Saturday 1 October 2011

ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి!!


ఆ వూళ్ళో భార్యాబాధిత సంఘం మొదలెట్టి సరీగ్గా సంవత్సరం అయింది. ఇవ్వాళ మొదటి వార్షికోత్సవ సభ జరుపుకుంటున్నారు. సంఘంలో సభ్యులైతే చాలామందే వున్నారు. సుఖవ్యాధి రోగుల్లాగా (సుఖరోగం అంటే రోగం సుఖంగా ఉంటుందని కాదు, పరులతో సుఖించడం వల్ల వచ్చిన రోగమని అర్ధం), భార్యాబాధితులు బయటకి చెప్పుకోటానికి మొహమాటపడతారు. 

కాబట్టి - యోగాలంటూ గుండెల్నిండా గాలి పీల్చుకొమ్మని బొధించే స్వామిజీ సభలంతగా కాకపోయినా, కొద్దిమందైనా రాకపోతారా అనే ఆశతో నిర్వాహకులు ఎదురుచూశారు. సభ్యులు ఒక్కొక్కళ్ళుగా చేరుకుంటూ సభ ప్రారంభమయ్యే సమయానికి్ కొద్దిమంది కన్నా ఎక్కువమందే వచ్చారు. అంచనాలకి మించి హాజరైన భార్యాబాధిత భర్తల్ని చూసి నిర్వాహకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 
                  
కుర్రభర్తలు, ముసలిభర్తలు, పొట్టిభర్తలు, పొడుగుభర్తలు, వేదాంతభర్తలు, విప్లవభర్తలు - అదొక నానావిధ భర్తలోకం! 'విధి ఒక విషవిలయం' అనుకునే ఉసూరు భర్తలు, 'ఉందిలే మంచికాలం ముందూముందునా' అనుకునే ఆశావాహ భర్తలు - ఎటు చూసినా పీడిత తాడిత భర్తలే!           

అధ్యక్షులవారైన గుమ్మడి గుర్నాధం వేదికపైకొచ్చాడు. ఆయన పెళ్ళానికి తప్ప పులిక్కూడా భయపడని ధీరోధాత్తుడు! ఎర్రటి శరీరమంతా మానిన గాయాల తాలూకా గుర్తులు. పండిపోయిన కాకరకాయలా, వడలిపోయిన వంకాయలా ఉన్నాడు. వారీ సంఘాన్నేర్పరచటంలో జీవితాన్నే ధారబోసిన గొప్ప త్యాగమూర్తి! 
                 
కొంచెంసేపు దగ్గి, అధ్యక్షోపన్యాసం మొదలెట్టాడు. 

"మితృలారా! మీ ఉత్సాహం చూస్తుంటే మన భర్త జాతికి మంచికాలం వచ్చేసిందనే నమ్మకం నాకు కలుగుతుంది. మన పురుషజాతి గతవైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుళ్ళందరికీ రెండు ఫ్యామిలీలు. శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు. వీళ్ళు చాలరన్నట్లు అనేకమంది భార్యలు. కన్యాశుల్కంలో మధురవాణి కోసం గిరీశం, రామప్పపంతులు పోటీ పడ్డారు. వనితలను ఆదుకొనుట మన సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం. మన కవులు, కళాకారులు రెండోభార్య వల్లనే అద్భుత క్రియేటివిటీ సాధించారని చరిత్రలో లిఖితమై ఉంది." అంటూ ఖణేల్ ఖణేల్మంటూ దగ్గాడు. 
                 
కొంచెంసేపు రొప్పి, మరికొంతసేపు నిట్టూర్చి విషాదవదనంతో చెప్పసాగాడు.  

"కాలం కౄరమైనది. విధి విచిత్రమైనది. ఒకప్పుడు మన కాళ్ళ మీద పడి సావిత్రిలా విలపిస్తూ పాదాల దగ్గర చోటు అర్ధించిన స్త్రీజాతి ఇప్పుడు మనని శాసించే స్థాయికి ఎదుగుట కడు శోచనీయము. ఇంట్లో పాత ఫర్నీచర్లా ఒక మూల పడుండే భార్యజాతి - ఈరోజు మనపై వరకట్న కేసులు, గృహహింస కేసులు.. భగవాన్! ఏమిటీ విధివైపరీత్యం!" 

హాలంతా వేడి నిట్టూర్పులతో నిండిపోయింది.  

