Monday, 5 August 2013

నేను మేధావిని కాదు


"అమ్మయ్య! ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. లగడపాటి అమ్ములపొదిలోంచి పాశుపతాస్త్రం బయటకి తీస్తున్నాడు.. ఇంక తెలంగాణా వెనక్కి పోయినట్లే." ఇవ్వాళ ఉదయాన నా స్నేహితుని ఫోన్.

నాకు అర్ధం కాలేదు. అదే అడిగాను.

"నీదో రోగం.. తెలుగు పేపర్లు చదవ్వు. తెలుగు చానెల్స్ చూడవు. హాస్పిటల్లోంచి బయటకి రావు. ఇక్కడ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది." అన్నాడు.

"ఈ ఉద్యమం టూ లేట్, టూ లిటిల్. ఇవన్నీ బంతి కాంగ్రెస్ హై కమాండ్ కోర్టులో ఉన్నప్పుడు జరగవలసిన కార్యక్రమాలు. నాకున్న అవగాహన ప్రకారం తెలంగాణా రాష్ట్రం ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంక ప్రాసెస్ మాత్రమే మిగిలుంది. ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడమే ఆలస్యం. తీసుకున్న తరవాత పెద్దగా చేసేదేమీ ఉండదు. ఇంతదాకా వచ్చిన తరవాత కేంద్రం వెనక్కి ఎలా పోతుంది?" అన్నాను.

నా స్నేహితుడు పెద్దగా నవ్వాడు.

"నీకు దీవార్ సినిమా గుర్తుంది కదూ! అందులో 'మేరా పాస్ గాడీ హై, బంగ్లా హై, తుమ్హారా పాస్ క్యా హై? క్యా హై?' అని అమితాబ్ శశికపూర్ని అడుగుతాడు. శశికపూర్ కూల్ గా 'మేరా పాస్ మా హై' అంటాడు. ఇప్పుడు నేను కూడా అదే సమాధానం చెబుతాను. హమారా పాస్ KVP హై, ఉండవల్లి హై, కావూరి హై. డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనక్కి పోలేదా? అందుకే తెలుగు పేపర్లు చదవమని చెప్పేది."

"తెలుగు న్యూస్ పేపర్లు ఇరుప్రాంతాల మనోభావాలకి తగ్గట్లుగా రెండురకాల ఎడిషన్లు వేస్తున్నాయి. రెండు ప్రాంతాల ఎడిషన్లకి వేరువేరు బేనర్లతో, కేప్షన్లతో, కంటెంట్ తో పబ్లిష్ చేసుకుంటున్నాయి. ఇరుప్రాంతాల్ని రెచ్చగొడుతూ తమ సర్క్యులేషన్ పెంచుకుంటున్నాయి. వారిది వార్తల్ని అమ్ముకునే వ్యాపారం. వారి రోడ్ మేప్ వారికి ఉంటుంది కదా." అన్నాను.

"అదంతా నాకు తెలీదు. TG వెంకటేష్ కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడు. NGO లు సమ్మెకి దిగుతున్నారు. దెబ్బకి దిమ్మతిరిగి ఢిల్లీ దారికొస్తుంది. తెలంగాణా ప్రకటన వెనక్కి తీసేసుకుంటుంది. ఏదీ కుదరకపోతే పార్లమెంటుని ఎలాగూ లగడపాటి స్తంభింపజేస్తాడు." అన్నాడు నా మిత్రుడు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"అంతేనంటావా?"

"అంతే! జరగబోయ్యేది ఖచ్చితంగా ఇదే." కాన్ఫిడెంట్ గా అన్నాడు నా స్నేహితుడు.

"చూద్దాం. ఎలా జరగబోతుందో." అంటూ ఫోన్ కట్ చేశాను.


కొద్దిసేపు ఆలోచనలో పడ్డాను. నా రాజకీయ అవగాహన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందేమిటి? జరుగుతున్న పరిణామాలు నేనెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాను?

నేనింతకు ముందు "నేను మేధావినే!.. నా?"  అంటూ ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు నాకా డౌట్ లేదు. నేను ఖచ్చితంగా మేధావిని కాదు. అంతేకాదు.. నేను అజ్ఞానిని కూడా అనే అనుమానం కలుగుతుంది.

