Friday 11 October 2013

తెలంగాణా! ఎందుకు?


"సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." బాధగా అన్నాను.

కాఫీ తాగుతున్న సుబ్బు చిన్నగా నవ్వాడు.

"నేనైతే అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుండి తెలంగాణా ప్రాంతంపై ప్రేమ పుట్టుకురాలేదు. ఆ పార్టీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత ఏర్పడింది." అన్నాడు సుబ్బు.

"అంటే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీలుస్తుందా?" అన్నాను.

"ముందు నువ్వా 'తెలుగు జాతి' అంటూ పరుచూరి బ్రదర్స్ మార్కు డైలాగులు కొట్టడం ఆపు. రాజకీయాలు మాట్లాడేప్పుడు రాజకీయ భాషనే వాడు. సినిమా భాష వాడకు. అవును ఏ పార్టీకైనా రాజకీయ లబ్దే అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. డాక్టర్లు వైద్యం చేస్తారు. వంటవాడు వంటే చేస్తాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇంకోటి చెయ్యవు. దేశంలో రాజకీయ లబ్ది చూసుకొని రాజకీయ పార్టీ ఏదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"అవుననుకో. కానీ నాకెందుకో బాధగా ఉంది." అన్నాను.

"అవును. కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన ఒక రాజకీయ అంశం. రాజకీయ అంశాలని emotional గా చూడరాదు మిత్రమా! ఒకరకంగా కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి నరేంద్ర మోడీ ముఖ్యకారకుడు. కాంగ్రెస్ పార్టీ 2014 లో రాహల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికి రోడ్ మేప్ వేసుకుంది. బిజెపి నరేంద్ర మోడీతో రోడ్ మేప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ రెండు మ్యాపుల్లో ఒక మ్యాప్ మాత్రమే సక్సస్ అవుతుంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో నిధి కోసం వేసుకునే ఎత్తులు, పైయ్యెత్తులు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఈ వాతావరణమే నెలకొని ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి పార్లమెంటు సీటు కీలకంగా మారింది." అన్నాడు సుబ్బు.

"అందువల్ల రాష్ట్రం విడగొట్టాలని దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటావ్?" అడిగాను.

"మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుతున్నావ్. ఇక్కడ దుర్మార్గం, సన్మార్గం ఏముంది? అంతా రాజకీయ  మార్గమే! నువ్వు రాష్ట్ర రాజకీయాల్ని ఢిల్లీ వైపు నుండి చూట్టం నేర్చుకో. విషయం చాలా తేలికగా అర్ధమవుతుంది." అన్నాడు సుబ్బు.

"నేను నిఖార్సైన తెలుగువాణ్ని. సమస్యని నా ప్రాంతం నుండి మాత్రమే చూస్తాను. ఇంకేవైపు నుండి చూడను." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఖాళీ కాఫీకప్పు టేబుల్ పై పెట్టి కుర్చీలోంచి లేచాడు. నా ఎదురుగా నించొని.. నా నుదిటిపై తన కుడిచేతి చూపుడు వేలు ఆనించాడు.

"ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది.. వస్తుంది. హాయిగా నిద్ర పోతున్నావ్. నిద్ర పోయ్యావ్. నిద్ర పో.. య్యా .. వ్." అన్నాడు.

ఆశ్చర్యం! నాకు నిజంగానే నిద్రోచ్చింది. అలాగే కుర్చీలో ఒరిగిపొయ్యాను.

"మిత్రమా! ఇప్పుడు నువ్వు సాధారణ పౌరుడివి కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడవి. నువ్విప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగులో ఉన్నావు. నేను సోనియా గాంధీని. అదిగో చూడు.. ఎదురుగా అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటోని.. కనిపిస్తున్నారా?"

"అవును. స్పష్టంగా కనిపిస్తున్నారు మేడం." అన్నాను.

"మీరు CWC లో ఆంద్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షురాలిగా ఏపీలో మన పార్టీ పరిస్థితిపై మీ నివేదిక అడుగుతున్నాను. ఏం చెబుతారో చెప్పండి." అన్నాడు సుబ్బు.

నేను గొంతు సరి చేసుకుని చెప్పటం మొదలెట్టాను.

"నమస్తే మేడం! ఏపీలో మన పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు మేడం. సీమాంధ్రలో జగన్ పార్టీ దూసుకుపోతుంది. తెలంగాణా కెసిఆర్ కోటగా మారిపోయింది. తెలంగాణలో బిజెపి కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్ట్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోటా మన పార్టీ డిపాజిట్టు కోల్పోయింది. కాబట్టి మన రాష్ట్ర నాయకుల మాటలకి విలువనివ్వడం శుద్ధదండగ." అన్నాను.

"అలాగా? సరే! మీరేం చేస్తారో నాకనవసరం. ఎట్లాగైనా సరే అక్కడ మన పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి. మనకి ఏపీ నుండి మేక్జిమం పార్లమెంటు సీట్లు రావాలి. ఏం చేద్దామంటారు?" అడిగాడు సుబ్బు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"మేడం! మనం అర్జంటుగా తెలంగాణా ఇచ్చేద్దాం. అందువల్ల ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు మన ఖాతాలో పడతయ్. ఈ దెబ్బకి తెలంగాణలో బిజెపి అవుట్. కెసిఆర్ ఎలాగూ మనతో కలిసిపోతాడు. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాని స్వీప్ చేసేస్తాం." ఉత్సాహంగా అన్నాను.

"వెరీ గుడ్. మరప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఏం చేద్దాం?" అడిగాడు సుబ్బు.

"అక్కడ రాజకీయం చెయ్యడానికి మనకి వెసులుబాటు ఉంది మేడం. జగన్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రంగం సిద్ధం చేశాను. ద డీల్ ఈజ్ జగన్ బాబు CM, మన రాహుల్ బాబు PM."