"ఎందుకిన్ని కఠిన చట్టాలు? మనమేమన్నా పక్కింటోడి భార్యని తంతున్నామా? ఏం! ఆమాత్రం సొంతభార్యని తన్నుకునే కనీసస్వేచ్ఛ కూడా మనకి లేదా? ముల్లు అరిటాకు సామెతలో ఇప్పుడు మనం అరిటాకులమైపొయ్యాం. ఎందుకిలా జరుగుతుంది? స్త్రీజాతి నుండి పురుషజాతికి రక్షణే లేదా?" జవాబుల్లేని ప్రశ్నలేసుకుని బాధ భరించలేక భోరుమన్నాడు అధ్యక్షులవారు.             
                 
తదుపరి కార్యక్రమంగా కార్యదర్శి రమాపతి తమ సంస్థ చేపట్టిన కార్యక్రమ వివరాలు సుదీర్ఘంగా చెప్పాడు. ఈరోజు నుండి భార్య చేత చావుదెబ్బలు తిన్న భర్తలకి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చుల్ని 'ఆరోగ్యశ్రీ' లిస్టులో చేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేశాడు. ప్రతివారం భార్యబాధిత సంఘ అధ్యక్ష, కార్యదర్శులు 'భార్యల హెచ్చులు - భర్తల హక్కులు' అనే ప్రశ్నోత్తర లైవ్ కార్యక్రమాన్ని, మెరుగైన సమాజం కోసం తిప్పలు పడుతున్న టీవీ 420 వారి సౌజన్యంతో నిర్వహించబోతున్నామని చెప్పాడు. సభ్యులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.  

చివరగా భార్యని ఎదిరించి భర్తజాతి పరువు నిలిపిన విప్లవజ్యోతి ఆర్.సత్యన్నారాయణమూర్తికి సన్మానం కార్యక్రమం. ఆర్.సత్యన్నారాయణమూర్తిది స్థూలకాయం. ఆయన్ని టైమడిగినా ఆవేశంతో ఊగిపోతాడు, హూంకరిస్తాడు. సన్మాన గ్రహీతగా మాట్లాడబోయే ముందు ఎర్రజెండాకి నమస్కరించాడు. 

అతనిలో ఒక అల్లూరి సీతారామరాజునీ, ఒక భగత్ సింగునీ గాంచి భర్తజనులందరూ ఉప్పొంగిపోయారు. ఆర్.సత్యనారాయణమూర్తి తన బొంగురు గొంతుకతో గద్దర్ స్టైల్లో దిక్కులు పిక్కటిల్లేట్లు ఒక పాటందుకున్నాడు. 

"గ్యాసు మనదిరా, గిన్నెమనదిరా, బట్ట మనదిరా, సబ్బు మనదిరా! నడుమ పెళ్ళమేందిరో, దాని పీకుడేందిరో!" భర్తాధములందరికీ ఆవేశంతో గుండెలుప్పొంగగా కోరస్ అందుకున్నారు. కొందరు ఆనందం తట్టుకోలేక కిందపడి గిలగిలా కొట్టుకోసాగారు.

పాట అయిపోయింది. ఒక్కక్షణం ఆగి ఆయాసం తీర్చుకుని ఆవేశంగా చెప్పసాగాడు ఆర్.సత్యన్నారాయణమూర్తి. "బ్రదర్స్! విప్లవం మొదలయ్యింది. మనం మీసమున్న మొగాళ్ళం, బానిసలం కాదు. భార్యకి భయపడేదేంటి బ్రదర్? నేనేనాడూ నా భార్యని లెక్కజేయలా. మగాళ్ళా, పులిబిడ్డలా బతుకుతున్నా! ఇవ్వాళ మీ సన్మానం నాలోని ఫైర్ పదింతలు పెంచింది."   
                 
ఇది కలా, నిజమా? ఇదెలా సాధ్యం? ఆర్.సత్యన్నారాయణమూర్తి తన రహస్యాన్ని బయటపెట్టి తీరాలంటూ సభికులంతా ముక్తకంఠంతో నినాదాలు చేశారు, ఆపై వేడుకున్నారు.
                 
ఆర్.సత్యన్నారాయణమూర్తి ఆవేశంగా ఊగిపోయాడు. పిడికిళ్ళు బిగించాడు. 

