి. కావున పెద్దగా కన్ఫ్యూజనుండదు. కానీ నోట్లో పళ్ళు 32. అంచేత డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఎక్కువ. పొరబాటున ఒకదాని బదులు ఇంకోటి పీకేసే ప్రమాదం మెండుగా ఉంటుంది." అన్నాడు సుబ్బు.
"ఒరే నాయనా! నీకో నమస్కారం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు." అన్నాను.
"నువ్వు ఏమీ చెయ్యనక్ఖర్లేదు. బాబా రామ్ దేవ్ పళ్ళపొడి మూడు పూటలా వేసి తోమితే పంటినొప్పి చిటికెలో మాయమౌతుందని మన పుచ్చాగాడు చెప్పాడు. అసలీ ఇంగ్లీషు డాక్టర్ల వైద్యం నరకానికి అడ్డదారి." అంటూ లేచాడు సుబ్బు.
"పోనీ నొప్పి తగ్గడానికి ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వమంటావా?" అడిగాను.
"అవసరం లేదు. మీ సైకియాట్రిస్టులు ఇచ్చే మందులు నేను వాడను." అంటూ హడావుడిగా వెళ్ళాడు సుబ్బు.
'ఈ జన్మకి సుబ్బుకి బుద్ధొచ్చే అవకాశం లేదు.' అనిపించింది. దీర్ఘంగా నిట్టూర్చి నా పనిలో పడ్డాను.
సాయంకాలం సుబ్బు మదర్ ఫోన్.
"ఒరే రమణా! ఇక్కడ సుబ్బు పరిస్థితి ఏమీ బాగాలేదు. అదేదో పళ్ళ పొడి తెచ్చుకుని మధ్యాహ్నం అంతా పళ్ళకేసి రుద్దాడు. ఇప్పుడేమో నోరంతా పోక్కి ఎర్రగా అయిపొయింది. మూతి కూడా వాచిపోయింది. మాట్లాళ్ళేకపోతున్నాడు. సైగలు చేస్తున్నాడు. నీ దగ్గరకి పొమ్మంటే పోనంటున్నాడు." అన్నారావిడ.
"అమ్మా! వాణ్ని నోరు మూసుకుని నే చెప్పినట్లు చెయ్యమను." అన్నాను.
"వాడిప్పుడు నోరు మూసుకునే ఉన్నాడు గదరా. తెరవలేడు. మళ్ళీ మూసుకొమ్మని చెప్పడం దేనికి?" ఈవిడ అన్నివిధాలా సుబ్బుకి తల్లే.
"సరేనమ్మా. నేనిప్పుడే కారు పంపుతున్నాను. ఆ దరిద్రుణ్ని అర్జంటుగా రెడీ కమ్మను. కారెక్కనంటే కర్ర తీసుకుని నాలుగు బాది కార్లోకి నెట్టు." అంటూ ఫోన్ పెట్టేసి డ్రైవర్ కోసం బెల్ నొక్కాను.
(picture courtesy : Google)
మీ సుబ్బు ఎంతో నయం...చాలా మంది t.v లో వచ్ఛే ఓ గడ్డపాయన మాటలు విని అడ్డమైన భస్మాలు తయారు చెసుకుని మింగి gastoentrologists దగ్గరికి పరిగెత్తుతున్నారు.ఇంతకీ ఈ t.v వైద్యులకు మీ doctors కి ఏమైనా లోపాయకారి ఒప్పందం వుందటారా?(నిజం చెప్పండి , ఈ రహస్యాన్ని మూడో చెవికి చెప్పను.
ReplyDeleteటూత్ - ఏక్ కాదండి. బత్తీస్ కదా.
ReplyDeleteఅందుకే అన్ని డౌట్స్.
రమణగారూ, బాబా రాందేవ్ అమ్మే వస్తువులు (ముఖ్యంగా పళ్ళపొడి) చెడు ఫలితాలు అందించినట్లు మీదగ్గర సమాచారం ఉందా? ఉంటే ఆ సమాచారాన్ని నేరుగా బ్లాగులో రాసి ఆ ఫలితం రావడానికి గల కారణాలేవైనా మీ ఊహకు అందితే రాయండి. అలా కాకుండా ఇలా సుబ్బునో మరొకరినో అడ్డుపెట్టుకుని సెటైర్లు వెయ్యటం సంస్కారం అనిపించుకోదు.
ReplyDelete:) :)
ReplyDeleteBeing an Indian heckling Indian medicine is very bad.
ReplyDeleteరమణగారూ, బాబా రాందేవ్ అమ్మే వస్తువులు (ముఖ్యంగా పళ్ళపొడి) చెడు ఫలితాలు అందించినట్లు మీదగ్గర సమాచారం ఉందా?