"ఇప్పుడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నడుస్తుంది. మరి తెలంగాణా ఆపేద్దామా?" అడిగాడు సుబ్బు aka సోనియా గాంధీ.

"అదెలా కుదురుతుంది. ఇప్పుడు రాష్ట్ర విభజనని పెండింగ్ లో పెడితే అన్నింటికి చెడతాం మేడం. దీన్నే మా తెలుగు భాషలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారు. మనకి ముందుకు పోవడం మించి వేరే దారి లేదు మేడం." అన్నాను.

"అంతేనంటారా?"

"అంతే మేడం. మీరు తెలంగాణా ఇస్తానని ఒకసారి ఎలక్షన్ మీటింగులో చెప్పారు. ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే మాట నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.. రాజకీయంగా లాభమూ చేకూరుతుంది. తెలంగాణా ఇవ్వకుండా రాష్ట్రం మొత్తం నష్టపొయ్యేకన్నా.. ఇచ్చి ఒక భాగాన్ని మన ఖాతాలో వేసుకోవడం ఉత్తమం."

"మరి రాష్ట్రవిభజన విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారేమిటి?" అడిగాడు సుబ్బు.

"చూడండి మేడం! ఎదురుగా మసాలా దోశ విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరి చట్నీలతో రెడీగా ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిందాం. హడావుడిగా తినవలసిన అవసరం మనకేంటి?" అన్నాను.

"అర్ధం కాలేదు." అన్నాడు సుబ్బు.

"కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో మనమే ఉన్నాం గదా మేడం. ఎన్నికల సమయానికి క్లైమేక్స్ వచ్చేట్లుగా మనం రాజకీయాలు నడిపిద్దాం. మా  తెలుగు సినిమాల్లో పదోరీల్లోనే పోలీసులు వస్తే హీరో ఫైటింగు చెయ్యని అసమర్ధ వెధవగా మిగిలిపోతాడు. కాబట్టి దర్శకుడు పద్నాలుగో రీలు దాకా పోలీసుల్ని ఆపుతాడు. అంచేత తెలంగాణా ఇవ్వాల్సిన టైమింగ్ మన ఇష్టప్రకారం మాత్రమే ఉంటుంది. చివరిదాకా ఎవరికీ ఇంకే అవకాశం లేకుండా చెయ్యడమే మన మాస్టర్ ప్లాన్." అన్నాను.

కుర్చీలోంచి లేచాడు సుబ్బు. తన కుడిచేతి చూపుడు వేలుతో నా నుదురు తాకాడు.

"ఇప్పుడు నువ్వు నిద్ర లోంచి లేస్తున్నావు. నిదానంగా కళ్ళు తెరుస్తున్నావు. ఇప్పుడు నేను సోనియా గాంధీని కాను. నువ్వు CWC సభ్యుడవి కాదు.. సభ్యుడవి కాదు. నువ్వొక సాధారణ పౌరుడివి." అన్నాడు సుబ్బు.

నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు నిదానంగా కళ్ళు తెరిచాను. వెలుగు భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఎదురుగా నవ్వుతూ సుబ్బు.

ఇందాక ఏదో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఆఁ.. గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన గూర్చి సుబ్బుతో చర్చిస్తున్నాను.

" సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." అన్నాను.

"అవునా? అయితే ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒక్కటే! రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం చెయ్యడం. బెస్టాఫ్ లక్." అంటూ నవ్వుతూ గదిలోంచి నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

38 comments:

  1. మీ వ్యాసం‌ బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది.
    మీ రన్నట్లు వైద్యులు వైద్యమే చేస్తారు. రాజకీయనాయకులు రాజకీయాలే చేస్తారు.
    మరి ప్రజలేం చేస్తారూ?
    ప్రజలంతా కేవలం బెల్లం కొట్టిన రాళ్ళల్లా కూర్చుంటారని ఎందుకు అనుకుంటారూ?
    ప్రజలూ, ప్రజలు చెయ్యవలసిన పనినే చేస్తారు. తమ అభిప్రాయాన్ని సందర్భానుసారంగా వెలిబుచ్చుతారు.
    ఇప్పుడు ప్రజలు చేస్తున్నది అదే!
    కాబట్టి మీరు కూడా ఛోటా రాజకీయనాయకుడిలా ప్రజల మీద సెటైర్లు వేయటం సరికాదు!
    ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. "మరి ప్రజలేం చేస్తారూ?
      ప్రజలంతా కేవలం బెల్లం కొట్టిన రాళ్ళల్లా కూర్చుంటారని ఎందుకు అనుకుంటారూ?
      ప్రజలూ, ప్రజలు చెయ్యవలసిన పనినే చేస్తారు. తమ అభిప్రాయాన్ని సందర్భానుసారంగా వెలిబుచ్చుతారు.
      ఇప్పుడు ప్రజలు చేస్తున్నది అదే!"
      నిజమా..! మీరు పైన చెప్పింది ప్రజలు ఎలాగ ఉండాలి అని... మీరు పైన చెప్పినట్టు ప్రజలు ఉంటె బాగనే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజలు చెస్తున్నదేంటి ? ప్రజలంటె ఒక single entity గా తీస్కొంటే ఎక్కడొ ఒక చొట చిన్న చిన్న spikes తప్ప, నిజంగా ఒక సామన్య పౌరుడు చెస్తున్నదేమి లెదు. TV9 లొ వార్తలు చూడటం తప్ప. జరిగేదంతా నాయకులు వెనకనుండి నడిపిస్తున్నదే (తమ తమ వ్యక్తిగత స్వార్ధముల కోసం). డబ్బులు తీసుకొని వోటు వేసే ప్రజలు ఏమి చెయ్యరండి. మన ఎప్పుడో 80% చచ్చిపోయాము.

