Saturday 29 September 2012

సావిత్రి ఎంతో అందముగా యుండును


"శిష్యా! జీవితాన్ని కాచి వడబోసి ఒక నగ్నసత్యాన్ని కనుక్కున్నా. రాసుకో! సావిత్రి ఎంతో అందముగా యుండును."

"అంత అందంగా ఉంటుందా గురూజీ?"

"అంతింత అందం కాదు. మబ్బంత అందంగా ఉంటుంది."

"మబ్బంతా!?"

"అవును. మబ్బు అందంగా ఉంటుంది. ఎవరికీ అందనంత ఎత్తుగానూ ఉంటుంది. అర్ధం కాలేదా? అయితే - 'ఏమిటో ఈ మాయ'  అంటూ మిస్సమ్మలో సావిత్రి పాడిన చూసుకో. పండగ చేసుకో!"

"గురూజీ! నాక్కూడా ఈ పాట భలే నచ్చింది."

"నచ్చక చస్తుందా! సావిత్రి అందం అట్లాంటిది. చూశావా! 'వినుటయె కాని వెన్నెల మహిమలు.. అనుభవించి నేనెరుగనయా!' అంటూ చంద్రుడితో చెప్పుకుంటుంది. పాపం! కష్టపడి బియ్యే పాసయింది. అయినా ఏం సుఖం? రవణారెడ్డి అప్పు తీర్చడం కోసం పాఠాలు చెప్పుకు బతుకుతుంది. ఏంటలా దిక్కులు చూస్తున్నావ్? ఇంతకీ సావిత్రి అందం గూర్చి నే చెప్పిన నగ్నసత్యం రాసుకున్నావా?"

"గురూజీ! మీరేవీ అనుకోకపోతే నాదో మాట. నాకీ పాటలో సావిత్రి అందం కంటే ఎన్టీరామారావు సిగరెట్ కాల్చడం భలే నచ్చింది. సిగరెట్ అంతలా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చని నాకిప్పటిదాకా తెలీదు. మీరు నన్నొదిలేస్తే అర్జంటుగా ఒక సిగరెట్ కాల్చుకుంటాను. ఉంటాను."

"ఆఁ!"

(photos courtesy : Google)

16 comments:

  1. రమణ గారు.. మీ మిత్రుడు ఈ పాట చూస్తూ సిగెరెట్ కాల్చటంని ట్రై చేస్తే చేయి చురుక్కుమనడం ఖాయం.
    మీ మాట,మీ మిత్రుడి మాట రెండు బావున్నాయి. :)

    ReplyDelete
    Replies
    1. వనజ గారు,

      సరదాగా చిన్న స్కిట్!

      గిరీశం, శిష్యుడు వెంకటేశం స్టైల్లో రాద్దామనుకుని.. టైం కుదరక ఇలా రాసేశాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
  2. రమణగారు,

    సావిత్రి మంచి నటి. ఆమే అందంగా ఉండటమేమిటి? మీ పాఠకులను తప్పు దోవ పట్టిస్తున్నారు :) ఈ క్రింది పాటలో జయప్రదకన్నా అందగా ఉందా, సావిత్రి? నేను చెప్పినది అబ్బద్దమైతే ఎవరైనా చిన్నపిల్లలకి ఈ రెండు పాటలు చూపించి ఎవరు బాగునారని అడిగితే నిజం తెలిసిపోతుంది :)


    http://www.youtube.com/watch?v=oas_0icRhnc

    SriRam

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారూ,

      నా పోస్ట్ లో అతిశయోక్తులతో కూడిన అలంకారిక భాష వాడాను. గమనించగలరు.

      అందం అనేది చాలా రెలటివ్ పదం. నేను అందాన్ని అందాల పోటీల వాళ్ళ నిర్వచనంలో వాడలేదు. పిల్లవాడికి తన తల్లి అత్యంత అందమైనది. అలాగే.. 'గాంధీ అందంగా ఉంటాడా?' అని ఆలోచించం.

      నా దృష్టిలో అందమనేది హృదయానికి సంబంధించినది. తెలుగు సినిమాలన్నింటిలో (నేను చూసినంత మేరకు) మిస్సమ్మ పాత్ర స్వభావం చాలా క్లిష్టమైనది. ఈ పాత్రలో మనకి అనేక షేడ్స్ కనిపిస్తాయి. మిస్సమ్మ పాత్ర తీరుతెన్నుల గూర్చి తరవాత ఎప్పుడైనా ఒక టపా రాస్తాను. ఈ పాత్ర పోషణలో సావిత్రి డిస్టింక్షన్ లో పాసయ్యింది. మనందరికీ ఆత్మీయురాలైంది. బహుశా ఈ 'ఆత్మీయ' భావన నా చేత బయాస్ద్ గా ఆలోచింప చేసిందేమో!