ReplyDeleteAgree With Surya Garu
కొందరు వ్యాఖ్యాతలు పొరబడ్డారు.
ReplyDeleteరమణగారు "అదేదో పళ్ళ పొడి తెచ్చుకుని మధ్యాహ్నం అంతా పళ్ళకేసి రుద్దాడు." ఆ అభాగుడి తల్లి పాత్ర చేత అనిపించారు. మరో సారి చదవండి టపాను.
సరిగా పనిచేసే మందోమాకో అయినా సరే, అజ్ఞానంతో అతిగా వినియోగిస్తే వికటించదా?
అది రాందేవ్‌గారి పళ్ళపొడో మరోటో కానక్కరలేదు పారాసిటమాల్ వరసా పది మాత్రలు మింగినా ప్రమాదమే కాదా? ఇక్కడ కోతిపుండు బ్రహ్మరాక్షసి కావటానికి సదరు సుబ్బు అవివేకమే ప్రధాన కారణం. పళ్లపొడి కారణం అని డాక్టరు గారు ఎక్కడా వ్యాఖ్యానించలేదు.
వ్యాఖ్యాతలు ఆవేశపడటం అసంగతం.
హల్లొ,
ReplyDeleteరాందెవ్ గారి భక్తులు చలామందే ఉన్నారు. విమర్శని విమర్శగా తీస్కొని ఆలొచనలొ పడితే పర్వాలెదు గాని, మరీ వ్యక్తిగతంగా ఫీల్ అవ్వకండి.
ఈ TV ఆకు వైద్యుల వల్ల మేలు కన్నా హానే ఎక్కువ జరుగుతుందండి. వాళ్ళు చెప్పే మందు సరి అయినదే కావచ్చు, కానీ అదిచూసి సరి అయిన diagnosis లేకుండా మందు వాడేస్తే నష్టమే జరుగుతుంది. వైద్యం లో మందు కన్నా diagnosis చాలా ముఖ్యం.
కానీ మన రమణ గార్కి ఆయుర్వెదం మరియు yoga మీద కాస్త నమ్మకం తక్కువే. ఆయన English మందులనే బాగా advocate చేస్తారు. (నేను ఆయనతో ఏకీభవించను లెండీ)
కానీ మందు వాడె ముందు diagnosis సరిగ్గా చేయించుకోవాలి. లేదంటె మన సుబ్బు లాగా మూతి వాచి పొతుంది.
మహేష్ గారు ,
ReplyDeleteబ్లాగ్ లో కామెంట్ రాసినంత మాత్రాన భక్తులు కానవసరం లేదు
శ్యామలీయం గారు ,
మరో సారి చదవండి టపాను : టపా చదివేటప్పుడు ప్రతి లైన్ విడిగా చదవము కదండి . ముందు చెప్పినది అన్వయించుకోవడం మాములే కదా
మీ సుబ్బు సూపరండీ! పుచ్చుపంటికి మందేస్తే జ్ఞానదంతం ఊడిందని... మీ సుబ్బు మరోసారి రూఢీ చేశాడు. Quack Medicine Zindabad!!
ReplyDeleteనాగరాజ్ గారు , మీ ఒక్కరి వ్యాఖ్య కాస్త అర్ధం అయినట్లు ఉంది . ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ పరిస్థితి అదేనంటారా ? ఉద్యమం పేరుతొ పుచ్చు పన్నుకి మందేస్తున్నారా :)
ReplyDeleteఈ పోస్టు ద్వారా నా మనోభావాలు గానీ, మీ మనోభావాలు గానీ పెద్దగా దెబ్బతినలేదు కాబట్టి నేను రాసిన సింపుల్ కామెంట్, మీకు కాస్తయినా అర్థమైందని భావిస్తాను. అసలే దేశవ్యాప్తంగా కులాల పేర, మతాల పేర, ప్రాంతాల పేర, భాషల పేర, ఇంకా ఏవేవో పేరిట... అనునిత్యం జరగకూడని అనర్థాలన్నీ జరుగుతూ, విపరీతంగా మనోభావాలు దెబ్బతింటున్న ’రాహు‘కాలమిది!! ఈ పరిస్థితిలో ఏ ఉద్యమం గురించి ఏం మాట్లాడితే ఎవ్వరు ఊరుకుంటారు చెప్పండి. Thanx to the most opportunistic & corrupt Indian politicians who have been being successful in instigating animosity among common people and diverting them form real enemy since independence!!! ఒక్క విషయం మాత్రం చెప్పే ధైర్యం చేయగలను!! నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజలు వేరు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేనికైనా తెగబడే పొలిటీషియన్స్ వేరు. ఈ డిస్టింక్షన్ అవసరం. ఏ ప్రాంతంలోనైనా సరే. ఆ డిస్టింక్షనే లేకపోతే చివరికి సామాన్య ప్రజలే ఒకరికొకరు