(photo courtesy : Google)

20 comments:

  1. చలసాని శ్రీనివాస్ గారిని వదిలి ఇప్పుడు పెద్దవాళ్ళ మీద పడ్డారెంటండీ మరీను. లగడపాటి గారు ఏదో ఒక పనిలేని రోజున పిచ్చుక లాంటి మీపై బ్రహ్మాస్త్రం వేయగలరు తస్మాత్ జాగ్రత్త.

    ReplyDelete
    Replies
    1. ఈ పోస్టులో నేన్రాసింది మొత్తం (నూటికి నూరుపాళ్ళు) నా స్నేహితునితో ఫోన్లో జరిపిన సంభాషణే. ఒక్క పైసా కూడా కల్పితం కాదు.(నిజంగానే నా రాజకీయ జ్ఞానం పట్ల తీవ్రమైన సందేహంతో ఉన్నాను.)

      మీ సలహాకి ధన్యవాదాలు.

      "జై సమైక్యాంధ్ర".

      Delete
    2. ఇకనేం వెంటనే తెలుగు పేపర్లు & టీవీ మీద పడిపోవడమే తక్షణ కర్తవ్యం. అదృష్టం బాగుంది బంద్ పుణ్యమా అంటూ రోగులు ఉండరేమో బోలడంత సమయం ఉంటుంది.

      ఒకటిరెండు రోజులలో తగినన్ని విషయాలు నేర్చుకొని లైవ్ షోలకు కాల్-ఇన్ చేసే లెవెలుకు ఎదిగుతారని నా నమ్మకం. అచిరకాలంలోనే మేధావి ముద్ర వేయించుకొని అవే షోలలో విశ్లేషణ చేసే స్తాయికి చేరి ప్రజలకు కర్తవ్యబోధ చేయ ప్రార్తన.

      Delete
    3. హ.. హ.. హా!

      నా జూనియర్ ఒకాయన చదువుకునే రోజుల్లో 'పెద్ద' రాడికల్. వారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ అన్ని స్టూడియోల్లోనూ ప్రముఖంగా దర్శనమిస్తుంటారు. కాంగ్రెస్ టికెట్ కోసం గత పదేళ్ళగా ఆయన చేస్తున్న తీవ్రమైన కృషి ఫలించాలని కోరుకుంటున్నాను.

      (టీవీలో ఒక నిమిషమైనా కనిపించడానికి తహతహలాడేవారి క్యూ చాలా పెద్దది. కావున నాగూర్చి మీ కోరిక నెరవేరే అవకాశం లేదు.)

      Delete
  2. nenunnoo medhaavini kaadu!lagadapati taataaku chappullaku congress kundellu bedaravu!chooddam lagadapati bedirichagalugutaademo!bedirinchalekapote ika chivaraku migiledi raajakeeya sanyaasame!

    ReplyDelete
  3. మా ఉండవిల్లీ బల్లగుద్ది మరే చెప్పేడండి తెలంగాణా వెనక్కిపోయి’నట్టే’నని, నిజంగా మీరు మేధావే!

    ReplyDelete
    Replies
    1. శర్మగారు,

      ఇక్కడ కూడా అందరూ తెలంగాణా రాదు అనే బల్ల గుద్దుతున్నారు.. ఒక్క నేను తప్ప!

      Delete
  4. ఇప్పటికే కుల మేధావులు, మత మేధావులు, ప్రాంత మేధావులు, బూర్జువా మేధావులు, కుహనా లెఫ్టిస్టు మేధావులు, ఫెమినిస్టు మేధావులు, భాషా మేధావులు, సినీ మేధావులు, మీడియా మేధావులు... గల్లీ నుండి ఢిల్లీ దాకా ఈ మేధావుల బారిన పడి ప్రజలు పాపం ఎక్కడికక్కడ విలవిల్లాడిపోతున్నారు, గిలాగిలా తన్నుకుంటున్నారు, జుట్టు పీక్కుంటున్నారు, పిచ్చివాళ్లైపోతున్నారు, చివరికి బిక్కచచ్చిపోతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కుహనా మేధావులు ప్రమాదకర మీడియా ద్వారా ప్రజల నరనరాల్లోకి, రక్తంలోకి భయంకరమైన వైరస్ లాగా చొచ్చుకుపోతున్నారు. ప్రజారోగ్యానికి ఇదో ప్రాణాంతక సమస్యగా తయారైంది. దీన్ని అసలు ఓ సమస్యగానే గుర్తించడానికి ఒప్పుకోని మన ప్రభుత్వాలు సదరు మేధావులకు మరిన్ని అవార్డులు, సత్కారాలు, సన్మానాలతో ఘనంగా వీరతాళ్లు వేస్తోంది. హతవిధీ... ప్రజల కేదీ దారి??? ఈ స్థితిలో... మేధావి కాకపోతేనే శ్రేయస్కరమేమోనండి :)