      మీరు చెప్పిన జయప్రద ముక్కూ, మొహం సావిత్రి కన్నా చాలా బాగుండవచ్చు. ఒప్పుకుంటున్నాను. పిల్లలేం భాగ్యం! పెద్దవాళ్ళు కూడా అదే అనొచ్చు. అయితే నటిగా జయప్రద నాకు పెద్దగా తెలీదు. కావున ఆవిడ రూపు రేఖా విశేషాలు నన్నంతగా ఆకట్టుకోవు. అందువల్ల జయప్రదని చూస్తుంటే ఏ షాపింగ్ మాల్ లోనో కనబడే స్ట్రేంజర్ ని చూస్తున్న ఫీలింగ్ మాత్రమే నాకు ఉంటుంది.

      మీరు కొడవటిగంటి కుటుంబరావు 'కురూపి' చదివారా? ఆధునిక నవలా సాహిత్యంలో ఈ అందచందాల గూర్చి వాస్తవ దృక్పదంతో చర్చించిన రచన 'కురూపి'. చదవకపోతే తప్పకుండా చదవండి.

      Delete
  3. రమణగారు,

    సాగర సంగం సినేమాలో జయప్రద ప్రతిసన్నివేశం లో చాలా అందంగా ఉంట్టుంది. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన సినేమాలలో, మొదటి సన్నివేశం నుంచి చివర వరకు సాగరసంగమం సినేమాలో మొహంలో, ఆహర్యంలో తెలుగుదనం ఉట్టిపడుతూ జయప్రద అంత అందంగా, ఇతర కథానాయికలు కనిపించిన సినేమా నాకు గుర్తుకు రావటం లేదు.

    SriRam

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      ఇవన్నీ అందానికి మనమిచ్చుకునే నిర్వచనం బట్టి మారిపోతుంటాయి.

      మీకు 'సాగరసంగమం' లో విశ్వనాథుని నాయిక తెలుగుదనం ఉట్టిపడేలా ఉంది కాబట్టి.. అందంగా కనపడింది. నాకు కాదు. ఆ సినిమాలో తాగుబోతు హీరో జయప్రద నుదుటి బొట్టు మీద వర్షం పడకుండా చేతులు అడ్డం పెడతాడు. మరీ అంత బీభత్స సెంటిమెంటు తట్టుకోలేకపోయాను.

      నాకు 'సాగరసంగమం' సినిమా నచ్చలేదు. (అంటే సినిమా సరీగ్గా తియ్యలేదని కాదు. ఆ దర్శకుడి సనాతన ఆలోచనలు నాకు నచ్చకపోవడం మాత్రమే కారణం.) కాబట్టి.. జయప్రద అందచందాలు పట్టలేదు.

      అదేవిధంగా.. మిస్సమ్మ సినిమా నాకు నచ్చకపోయినట్లయితే సావిత్రిని కూడా పట్టించుకోకపోదును. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. (కేలండర్ లో బొమ్మని చూసి మెచ్చుకోవడానికీ.. కేరెక్టర్ నచ్చడానికీ చాలా వ్యత్యాసముంది.)

      నా ఆలోచనా సరళి ననుసరించి ఉన్న కారణానే..

      అప్పు తీరే మార్గం లేక.. గతి లేని పరిస్థితుల్లో జమీందారు దగ్గర ఉద్యోగం చేస్తూ.. తనకి నచ్చని విషయాల్లో ఆయన్ని కూడా ఎదిరించే మిస్ మేరీ ఆత్మవిశ్వాసం నాకు అందంగా కనబడింది.

      'మదర్ ఇండియా' చూశారా? భర్త చనిపోయినా.. షావుకారుకి లొంగకుండా.. తన పిల్లలతో అరకు దున్నిన మట్టిమనిషి నర్గీస్ లో నాకు చాలా అందం కనబడింది.

      'మొఘలే ఎ ఆజం' చూశారు కదూ! 'నా ప్రేమ ముందు నువ్వెంత?' అంటూ అక్బర్ చక్రవర్తినే ప్రశ్నించిన మధుబాల తృణీకార భావనలో నాకు చాలా అందం కనబడింది.

