వైద్యవృత్తి అంటే ఒకప్పుడు గౌరవప్రదమైన వృత్తి, నేడు డబ్బు సంపాదించే గిట్టుబాటు వృత్తి. ఎవరికైనా అనుమానం ఉంటే 'జూడా'లుగా వ్యవహరింపబడుతున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లని పరిశీలిస్తే అనుమానం తీరిపోతుంది. మన బ్లాగర్లు ఎందుకనో ఈ స్వార్ధ జూడాల చావు తెలివిని పట్టించుకోలేదు!
ప్రభుత్వ వైద్యకళాశాలలు మన డబ్బుతో నడుస్తాయి. మన దేశ అవసరాలకి తగినట్లు వైద్యవిద్యకి సిలబస్ నిర్ణయించబడుతుంది. ఇష్టమైతే చేరండి, కష్టమైతే పోండి. మిమ్మల్ని డాక్టర్లయ్యి మమ్మల్ని ఉద్ధరించమని ఎవడూ దేబిరించట్లేదు. చేరేప్పుడు అన్నింటికీ ఒప్పుకుని బాండ్లు ఇస్తారు. బయటకి వచ్చేప్పుడు మాత్రం సమ్మె చేస్తారు. మీ సిగ్గుమాలిన, నీచోపాయానికి రాజకీయపార్టీల వత్తాసు తోడు!
మీ ఏడుపంతా 'రూరల్ సర్విస్' గురించే అని మాకు తెలుసు. హడావుడిగా కార్పరేట్ ఆస్పత్రులు పెట్టేసి ప్రజల్ని దోచేయ్యాలి, లేదా అర్జంటుగా అమెరికా వెళ్లిపోవాలి. మరి రూరల్ సర్విస్ అడ్డే గదా! మీలాంటి దౌర్భాగ్యుల చేతిలో ఈ దేశ ఆరోగ్యం ఉండబోతుంది. ఖర్మ!
మీ బ్లాక్ మెయిల్ గూర్చి ఇంక రాసి నా టైమ్ వేస్ట్ చేసుకోలేను. మీ స్థాయికి దిగజారి రాయలేను.
(photo courtesy : Google)