    ReplyDelete
    Replies
    1. అయ్యా రమణ గారి మేదావీయోగం మొదలవుతున్న ఈ శుభ తరుణంలో మీరు అడ్డు తగలడం బాలేదు. పైగా "మహామదేహావి" బిరుదాంకితుడు కావాల్సిన వారిని ఆపేందుకు అదృశ్యశక్తుల కుట్రలో భాగమేమో అని అనుమానం వేస్తుంది. మీ శాల్యసారాధ్య ప్రయత్నం మానుకొని వారిని ప్రోత్సాహిస్తే మీకే మంచిది. (అడ్డు పడితే అడ్డంగా నరికేస్తాం).

      అలగా జనం పిచ్చి వాల్లయిపోతే మనకు నష్టమా? డాక్టరు గారికి వ్యాపారవృద్ధి, మనకు కొత్త టపాలు. సర్వేజన సుఖినో భవంతు

      Delete
    2. నాగరాజ్ గారు,

      మేధావినని అనిపించుకోవాలనే నా ప్రయత్నం ఈనాటిది కాదు! దానికో చరిత్ర ఉంది.

      @Jai,

      నన్ను ముందుకు నెట్టాలనే మీ కుట్రని అర్ధం చేసుకున్నాను:)

      Delete
    3. రమణగారు,
      మీ అభీష్టం, ప్రజాభీష్టం (జై గారి) ఒకటే అయినప్పుడు ఆ చారిత్రక తప్పిదం జరగకుండా ఎవరు మాత్రం అడ్డుకోగలరు చెప్పండి. (అ)మంగళం అప్రతిహతమగుగాక :)

      Delete
    4. నాగరాజు గారూ మనలో మాట. నేను కాదు కదా నా దూరపు చుట్టాలకు కూడా మేధావి అనే గుర్తింపు పొందే అవకాశం సుతరామూ లేదు. దీనివల్ల అత్తగారి వైపు వారందరికీ చులకన అవుతాము కదా. బ్లాగ్మిత్రులు అందరి ఆత్మబంధువు రమణ గారికి ఆ హోదా దక్కితే ఇంటికాడ నా పరువు పెరుగుతుందనే సత్సంకల్పం తప్ప ఎ దురాలోచన లేదు.

      Delete
  5. ఫిరోజ్ గాంధీ - తెలంగాణా
    ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ చాలా మేధావి ఆయన ప్రశ్నించడానికి లేచాడంటే నెహ్రు ఉచ్చ పోసుకునేవాడు
    పోటీ అవుతాడని చంపేశారు
    సంజయ్ గాంధీ వ్యక్తిగా చాలా మంచి వాడు .. పోటి వస్తాడని చంపేశారు
    తరు వాత ఇందిరా గాంధీ ని చంపారు .. రాజీవ్ గాంధీ ఎలా మరణించాడు
    అధికారం అంటేనే పెద్ద కుట్ర .. పదవి కోసం ఎవరి నైనా చంపుతారు
    నువ్వు చూస్తుండు కొందరిని చంప బోతున్నారు కాబట్టి .. తెలంగాణా రాదు
    ఇప్పుడే ఇలాంటి చర్చ ఒకటి వినే అదృష్టం లభించింది
    ఫిరోజ్ గాంధీ చావడానికి , ఇందిరా గాంధీ మరణానికి తెలంగాణా రాక పోవడానికి సంబంధం ఏమిటా అని అడగాలనుకున్నాను కాని నెహ్రు కుటుంబం రాజకీయాల గురించి అంత దగ్గరగా తెలిసిన వ్యక్తిని ప్రశ్నించలేక పోయాను కొద్ది సేపటి తరు వాత అతనే నన్ను ప్రశ్నించాడు .. తెలంగాణా వ్యవహారానికి, మన హోసింగ్ సొసైటీ కోర్టు కేసుకు సంబంధం ఏమి లేదు కదా .. ఇబ్బందేమీ రాదు కదా గురువు గారు అని