ద్వేషించుకుని, కొట్టుకుని, చంపుకునే దాకా పోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో! ఒకవేళ ఇలాంటి విపత్తులు సంభవించినా రాజకీయ నాయకులు మాత్రం సేఫ్ గా వేడుక చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ప్రజలు నిజంగా ఒకరినొకరు అంతగా ద్వేషించుకోవాలా? విద్యకు, ఉద్యోగాలకు, సాగునీటికి, తాగునీటికి... మన రాష్ట్రం మరీ అంత గొడ్డుపోయిందా? మరి ఇదే రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ నాయకుడు అడ్డగోలుగా లక్షల కోట్లు వెనకేసుకుంటున్నాడే? రాజభోగాలు అనుభవిస్తున్నారే? ఎవ్వరి సంపద ఇదంతా? ఏం... చదువుకున్న యువతీయువకులందరికీ ఉద్యోగాలు కావాలనీ, అందరు రైతన్నలకు, ప్రజలందరికీ సాగునీరు, తాగునీరు కావాలని అందరూ డిమాండ్ చేయలేరా? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే నాకేం, నేను మాత్రం సుఖంగా ఉండాలి? ఎవ్వడు ఎలా పోతే నాకేం, నాకు మాత్రం ఉద్యోగం కావాలి? వాళ్లది ఉద్యమం కాదు బూటకం, వీళ్లది ఉద్యమం కాదు నాటకం అని సామాన్య ప్రజలే ఒకళ్లనొకళ్లు తిట్టుకుంటుండగా చూసి రాజకీయ నీరోలు ఎలక్షన్ల ఫిడేలు వాయించుకుంటున్న వేళ... ఎలా స్పందించడం? తాము ఉద్యమించాల్సింది... నేడు అన్నిరకాల సమస్యలకు మూలకారణమవుతున్న కుట్రపూరిత ప్రభుత్వాలకు, నీచ పాలకులకు వ్యతిరేకంగా అని ప్రజలు గుర్తించనంత కాలం, ఆ చైతన్యం రానంతకాలం, ఆ దిశగా ఆర్గనైజ్ కానంతకాలం... ప్రజలు విడిపోయినా, కలసి ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదని, సమస్యలు మాత్రం అలా పెరుగుతూ పోతాయనే నా అభిప్రాయం. Hope, people will soon recognize their common enemy and release their struggle accordingly. Thank you. సర్వేజనా స్సుఖినోభవంతు!!
DeletePS: Plz try to note that I'm not supporting any movement here!
మిత్రోత్తములారా,
ReplyDeleteఒక విజ్ఞప్తి. బ్లాగుల్లో నే రాసేవి సీరియస్ సాహిత్య అంశాలు కాదు. అప్పటికప్పుడు నాకు అనిపించే అభిప్రాయాలు మాత్రమే.
మీ అందరికీ ఉన్నట్లే నాక్కూడా అభిప్రాయాలుంటాయి. నా అభిప్రాయాలు మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చని అంశాలని నిరూపించడానికి, వాదించడానికి నాకు సమయం, ఓపిక లేవు. (నాకున్న సమయంలో, నాకు నచ్చిన అంశాలపై రాసుకుంటాను గానీ.. ఏదో నిరూపించడానికి పన్లు మానుకుని మరీ రాసే అవసరం నాకేంటి?)
విషయ పరిజ్ఞానం, వాదనా పటిమ కలవారు తెలుగు బ్లాగుల్లో ఎందరో ఉన్నారు. వారి మేధస్సు నన్ను అబ్బుర పరుస్తుంది. వారికి గౌరవంతో నమస్కరిస్తున్నాను.
చాలాసార్లు నా బ్లాగ్ నేనే పెద్దగా పట్టించుకోను. ఏం రాశానో గుర్తు కూడా ఉండదు. నాకు రాయడం ఒక సరదా. అందుకోసమే రాస్తాను. అంతే!
మీకు నా పోస్టు నచ్చితే ఒక కామెంట్ రాస్తే సంతోషం. నేను మీ వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తాను. అందుకే కామెంట్ మోడరేషన్ కూడా పెట్టలేదు. నా బ్లాగు నచ్చకపోతే, నా రాతల్ని ఇగ్నోర్ చేసెయ్యండి. అది మీకూ, నాకూ హాయి.
హి హి హి ..
Deleteమీరేమో అగ్గిపుల్ల విసిరేసి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు కొట్టేసుకుంటున్నారు .
సరేలెండి కానీయండి, ఇది కూడా ఒక టైం పాస్ .
