Monday 21 May 2012

పేరులో ఏముంది?!

"నీకు నా ఇష్టదైవం పేరు పెట్టుకున్నాను, అందుకైనా ఒక్కసారి ఆ దేవుడికి దణ్ణం పెట్టుకోరాదా!" ఇది అమ్మ ఆర్గ్యుమెంట్.

"నువ్విట్లా కొత్త రూల్స్ పెట్టకు. నాకీ పేరు పెట్టమని నేనడిగానా? నాకు చెప్పకుండా నాపేరు పెట్టటమే కాక, ఆ పేరుకు తగ్గట్లు ప్రవర్తించమని డిమేండ్ చెయ్యడం అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా!" ఇది నా కౌంటర్ ఆర్గ్యుమెంట్.

అసలు పేరుకీ, ప్రవర్తనకీ సంబంధం ఉంటుందా? ఉండాలా?

నా చిన్నప్పుడు మా పక్కవీధిలో నెయ్యి అమ్మేవాళ్ళు. 'ఇచ్చట స్వచ్చమైన వెన్న కాచిన నెయ్యి అమ్మబడును.' అని పెద్ద బోర్డుండేది. ఆ నెయ్యి మాత్రం ఎలుక చచ్చిన పాడు కంపు కొడుతుండేది.

'కేర్' ఆస్పత్రి అంటారు. అక్కడ పేషంట్లని కేర్‌లెస్సుగానూ, బిల్లుల్ని కేర్‌ఫుల్లుగానూ చూస్తారని అభిజ్ఞువర్గాల భోగట్టా. ఈ మధ్య కొన్ని ఆస్పత్రులకి 'హెల్ప్' అని పేరు పెడుతున్నారు. వాళ్ళ బిల్లుల్ని చూసి జనాలు ఘొల్లుమంటున్నారు, ఇంక 'హెల్ప్' ఎక్కడ!

పాతతరం కమ్యూనిస్టులు పిల్లలకి లెనిన్ బాబు, స్టాలిన్ బాబు అని పెట్టుకునేవాళ్ళు. వారి పిల్లల బుల్లిఅడుగుల్లో భవిష్యత్ విప్లవకారుని 'లాంగ్ మార్చ్' చూసుకుని మురిసిపొయ్యేవారు. తదనంతరం ఆ బుల్లి విప్లవకారులు 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' చేసి - వడ్డీ వ్యాపారస్తులుగానూ, లిక్కర్ సిండికేట్లుగానూ 'ఎదిగి' తలిదండ్రులకి గొప్ప పేరు తెచ్చిపెట్టారు 'గోరా' తండ్రి కొడుక్కి రామచంద్రరావు అని రాముడి పేరు పెట్టుకున్నాడు. మరి గోపరాజు రామచంద్రరావు ఏం చేశాడు? 'గోరా'గా మారిపోయి ఆ దేవుడే లేడన్నాడు!

గురజాడ అప్పారావు మాత్రం తన నాటకానికి సాంప్రదాయక పద్ధతుల్నే నమ్ముకున్నాడు. 'కన్యాశుల్కం'లో పాత్రల పేర్లు వారి బుద్ధిననుసరించి ఉంటాయి. లుబ్దావధాని, అగ్నిహోత్రావధాని, కరటకశాస్త్రి, సౌజన్యారావు.. ఇది ఈ నాటకానికి నెగెటివ్ పాయింటని పలువురు విజ్ఞులు వాకృచ్చారు.

అమ్మకి 'కన్యాశుల్కం' సినిమా మాత్రమే తెలుసు. ఆవిడకి మధురవాణిగా సావిత్రి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అంతే! అయితే కన్యాశుల్కం ఒక గొప్ప నాటకమని.. గురజాడ పాత్రలు బుద్ధిగా తమ పేర్లననుసరించే ప్రవర్తించాయని తెలీదు. తెలిసినట్లయితే ఆవిడ ఈ పాయింటుని తన డిఫెన్సుకి వాడుకునేది. ఆమెకి తెలీదని నాకు తెలుసు కాబట్టే.. పేర్లకీ, ప్రవర్తనకీ సంబంధం లేదని, ఉండదనీ బల్ల గుద్ది వాదిస్తున్నాను.

ఇంట్లో ఏదో వ్రతం. అమ్మ కొత్త ఎత్తు వేసింది.

"కనీసం ఇవ్వాళయినా ఒక్కసారి దణ్ణం పెట్టుకో.. నాకోసం!" అంటూ సెంటిమెంటుతో కొట్టింది.

చచ్చితిని. ఇరుక్కుపొయ్యానా? ఒక్కక్షణం ఆలోచించాను.

"అమ్మా! నాకయితే ఇటువంటివి నమ్మకం లేదు. నీకోసం తప్పకుండా పెడతాను. కానీ నమ్మకం లేకుండా దణ్ణం పెట్టుకోవడం మహాపచారం. అసలే నీకీ మధ్య బిపి ఎక్కువైంది, ఆ తర్వాత నీ ఇష్టం." హెచ్చరిస్తున్నట్లుగా అన్నాను.

