Monday 26 November 2012

పిల్ల సందేహాలు - పిడుగు సమాధానాలు


అప్పుడు నాకు పదేళ్ళు. అమ్మానాన్నల మధ్య కూర్చుని 'కన్యాశుల్కం' సినిమా చూస్తున్నాను (అవునురే! పదేళ్ళ వయసులో ఏ ఎన్టీవోడి సినిమానో చూసుకోక - కన్యాశుల్కాలు, వరకట్నాలు నీకుందుకురా? అయ్యా! సినిమాలు చూచుట అనేది పరమ పవిత్రమైన కార్యము. మనం ప్రతిరోజూ ఎంతమంది దేవుళ్ళకి మొక్కట్లేదు? అట్లే, అన్నిరకముల సినిమాలు చూడవలెననీ, ఎన్ని సినిమాలు చూచినచో అంత పుణ్యము లభించునని నా ప్రగాఢ విశ్వాసము).

తెర మీదకి ఎవరెవరో వస్తున్నారు. ఏవిటేవిటో మాట్లాడుతున్నారు. సినిమా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. కనీసం ఒక్క ఫైటింగు కూడా లేదు. సినిమా పరమ బోర్!

ఉన్నట్టుండి సావిత్రి 'లొట్టిపిట్టలు' అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టింది. అట్లా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఎందుకంత పడీపడీ నవ్వుతుంది? నాకర్ధం కాలేదు.

"అమ్మా! సావిత్రి ఎందుకట్లా నవ్వుతుంది?"

"సావిత్రి మధురవాణి వేషం వేస్తుంది. మధురవాణి వేశ్య!" అంది  అమ్మ.

ఓహో అలాగా! వేశ్యలు పెద్దగా నవ్వెదరు.

అంతలోనే ఇంకో సందేహం.

"వేశ్య అంటే?"

అమ్మ చిరాగ్గా మొహం పెట్టింది. ఒక క్షణం ఆలోచించింది.

"వేశ్య అంటే సంపాదించుకునేవాళ్ళు." అంది.

ఓహో అలాగా! సంపాదించుకునేవారిని వేశ్యలు అందురు.

ఇప్పుడింకో సందేహం.

"అమ్మా! నాన్న సంపాదిస్తున్నాడుగా. మరి నాన్న కూడా వేశ్యేనా?"

అమ్మ చిటపటలాడింది.

"నీ మొహం. అన్నీ కావాలి నీకు. నోర్మూసుకుని సినిమా చూడు." అంటూ కసురుకుంది.

నా మొహం చిన్నబోయింది.

          *                     *                   *                    *                        *                    
మళ్ళీ చిన్నప్పుడే!

అది మధ్యాహ్నం. సమయం సుమారు మూడు గంటలు. అమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకునే సమయం. బియ్యంలో మట్టిగడ్డలు ఏరుతూ, తిరగలి తిప్పుతూ, ఊరగాయ పచ్చడికి ముక్కలు తరుగుతూ లోకాభిరామాయణం చెప్పుకుంటుంటారు. నేనా కబుర్లు ఆసక్తిగా వినేవాణ్ని.

ఆరోజు ఎదురింటి విజయక్కయ్య, పక్కింటి భ్రమరాంభ పిన్ని, రెండిళ్ళవతల ఉండే గిరిజత్తయ్య చెవులు కొరుక్కుంటున్నారు. ఒక చెవి రిక్కించి అటు వేశా.

"చూశావా భ్రమరా! ఎంత అమాయకత్వంగా ఉండేవాడు. అంతా నటన! నంగి వెధవ. చదువుకున్నాడు గానీ ఏం లాభం? నేనైతే చెప్పుతో కొట్టే్దాన్ని." అంది విజయక్కయ్య.

"పాపం! ఆ పిల్ల ఎంత అమాయకురాలు! ఈ మధ్యనే పెళ్ళికూడా కుదిరిందట. ఇట్లాంటి దరిద్రుల్ని గాడిద మీద ఊరేగించాలి." అంది గిరిజత్తయ్య.