    ReplyDelete
    Replies
    1. buddha murali గారు,

      నాకు బాగా ఇబ్బంది కలిగిస్తున్న అంశం.. కొంత సంయమనం పాటిస్తూ, అంశాల వారిగా (రాజకీయ ధృక్పధంతో) కాంగ్రెస్ నిర్ణయాన్ని ఎండగడుతూ టీవీలో మాట్లాడగలిగిన వ్యక్తి ఇటువైపు నుండి లేకపోవడం.

      టీవీ గొట్టం కనబడంగాన్లే ఆవేశంతో ఊగిపోతూ తిట్లదండకం ఎత్తుకుంటున్న శూరులే కనిపిస్తున్నారు (మరి నేను చూస్తున్నప్పుడే వారు దర్శనమిస్తున్నారేమో నాకు తెలీదు).

      Delete
  6. ramana garu mi post chadivaaka nenu vinna ee sambashana rayalanipinchindi

    ReplyDelete
  7. చక్కటి బట్టతల పెట్టుకుని మేధావి కాదంటే ఎలా ఒప్పుకుంటామండి?

    ReplyDelete
    Replies
    1. అవును కదా! ఆ విషయమే మర్చిపోయానండి. గుర్తు చేశారు. థాంక్యూ.

      Delete


  8. డాక్టరు బాబు గారు,

    మీరు మేధావి యే నని అదిన్నూ వంద నయాపైసల మేధావి అనిన్నూ ఈ కీబోర్డు మీద ఆన గా ఒప్పేసు కుంటున్నా మండీ !!

    జిలేబి

    ReplyDelete
  9. పర్లేదు కాంగ్రెస్ కి అన్న్ధ్రలో ఉన్న పలుకు బడి దృష్ట్యా ఇంకా మీరు మేధావులుగా చెప్పుకోగలిగే అవకాసం ఉంది.

    తెలంగాణా ఇచ్చినా ఇవ్వకున్నా ఆంధ్రలో కాంగ్రెస్ ని జగన్ మింగేసాడు. ఒంటరిగా నెగ్గలెదు. కనీసం ఇచ్చేస్తే తెలంగాణాలో అయినా (జగన్ లేని చోట) బతుకుద్ది.

    కాబట్టి యెంత బల్ల గుద్దినా వచ్చిన తెలంగాణా పోదు. జై సమైక్యాంధ్ర అనే బదులు జనం జగన్ వద్దు, కాంగ్రెస్స్ ముద్దు అంటే చాలు, తెలంగాణా ఆగిపోతుంది :)

    సమైక్యాన్ద్రులలో నిజాయితీ లేదు . వాళ్ళకి హైదరాబాద్ కన్నా జగనే ఎక్కువ అయినందువల్ల, తెలంగాణా వెనక్కి పోదు :)

    ReplyDelete
  10. idenaa>>పాశుపతాస్త్రం<<
    Vijayawada MP Lagadapati Rajagopal made a sensational statement that could draw attention of many. He claims to have got assurance from the Centre that the process of dividing the state will be stalled for now.
    Seemandhra Congress MPs met at Lagadapati's house to decide the future course action on the Telangana issue.
    After the meeting, Lagadapati said that they would collect more information about the to-be-formed high-level committee. He said that the meeting centrred around how to go about protests during the Parliament sessions.
    The MPs will bring to the notice of Sonia Gandhi the interests of Seemandhra people, he said, adding, "We are fighting for the past four weeks to keep the state united."
    Speculation is rife that in view of the raging Seemandhra protests Congress High Command has stalled the process of Telangana till the high-level Committee led by AK Antony submits its report on the issue. Yesterday, Union Minister Pallam Raju hinted at the same after meeting Sonia.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.