ఇక్కడ కొట్టేసుకునేంతగా కూడా ఏమీ లేదు. పనికిమాలిన చెత్త ప్రశ్నలు తప్ప.
DeleteRamdev Baba is a political buffoon and a third rated quack. రోడ్ల మీద నాటు వైద్యాలు చేసే బాపతు. ఈ వెధవ అమ్ముకునే పౌడర్ల గూర్చి ఏవో గొప్ప ప్రశ్నలు! ఈయనగారి నాటు వైద్యం దురదగా ఉంటే మీరు వాడుకోండి. ఆ ఏడుపు నా బ్లాగులో ఏడవకండి.
నిజం చెప్పాలంటే, విభిన్న విషయాలమీద మీ అభిప్రాయాలు రాస్తూ, ఎలాంటి మోడరేషన్ లేకుండా ఆ పోస్టులపై ఇతరులు కామెంట్స్ రాసేందుకు అవకాశమీయడం మీ పెద్ద మనసుకు నిదర్శనం. ఇక, మీరు రాసే పోస్టులు బ్రాడర్ పర్ స్పెక్టివ్, సోషల్ ఇష్యూస్ తో ముడిపడి ఉంటాయి కాబట్టి చాలామంది స్పందించడం సహజమేనేమో. నేననుకోవడం... ఏ విషయం మీదనైనా కేవలం అభిప్రాయాలకే పరిమితమై పోకుండా, నిష్పాక్షికంగా చర్చ జరిగి నిజానిజాలేమైనా తెలిస్తే అది అందరికీ ప్రయోజనమే కదా. కానీ దురదృష్టమేమంటే, అత్యధిక సందర్భాల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చే చర్చలు కాకుండా వ్యక్తిగత దూషణభూషణలకు దిగుతుండడం బాధాకరం. మనలో రానురాను logical bent of mind & reasoning కనుమరుగైపోయి, వాటిస్థానే blunt arguments & arrogance పెరిగిపోతున్నాయా అని అనిపిస్తుంది. ఇదేమైనా మొత్తంగా సమాజానికి దాపురించిన మానసిక జాఢ్యమా? మానసిక వైద్యులుగా దీనికేమైనా తరుణోపాయం ఆలోచించి కాస్త నయం చేయండి :)
DeleteThank you
ReplyDeleteDear friends,
ReplyDeletePlease note that i have enabled comment moderation from now on to avoid some stupid comments. Thank you.
మంచిపని చేసారు.
Delete
Deleteఅమ్మయ్య.
ROFL. good post on subtle humor though its the today's reality. . What do think of Manthena satyanarayana raju's "solutions" for all health problems of this world where no one need to visit hospitals or medicalshops at all anymore?
ReplyDelete@చాతకం,
Deletemy physician friends tell me that people suffer from hyponatremia and land up in ICU due to mr.Manthena's regime (in fact they are thankful to mr.Manthena).
BTW Manthena himself suffered from severe MI and underwent a major (interventional) cardiac procedure
ReplyDeleteఅక్కడేదో బ్లాగర్లు 'వార్ధక్య' విచారం వెలిబరుచుతూ ప్చ్ ప్చ్ ప్చ్ మా టపా కి కామెంట్లే రావడం లేదని విచార పడి పోతున్నారు ఒక వైపు !
మరి ఇక్కడేమో 'కామంటలు!"
కామెంటు వద్దు బాబోయ్ నేను నాకు నచ్చింది రాసుకుంటున్నా !
సీరియస్ గా తీసుకోమాకండీ అని 'దాట్రారు' బాబు గారు
అంటున్నా తప టఫా వీర వాయిన్పుళ్ళు !
ఇదియే కదా నిజమైన 'ట్రూత్' 'ఏక్ ' !
బ్లాగర్ పై టపాలు చెక్కినారు మనవాళ్ళు 'టపా లోకానికే ' అందాలు తెచ్చినారు !
ఒకవైపు ఉర్రూత లూగించు టపాలు
మరువైపు ఉరికించు యుద్ధభేరీ కామెంటులు !
నవరసాలొలికించు లోకానికొచ్చాము !
చీర్స్
జిలేబి
మంతెన గారి మహా వైద్యం తరవాత పెద్ద ప్రొబ్లం వచ్చిన ఒకతను నాకు తెలుసు.అసలు మంతెనకి గుండె ఆపరెషన్ జరిగింది అని విన్నాక ఆయన పట్ల వున్న అభిప్రాయం కాస్తా మారింది.
ReplyDeleteBELOW THE BELT అనుకోకపొతే ఇన్నిరకాల చిట్కాలు చెప్పె అయనకి పిల్లలు యెందుకు లేరొ మరి..పెరటి చెట్టు మందుకి "పనికి" రాలేదా?