      Delete
    2. "నిజంగా ఒక సామన్య పౌరుడు చెస్తున్నదేమి లెదు"

      http://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html

      Delete
  2. మీ సుబ్బు చెప్పింది పాత చింతకాయపచ్చడి కబురు, ఆంధ్రాలో గొడ్లుకాసుకునే బుడ్డోడు కూడా చెబుతున్నాడు ఈ మాట చాలా కాలం నుంచే!! :)))

    ReplyDelete
    Replies
    1. kastephale గారు,

      అవును. నేనూ అదే అనుకుంటున్నాను. అందుకనే.. ఇది రాసి నెల్రోజులయినా.. పోస్ట్ చెయ్యలేదు. ఇంకెంతకాలం డ్రాఫ్ట్ రూపంలో బంధిస్తాంలే అనుకుని.. ఇవ్వాళ బెయిల్ ఇచ్చాను.. అదే పోస్టాను. :)

      Delete
    2. >>ఆంధ్రాలో గొడ్లుకాసుకునే బుడ్డోడు కూడా చెబుతున్నాడు ఈ మాట చాలా కాలం నుంచే!! :)))

      అనే నేనూ అనుకున్నాను నిన్నటిదాకా.

      నిన్న నా ఫ్రెండ్స్ (అందరూ డాక్టర్లే) జగన్ వల్ల రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని వాదించారు. అందువల్ల కూడా ఈ పోస్ట్ పబ్లిష్ చేశాను.

      Delete
  3. తెలంగాణాను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంది!తెలంగాణాను ఇప్పటికే ఎప్పుడో ఏర్పాటు చేయవలసింది!కాని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ కు తెలంగాణాలో పూర్తిగా ప్రయోజనం కలుగుతుందని భావించింది!సమ్మె దాదాపు విరమించినట్లే!సీమాంధ్ర లో తుఫాను హెచ్చరికలు రావడంతో సమ్మెను,ఆందోళనను కట్టిపెట్టి తుఫాన్ ను ఎదుర్కొనడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు!తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఒక తుఫాన్ లా వేగంగా సాగుతోంది!తొందరలోనే కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలలో తెలంగాణా లో రాజకీయ లబ్ది పొందడం తథ్యం!

    ReplyDelete
  4. ప్రభుత్వాల్ని, ప్రజా ప్రతినిధుల్ని ఎప్పటికప్పుడు రీకాల్ చేసే సౌకర్యం ప్రజలకు ఉండాలి. మన వ్యవస్థల్లో ఇలాంటి సౌకర్యం లేకపోవడం వల్లే ఒకసారి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన తర్వాత ఐదేళ్లపాటు వారేం చేసినా ప్రజలు నోర్మూసుకుని కూర్చోవాల్సి వస్తోంది. వెధవ రాజకీయాలు, రాజకీయ నాయకులు.

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతానికి మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు.

      (ఉదాహరణకి రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఈ పార్టీల్లోనే ఒకరికి ఓటేసి గెలిపించాలి. అంచేత ఆ ఓటు కోసమే పోటీ దీక్షలు నడుస్తున్నయ్.)

      Delete
  5. బాగుంది . గొడ్లు కాచే వారికే కాదు దీక్ష చేసిన జగన్ కు కూడా ఈ విషయం తెలుసు. తెలిసీ 175 నియోజక వర్గాల్లోనే ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ( పాపం ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన అభిమానులకే తెలియదు చిన్న సవరణ .. జిల్లాలు 23 .. తెలంగాణా ఎర్పడిన తరువాత 24 జిల్లాలతో తెలంగాణా అంటున్నారు

    ReplyDelete
    Replies
    1. అవునా! సరిచేస్తున్నాను.

      (అయినా hypnotize అయినవాడికి జిల్లాల సంఖ్యేం గుర్తుంటుందండి?!)

      Delete
  6. తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసమే ఐతే... సమైక్యాంధ్ర ఎందుకు.....? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం సమైక్యంగా ఉంచాలి.
    తెలంగాణలో సమైక్య ఉద్యమం మొదలు పెట్టడం సంగతి సరే. మరి సీమాంధ్రలోనే జై ఆంధ్ర ఉద్యమం కూడా నడుస్తోంది దాని గురించి రాయండి.
    మన రాష్ట్రంలో ఇరవై నాలుగు కాదు. ఇరవై మూడే జిల్లాలు ఉన్నాయి. ఇరవై నాలుగో జిల్లా ఏదో చెప్పగలరా...? మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసుకోకుండానే ఈ పోస్టు రాశారా... లేక మీరు మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసుకోవడంతో పాటూ ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందని అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. చందు తులసి గారు,

      జిల్లాల సంఖ్య సరిచేశాను. థాంక్యూ.

      కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణా ఇవ్వాలని నిర్ణయించుకుందనేది నా అవగాహన.

      (నాకు మీ కామెంట్ సరీగ్గా అర్ధం కావట్లేదు.)

      Delete
  7. Instead of samykya they need to concentrate on transfering registered offices of Loyal Andhrites. These Loyal andhrites are the first in the list of Samykya list but why they are not transferring their offices to pay the vat in Andhra/Rayalaseema? Vat is 1 issue , 2nd issue is govt employees/employeement- employees need to be trfrd to andhra will be around 15-20k i think. not more than that. 3. water, only fron jurala-srisailam there is a way to stop krishna, its not possible. and for godavari its impossible to stop water. 4. regarding persioners, since more people have retired in hyd they have to pay more pensioners. 5. education/jobs - already 371d limits local/non local. now 371D will not be implemented for telangana, andhrites can apply jobs in new telangana too, reverse is prevented by 371D. 6. After T formation all Andhrites will be minority in 26 hyd assemblies and mahboobnager,khammam,nalgonda areas.. they still can have their say...
    7. Most important, for speculative realestate buyers, there will be ups/downs if you speculate...8. after partition andhra will have new capital, new funds/new realestate game..., new allocations and GDP improvement. New industrial estate/software parks near our houses. Losses will be for initial years funds/money issues as vat will be less(somehow need to get the companies trfrd to Andhra to fill this) 9. Bhadrachalam is formed with a GO. i dont know why Kiran is not issuing a GO to reverse it.

