Saturday 31 August 2013

లవకుశుల కష్టాలు


"పిల్లలూ! ఈ పాట చూడండి. వారు లవకుశులు. శ్రీరాముని కొడుకులు. ఆవిడ వారి తల్లి సీత."

"లవకుశులు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదేం?"

"వాళ్ళు ఆశ్రమవాసం చేస్తున్నారు. అదే వాళ్ళ యూనిఫామ్."

"ఓహో అలాగా!"

"సీతాదేవి మనసుకి కష్టం కలిగింది. అందుకే ఆవిడ దుఃఖంగా ఉంది. పసిపిల్లలైన లవకుశులు తల్లిని ఓదారుస్తున్నారు. ఈ పాట చాలా బాగుంటుంది. ముందు పాటని శ్రద్ధగా చూడండి. ఆ తరవాత మీకు ఏమర్ధమైందో చెప్పండి."

<

"పిల్లలూ! పాట మొత్తం చూశారుగా?"

"ఓ!"

"ఇప్పుడు ఆ పాట గూర్చి నాలుగు ముక్కలు చెప్పండి."


"లవకుశులు చాలా పేదవాళ్ళు. అందుకే పూరి గుడిసెలో ఉంటున్నారు. పేదవారైనప్పటికీ మంచి ఇంగ్లీషు మీడియం స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకుంటున్నారు. రోజూ అర్ధరాత్రి దాకా స్టడీ అవర్స్ ఉన్నాయి. వారు కష్టపడి చదువుతూ వీక్లీ టెస్టులు, డైలీ టెస్టులు రాస్తున్నారు. ఒకసారి వాళ్లకి వీక్లీ టెస్టులో వందకి 0.00001 మార్కులు తక్కువొచ్చాయి. స్కూల్ హెడ్ వాళ్ళని వెంటనే తక్కువ సెక్షన్ కి మార్చేశారు."

"!!!!"

"తన పిల్లల్ని సెక్షన్ మార్చారన్న వార్త వినంగాన్లే శ్రీరామునికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన్ని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. భర్త ఆస్పత్రి పాలైతే పిల్లల చదువులకి ఫీజులు ఎవరు కడతారు? అందుకే సీతాదేవి ఏడుస్తుంది."

"!!!!!"

"ఏడవకమ్మా! మాకు తగ్గిన ఆ 0.00001 మార్కులు మళ్ళీ సాధిస్తాం. తిరిగి మొదటి సెక్షన్లోకి వచ్చేస్తాం అంటూ తల్లిని ఓదారుస్తున్నారు. అదీ ఈ పాట కథ. మాకు సీతాదేవి ఎందుకు ఏడిచిందో అర్ధమైంది. కానీ ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారో మాత్రం అర్ధం కావట్లేదు!"

చివరి మాట :

క్లినికల్ సైకాలజిస్టులు Thematic Apperception Test (TAT) చేస్తుంటారు.ఈ పోస్టు రాయడానికి ఆ టెస్ట్ చేసే విధానం వాడుకున్నాను.

(picture courtesy : Google)

30 comments:

  1. మీ టపా శీర్షిక "లవకుశల కష్టాలు" అని ఉంది. అక్షరదోషం ఉందనుకుంటాను.
    మీరు "లవకుశుల కష్టాలు" అనదలచుకుంటే. (శ బదులు శు ఉండాలి శీర్షికలో)

    టపా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      'శ'నా? 'శు'నా? అని తీవ్రంగా ఆలోచించి.. 'శ'కి ఫిక్సైపొయ్యాను.

      (తప్పైతే శ్యామలీయం గారు సరిచేస్తారనే ధైర్యం కూడా మనసులో ఉంది).

      నా భాషలో పొరబాట్లని తెలియజేస్తున్నందుకు మీకు నేను సదా కృతజ్ఞుడను.

      (మీరు సూచించిన విధగా సరిచేశాను).