నా మంత్రం పని చేసింది. "సరెసరే! వద్దులే." అంది కంగారుగా.

అమ్మకి కనిపించకుండా మొహం పక్కకి తిప్పుకుని.. నవ్వుకున్నాను!! 

21 comments:

  1. చాదస్తం అనేది కమ్యూనిజంలో లేదు. లెనిన్ పేరు పెట్టినంతమాత్రాన కమ్యూనిస్ట్ అవుతాడనుకుంటే వాళ్ళకి కమ్యూనిజం గురించి ఏమీ తెలియనట్టే. సమాజంలో డబ్బున్నవాళ్ళు-పేదవాళ్ళు అనే తేడాలు ఎందుకు ఉన్నాయో తెలిస్తే అతనికి విప్లవ వ్యతిరేకి అయిన గాంధీ పేరు పెట్టినా అతను విప్లవకారునిగానే మారుతాడు.

    ReplyDelete
  2. Praveen Mandangi గారు,

    అవును. నేను రాసింది కూడా అదే!

    నా కొడుక్కి రావిశాస్త్రి పేరు 'విశ్వనాథ్' అని పెడదామని ఉబలాట పడ్డాను. కానీ.. కొందరు కె.విశ్వనాథ్ పేరనుకుంటారని భయపడి.. ఆ ఆలోచన డ్రాప్ చేసుకున్నాను.

    ప్రస్తుతం మావాడి పేరు రాహుల్. రాహుల్ ద్రావిడ్ పేరు అంటూ నా భార్యా.. రాహుల్ సాంకృత్యయేన్ పేరని నేనూ తృప్తి నొందుతున్నాం!

    ఎంత కాదనుకున్నా.. పిల్లల పేర్లలో మన పైత్యం చూపుతూనే ఉంటాం!

    ReplyDelete
  3. "ప్రస్తుతం మావాడి పేరు రాహుల్. రాహుల్ ద్రావిడ్ పేరు అంటూ నా భార్యా.. రాహుల్ సాంకృత్యయేన్ పేరని నేనూ తృప్తి నొందుతున్నాం!"

    రాహుల్ గాంధీ పేరని ఎవరూ అనడం లేదా?

    ReplyDelete
  4. నా పేరు ప్రవీణ్, నేను మావోయిస్ట్‌ని. పేరులోనే ఏదో ఉందనుకుంటే నన్ను హిందూత్వవాది ప్రవీణ్ తొగాడియాతో పోల్చొచ్చు. మా పట్టణంలో యూకో బ్యాంక్‌లో నిత్యానందం అనే పేరు ఉన్న మేనేజర్ గారు ఉండేవారు. ఆయన స్టీల్ ప్లాంట్ బ్రాంచ్‌కి ట్రాన్స్ఫర్ అవ్వకముందే నిత్యానంద సెక్స్ స్కాండల్ బయటపడింది. బ్యాంక్ ఉద్యోగులు మేనేజర్ గారి పేరు చెప్పేటప్పుడు నిత్యానందం గారు అని అంటోంటే కొంత మంది కస్టమర్లు నెగటివ్‌గా అనుకునేవాళ్ళు.

    ReplyDelete
  5. మావోయిస్ట్ ప్రవీణ్ మీరు పాల్గొన్న దాడులు, కూల్చిన ప్రభుత్వ ఆస్తులు, తొలగించిన పట్టాలు, హతమార్చిన వర్గశతృవుల వివరాలు చెప్పగలరా? మీది ఏ దళము, దళపతి ఎవరు?

    ReplyDelete
  6. @Jai GOttimukkala గారు,

    నిజమే! మీరనేదాకా నాకూ తట్టలేదు.

    గాంధీలని కాంగ్రెస్ అభిమానులకి వదిలేద్దాం లేండి!

    ReplyDelete
  7. సచిన్ టెండూల్కర్ తండ్రి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సచీంద్ర దేబ్ బర్మా (సత్యేంద్ర దేవ వర్మ) అభిమాని. అందుకే అతను తన కొడుకుకి సచిన్ అని పేరు పెట్టాడు.

    ReplyDelete
  8. గురజాడ పాత్రలు బుద్ధిగా తమ పేర్లననుసరించే ప్రవర్తించాయని తెలీదు. తెలిసినట్లయితే ఆవిడ ఈ పాయింటుని తన డిఫెన్సుకి వాడుకునేది. ఆమెకి తెలీదని నాకు తెలుసు కాబట్టే.. పేర్లకీ, ప్రవర్తనకీ సంబంధం లేదని, ఉండదనీ బల్ల గుద్ది వాదిస్తున్నాను.
    :))
    అమ్మకి ..ఈ విషయం తెలిస్తే..మీ పేరుకు ప్రవర్తనకి సంబంధం ఉందని అంటారు.. జాగ్రత్త . డాక్టర్ గారు.