    ReplyDelete
  8. బ్రిటీషోడి Divide and Rule అనే కుళ్లు రాజకీయమే కాంగ్రెస్ పార్టీది కూడా. ఎంతైనా బ్రిటీషోడి పడగనీడలో పురుడు పోసుకుని ఎదిగిన పార్టీ కదా! అలాంటి దిక్కుమాలిన పార్టీ నుండి ‘మంచి’ ఆశించడం అత్యాశే అవుతుందేమో! ఆ మాటకొస్తే, రాజకీయ లబ్ది కోసం ప్రజల్నినిట్టనిలువునా నట్టేట ముంచడానికైనా, పాతేయడానికైనా.. అధికారంలో ఉండే ఏ పార్టీ కూడా ఎంతమాత్రం వెనకాడదేమో! ప్రాంతం పేరిట, భాష పేరిట, మతం పేరిట, కులం పేరిట, ఇంకా సవాలక్ష సాకులు చూపి ప్రజల్ని విడదీసి, వీలైతే ఒకరికి మరొకర్ని శత్రువులుగా చూపించి పబ్బం గడుపుకునే పార్టీలే ఇవన్నీనూ. ఎందుకంటే ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం, సాగునీరు, విద్యుత్ తదితర మినిమమ్ మౌలిక సదుపాయాలను స్వాతంత్ర్యం వచ్చిన ఈ 66 ఏళ్లలో ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలోనూ కల్పించలేకపోయాయి. ఇకమీదటైనా, అవినీతిలో నిండా మునిగిపోయిన ఈ పార్టీలన్నీ ప్రజల బాగోగుల్ని పట్టించుకుంటాయన్న ఆశ కూడా ఏమాత్రం లేదు. అందుకే అధికారంలో ఉన్న, అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీ అయినా... ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే ప్రయత్నిస్తాయి. ఎలాగూ ప్రజల్లో వ్యవస్థ పట్ల అసంతృప్తి, జీవితంలో అభద్రతాభావం గూడుకట్టుకుని ఉన్నాయి కాబట్టి, స్వార్థపూరిత రాజకీయ పార్టీలు ఇట్టే దానిని క్యాష్ చేసుకొని జనం మధ్య సులభంగా గొడవలు, విభేదాలు, వైషమ్యాల్ని సృష్టించగలుగుతున్నాయి. నిజానికి సుభిక్షంగా ఉంటే ఏ జాతి మాత్రం విడిపోవాలని ఎందుకు కోరుకుంటుంది?! రాజకీయాల్లో కుళ్లును కడిగేసేలా, తప్పు చేసిన ఏ నాయకుణ్నైనా కాలర్ పట్టుకుని నిలదీసే స్థాయికి ప్రజల్లో చైతన్యం అభివృద్ధి అయ్యే వరకు ఈ తిప్పలు తప్పవేమో! ఈ సినిమా డైలాగులు ఆపేయ్ అంటాడేమో, మీ సుబ్బూ! కానీ, ఉద్యమించడం తప్ప ప్రజలకు వేరే మార్గం లేదు మరి. గెలుపోటములంటారా... పోరాటమన్నాక రెండూ ఉంటాయి మరి. తీరాన్ని చేరుకోలేకపోయానని సంద్రంలోని కెరటం అలాగే వెనక్కి వెళ్లిపోదు కదా, మళ్లీ ఎగసిపడక తప్పదు కదా. ఈ విభజన ప్రకటన నేపథ్యంలో ప్రజలు ఈ మాత్రం ఆర్గనైజై ఉద్యమించినందుకే కాంగ్రెస్, టీడీపీ, తెరాస, వైసీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల అసలు రంగు బయట పడింది. ఆ మేరకు ప్రజలూ ఎడ్యుకేట్ అయ్యారు, నాయకులూ భయపడ్డారు. Whether division process progress or recedes, but movements are dire necessity for people of all regions to get educated, organized to find their real enemy and to fight out the filthy politics, I believe. Thank you!

    ReplyDelete
  9. Inspite of all this people will again vote for the same party or to the new party floated by the people coming out of the party, who finally join congress, after elections, that is the strategy of the congress :)

    ReplyDelete
  10. ఆడిని ఈడిని తిట్టేద్దాం. బ్రిటీష్ వాడిని తిట్టేద్దాం.
    కాంగ్రేస్ ని తిట్టేద్దాం, నాయకులని తిట్టేద్దాం,
    అధికారులని తిట్టేద్దాం, వ్యాపారులని తిట్టేద్దాం,
    మన రాత రాసిన దేవుడినైనా తిట్టేద్దాం
    TV వాళ్ళని, పత్రికల వాళ్ళని అందరిని చుట్టగా తిట్టేద్దాం,
    అప్పుడప్పుడు పనిలేక టపాలు రాసే పిచ్చి డాట్రారుని కూడ వదలక తిట్టేద్దాం,
    వాళ్ళంతా మన సామాన్య జనానికి 'నీడ ' అనే మాటను మరుద్దాం,
    మనిషిని వదిలి నీడతొ యుద్దం చేసేద్దాం,
    మన గుండెల్లోని శత్రువుని బద్రం చేసేద్దాం,
    మనిషిని వదిలి నీడతొ యుద్దం చేసేద్దాం,

    ReplyDelete
    Replies
    1. మీ 'నీడ' కవిత బాగుంది.

      Delete
    2. ఏదో అలా తన్నుకు వచ్చింది. వెంటనే ప్రచురించాను.
      నచ్చినందుకు సంతొషం.