"బ్రదర్స్! నేనేరోజూ నా భార్య మాట విన్లేదు, వినను కూడా, వినను గాక వినను. నా భార్యా కుడికాలు పట్టమంటే ఎడంకాలు పడతా, ఎడంకాలు పట్టమంటే కుడికాలు పడతా. బట్టలుతకమంటే వంట చేస్తా. వంట చెయ్యమంటే అంట్లు తోముతా. వంకాయకూర చెయ్యమంటే దొండకాయ వేపుడు చేస్తా. కాఫీ ఇమ్మంటే టీ ఇస్తా. అంతేగానీ నా భార్య చెయ్యమన్న పని పొరబాటున కూడా చెయ్యను. మాట వినే ప్రసక్తే లేదు. భూమ్యాకాశాలు దద్దరిల్లనీ - వాగులూ, వంకలూ పొంగనీ! అవసరమైతే ప్రాణత్యాగానిక్కూడా సిద్ధమే! ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి, పోరాడితే పొయ్యేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప. విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్." 

ఆర్.సత్యన్నారాయణమూర్తి గాండ్రింపుకి మైకు ఠప్పున పేలిపోయింది! 
                 
భర్తలందరూ పెద్దపెట్టున నినాదాలు చేసి, ఆనందం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.  
                 
"సభని జయప్రదం చేసిన మీ అందరికీ కృతజ్ఙతలు. మళ్ళీ ఇదే అలవరసలపై వచ్చే సంవత్సరం కలుద్దాం. జైహింద్!"

సభ ముగిసింది.

(picture courtesy : Google)

36 comments:

  1. Many of our contemporary men are undergoing untold real torture in the hands of their wives and in-laws. Please do'n't humorize or trivialize their plight and agony just because you are personally happy with your marital life.

    ReplyDelete
  2. Ramana garu,
    అదిరిపోయే పోస్టు రాశారు సార్. హాయిగా నవ్వుకున్నాను.
    థాంక్స్.
    రాము
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  3. భార్య భర్తకు పెట్టే బాధలు మీకు నవ్వులాటగా ఉన్నాయా?

    ReplyDelete
  4. భార్యా బాదితుల సంఘం జిందాబాద్

    ReplyDelete
  5. బాగుందండీ..ముఖ్యంగా ఈ పాట...

    అవమానాలూ...దౌర్జన్యాలూ..పరాయిపాలన...ఈ కారణాలు చాలండీ...భార్యా బాధితుల సంఘం ప్రత్యేక రాష్ట్రం కోరవచ్చు.

    /"గ్యాసు మనదిరా, గిన్నె మనదిరా.. బట్ట మనదిరా, సబ్బు మనదిరా.. నడుమ పెళ్ళమేందిరో, దాని పీకుడేందిరో.. " /

    ReplyDelete
  6. Baagundiraa nee 'bhartallara ekamkandi' kadha. kaani nenu mugimpu vere vidhangaa expect chesa. chivariki aa satyanarayana murthy pellam.. aayana prasangam ayyesariki appadalakarrato vochhi 'chaalle inka stage digandi' antamo etc. deenki inka continuation gurinchi aalochinchu. by the way idi nuvvu mee aavidaki chupinchaku / cheppaku, neeku naalugu rojulu pasthe!
    weekend on call. anduke ila phone to reply.
    G V

    ReplyDelete
  7. మీ ఆవిడ ఊర్లో లేరా అండీ ??
    ఇంత ధైర్యంగా రాసారు, బ్లాగర్లలో మీ అంత ధైర్యవంతులను నేనిప్పటివరకూ చూడలేదు !!

    ReplyDelete
  8. నా భార్యా కుడి కాలు పట్టమంటే ఎడం కాలు పడతా. ఎడం కాలు పట్టమంటే కుడి కాలు పడతా. బట్టలుతకమంటే వంట చేస్తా. వంట చెయ్యమంటే అంట్లు తోముతా. వంకాయ కూర చెయ్యమంటే దొండకాయ వేపుడు చేస్తా
    __________________
    అన్యోన్య దాంపత్యానికి గీటురాయి. దిగులుతో మనసులో కుమిలిపోయే భర్తలకి,ఇప్పుడు అయినవారికీ ముందు అవబోయే వారికీ, కర్కశ నిర్కశ గృహస్థ సృంఖలాలనుండి బయటపడాలంటే, రోడ్ మాప్ - కనువిప్పు - ఆశా కిరణం. దారి చూపించిన సత్యనారాయణ గారికి జిందాబాద్.

