Tuesday, 6 May 2014

AC సర్వే


ఇది ఎన్నికల సమయం. రోజుకో సర్వే, గంటకో కథనం. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వాళ్ళ రిపోర్టు లాగా విషయం మారిపోతుంది. 

నేను మాత్రం ఖాళీగా ఎందుకుండాలి? కాబట్టి - ఈమధ్య నేనూ ఒక సర్వే చేశాను. దీని పేరు 'AC సర్వే' (అంటే AC రూములో కూర్చుని నిర్వహించిన సర్వే అని అర్ధం).

నాకు psephology తెలీదు. కావున, నా methodology నేనే తయారు చేసుకున్నాను.

exclusion criteria : 

1. రెడ్డి, కమ్మ కులస్తులు (ఈ రెండు కులాల వారి అభిప్రాయం కనుక్కోడం అనవసరం.. కారణం అందరికీ తెలిసిందే).  

2. PG స్థాయి చదువు (బాగా చదువుకున్నవాడు ఛస్తే నిజం చెప్పడు).  

inclusion criteria :

1. పై రెండు వర్గాలకి చెందని వారు. 

2. వ్యవసాయ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారికి ప్రాముఖ్యం. 

sample size : 40 - 50 

నేను వాళ్లకి బాగా తెలుసు కాబట్టి.. నా ప్రశ్నకి చాలామంది స్పష్టంగా సమాధానం చెప్పారు, కొందరైతే నన్నుకూడా వాళ్ళు సూచించిన పార్టీకే ఓటెయ్యమని అడిగారు. 

నాకు ఓటర్లలో స్పష్టమైన ట్రెండ్ కనిపించింది. ఆ ట్రెండ్ ఇక్కడ ఇస్తున్నాను.

(> అన్న గుర్తుకి more than అని అర్ధం.)  

1. గుంటూరు టౌన్ లోకల్, జిల్లాలో ఇతర పట్టణాలు.. TDP > YSR CP 

2. గ్రామీణ ప్రాంతాలు.. YSR CP > TDP 

3. కుర్రాళ్ళు.. YSR CP > TDP 

4. మధ్యవయసువారు (30 - 65).. TDP > YSR CP

5. ముసలివారు (above 65).. TDP = YSR CP

6. BC ఓటర్లు.. TDP = YSR CP

7. SC ఓటర్లు.. YSR CP > TDP

8. దళిత్ క్రిస్టియన్లు.. YSR CP only. 

9. ముస్లిం ఓటర్లు.. YSR CP > TDP 

10. చిన్నఉద్యోగులు.. TDP > YSR CP

కొన్ని అబ్జర్వేషన్లు :

1. ఆరోగ్యశ్రీ, fee reimbursement స్కీముల వల్ల లబ్ది పొందిన కుటుంబాలవారు పూర్తిగా YSR CP పక్షాన ఉన్నారు. 

2. నిరుద్యోగులు (ముఖ్యంగా ఇంజినీరింగ్ చదివినవాళ్ళు) పూర్తిగా TDP వైపున్నారు. 

limitations :

ముందే చెప్పాను.. ఇది పూర్తిగా AC సర్వే. కావున, reliability & validity - ???????????? (0 - 100 ఎంతైనా కావచ్చు). 

conclusion : 

TDP, YSR CP లలో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది!

క్రీడల్లోలా రాజకీయాల్లో సిల్వర్ మెడల్ లేదు. ఒకటే మెడల్.. అధికారం. అందుకే ఈ రెండు పార్టీలు భీభత్సమైన డబ్బు బలంతో (రేపు రాష్ట్ర 'పునర్నిర్మాణం'లో వడ్డీతో సహా నాలుగింతలు వసూలు చేసుకుంటాయి లేండి), కండ బలంతో అధికారం కోసం పోరాడుకుంటున్నాయి.

బాబ్బాబు! మీ ఓటు ఒక వజ్రాయుధం.. అంచేత - మీట నొక్కండని ఎన్నికల కమిషన్ వారు (టార్గెట్లు పెట్టుకుని మరీ) జనాల్ని బ్రతిమాల్తున్నారు. మధ్యతరగతి మేధావులు కూడా మీట నొక్కకపొతే మనిషివే కాదన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కావున - మీరు కూడా మీ ఓటేసి, వేలు పైకెత్తి ఫోటో దిగి ఫేస్బుక్కులో పెట్టుకోండి.. చాలా లైకులొస్తాయి. 

చివరి మాట :

డా.బి.హరిబాబు, ఆర్తోపెడిక్ సర్జన్, గుంటూరు. నాకు ఇంటర్ నుండి క్లాస్మేట్, అత్యంత అత్మీయుడు. 

నా సర్వే ఫలితాలు మా హరిబాబుకి ఫోన్లో చెప్పాను - 'ఇంకెందుకాలస్యం? పెట్టెయ్ నీ బ్లాగులో!' అన్నాడు.. పెట్టేశా! 

(picture courtesy : Google)