      Delete
  11. మాలికలో మీ టపా శీర్షిక చూసి ఆశ్చర్యపోయాను. 'ఎందుకు వద్దు' అని కదా ఉండాలీ... అని కంగారు పడ్డాను. డాక్టరుగారు ఏదో మతలబు పెట్టే ఉంటారులే అనుకుంటూ తెరిచాను. చదివాక నా అంచనా సరైనదే అని అర్ధమైంది. టైటిల్‌తో ఒకరకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. :)

    ప్రజలు గొర్రెలు కాబట్టి... (మహా అయితే, తెలివైన గొర్రెలేమో) పులుల బారి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు... ఏ అడవిలో అయినా.

    ReplyDelete
    Replies
    1. ee samajam lo, ye gorre ayina avakasam vasthey puli ga maruthundi...

      Delete
  12. సమైక్యాంధ్ర వల్ల తెలంగాణాకు ఏమి లాభం?తెలంగాణా నీళ్ళు,నిధులు,ఉద్యోగాలు day one నుంచి open గా కొల్లగొట్టారు!కలిసి ఉండడం వల్ల తెలంగాణా ప్రాంతానికి జరిగిన నష్టం అపారం!Gentleman Agreement ను పూచికపుల్లలా ఎంచి మొదటినుంచీ ఉల్లంఘిస్తూనేపోయారు!ముఖ్యమంత్రులు నీలం సంజీవ రెడ్డిగారి నుంచి నల్లారి కిరణ్ కుమార్ గారిదాకా సీమాంధ్ర ముఖ్యమంత్రులందరూ దాదాపు తెలంగాణాకు తమకు చేతికందినంత మేర నిర్దాక్షిణ్యంగా అన్యాయాల మీద అన్యాయాలు ఎడాపెడా చేసేస్తూ తమ పబ్బం గడుపుకున్నారు!తెలంగాణా ముఖ్య మంత్రులకు పొమ్మనలేక పొగపెట్టారు,అయిదేళ్ళు ఎవ్వరినీ ఉండనీయలేదు!సీమాంధ్ర ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడుగారు కొంత better!హై టెక్ సిటీని హైదరాబాద్ లో నిర్మించి మంచి పరిపాలకుడుగా తెలంగాణవారి మన్ననలను అందుకున్నారు!అయితే వ్యవసాయ రంగాన్ని అలక్ష్యమ్ చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు!సమ న్యాయం చేయలేదు! మెజారిటీ ఎమ్మెల్యేలు సీమాంధ్ర కు చెంది ఉండటం వల్ల వాళ్ళు ఆడింది ఆట,పాడింది పాట అయ్యింది!సొమ్ము తెలంగాణాది,సోకు సీమాంధ్రది అయింది!తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవం గాయపడింది!ఇప్పటితరానికి అప్పుడు తెలంగాణాకు జరిగిన అన్యాయాలు తెలియకపోవచ్చును!తెలంగాణా ప్రజలు స్వాభిమానం కోసం,ఆత్మగౌరవం కోసం అవిశ్రాంత పోరాటం జరుపుతున్నారు!వెయ్యిమందికి పైగా యువత తెలంగాణాకోసం ఆత్మబలిదానాలు చేసుకొని అమరులయ్యారు!అయినా వివక్ష కొనసాగుతూనే ఉంది!తెలంగాణా ప్రజలు స్వపరిపాలనకోసం తపిస్తున్నారు,పరితపిస్తున్నారు!ఎప్పుడెప్పుడా తెలంగాణా అని ఆబగా ఎదురుచూస్తున్నారు!తెలంగాణా రాష్ట్రం కోసం ముఖం వాచిపోయారు!అనుక్షణ౦ తెలంగాణాకోసం కలవరిస్తున్నారు!పలవరిస్తున్నారు!తపన చెందుతున్నారు!తెలంగాణా ప్రజల కల తెలంగాణా రాష్ట్రం!ఇది రాజకీయనాయకులు పదవులకోసం చేస్తున్న ఆరాటం కాదు!ఇది తెలంగాణా ప్రజల చిరకాల పోరాటం!ఇంకా ఓపికపట్టలేరు,తెలంగాణా ప్రజల సహనానికి కూడా హద్డులుంటాయి!ఇంకా తెలంగాణా ప్రజల సహనాన్ని పరీక్షించకండి!ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణాను అవతరించనివ్వండి!అడ్డురాకండి!హైదరాబాద్ తప్ప మీకు ఏం కావాలో చెప్పండి!న్యాయబద్ధం అయితే మీ కోరికలు తీరుస్తారు!సందు దొరికింది కదా అని గొంతేమ్మకోరికలు కొరకండి!ఇంతకు పూర్వం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్రం ఎంత ఇచ్చిందో మీ కొత్త రాజధాని ఏర్పాటుకు కొంత ఎక్కువే ఇస్తారు!చిన్న రాష్ట్రాలలోనే పాలనా సౌలభ్యం ఉంటుంది!ప్రజలదగ్గరికి పాలన వస్తుంది!

    ReplyDelete
    Replies
    1. surya prakash apkari గారు,

      మీరు ఏమీ అనుకోకపోతే..ఒక ఉచిత సలహా.

      మీరు punctuation mark తరవాత space ఇస్తే ఇంకా బాగుంటుంది.

      Delete
  13. నిర్ణయం తీసుకున్న వాళ్ళ బూట్ల లో (లేదా చెప్పులలో) కాళ్ళు పెట్టి ఆలోచించే ప్రయత్నం బాగుంది.
    ప్రత్యేక రాష్ట్రంతో తెలంగాణా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది చర్చనీయ అంశం అయినా, తెలంగాణా ఉద్యమం చివరి దశలలో ప్రజలందరూ తేడా లను పక్కన ఉద్యమించిన స్పూర్తి, రాష్ట్రం యేర్పడ్డాక కుడా కొనసాగితే మాత్రం తప్పకుండా మంచి జరుగుతుంది.

