Tuesday 9 April 2013

వొంసె సంకరం.. ఎంత గోరం!


"ఎంతన్నాయం! గోరం జరిగిపోతంది."

"ఏందిరా?"

"ఆళ్ళెవళ్ళో ఎన్టీవోడి బొమ్మని వయ్యస్ బొమ్మతో కలిపేసారంట!"

"అయితే యేంది?"


"మడిసన్నాక మంచీసెబ్బర ఉండక్కర్లా? ఎన్టీవోడు బాలయ్య బాబు సొత్తు. వయ్యస్ జగన్ బాబు సొత్తు. యాడైనా అబ్బల సొత్తు కలిపేత్తారా?"

"కలిపేత్తే ఏవవుద్ది?"

"అరే యెదవా! నీ పొలం నా పొలంలో కలుపుకు దొబ్బితే నీక్కాలదు?"

"నాకెందుక్కాలుద్ది? నువ్వు కలిపేసుకొటాకి నాదెగ్గిరసలు పొలవుంటేగా!"

"ఓరి తిక్కల నాయాలా! ఎన్టీవోడి వొంసెం, వయ్యస్ వొంసెం యేరేరు. ఆళ్ళు సేసిన అబివుర్దులు యేరేరు. పెళ్ళిసమ్మందం కలుపుకున్నట్లు యాడైనా అబివుర్దులు కలిపేసుకుంటారా? అట్టా అడ్డగోలుగా వొంసాలు, అబివుర్దులు కలిపేస్తే రేపు ఓటేసేవోడికి అరదం కావొద్దా?"

"అరదం కాపోతే మానె! ఓట్ల మిసనీ యాడ నొక్కినా 'కుయ్' మంటది గదా! దానికి వొంసెంతో పనేంది?"

"ఒరే యెదవన్నర యెదవా! మడిసి కన్నా వొంసెం గొప్పదిరా సన్నాసి. నీ అయ్య పుటో నా ఇంట్లో పెడితే నేనూరుకుంటానా యేంది?"

"ఊరుకోమాక. అయినా నువ్వెట్టుకొటాకి నాదెగ్గిర మా అయ్య పుటో ఉంటేగదా!"

"వామ్మో! ఓర్నాయనో! నీకు దండాల్రా బాబూ! రెండు దినాల్నించి టీవీల్లో ఈ ఇసయం మీద సొక్కాలు సించుకుంటా అరుస్తా వుండారు. నీ యెదవ మొకానికి ఎంత సెప్పినా అరదం అయ్యి సావదు. నిన్ను ఆడికి పంపిస్తే ఆళ్ళకి మెంటలెక్కుద్ది."

"ఎక్కనీ! నాకేంది? అయినా మా ఇంట్లో టీవీ యాడుండాది? ఆ టీవీ బొమ్మలోళ్ళు సెప్పే పోసుకోలు కబుర్లు ఇంటా కూకోటానికి నేన్నీలాగా పనీపాటా లేని యెదవననుకున్నావా యేంది!"

"ఆఁ!"

(photos courtesy : Google)

16 comments:

  1. వరెవా...ఏమి రాస్తిరి..ఏమి రాస్తిరి.. సూపరుంది.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండి!

      (ప్రశ్నలు నావే! భాష మార్చాను. అంతే!)

      Delete
  2. Oh my god.. can't laugh any more:)

    ReplyDelete
    Replies
    1. thank you!

      (credit goes to my morning coffee!)

      Delete
  3. సూపరో సూపర్ . వేసుకోండి రెండు వీరతాళ్ళు

    ReplyDelete
    Replies
    1. "ఈరతాళ్ళా! అయ్యేంది?"

      "నువ్వు బాగా సెప్పావంట్రా! సెబాసంటన్నారు."

      "అయితే యేంది?"

      "నీ మెళ్ళో తాళ్ళేస్తారంటా!"

      "నాకు మొల్తాడుంది. అది సాల్లే. అయినా మెడకి తాడేసేది గొడ్లకిగా! ఇప్పుడు మడుసులుక్కూడా యేస్తన్నారా యేంది!"

      Delete
  4. ఇదిగో డాటేరు బాబు,

    గిట్లా ఎంటీ వొడి ఫుటో పెట్టడం వెనుక శానా విషయం ఉండాది

    గాంధీ గోరు దేశానికి సొతెంత్రెం గెట్ల తెచ్చిండ్రో గట్లా ఎంటీ వోరు రాజ్యానికి తెలుగు వెలుగు తెచ్చిండ్రు. సొ, మన రాజ్యానికి మారాజు (గంటే 'స్టాంపు' ఫుటో అన్న మాట ) ఎంటీ వోడు కాన , ఎంటీ వోడు ఒక పార్టీ కి చెందడు ! అన్ని పార్టీ వొళ్ళు గట్లా ఫుటో పెట్టేసుకుని కర్పూరం వెలిగిస్తరు !

    గదన్న మాట మరి విషయం


    డాక్టరు గారు,

    ఎంటీ వోరు కొంత కాలం పోయేక ఎట్లాగు ఈ పొజిషన్ కి వెళ్లి పోతారు మన రాష్ట్రం వరకు ! మా మనవడు అంత కాలం ఎందుకు వెయిట్ చెయ్యడం ఇప్పుడే మనమే గట్లా స్టార్ట్ చేసేద్దారి అని జెప్పి గిట్లా ఎంటీ వొడి పుటో పెట్టేడన్న మాట

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అయితే బాలయ్య బాబు ఒప్పుకోటల్లేదే!

      Delete
  5. ఇసయం లేని దానిమీద ఇసం గక్కుంట్రుండని, నా దగ్గర టీవీ ఉన్నా బంద్ చేసి హాయిగా తొంగున్నా! నువ్వు గూడా అదే ఫీలైతున్నావ్గా! మరిక ఉంటా. అన్ని దేసాలోల్లూ కలసాడున్న ఆట సూడాలి మరి.

    ReplyDelete
    Replies
    1. ఎక్కడో దూరాన ఉన్నావు కాబట్టి టీవీ కట్టేసి హాయిగా తొంగున్నావు. మాకిక్కడ ఈ ఫ్లెక్సీల గూర్చి ఆలోచించి.. చించి.. తల నరాలు చిట్లిపోతున్నయ్!

      Delete
  6. Reminds me of this! How true!!!

    ఏమంటివి ఏమంటివి? జాతి నెపమును సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా?
    ఎంత మాట.. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు... ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టికుండలో పుట్టితివి కదా. సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదమెందులకు?’’

    ReplyDelete
  7. ఇదిగిదీ .. ఇలగుండాల దెబ్బ ! కరిసీసి నారు కాదా ? నేక పోతే ఎమ్ప్టీవోడి మీద రాజకీయమా ..

    ReplyDelete
  8. doctor garu,
    baagundi
    ayinaa ramarao bomma pettimappudu babanna kannerra chesinappudu
    mana anjaneyulu master gaari shishyudu baalayya babu emaipoyaadu sir.

    G Ramesh babu
    Guntur

    ReplyDelete
  9. చాలా బాగా రాసారు .

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.