      మనకి నచ్చిన లక్షణాలున్న పాత్రల్ని ప్రతిభావంతంగా పోషించిన నటీమణులందరూ మనకి అందంగానే కనబడతారు. అదీ నా పాయింట్.

      Delete
    2. బుల్లాబ్బయ్30 September 2012 at 09:19

      ఈడెవడండీ.. సాగరసనగమం టైం కి జయప్రద ఫేడైపోయిందిరా బాబు.. ఏ అడవి రాముడ్లోనో అంతకు ముందు సిన్మాలో సూడు కాత్త.


      రవణన్నా, ఈడితో మనకేటి గానీ, మన ఎంటీవోడు సావిత్రీ ఇద్దరూ మాంఛిగా చేసిన అలిగినవేళనే సూడాలి (గుండమ్మ?) పాట మీదో పోస్టింగేసేద్దూ

      Delete
    3. రమణగారు ఇచ్చిన సుదీర్గ వివరణ నీకర్థం కాలేదు రా మొద్దబ్బాయ్. అడవిరాముడిలో జయప్రదకి ఉన్న పాత్ర, ప్రాముఖ్యత ఎమీ లేదు. 15సం అమ్మాయి, 50సం|| హీరోతో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని ఎగురుతూంటే నీలాంటి వాళ్లకి నచ్చుతుంది కాబోలు.

      SriRam

      Delete
    4. *ఆ సినిమాలో తాగుబోతు హీరో జయప్రద నుదుటి బొట్టు మీద వర్షం పడకుండా చేతులు అడ్డం పెడతాడు. మరీ అంత బీభత్స సెంటిమెంటు తట్టుకోలేకపోయాను.*

      రమణగారు,
      అక్కడ సెంటిమెంట్ ఏముందండి? కమల్ హాసన్ కోణం నుంచి చూడండి. కమల్ పట్టుదల గల దిగువ మధ్యతరగతివాడు, కొన్ని కలలు కంటాడు. గొప్ప డాన్సర్ గా ఎదగాలని, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. డాన్సర్ గా కావల్నుకొనే అతని కల శాస్వతంగా చెదిరిపోతుంది. సంస్కారవంతుడు కనుక మొగుడితో జయప్రద జీవితం బాగుండాలని కోరుకొంటాడు. అలా ఆమే జీవితం సుఖ సంతోషాలతో జీవిస్తున్నాదని అతను అనుకొంట్టుంటాడు( ఎక్కడ ఉన్నా, నీ సుఖమేనే కోరుకొన్నా అనుకొనే రకం ) ఇది కూడా ఒకరకంగా అతని కొత్త కల! జయప్రద నుదుటి బొట్టు మీద వర్షం పడకుండా చేతులు అడ్డం పెట్టటానికి, బొట్టు చెరిగిపోవటం వైధవ్యానికి చిహనం గా భావించి,జీవితం లో ఒంటరితనంలో ఉండే కష్ట్శాలను తెలిసిన అతను, ఆమేకి అటువంటి కష్ట్టాలు అనుభవించకుడదని, ముత్తైదువగా గా ఉండాలని అనుకోవచ్చుకదా! లేకపోతే జీవితంలో తనకున్న ఆ ఒక్క చివరి కొత్తకల కూడా ఓటమి పాలు కావటం చూడలేక అలా చేసి ఉండవచ్చు కదా! మీకు భారతీయ మగవారి ప్రేమ అర్థం కాలేదండి :), టైటానిక్ సినేమాలో మాదిరిగా హీరొయిన్ పడవేక్కించేసి, హీరొ చనిపోతేనేనా ప్రేమ అంటే?మీరు ఆ సన్నివేశాన్ని అందులో హీరోగారి ప్రేమను సాంప్రదాయం, సెంటిమెంట్ కోణం లో చూస్తున్నారు. విశ్వనాథ్ అంత సంప్రాదాయి ఐతే కమల్ కి తాగుడల వాటూన్నట్టు చూపేవాడు కాడేమో!

      SriRam

      Delete
    5. శ్రీరాం గారు,

      మీ అభిప్రాయాన్ని కాదనను. గౌరవిస్తున్నాను కూడా. సినిమాలోని పాత్రలతో మనం ఐడెంటిఫై చేసుకుంటేనే ఆయా సినిమాలు నచ్చుతాయి. ఆ సినిమా మన అభిప్రాయాలకి విరుద్ధంగా ఉంటే ఆ సినిమా నచ్చే అవకాశం లేదు.