      Delete
  2. హహ్హహ్హ్హ... మీరు సూపరండి బాబు :) :)

    ReplyDelete
  3. Hahaha!! లోకో భిన్న దృష్టి:! ఎవరి అప్రోచ్ వారిది! ఒకటి మాత్రం క్లియర్... ఈకాలం చదువులు అటు పిల్లలకు ఇటు పేరెంట్సుకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయ్. మీ, మా కాలంలో చాలా బెటరేమో... అప్పటి చదువులు నల్లేరు మీద నడకలా హాయిగా లాహిరి లాహిరిలో... అని ఆడుకుంటూ పాడుకుంటూ కంప్లీటైపోయాయ్. థ్యాంగాడ్! కొన్ని దశాబ్దాలు ముందు పుట్టడంతో బతికిపోయాం! పాపం... సీతమ్మ తల్లి, లవకుశ & co, కష్టాలపై ఈ జెనరేషన్ పిల్లల పర్సెప్షన్ వింటే ఆ జెనరేషన్ పెద్దవాళ్లకు గుండె హార్టు ఫెయిలైపోవాల్సిందే. మీరు మాత్రం, మాంచి కరుణ రస గీతంతో గుండెలు పిండేశారు!

    ReplyDelete
  4. శ్రీరామున్ని కేర్ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. 108 సిబ్బంది సమ్మె వల్ల అమ్బులన్సు రాలేదు.

    చచ్చీ చెడీ ఆటోలో రామున్ని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశ్రీ మంచాలు ఖాళీ లేవని కేర్ వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు.

    సీతమ్మ తమ బస్తీ దాదా సాయంతో ఎంఎల్ఏ గారిని కలిసి మోర పెట్టుకుంది. ఆయన మూడు రోజులు తిప్పుకొని రెకమెండేషన్ ఉత్తరం ఇచ్చాడు.

    ఈలోపల తరువాత స్లిప్ టెస్టు ఫలితాలు వచ్చాయి. లవకుశులు ఇద్దరూ మార్కులు పెంచుకొని మునుపటి సెక్షన్ తిరిగి చేరారు. అప్పటి దాకా ఆసుపత్రి ఆవరణలో ఒక మూల పది ఉన్న రాముడు ఈ వార్త వినగానే లేచి గంతులేసాడు.

    ReplyDelete
    Replies
    1. పురాణ పురుషుడైన శ్రీరాముడి ఔన్నత్యం గురించి రాయకపోయినా పర్వాలేధు ఇలా కించపరచటం ఏం బాగాలేదు. ఇంక పై వ్యాఖ్య రాసిన వ్యక్తి Jai గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతమ్మ గురించి అడ్డమైన కూతలు కూస్తూ అది హాస్యం అనుకోవాలనుకోవటం ఒక ఎత్తైతే దాన్ని మీరు ప్రచురించటం మరో ఎత్తు. దయచేసి దాన్ని తొలగించగలరు.

      Delete
    2. @phanikris,

      ఈ రోజుల్లో పిల్లలకి రాముడికి సీత ఏమవుతుందో తెలీదు (అది వారి తప్పు కాదు).

      పిల్లలు (కొందరు పెద్దలు కూడా) సమస్యని తమ కోణం నుండి మాత్రమే చూస్తారు. వాళ్ళకి స్కూళ్ళు, పరీక్షలు అతి పెద్ద శిక్ష.

      ఈ రెంటిని కలుపుతూ సరదాగా రాసిన ఈ చిన్న పోస్టు ఎవర్నీ కించపరిచేందుకు ఉద్దేశించింది కాదు.

      (నచ్చిన వ్యాఖ్యల్ని మాత్రమే ప్రచురిస్తున్నాను. నాకు Jai వ్యక్తిగతంగా తెలీదు.)

      Delete
  5. మిత్రులారా,

    రాత్రి పదిన్నరకి లవకుశ పాటలు చూస్తూ treadmill చేస్తుండగా ఈ ఐడియా తట్టింది. లవకుశులపై సరదాగా రాస్తే బాగుండదేమోనని సందేహిస్తూనే అర్ధరాత్రి కూర్చుని రాశాను. పొద్దున్న లేవంగాన్లే బొమ్మ, విడియో పెట్టేసి పోస్టితిని.