కొంతసేపటికి నాకర్ధమైనదేమనగా.. వీధి చివర శంకరం గారింట్లో  స్కూల్ మాస్టరు రంగారావు అద్దెకుంటారు. ఆయన వాళ్ళావిడ ఇంట్లోలేని సమయమున పనిమనిషి చెయ్యి పట్టుకున్నాట్ట. అదీ సంగతి!

విషయం అర్ధమైంది గానీ.. మర్మం అర్ధం కాలేదు.

ఒక సందేహము బుర్ర తొలుచుచుండెను.

"విజయక్కయ్యా! మాస్టారు పనిమనిషి చెయ్యి పట్టుకుంటే ఏమవుతుంది?" అడిగాను.

అమ్మ నోర్మూసుకోమన్నట్లు గుడ్లురుమింది.

విజయక్కయ్య సిగ్గు పడుతూ చెప్పింది.

"మగవాడు ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోకూడదు. చాలా తప్పు." అంది.

ఓహో అలాగా! మగవాడు ఆడవారిని ఎక్కడైనా పట్టుకొనవచ్చును గానీ.. చెయ్యి మాత్రం పట్టుకొనరాదు!

ఇప్పుడింకో సందేహం.

"మరయితే ఆ గాజులమ్మేవాడు ఇందాక మీఅందరి చేతులూ పట్టుకున్నాడుగా?"

నా డౌటుకి విజయక్కయ్య తికమక పడింది. భ్రమరాంభ పిన్ని చీరకొంగు అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది.

అమ్మ కసురుకుంది.

"వెధవా! అన్నీ పనికిమాలిన ప్రశ్నలు. అయినా ఆడాళ్ళ మధ్య నీకేం పని? అటుపొయ్యి ఆడుకో పో!"

నా మొహం మళ్ళీ చిన్నబోయింది!

(photo courtesy : Google)

23 comments:

  1. బుల్లబ్బాయ్26 November 2012 at 10:38

    మా బుడ్డోడ్ని డవుట్లడిగి చంపమాకురా అంటే, వాడి రెస్పాన్సు: నాన్నా డవుటంటే ఏంటి?

    ReplyDelete
    Replies
    1. మా వాడు కూడా మీ బుడ్డోళ్ళాగే బుర్ర తినేస్తుంటాడు. పాపం! అమ్మని చాలా ఇబ్బంది పెట్టాను.

      Delete
  2. హహహహ బాగున్నాయండీ మీ సందేహాలు :-)) అన్నట్లు మీ మొదటి సందేహం నాకు ఇప్పటికీ సందేహమే :-) కాకపోతే కన్యాశుల్కం నేను మొదటిసారి కాలేజ్ రోజుల్లో చూడ్డంవల్ల "ఎహే ఎందుకు నవ్వితే ఏంటి.. గలగలా నవ్వే సావిత్రిని చూస్తూ కూర్చోక.." అని సందేహాల్రావ్ నోరునొక్కేశా :-)

    ReplyDelete
    Replies
    1. నా సందేహం 'కన్యాశుల్కం' చదివేప్పుడే తీరిపోయింది. గురజాడ ఎవరిని ఊహించుకుని మధురవాణి పాత్రకి అంత నవ్వు రాశారో తెలీదు గానీ.. సావిత్రి అభినయం అద్భుతం. అనితర సాధ్యం.

      Delete
  3. so nice andi entaki samaadhaanaalu dorikaya ippatikainaa :)

    ReplyDelete
    Replies
    1. భలేవారండి. సమాధానాలు వెతుక్కోడానికే గదా టపా రాసింది :)

      Delete
    2. మీకు,పిల్ల సుబ్బు గాడికి తెలీకపోతే ఇంకెవ్వరికీ తెలీనట్లే నండీ. అడగడం దండగ ;-)

      Delete
  4. Daatraru baagu baagu... kaani miru iteevala kalamlo raajakiya visleshanalu manesaru... adi chaala lotuga undandi...

    ReplyDelete
    Replies
    1. అవును గదా!