    రాష్ట్రం లోని రెండు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, తెలుగు దేశం లు తెలంగాణా ఏర్పాటు కు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణా అంశం రాష్ట్ర విభజన దాక వచ్చేది కాదు.

    క్లాసు పుస్తకాల లో చదివానో లేక చందమామ, బాలమిత్ర లో చదివానో గానీ, చిన్నప్పుడు చదివిన రెండు పొట్టేళ్ల కథ గుర్తు వస్తోంది. రెండు బలిసిన (అహం తో కుడా) పొట్టేళ్ళు ఒక ఇరుకైన వంతెన ఇరుపైపులా ఉంటూ ఎదురు పడతాయి. రెండూ ఒకేసారి దాటడానికి వీలు లేదు. ఏ పొట్టేలు కు రెండవ దానికి దారి ఇవ్వడం అవమానం, ఓటమి సమానం.వంతెన మద్యలో రెండు హోరాహోరి గా పొట్లాడుతాయి. చివరికి వంతెన కూలిపోయి నదిలో పడి పొతాయి.
    ఇద్దరు బలమైన ప్రత్యర్థులు(పోట్టేల్లకు, వీళ్ళకు తేడా ఏమిటి అంటే ఇద్దరు ఒకేసారి బలవంతులుగా లేరు) ఒకరినొకరు ఓడించుకోవడం కోసం తెలంగాణా అంశం ను ఉపయోగించు కోవడానికి చేసిన ప్రయత్నాన్ని, పట్టించుకోకుడా వదిలేసి ఇప్పుడు తీరికగా విచారిస్తున్నారు. ( పట్టించుకోని వాళ్ళలో నేను కుడా ఉన్నాను, విచారం గురించి మాత్రం చెప్పలేను)

    ReplyDelete
  14. నెలక్రితం రాష్ట్రవిభజనపై బుద్ధా మురళి గారి పోస్ట్ చదివాను. అది నాకు బాగా నచ్చింది. చదివిన వెంటనే ఈ పోస్ట్ రాశాను. రాసిన తరవాత చూసుకుంటే మరీ LKG పిల్లాడి అవగాహనతో రాసినట్లనిపించి.. పోస్టకుండా వదిలేశాను.

    అయితే నా చుట్టూ ఉన్నవారు (నిన్నటిదాకా లగడపాటి విభజన ఆపేస్తాడు అని ఘాట్టిగా నమ్మినవారు), ఇప్పుడు అశోక్ బాబు + CM ఉన్నంతకాలం రాష్ట్రం divide అవ్వ్దదని తీవ్రంగా నమ్ముతున్నారు. ఇది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. (wishful thinking వేరు, రాజకీయాల్ని అర్ధం చేసుకోవడం వేరు).

    ఈమధ్య.. నా LKG అవగాహన పోస్ట్, నాచుట్టూ ఉన్నవారికి PG స్థాయి అని గుర్తించినందున.. దాదాపు నెల తరవాత పోస్ట్ చేశాను.

    కామెంట్లు రాసిన మిత్రులకి పేరుపేరునా ధన్యవాదాలు.


    ReplyDelete

  15. ప్రజాస్వామ్యంలో ప్రజలంతా బలంగా కోరుకుని ఉద్యమైస్తే రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వానికీ దాన్ని సమర్ధించాల్సిన రాజకీయ అనివార్యత ఏర్పడుతుంది(ప్రొఫెసర్ జయశంకర్ చెప్పింది ఇదే). యూపీయే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి తెలంగాణను ప్రకటించినా, కాంగ్రేస్, టీడీపీలు తమ రాజకీయ అవసరాలకోసం తెలంగాణను మానిఫెస్టోలో పెట్టినా అందుకు రూట్ కాజ్ ప్రజలలో ఉన్న బలీయమైన ఆకాంక్ష మాత్రమే. ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వాల రాజకీయ అవసరాలు ఒకే దిశలో ఉన్నంతవరకూ ప్రభుత్వ నిర్ణయాలు అవి తమ రాజకీయ అవసరాలకోసమయినా తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

    తెలంగాణలో స్వరాష్ట్రం కోసం ఉన్నంత బలంగా సెంటిమెంటు సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం లేదు. పైగా ప్రజలకు కూడా బలవంతంగా సమైక్యతను సాధించలేమని తెలుసు. అందుకే కాంగ్రేస్, తెదేపాలు వోట్లకోసం తమ మానిఫెస్టోల్లో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పటికీ పట్టించుకోకుండా అక్కడి ప్రజలు ఆపార్టీలను ఆదరించారు. ఇప్పటికీ అక్కడ ఒక సమైక్యాంధ్ర పార్టీని పెట్టి గెలిపించగలమనే ధీమా ఏనాయకునికీ లేదు.

    ReplyDelete
  16. 2008లొ తెదేపా తెలంగాణా కావాలంటూ తీర్మానం చేసి ఆ తరువాత కేంద్రానికి లేఖ రాసింది. ఏడాది తరువాత చిరంజీవి ఒక అడుగు ముందుకెళ్ళి సామాజిక తెలంగాణా తెస్తానని రంకెలు వేసారు. నిన్నటికి నిన్న వైకాపా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించింది. సుబ్బు గారు అప్పుడు ఎవరినీ హిప్నోసిస్ చేయలేదు ఎందుకండీ?

    ReplyDelete
    Replies
    1. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వదనే నమ్మకంతో అందరూ తెగ రెచ్చిపొయ్యారు. ఇప్పుడు ఏడుస్తున్నారు. అవకాశవాద రాజకీయాలకి ఇంతకన్నా గొప్ప ముగింపు ఉండదు. (ఈ విషయంపై ఒక పోస్ట్ రాసినట్లు గుర్తు.)