    ఈ నెల్లో రికార్డు స్థాయిలో ఎక్కువ పోస్టులు రాశాను. అందుకు ప్రధాన కారణం ఆర్టీసీ వాళ్ళ సమ్మె. అంచేత ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. "ఈ నెల్లో రికార్డు స్థాయిలో ఎక్కువ పోస్టులు రాశాను. అందుకు ప్రధాన కారణం ఆర్టీసీ వాళ్ళ సమ్మె. అంచేత ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను"

      మధ్యలో వాళ్ళు ఏమి చేసారండీ? మీ "పని లేని" రాతలకు వారి సమ్మెకు సంబంధం కాస్త విపులంగా చెప్పండి ప్లీస్

      Delete
    2. Jai గారు,

      ఆర్టీసీ సమ్మె వల్ల పేషంట్లు తగ్గారు. అంచేత నా "పని లేని" రాతలు పెరిగాయి. అదీ సంబంధం!

      Delete
    3. డాక్టరు గారూ, వ్యాపారం తగ్గిందని బాధ పడకుండా బ్లాగులు రాయగలిగానని ఆనందిస్తారా? మీ అంతటి అల్పసంతోషులు నిజంగా అరుదు. మరీ ఇంత అమాయకత్వం మంచిది కాదండీ.

      Delete
    4. అమాయకత్వం కాదండి.. విసుగు. వైద్యవృత్తి క్షురకవృత్తి రెండూ ఒకటే.

      ఈ పోస్ట్ చదివారా?

      ఈ ప్రపంచమే ఓ క్షౌరశాల.. !

      Delete
    5. సినిమా టాకీసో, బారో పెట్టుకున్నా బాగుణ్ణు. బస్సుల మీద ఆధారపడ్డ వ్యాపారాలు తప్ప జనజీవనం సాఫీగా నడుస్తుంది.

      http://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html

      Delete
    6. @Jai,

      కొద్దిసేపు ఆటో ప్రయాణంతోనే వాస్తవాలు పట్టేశారు. అభినందనలు.

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
  6. Hi Ramana Garu Alias Da.Ramana garu (Da.Su la pilavalanipinchi)

    Monneeppudo mee tapa okati andhrajyothi lo chadivi mee blog chusanu.
    inka rendu rojulugaa naa pani manesi(sat and sun kuda work in client place :( ) meeru pani leka rasinavi :) chaduvuthooooooooooo(Inka mottham avaledhu) vunnanu. Guntur lo nenu M.Sc chadivina rojulani gurthu chesukunnanu.

    Nice meeting you and keep posting.
    Regards,
    Sreedhar

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ.

      మీరు eపలక వాడుతూ తెలుగు రాయొచ్చు. ప్రయత్నించండి.

      Delete
  7. అయ్యా! ఏం బాలేదు, శ్రుతిమించిన అనాలిసిస్! లవకుశులకు మార్కులు తక్కువ రావటమేమిటి? రాముడికి హార్ట్ ఎటాక్ రావడమేమిటి? 108, ఆరోగ్యశ్రీ? సరదాలకీ కార్టూన్లకీ వాడుకునే పాత్రలా రామాయణంలోనివి? మనకున్న అవలక్షణాల్ని పురాణపురుషులకంటగట్టడమా? ఇప్పటికే ఎంతో మంది ఎవడు పడితే వాడు ఇష్టమొచ్చినట్లు పురాణేతిహాసాల్ని వక్రీకరించి కించపరుస్తున్నారు. ఈ పోకడని ఎక్కడికక్కడ తెలిసినవారు తెలిసినట్లుగా ఖండించాల్సిందే. మిమ్మల్నేదో పనిగట్టుకుని అనాలని నా ఉద్దేశ్యం కాదు. లౌకిక విషయాలు లేక వేరే సినిమాలేవీ మీ TAT FAT లకు దొరకలేదా! పెద్దలైనవారు అనుభవజ్ఞులు కూడా ఇలా చేయడం శోచనీయం.

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారు,

      క్షమించండి. ఇకముందు ఇలా రాయను.