      విశ్వనాథ్ కి మంగళ సూత్రాల మీద మిక్కిలి మక్కువ. అందుకే జయప్రదకి ఎప్పుడో తాళి కట్టిన మగాడు ఎక్కడి నుండో ఊడి పడంగాన్లే జయప్రద వాడితో వెళ్ళిపోతుంది. హీరో గారు కూడా మంగళ సూత్రాల పవర్ కి తల వంచేస్తాడు. ఇక్కడ దర్శకుడు మంగళ సూత్రానికున్న గొప్పదనాన్ని అద్భుతంగా చాటాడు!

      ఆడవారికి ఐదోతనమే అంతిమం. అందుకే ఆ ఐదోతనానికి సింబల్ అయిన బొట్టుకి ఎక్కడ లేని ప్రాధాన్యత. కాబట్టి వర్షంలో బొట్టు తడవకుండా చేతులు అడ్డం పెట్టి సీన్ గొప్పగా పండిస్తాడు. ఇవన్నీ విశ్వనాథ్ నమ్మకాలు. ఆయన తన గోల్ ని శాస్త్రీయ సంగీతం, నృత్యం లాంటివి అద్దుతూ బాగా ప్రెజెంట్ చేస్తాడు. సందేహం లేదు. దర్శకుడిగా విశ్వనాథ్ చాలా ప్రతిభావంతుడు.

      ఇక్కడ విశ్వనాథ్ భావాలు నచ్చిన వారికి ఆయన సినిమాలు కళా ఖండాలుగా కనిపిస్తాయి. నచ్చనివారికి అందులో ఒక కుట్ర కనిపిస్తుంది. అంతే!

      Delete
    6. అయ్యా రమణగారూ. కళా తపస్వి వి సనాతన భావాలనుకునే మీరు స్వాతి ముత్యాన్ని ఎందుకు చూడలేదు. మరి ఆ రోజుల్లోనే రెండో పెళ్ళిని ఒక సమస్య కు పరిష్కారంగా చూపాడే. అఫ్ కోర్స్ ఒక వెర్రి వాడితో పెళ్ళి చేయించాడని మీరు దర్శకుడిని విమర్శించవచ్చు. కాని అందులో తెలివి తేటలు అంతగా లేని ఒక వ్యక్తి ఒక పరిష్కారమార్గంగా ఎదగడం అన్నది పాయింట్. మీ భార్యగారు కూడా ఒక హిందువే అనుకుంటాను. ఏదీ ఒకసారి మంగళసూత్రాలు తీసీయ్యమండి చూద్దాం (జాగ్రత్త చెంపలపై చేతులు అడ్డుపెట్టుకోండి!). అపుడు మీకు మంగళసూత్రాల పవర్ అర్థమవుతుందని మా ఆశ.

      Delete
    7. శ్రీ సూర్య గారు,

      నా బ్లాగులో వ్యాఖ్యలు రాస్తున్నందుకు కృతజ్ఞతలు.

      బ్లాగులన్నవి హాబీగా అభిప్రాయాలు రాసుకునేందుకు మాత్రమే. మీకు కె.విశ్వనాథ్ ఆధునిక భావాలు కలవాడిగా అనిపిస్తే మంచిదే. మీ అభిప్రాయం మీది.

      అదే విధంగా మీకు మంగళసూత్రంపై కల అచంచల విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. దాని పవర్ మూలంగా మీకు మంచి జరగుతుందని కూడా మనస్పూర్తిగా ఆశిస్తున్నాను!

      Delete
    8. tiruguleni andam jayapradadi.Last Mogal King Bahadurshah Jafar..alaage chittachivari asalu sisalu Telugu Heroine mummaatiki JAYAPRADA ne..

      Delete
    9. మీ జయప్రద అభిమానానికి అభినందనలు!

      నాకైతే జయప్రద కన్నా ఇలియానా బాగుంటుంది (ఈ మధ్యే 'పోకిరి' డివిడీ చూశాన్లేండి)!

      Delete
  4. బుల్లాబ్బయ్ :-)
    రమణ గారు మీకు మంచి దోస్తులే ఉన్నారు. ;-)

    ReplyDelete
  5. రమణ గారూ
    సాగర సంగమం పై నాదీ సేమ్ టు సేమ్ అభిప్రాయం. చాలా అతిగా వున్నదా సీన్

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.