    ReplyDelete
  9. ramana garu ,ikanundi meere maa president. swanubhavamto chakkaga badha padutu raasaru.emina mee sreevaariki thanks,meeku inta chakkati anubhuthi nichinanduku.jai ;;;ramana garu.

    ReplyDelete
  10. మొదటి మరియూ రెండవ అజ్ఞాతలకి..
    "నేనే రోజూ నా భార్య మాట విన్లేదు. వినను కూడా. వినను గాక వినను. నా భార్యా కుడి కాలు పట్టమంటే ఎడం కాలు పడతా. ఎడం కాలు పట్టమంటే కుడి కాలు పడతా. బట్టలుతకమంటే వంట చేస్తా. వంట చెయ్యమంటే అంట్లు తోముతా."
    నాకీ చిన్న జోక్ గుర్తుంది. దీన్నే సాగదీసి ఒక పోస్టుగా రాశాను. భర్తల మనోభావాలు దెబ్బ తీసే ఉద్దేశ్యం అస్సలు లేదు. క్షంతవ్యుడను. నా వైవాహిక జీవితం బాగుందని మీరు అనుకున్నందుకు కృతజ్ఞతలు. నేను కూడా ఒక భర్తనే అన్న సంగతి మర్చిపోకండి. అందుకే అంత లిబర్టీ తీసుకున్నాను. నా "పని లేక" టపాలని సరదాగా తీసుకొమ్మని కోరుకుంటున్నాను. కామెంటుకి ధన్యవాదాలు.

    ReplyDelete
  11. నీహారిక గారు..
    కామెంటుకి ధన్యవాదాలు.
    మా ఆవిడ ఊళ్ళోనే ఉంది.
    ఆవిడ పేషంట్లతో బిజీగా ఉంటుంది.
    ఆ విధంగా.. కనీసం బ్లాగుల్లోనయినా నాకు వాక్ స్వాతంత్ర్యం లభించింది.
    ఇప్పుడావిడ మీ కామెంటు చూస్తే..
    నా బ్లాగు జీవితం ముగిసే ప్రమాదముంది.
    నా ధైర్యాన్ని మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు.
    అయినా.. ఆడవారి గూర్చి రాయలంటే ధైర్యం కావాలి గానీ..
    అర్భకులూ, అమాయకులూ అయిన మగవారి గూర్చి ఎంతైనా రాసుకోవచ్చులేండి!

    ReplyDelete
  12. ఆర్.సత్యన్నారాయణమూర్తి మీరే నేమో :) చాల చాల బాగు౦ది టపా. ఇ౦త మ౦చి టపాలు బ్లాగుల్లో రావడం నిజం గా స౦తోషి౦చదగ్గ విషయం :)

    ReplyDelete
  13. శరత్ "కాలం' గారు,
    Ramu S గారు,
    John గారు,
    వనజ వనమాలి గారు,
    Rao S Lakkaraju గారు,
    Mauli గారు,
    మరియూ అజ్ఞాతలు,
    ధన్యవాదాలండి.
    నిద్ర పట్టక..
    పని లేక (ప్రాక్టీసు లేక)..
    తినేందుకు ఎవరి బుఱ్ఱ దొరక్క..
    రాస్తున్నాను.
    మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  14. *కనీసం బ్లాగుల్లోనయినా నాకు వాక్ స్వాతంత్ర్యం లభించింది. ఇప్పుడావిడ మీ కామెంటు చూస్తే.. నా బ్లాగు జీవితం ముగిసే ప్రమాదముంది.*

    ఆడవారిని గురించి రాయటానికి భయపడలసినది ఎముంది? మరి అమాయకుడిగా నటిస్తున్నారు తప్పితే. వారేమైన ప్రపంచం లో వింతజీవులా లేకా అడవిలోసిం హం కన్నా భయకరమైనా కృర మృగాలా? మీలాంటి వారు స్వార్థానికి, వారిని కాకా బట్టి, పొగిడి, మునగ చెట్టు క్కించారు. ఈ కాలంలో, చీకేసిన మామిడి కాయలా వుండేవారు కూడా, వారేదో భూలోక రంభలు అన్నట్టు తెగ ఫీలౌతూ వుంటారు. పెళ్ళం మాట వినక పోతే, ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోతే సరి. మగవారి జీవితం అన్నా బాగు పడుతుంది.మీలాగా సంసారన్ని పట్టుకొని వేలాడుతూ, ఇలాంటి సేటైర్లు రాసుకొంట్టూ, కష్ట్టాలను కూడా సుఖాలుగా ఫీలౌతూ జీవితాన్ని గడిపేవారికి "స్వేచ్చ" విలువ తెలియదు.