    ReplyDelete
  9. మా నాన్నగారి పేరు జగన్నాథ్. పురీ జగన్నాథుని పేరు మీద ఆ పేరు పెట్టారు. కానీ మా నాన్న గారికి 1991 వరకు దేవుని మీద నమ్మకం అంత బలంగా లేవు. కరీంనగర్‌లో పరిచయమైన కొంత మంది సాయిబాబా భక్తుల వల్ల నాన్నగారిలో భక్తి విశ్వాసాలు పెరిగాయి. మా పెదనాన్న గారి పేరు జై దేవ్. భక్త జయదేవుని పేరు మీద ఆ పేరు పెట్టారు. మా పెదనాన్న గారికి కూడా అంతగా భక్తి విశ్వాసాలు లేవు.

    ReplyDelete
  10. ఇంకో విషయం. నిత్యానందం అనే పేరు ఉన్నవాళ్ళు నిజ జీవితంలో ఉంటారని ఒక సినిమాలో నిత్యానందం అనే పదం ఉన్న డైలాగ్‌ని సెన్సార్ బోర్డ్‌వాళ్ళు డిలీట్ చెయ్యించారు.

    ReplyDelete
  11. డాక్టర్ గారు,

    ఈ టఫా ఎందుకు రాసారో నాకర్దం కాలేదు సార్.
    అంత అర్దాంతరంగా ముగించేసారు.
    ఇందులో ఏమి చెప్పదలుచుకున్నారో కుడా అర్దంకాలేదు.
    నేననుకోవడం బహుశా మద్యలో సుబ్బు వచ్చి డిస్టర్బ్ చేసిండొచ్చు.

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  12. వనజవనమాలి గారు,

    అమ్మ ఎత్తులకి పై ఎత్తులు వెయ్యడంలో నేను సిద్దహస్తుణ్ణి. కాబట్టి ఇబ్బంది లేదు.

    నేను అమ్మకి బెస్ట్ ఫ్రెండుని. నాకు ఆవిడని గౌరవించడం వంటి ఫార్మాలిటీస్ ఉండవు. స్నేహితుల్ని ఎలా గౌరవిస్తాం? మా ఇద్దరికీ అనేక వాదోపవాదాలు నడుస్తుంటయ్.

    ReplyDelete
  13. ఓహో అలా పేర్లు పెట్టారా. భలే చెప్పావు ప్రవీణ్. బహుశా నీకు ఎందులోనూ ప్రావీణ్యత ఉండదని ముందే ఊహించి మీ పెద్దవాళ్ళు కనీసం పేరులో అయినా మిగులుతుందని నీ పేరు అలా పెట్టారేమో. పోన్లే ఏంచేస్తాం.

    ReplyDelete
  14. Good one sankar !!

    ReplyDelete
  15. @ramaad-trendz,

    రమేష్ బాబు గారు,

    >>ఈ టఫా ఎందుకు రాసారో నాకర్దం కాలేదు. ఇందులో ఏమి చెప్పదలుచుకున్నారో కుడా అర్దంకాలేదు.<<

    అమ్మయ్య! మీకు అసలు సంగతి అర్ధమైంది! ఇవ్వాళ నాలుగింటికే మెళుకువొచ్చింది. అందుకే రాశాను. ఏమీ చెప్పదలుచుకోలేదు. కాఫీ తాగుతూ చదువుకోడానికి మీకోసం సరదాగా నాలుగు పేరాలు! అంతే!

    ReplyDelete
  16. నీ పేరు గార్ధభములకి సూట్ అవుతుందని నీకు ఆ పేరు పెట్టారు కదా శం"ఖర్‌".

    ReplyDelete
  17. మిత్రోత్తములారా,

    దయచేసి నా పోస్టుకి సంబంధించి మాత్రమే వ్యాఖ్య రాయండి. మీ కామెంట్లని డిలీట్ చేసి మిమ్మల్ని insult చెయ్యడం నాకిష్టం లేదు. దయచేసి సహకరించండి.

    ReplyDelete
  18. డాక్టరు గారూ, మీరు "మిత్రోత్తములారా" అని సంబోధిస్తే ఎవరు వింటారు? ఒక్కసారి "మిత్రాధములారా" అని చూడండి!

    PS: just for humor, నేను ఎవరినీ ఉద్దేశించి రాయలేదు.

    ReplyDelete
  19. బాబు ప్రవీణ్ నువ్వు ఇక్కడికి కూడా వచావా..ఎమన్నా కామెంట్స్ ఉంటె ఫున్ గా రాయి. ప్రతి దానికి నీ మేధావి తనం ఉపయోగించకు

    ReplyDelete
  20. అబ్బా...మిత్రోత్తములారా అని సంబోధించి చేతులు కట్టేశారు డాక్టరుగారూ. సరే కానీండి మనోడు ఇంకోచోట దొరికినప్పుడు రిటార్ట్ ఇస్తా :))

    ReplyDelete
  21. బుల్లబ్బాయ్22 May 2012 at 12:44

    లైఫ్ లో ఫస్ట్ టైం రిలవెంట్ కామెంట్ పెట్టిన మార్తాండ ఖర్మ కి వీరతాడు

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.