      ఇంక సుబ్బు సంగతి. కాంగ్రెస్ తన రాజకీయలబ్ది (ఇదేం బూతుమాట కాదు) కోసం తెలంగాణా ఇచ్చినా.. ఇదొక మంచి నిర్ణయమని సుబ్బు సంతోషంగా ఉన్నాడు.

      Delete
  17. రమణగారికి నమస్సులు!మీ ఉచిత సలహా నాకు సముచిత సలహా!ఇలాంటి సలహాలనే నేను ఆహ్వానిస్తాను!తెలుగు టైపింగ్ లో నేనింకా చిరుకూననే!బాగా నేర్చుకుంటాను ఇండియా కు వచ్చాక!మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

    ReplyDelete
  18. 24 గంటల్లో 28 పోస్టులు వచ్చాయి. అంటే మీరు జాతీయ నాయకుడైన చాకో లేదా బాకో గాని స్థాయికి ఎదిగారన్న మాట. ఈ పోస్టుకు 24 గంటల్లో 50 పోస్టులు వచ్చుంటే ఆం.ప్ర. అసెంబ్లీ స్థాయి, 75 పోస్టులు వచ్చుంటే షిండే స్థాయి, 100 పోస్టులు వచ్చుంటే డిగ్గీ స్థాయి,125కి యువరాజు స్థాయి, 150 పైబడి వచ్చుంటే హర్ ఎగ్జాల్టెడ్ హైనేస్, క్వీన్ ఎంపరెస్ సోనియా స్థాయి దక్కుండేది. ఈ 25 కన్నా తక్కువ వస్తే క్రమంగా కిరణ్, కావూరి, లగడపాటి స్థాయి, అసలేవీ రాకపోతే మెగాస్టార్ స్థాయి వచ్చేవి. మీరు ఆంధ్ర స్థాయి దాటినందుకు అభినందనలు. ఏదైమైనా సుబ్బు సత్యపీఠం చేతిలో ఉన్న నాగభూషణం అని నిరూపించుకున్నాడు. ఆయనక్కూడా అభినందనలే. (మాల మీరు తెచ్చుకుంటే వేసికూడా పెడతా. శాలువా మీ ఇష్టం. బైదివే జాతీయ నాయకుడంటే శాలువాని తువ్వాల లాగా వేసుకోవాలి)

    ReplyDelete
  19. the Telugu comment I posted seems failed to reach you.

    By getting 25+ comments in 24 hours you have proved to be leader. Now you have achieved the stature of Chako, If the number reached 50 in a day you be elevated to Shinde's position, 75+ Diggy's, 100+ Chiddu's, 125+ Prince of India's and if crossed 150+ in a day, you might have achieved the stature of Her Exalted Highness, Queen Empress Sonia's level. By crossing 25+ comments, you have passed the stature of Kiran, Kavuri, Lagadapati, Botcha and Megastar. Now that you are of a national leader's position, I am ready to felicitate you (bring your own garland), Shawl an optional. (By the way a National leader must have a shawl on the shoulder like a villager having a towel)

    Hope will b

    ReplyDelete
  20. దీనిబట్టి అర్ధమయ్యిందేంటంటే బుద్దున్న, ఆత్మాభిమానమున్న తెలుగోడెవ్వడూ కాంగ్రెస్ కి గానీ తెలుగుదేశంకి గానీ ఓటు వెయ్యకూడదు. అయితే దొంగోడే దిక్కా? ఖర్మ ఖర్మ!

    ReplyDelete
    Replies
    1. తాగుబోతు ఉన్నాడు కాబట్టి తెలంగాణా వారికి దొంగకు వోటు వేయాల్సిన ఖర్మ తప్పింది :)

      Disclaimer: just for fun, advance apologies to TRS/KCR/YCP/Jagan fans.

      Delete

  21. తెలంగణా ఉద్యమం..!!!

    స్వపరిపాలన కొసం ఇతే...

    నేటి తెలంగాణ జిల్లాల లోని ఎమ్మెల్యే మరియు ఎంపి లు అందరు అక్కడి వారే కదా, వేరే ప్రాంతం వారు కరు కదా..!!ఒక వేల సీయం కాదు అనుకుందాం రమారమి 30+ సంవత్సరాల సీమ ప్రాంత సీయం యేలుబడి లొ సీమ బాగుకుంది యేమి లేధు..అంటే కేవలం సీయం పీటం వచ్చినంత మాత్రన ప్రజల తలరాతలు మారతాయని చెప్పలేము... నేటి ఎమ్మెల్యే మరియు ఎంపి లు లొ ఒకరు సీయం అవుతారు అప్పుడు వారు కేంద్రం లొ తెలంగాణ పీయం లేరు అందుకే మనకు అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు తెలంగాణ దేశం కొసం పొరడాలి..

    సుపరిపాలన కొసం ఇతే...

    స్వతహాగా ప్రజలకి మంచి చేయలి అనే అలొచన లేనంతవరకు వారు కార్పొరేటర్ లేక ఎమ్మెల్యే అయీన ఎంపి అయీన లేక సీయం పీయం అయీన యేమి లాభం...!!ప్రజలకు ఉద్యొగాల బర్తీలొ తప్పు జరిగినప్పుడు(వారి వారి వాటాలు అందే ఉంటాయీ..) జల మరియు ఇతర వనరుల విషయమలొ తప్పు జరిగినప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం లొ 1% చేసినా యీ పరిస్తితి వచ్చెది కాదు..!!కేవలం వారి స్వలాభాలకు నష్టం కలిగినపుడే ఉద్యమం గుర్తుకు వస్తుంది..!!