    సుందర్

    ReplyDelete
  15. నాన్నా G V..
    డ్యూటీలో ఉండి కూడా చదివి కామెంట్ రాశావు. థాంక్సురా అబ్బీ.
    చేతిలో ఉన్నది గరెటెడు అట్ల పిండి. ఇప్పటికే పదట్లు వేశా! (విషయం తక్కువ. హడావుడి ఎక్కువ).
    నువ్వింకా కొత్త మలుపులు చెప్తున్నావ్!
    మా వంటావిడ దయామయి.
    ఎవరు తిన్నా, తినక పోయినా.. తన పని తను చేసుకుపోతుంది.
    కాబట్టి తిండికి ఢోకా లేదు.

    ReplyDelete
  16. శ్రీ రమణ గారూ,
    మీరు ఎంతో ధైర్యంగా మా లాంటి అర్భక భర్తల మనో భావాలని చాలా బాగా వ్యక్తీకరించారు. ముఖ్యంగా " ఈ గ్యాసు మనదిరా" పాట మా లాంటి తాడిత పీడిత వర్గాల వారికి " జాతీయ గీతం" లాంటిది. ఇక నుంచీ ప్రతి రోజూ ఈ పాట వంట చేస్తున్నప్పుడో, బట్టలు ఉతుకుతున్నప్పుడో మననం చేసుకుంటే మన సంఘ సభ్యులకి ధైర్యం తో పాటు కొంత ఊరట కలుగుతుందని ఈ బడుగు భర్త ఆశ. దయ ఉంచి మీ బ్లాగు నేను చదువుతున్నట్టు గానీ, కామెంటు వ్రాసినట్టు గానీ మా "హిట్లర్" ( యజమానురాలు/ భార్య ) కి తెలియనివ్వకండి. నా తాట తో పాటు మీ తాటకి కూడా అపాయం.
    దినకర్.

    ReplyDelete
  17. డియర్ రమణ, చాలా హిలేరియస్ గా ఉంది ఈ భర్తల కథ!
    "స్వేచ్చ" గురించి ప్రసంగాలిచ్చే వాళ్ళు ఎనానిమస్ బదులు సొంత పేరు ఉపయోగిస్తే బాగుంటుంది!!
    బి ఎస్ ఆర్
    పి. ఎస్.: రమణా, కొంపదీసి నీ మాజీ గర్ల్ ఫ్రెండ్సెవరు నీ బ్లాగ్ ని ఫాలో అవటం లేదుకదా?!

    ReplyDelete
  18. ఆరెస్నారాయణమూర్తి గారి ధైర్యం విస్తుగొలిపిందండి. ఒక భర్తలో ఇంతటి ధైర్యం కనీవినీ ఎరుగనిది. ఎర్రభర్తల దండుకు దళనాయకు డాయన.

    ReplyDelete
  19. Frikking awesome,
    రెండు చోట్ల పగలబడీ మరీ నవ్వాను.
    ఆ నవ్వు తర్వాత, సమీపంలో అడుగుల సవ్వడి వినిపించింది.
    వెనువెంటనే నా మనసు ప్రమాదాన్ని గ్రహించి, లాప్టాప్ మూసేసి, నా మొహం టివి స్క్రీన్ వైపు తిరిగి, హ హ హ అని నవ్వటం మొదలెట్టింది.