      (ఇంతకు ముందు 'ఆంధ్రజ్యోతి' అప్పుడప్పుడు చూసేవాణ్ణి. గత కొంతకాలంగా 'హిందూ' తప్పించి ఏదీ చదవట్లేదు. అందుకే మనసు ప్రశాంతంగా ఉంది. బహుశా ఇదొక కారణం కావచ్చు.)

      Delete
  5. అబ్బా లోట్టిపిట్ట అంటే సావిత్రిని అన్నారేమో అని సిన్మా చూసినా , ఎందుకు నవ్విందో అర్ధం కాలే...

    సర్లే, ఈ సిన్మా లో సావిత్రి డాన్సులు , చ ఎవరు ఈవిడని మధురవాణి గా తీసుకొన్నది అనిపించింది సుమా , అవే డాన్సులు ఘటోత్కచుడి గా వేసింది కదా, మధురవాణి పాత్రలో ఘటోత్కచుడి రూపం కనిపిస్తుంటే కాస్త చికాకువేసింది. డాన్సులు కాక మిగిలినవి ఒకే :)

    ReplyDelete
    Replies
    1. తెలుగు సినిమాల్లో రాజసులోచన, ఎల్.విజయలక్ష్మి, జయలలిత మొదలైనవారు trained dancers. భానుమతి, అంజలీదేవి, సావిత్రి మొదలైనవారు dancers కాదు. పాటకి అవసరమైనంత మేరకు ఏదో అలాఅలా మేనేజ్ చేసేవాళ్ళు.

      నాకయితే మధురవాణి dance కూడా నచ్చింది. పాత్ర పరంగా ఆలోచిస్తే సావిత్రి మధురవాణిగా అదుర్స్. మీరేమో ఆమెను 'ఓకే' కేటగిరీలో పెడుతున్నారు. ఇది అన్యాయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను:)

      Delete
  6. ఒకే అంటే, ముసలాళ్ళు కదా సావిత్రి సరిపోయింది, పిల్ల అల్లరి చక్కగానే ఉంది.

    నాకింకోటి అనిపిస్తుంది , ఈ సిన్మా లో సావిత్రి డాన్సులు చూసే, ఘతోత్కాచుడి పాత్ర వ్రాసారేమో మాయాబజార్ లో :)


    ఇంకో తోక : నావరకు మధురవాణి అంటే చెంచులక్ష్మే (రఘునాధ నాయక నాయకి), అప్పటినుండి గురజాడ వారితో సహా ఇలా వేశ్య కూతుర్లన్దరికీ మధురవాణి అని పెట్టడం మొదలెట్టారా ఏంటి ?

    ReplyDelete
    Replies
    1. 'మధురవాణి' అనే పేరుతో నా ఆత్మీయ స్నేహితుని చెల్లెలు ఉంది. మేం ఆవిడని 'వాణి' అని పిలుస్తాం.

      Delete
    2. నేను చెప్పినది రచన కి సంబంధించిన పేరు గురించి అండీ.

      Delete
  7. డాక్టర్ గారు,

    బాగుంది సార్

    అయితే మీకు చాలాతక్కువ సందేహాలే వచ్చాయి సార్
    అంటే మీ బాల్యమంతా చదువుమీదే కాన్సంట్రేషన్ అటుకుంటా.

    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
  8. డియర్ రమేష్ బాబు,

    నా టపాలు రెగ్యులర్ గా చదువుతున్నారు. అయినా మీరు నన్ను అర్ధం చేసుకోలేదు!

    నాకు చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ.. చెట్టులేని చోట ఆవదం చెట్టులాంటివాణ్ణి. అంచేత మీవంటివారు నన్నలా అనుకుంటుంటారు. అది నా అదృష్టం!

    ReplyDelete
  9. మీ గుంటూరు గొప్ప తనం జాతియ సర్వేలో కూడా బయటపడింది :)

    - Guntur is the capital of one-night stands in India.

    http://ibnlive.in.com/news/india-today-sex-survey-bizarre-small-town-sex-facts-you-didnt-know/308795-3.html

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.