    రాలెగాన్ సిద్ధి ని పునర్నిర్మానిచ్చిన అన్న హజారె కాని యెంతొ మంది ప్రజలకు సేవ చేసిన థెరెస్సా యే సీయం కాని మెగాస్టార్ కాని కాదు..!!నాయకుల అలొచన లొ మార్పు రానంతవరకు మరియు ప్రజల లొ ప్రశ్నించే తత్వం రానంత వరకు యెన్ని గీతలు గీసిన యెంత మంది క్రిష్ణులు ని మార్చిన..ఉపయొగం ఉండధు..!!

    తెలంగాణ ప్రజలని వంచించారు కాబట్టి...

    యెవరు..రాజకీయ నాయకుల లేక సమస్త సీమ ఆంధ్ర ప్రజలా..!! ఒక వేల సమస్త సీమ ఆంధ్ర ప్రజలు అయెతే తెలుగు వాళ్ళు ఒకరిని ఒకళ్ళు కొట్టుకొని తగల బెట్టుకొని ఉండేవాళ్ళు

    వంచించింది రాజకీయ నాయకులు కాబట్టి మరియు వారు వంచించింది అందరిని కాబట్టి వారిని తీసుకు వెళ్ళి సముద్రం లొ వేయాలి కాని..!! గుప్పెడు మంది రాజకీయ నాయకుల కొసం యీ విభజన అవసరమా..!!

    ఇన్ని కమీషన్లు మరియు అధునిక సధుపాయలతొ రాజకీయ నాయకులు కొట్టుకొవడానికి పాలరతి మేడల రాజధానుల నిర్మాణంకొసం లక్షల కొట్ల ప్రజా ధనం వ్రుధా చేసె బదులు ఒక నల్గొండ ఒక శ్రీకాకుళం ఒక అనంతపురం ప్రాంతాలని బాగు చెయవచ్చు కదా..!!

    కాంగ్రెస్స్ ఆధికారం కొసం...


    5 సంవత్సరాల తరువాత.. రాయల సీమ రాష్ట్రం+ ఆంధ్ర రాష్ట్రం+దక్షిన తెలంగాణ రాష్ట్రం+ఉత్తర తెలంగాణ రాష్ట్రం...




















    ReplyDelete
  22. నేను ఇంత కాలం, ఎదొ చదువు కోని వాళ్ళని మాత్రమే రాజకీయ నాయకులు ఇలాంటి వేర్పాటు వాదాలతో మొసగించగలరు అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని పొస్ట్ లు చూసిన తరువాత అది తప్పు అని అనుకుంటున్నాను.

    ReplyDelete
  23. హల్లొ రమణగారు,
    ఇప్పుడే ఒక వేడి కాఫీ తాగుతుంటే తట్టింది. మీ సుబ్బు మాటిమాటికి మీ ఇంటికొచ్చి 'మామా కాఫీ" అంటూ అంత తేలికగా ఎంతో కష్టమైన విషయాలకు పరిష్కారములు ఎలా చెప్తాడో అని.
    మిధునం సినిమాలొ ఒక కాఫీ దండకం విన్నాను. మీరు కొత్త సినెమాలు చూడరు(అని నా ఉద్దేశ్యం)కాబట్టి వినిఉండరు అనుకుంటు ఇక్కడ పోష్టు చెస్తున్నాను.

    అనుదిన్నమ్మును కాఫీ ఎ అసలు కిక్కు
    కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
    కప్పు కాఫీ లబించుటే గొప్ప లక్కు
    అమృతమన్నది హంబక్కు అయ్యలారా... జై కాఫీ
    విష్వంతరమ్ములొ ఉన్న బ్రహ్మాండ గోలాలలొ నీకు సాటైన పానీయమే లెదు ముమ్మాటికీ....
    అందుకె నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ
    నాలుకతో నీకు జే జేలు పలికేము నానాటికీ....
    ఎర్లి మార్నింగులొ లేవగానె పాచి పన్లైనయున్ తొమగ బెడ్ కాఫీ
    కోసము పెన్లాముపై రంకెలేయించకే బెస్టు టెస్టిశ్వరీ..
    బ్రష్ కాఫీష్వరి లెఫ్సు కెఫీష్వరి జిహ్వకున్ షుద్ది చేకూర్చవే బ్రూకుబండేష్వరీ....
    లోక ప్రాణేష్వరీ ప్రాణ దానెష్వరీ గంట గంటా ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్న పానెష్వరీ...
    స్టీలు ఫిల్టర్ల పల్లెంబులోనున్న రంద్రాలలోనుండి నీ సారమంత సుతారంగ
    జారంగ నొరూరుచూడంగ నాసామి రంగా నిజంగానె చచ్చే విదంగా...
    కాస్త తాగంగ పునర్జన్మ వచ్చేవిదంగా...
    ప్రొద్దు పొద్దున్ననే నీ పొందులేకున్న మూడంత పాడయ్యి
    టైమంత వేస్టయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అస్లీల సంభాషనల్
    చేసి కాంటాక్ట్సు సర్వమ్ము నాషమ్ము కావించుకుంటారుగా...
    అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా
    దాచుకొంటారుగ కాచుకొంటారుగ చచ్చినట్టింక ఇచ్చేంత
    సేపింక అందరున్ వేచివుంటారుగా...
    కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులోనుంచి
    ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా
    గిలక్కొట్టుచు నురుగు ఉప్పొంగగా ఇస్తారుగా...
    గొప్పనిష్టాగరిష్ఠుల్ భరిస్తాలలొ కనిష్ఠమంబుగా
    కాఫీ తాగెందుకిష్టంబుగా పొవుగా...
    షాపు మూసెయ వాపొవుగా
    సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ సుభంగీ ప్రభంగీ.. నమస్తే నమస్తే... నమహా

    గానం : జొన్నవిత్తుల
    సాహిత్యం : జొన్నవిత్తుల
    http://www.youtube.com/watch?v=6WL89GkvdxU

    ReplyDelete
  24. Interesting thoughts but I don't think our political parties strategies so simple and straightforward :)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.