    అదృష్టం, వచ్చినవారు టివిలో ఏమొస్తుందా అని చూడలేదు. ప్రస్తుతానికి బచాయించినట్లే, ఇహ మీ బ్లాగు ఈసారి నుంచి, మగవాళ్ళ ఏకైక స్వేచ్చామందిరం లోంచి మాత్రమే వీక్షించెద :-)

    ReplyDelete
  20. Ramana,
    idi superb.
    Inta viplava sahityam neelo unda!
    nizamga neeku red salute.
    Pranalu panamgaa petti ituvanti rachanalu chesi barthalaku dhairyamu noori postunnaduku viplavabhinandanlu.
    keep it up.
    Sateeshbabu

    ReplyDelete
  21. సుందర్ గారు..
    కామెంటుకు ధన్యవాదాలు.
    మీరు సూచించిన మార్గం మంచిదే!
    భరించ లేనప్పుడు అదెలాగూ తప్పదు.
    నేను కావాలనే "అతి" గా రాశాను.
    సర్రియల్ హ్యూమర్ ట్రై చేశాను.
    మునిమాణిక్యం "కాంతం కథలు" చదివారు కదా.
    ఇలా భార్యల గూర్చి సరదాగా రాయటం చాలామంది చేస్తూనే ఉన్నారు.
    ఇవన్నీ.. చదివి హాయిగా నవ్వుకోవటం కోసం మాత్రమే.

    ReplyDelete
  22. దినకర్,
    ఆర్.సత్యన్నారాయణమూర్తి పాటని "జాతీయ గీతం" గా భావిస్తున్నందుకు కృతజ్ఞతలు.
    పాడుకుంటూ పని చేసుకుంటుంటే అలుపూ సొలుపు ఉండదు. నిజమే!
    ఇంతకీ.. పన్లు చేసుకుంటూ పాడుకునే పర్మిషన్ ఉందా?

    ReplyDelete
  23. చదువరి గారు..
    ధన్యవాదాలు.
    అవును కదూ!
    అందుకే గదా, ఆయనకి సన్మానం చేసింది.

    ReplyDelete
  24. బి.ఎస్.ఆర్...
    థాంక్యూ.
    ప్లీజ్! కొత్త సమస్యలు సృష్టించకండి.

    ReplyDelete
  25. KumarN గారు..
    ధన్యవాదాలు.
    "మగవాళ్ళ ఏకైక స్వేచ్చా మందిరమా!"
    మీరు చెప్పేది వంటింటి గూర్చేనా?

    ReplyDelete
  26. సతీష్..
    ఏ చెయ్యను బాస్.
    ప్రాణాలకి తెగించడం పెళ్ళైనప్పట్నించి అలవాటైపోయింది!

    ReplyDelete
  27. "మగవాళ్ళ ఏకైక స్వేచ్చా మందిరమా!"
    మీరు చెప్పేది వంటింటి గూర్చేనా?
    ____

    ప్చ్, మీరు నన్ను డిసప్పాయింట్ చేసేసారండీ, మీలో మా నాయకుణ్ణి చూసుకుంటూంటే, మీరిలా....
    వంటింట్ళో ఎన్ని వంకలు పెడతారండీ వీళ్ళు.
    నేనన్నది ఆఫీస్ గురించి :-))

    ReplyDelete
  28. chala rojula tharuvatha kadupubba navvukunnamu. thank u very much.

    ReplyDelete
  29. చాలా చాలా బాగుంది నా బ్లాగ్ లో ఉన్న పెద్దపులి పెండ్లి విందు చదవండి .

    ReplyDelete
  30. rajasekhar Dasari గారు..
    ధన్యవాదాలు.

    ReplyDelete
  31. మీ ఈ టపాతో, పాపం మొత్తం బాధితులందరూ బయటపడ్డట్టున్నారు డాక్టరు గారు.. ఎప్పుడూ ఇంత లేట్ గా పెడుతుందేమిటీ ఈ అమ్మాయి కామెంటూ అని అనుకోకండి. నేను ఈ మధ్యనే మీ బ్లాగు చూడటం జరిగింది. అప్పటి నుంచీ ఒక్కొక్కటీ చదువుతున్నా..మీ బ్లాగు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచీ, చదివిన చాలా సేపటి వరకు కాదు కాదు రోజుల వరకూ ఆ మాటలు గుర్తొస్తూనే ఉంటున్నాయ్. మీ బ్లాగు గుర్తొస్తే తెలియకుండానే పెదవుల మీద దరహాసం మొదలై ఆ పై ఉండి ఉండి కొంచం పెద్దగా అంటే పగలబడి నవ్వేటంతగా మారిపోతోందండీ. ఎవరైన చూస్తే లూజు అనుకుంటారేమో అని ఒక కొత్త భయం పట్టుకుందండీ బాబు.. దీనికి మందేంటో మీరే చెప్పండి కాస్త. బ్లాగు చూడొద్దని మాత్రం చెప్పకండి.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.