      Delete
    2. @nagendra ayyagari గారు


      మొదటగా లవ కుశులు పురాణ పురుషులు కాదు . వారి కధ పురాణమూ కాదు . వారి తల్లిదండ్రులపెర్లు పురాణ పురుషుల పేర్లు ఒకటే అయ్యాయి అనుకోవచ్చు అలాంటప్పుడు. (కాదంటే ఆ కోవలో భారత జనాభా లో సగం మంది పురాణం పురుషులు అనుకొనే గండం తప్పదు). కాబట్టి పురాణాలకి అంతకట్టిన అవలక్షణం కూడా లేదనే కనిపిస్తున్ది.

      అలా కాదు అంటే మీరే లవ కుశులు కూడా పురాణం పురుషులు అని నిరుపించాల్సి ఉంటుంది . మన్నించాలి మీరు చెప్పిన లాజిక్ కి , మీ ఖండన సమర్ధనీయం కాదని మాత్రమె చెప్ప దలుచుకొన్నాను.


      ఈ వ్యాఖ్య టపాలోని విషయాన్ని సమర్ధించడానికి చెప్పడం లెదు. మీ వ్యాఖ్య లోని ఇబ్బందికరమైన సంభాషణను మాత్రమె ప్రశ్నిస్తున్నాను

      Delete
    3. శ్రీ రమణగారూ! పురాణేతిహాసాలకు అందులోని వ్యక్తులకు ఉన్న ఔన్నత్యాన్ని తగ్గించకూడదనే తప్ప రాద్ధాంతం చేయాలనో కుతర్కం చేయాలనో కాదు, పైగా పెద్దలైనవారి నుండి క్షమాపణలు కోరడం నా వేగు ఉద్దేశ్యం కాదు. పవిత్ర భావనలను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు.

      Delete
    4. Lite. Oka contemporary samasyani oka iti hasam loni characters, aa characters meeda vachina oka cinema loni oka patani vastugu ga teesukoni vyanganga cheppadam jarigindi. Thappem ledu.

      Delete
  8. లవకుశుల బాధలు విని కడుపు తరుక్కుపోయిందంటే నమ్మండి. 0.0001 మార్కులు తగ్గడమనే కష్టం పగవాడిక్కూడా రాకూడదు.

    ReplyDelete
  9. నమస్తె,
    ప్రపంచంలొ, ప్రతి విషయంలొ మనకు మంచి చెడు రెండు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు తమని మంచితొ associate చెస్కొని మన మనస్సుని సర్ది చెప్పుకొవటం మాములే. ఆందులొనుండి పుట్టిందే "శ్రే రంగ నీతులు" అనె పదం. మనం మంచి నిజంగా పాటించక పోయినా, మంచి చెడుల choice వచ్చినప్పుడు, మనలను మంచి వైపే project చేస్కొని మనకి మనం మరియు ప్రపంచానికి గొప్పగా చూపించుకొంటాం.

    ఎన్నొ ఘొరాలు జరుగుతున్నా పట్టించుకోని జనం, chance దొరికితే గొప్ప మాటలే చెప్తారు. రమణ గారు, సమాజం లొ ఉండాలి కాబట్టి మనకి మనం political గా correctగా ఉందేలా చూస్కొవాలండి.
    hypocracyని ఎలా fight చెస్తారు మాష్తారు.

    ReplyDelete
  10. రమణ గారు,
    ఈ లింకు పని చెయ్యటం లేదు. "ఈ ప్రపంచమే ఓ క్షౌరశాల.. ! "

    ReplyDelete
    Replies
    1. అవునండి. వెరీ సారీ.

      (కారణం తెలుసుకునేంత కంప్యూటర్ పరిజ్ఞానం నాకు లేదు.)

      Delete
    2. There is a problem in the link you added. Here is the correct link
      http://yaramana.blogspot.in/2011/12/blog-post_30.html

      Delete
  11. రమణ గారు, మీరు 'పని లేక ' వ్రాస్తుంటే, నేను పని మానుకొని మరీ చదువుతున్నాను. మీ పొస్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి! Thank you so much :)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.